శ్రీరాముడు

13:28 - November 26, 2018

లక్నో: ఉత్తరప్రదేశ్ లో ఆదివారం రామమందిర నిర్మాణం చేయాలనే  డిమాండ్ తో  విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ ధర్మసభ నిర్వహించగా....మరో వైపు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ అయోధ్యలో అతి ఎత్తైన రాముడి విగ్రహ నిర్మాణానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు. గుజరాత్ లో నర్మదానది ఒడ్డున నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం(182 మీటర్ల స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) కంటే ఎత్తుగా 221 మీటర్ల ఎత్తులో యోగి ప్రభుత్వం దీన్ని నిర్మిస్తోంది."స్టాచ్యూ ఆఫ్ ది మర్యాద పురుషోత్తమ్" పేరుతో  రాముడి విగ్రహాం నిర్మిస్తున్నారు. దీని నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రి శనివారం ఖరారు చేశారు.   
విగ్రహం పునాది 50 మీటర్లు, విగ్రహం ఎత్తు 151 మీటర్లు, దానిపై ఉండే గొడుగు 20 మీటర్లు ఉండేలా విగ్రహాన్నిడిజైన్ చేశామని, ఇది ప్రపంచంలో అత్యంత ఎత్తైన కట్టడం అవుతుందని ఉత్తరప్రదేశ్  రాష్ట్ర సమాచార శాఖ ముఖ్యకార్యదర్శి అవనీశ్ అవస్ధి చెప్పారు. విగ్రహం కింద ఇక్ష్వాకు వంశ చరిత్రకు సంబంధించిన విశేషాలతో అధునాతన మ్యూజియం ఏర్పాటు  చేస్తామని  అవస్ధి చెప్పారు. సరయూ నది ఒడ్డున నిర్మించే రాముడి కాంస్యవిగ్రహం చుట్టుపక్కల పర్యాటక రంగం అభివృధ్ది చెందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అవనీశ్ అవస్ధి తెలిపారు.

16:35 - September 27, 2018

గోవా : ఆర్ఎస్ఎస్ అంటేనే కాంట్రవర్సీలకు మారుపేరు. ఆ నేతలు ఏం మాట్లాడినా..అదే తీరులో మాట్లాడుతుంటారు. అది వ్యక్తులైనా దేవుడైనా సరే. వారి వాగ్ధాటికి హద్దు పద్దులుండవ్. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల విషయంలో ఆర్ఎస్ఎస్ నేత  ఎన్నికలకు, రాముడికి ముడిపెడుతు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నికలు వస్తున్నాయి. రాజకీయ నాయకులకు జనాభాలో అధికంగా ఉన్న యువత, మహిళలే ముఖ్యం. వీరిని ఆకట్టుకునేందుకు పార్టీలు ఎంత ఖర్చుకయినా వెనుకాడవు. ఇప్పటి రాజకీయాలు డబ్బు చుట్టే తిరుగుతున్నాయి. డబ్బు లేకుంటే గెలవడం అన్నది చాలా కష్టం.‘ఎన్నికలు వస్తున్నాయి. రాజకీయ నాయకులకు జనాభాలో అధికంగా ఉన్న యువత, మహిళలే ముఖ్యం. వీరిని ఆకట్టుకునేందుకు పార్టీలు ఎంత ఖర్చుకయినా వెనుకాడవు. ఇప్పటి రాజకీయాలు డబ్బు చుట్టే తిరుగుతున్నాయి. డబ్బు లేకుంటే గెలవడం అన్నది చాలా కష్టం. ఈ క్రమంలో ధనబలం లేకుంటే ప్రస్తుతమున్న రాజకీయాల్లో కేడర్ ను కాపాడుకోవడం చాలా కష్టమైపోతుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గోవా మాజీ చీఫ్ సుభాష్ వెలింకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో నోట్లు పంచకుంటే సాక్షాత్తూ శ్రీరాముడికి కూడా ఓట్లు రావనీ, గెలవలేడని వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గోవా సురక్ష మంచ్ కార్యక్రమంలో పాల్గొన్న సుభాష్.. ఈ సభకు హాజరైన యువతను ఉద్దేశించి మాట్లాడారు.  ఇప్పటి పరిస్థితుల్లో స్వయంగా శ్రీరాముడే దిగొచ్చి ఎన్నికల్లో పోటీ చేసినా డబ్బులు పంచకుంటే గెలవడం అసాధ్యం’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ తన విలువలకు తిలోదకాలు ఇచ్చి మిగతా పార్టీల మాదిరి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు.

13:11 - July 9, 2018

హైదరాబాద్ : శ్రీరాముడిపై సినీ క్రిటిక్ కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కత్తి మహేష్ వ్యాఖ్యలను నిరసిస్తూ ధర్మ యాత్ర చేస్తానన్న స్వామి పరిపూర్ణానంద స్వామిని గృహ నిర్భందం చేయడం..కత్తి మహేష్ ను నగర బహిష్కరణ చేయడం వంటి పరిణామాలు జరిగాయి. కత్తి మహేష్ ను ఏపీ పోలీసులు చిత్తూరు జిల్లాకు తరలించారు.

మరోవైపు పరిపూర్ణానంద స్వామి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆయన్ను గృహ నిర్భందం చేయడంతో వీహెచ్ పీ..భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి యత్నించడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వారిని వారించి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం..తోపులాట చోటు చేసుకుంది. 

11:12 - July 9, 2018

హైదరాబాద్ : సినీ క్రిటిక్ కత్తి మహేష్ పై నగర బహిష్కరణ వేటు పడింది. ఆయన్ను నగరం నుండి బహిష్కరిస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఆయన్ను ఏపీ పోలీసులకు అప్పచెప్పారు. ఇటీవలే శ్రీరాముడి విషయంలో కత్తి మహేష్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర దుమారం రేగింది. కత్తి మహేష్ పై వెంటనే అరెస్టు చేయాలని..చర్యలు తీసుకోవాలంటూ పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో ఆయన్ను అదుపులోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు విచారించారు. అనంతరం ఆయన్ను వదిలిపెట్టారు. కత్తి మహేష్ వ్యాఖ్యలను నిరసిస్తూ ధర్మాగ్రహ యాత్ర చేపడుతానని పరిపూర్ణనాంద స్వామి హెచ్చరించారు. 

14:29 - July 1, 2018

తూర్పుగోదావరి : నిత్యం వివాద అంశాలతో వార్తల్లో ఉండే సినీ విమర్శకుడు కత్తి మహేష్ పై పోలీసు కేసు నమోదైంది. పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేపుతున్నాయి. భారతీయుల ఆరాధ్యదైవం శ్రీరాముడిని ఉటంకిస్తూ ఓ టీవీ ఛానెల్ లో కత్తి మహేష్ వ్యాఖ్యలు చేశారంటూ అమలాపురంలో హిందూ ఆజాద్ ఫౌండేషన్ నేతలు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కత్తి మహేష్ తో పాటు ప్రసారం చేసిన టీవీ ఛానెల్ పై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. 

09:26 - March 26, 2018

ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతుల భద్రాద్రి పర్యటన రద్దు అయ్యింది. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి రాముడికి ప్రభుత్వం తరపున కేసీఆర్ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించడడం అనవాయితీగా వస్తోంది. కానీ కేసీఆర్ దంపతులు రాకపోతుండడంతో జిల్లా వాసులు, భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ రాకపోతుండడంతో దేవాదాయ శాఖ మంత్రి, తాను పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశవరరావు పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు, ఎంపీ కవిత దంపతులు వస్తారని తెలుస్తోంది.

కేసీఆర్ హాజరు కాకపోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భద్రాచల అభివృద్దికి రూ. 100కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. కానీ ఈ శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని సీఎం కేసీఆర్ పట్టువస్త్రాలు సమర్పించి భద్రాద్రికి పలు వరాలు కురిపిస్తారని జిల్లా వాసులు ఆశించారు. కానీ కేసీఆర్ పర్యటన రద్దు కావడంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రిపై పెట్టిన దృష్టి భద్రాద్రిపై పెట్టడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. 

09:12 - March 26, 2018
09:04 - March 26, 2018

ఖమ్మం : భద్రాద్రి జిల్లాలో శ్రీరాముడు కల్యాణోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 60 ఏళ్లకు ఒకసారి వచ్చే విళంబి నామ సంవత్సర ఉత్సవాలు ప్రత్యేకమైనవిగా భక్తులు భావిస్తున్నారు. శ్రీరాముని జన్మ సంవత్సరం కావడంతో ఈసారి కల్యాణా ఉత్సవాలకు భద్రాద్రి జనసంద్రంగా మారుతోంది. కానీ ఈసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపోవడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మిథిలా స్టేడియంలో భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టెన్ టివితో మాట్లాడారు. కేసీఆర్ రాకపోవడంతో దేవాదాయ శాఖ మంత్రి, తాను పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు తుమ్మల పేర్కొన్నారు. 

08:31 - March 26, 2018

సిరిసిల్ల : వేములవాడ ఆలయ ప్రాంగణంలో కోడెలు ఒక బాలుడి ప్రాణాలు తీశాయి. ఈ విషాదకర ఘటనతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆదివారం ఆయలంలో శ్రీరాముడి కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలతో పాటు ఇతర జిల్లాల నుండి కల్యాణం వీక్షించేందుకు తరలివచ్చారు. రాత్రి సమయంలో ఆలయ పార్కింగ్ స్థలంలో కొంతమంది భక్తులు నిద్రించారు. గాఢ నిద్ర ఉన్న సమయంలో కోడెల గుంపు ఘర్షణ పడుతూ నిద్రిస్తున్న భక్తులవైపుకు వచ్చాయి. భక్తులను తొక్కుకుంటూ వెళ్లిపోయాయి. దీనితో మనీష్ అనే మూడేళ్ల బాలుడు అక్కడికక్కడనే మృతి చెందాడు. 

13:24 - April 5, 2017

హైదరాబాద్ : నగరంలో శ్రీరామనవమి శోభాయాత్ర ప్రారంభమైంది. ధూల్ పేట నుండి ఈ యాత్ర ప్రారంభమైంది. నాంపల్లి దగ్గర్లోని సీతారాంబాగ్ నుంచి కోఠీలోని హనుమాన్ టెక్డీ వ్యాయామశాల దాకా శోభాయాత్ర జరగనుంది. రెండు యాత్రలు ప్రారంభం కానున్నాయి. ఒకటి సీతారాంబాగ్ నుంచి మొదలైతే మరోటి ధూల్ పేట్ లోని గంగాబౌలి రాణి అవంతిబాయినగర్ కమ్యూనిటీ హాల్ నించి శోభా యాత్ర ప్రారంభమైంది. రెండు యాత్రలు మంగళ్ హాట్ దగ్గర కలుస్తాయి. బోయిగూడ కమాన్, మంగళ్ హాట్, జాలి హనుమాన్, పురానాపూల్, జుమ్మెరాత్ బజార్, బేగంబజార్ ఛత్రి చౌరస్తా, కమల్ కాన్ దేవ్డి, క్లాసిక్ చౌరస్తా, సిద్ధం అంబర్ బజార్, గౌలిగూడ, పుత్లిబౌలి మీదుగా హనుమాన్ టెక్డీ హనుమాన్ వ్యాయామశాల దాకా ఒక శోభయాత్ర జరగతుంది. ధూల్ పేటలోని రాణి అవంతిబాయి భవన్ నుంచి మరో శోభాయాత్ర ప్రారంభమైంది. మంగళ్ హాట్ నుంచి జాలి హనుమాన్, పురానాపూల్, జుమ్మెరాత్ బజార్, బేగంబజార్, సిద్ధంబర్ బజార్, గౌలిగూడ మీదుగా చివరకు హనుమాన్ వ్యాయామశాలకు చేరుకుంటుంది. శోభాయాత్రకు పోలీస్ శాఖ గట్టి బందోబస్తు చేసింది. సీసీ కెమెరాలతో పాటు 12 వేల పోలీసులతో గస్తీ ఏర్పాటు చేశారు. శోభాయాత్ర సాగే రూట్లల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శోభాయాత్రకు బల్దియా కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. శోభాయాత్రకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు చేశామని నిర్వాహకులు టెన్ టివితో తెలిపారు.

Pages

Don't Miss

Subscribe to RSS - శ్రీరాముడు