శ్రీరెడ్డి

13:37 - October 24, 2018

హైదరాబాద్ : టాలీవుడ్‌లో ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. నేతల జీవితాల ఆధారంగా పలువురు దర్శకులు సినిమాలను రూపొందిస్తున్నారు. అందులో ప్రధానంగా ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రాలు హాట్ టాపిక్‌గా మారాయి. ఎన్టీఆర్ బయోపిక్ అయితే ముగ్గురు నిర్మాణం చేపడుతుండడం విశేషం. ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా చిత్రం రూపొందుతోంది. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఎన్టీఆర్ బయోపిక్‌ని తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే కేతి రెడ్డి జ‌గ‌దీష్‌రెడ్డి ‘ల‌క్ష్మీస్ వీర‌గంధమ్‌’ అంటూ మ‌రో బ‌యోపిక్‌ని తీస్తున్నారు. 
Image result for Sri Reddy in Lakshmi's Veeragrandham Kethi Reddyఎన్టీఆర్ జీవితంలో జరిగిన ఘటనలను చూపిస్తానని, నటీ నటుల ఎంపిక జరుగుతోందని కేతిరెడ్డి పేర్కొన్నారు. కానీ ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీ పార్వతి కీలకం. ఈ పాత్రను ఎవరు పోషించనున్నారనేది ప్రస్తుతం చర్చనీయాశమైంది. ఈ పాత్రకు శ్రీరెడ్డిని కేతిరెడ్డి ఎంపిక చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. 
గతంలో టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌ను శ్రీరెడ్డి కదిపిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర దుమారం రేగింద. ప్రముఖులపై శ్రీరెడ్డి విమర్శలు గుప్పించారు. ఏకంగా అర్థనగ్న ప్రదర్శన చేసి టాలీవుడ్‌ని షేక్ చేసేసింది. అనంతరం కొన్ని పరిణామాల నేపథ్యంలో శ్రీరెడ్డి మకాం తమిళనాడుకు మార్చింది. తాజాగా కేతిరెడ్డి నిర్మిస్తున్న ‘ల‌క్ష్మీస్ వీర‌గంధమ్‌’లో 

20:23 - October 16, 2018

హైదరాబాద్ : సినీ పరిశ్రమలోనే కాక దాదాపు అన్ని రంగాల్లోను ‘మీ టూ’ ఉద్యమం కాక పుట్టిస్తున్న సమయంలో మరో సరికొత్త ఉద్యమం పుట్టుకొచ్చింది. ఇది సాధారణమైన వ్యక్తులు పెట్టింది కాదు. తమిళ పరిశ్రమలోని ఓ దర్శకుడు ఈ ఉద్యమన్ని ప్రారంభించారు. ‘మీటూ’ ఉద్యమాన్ని ఆసరాగా చేసుకుని కొందరు మహిళలు బెదిరింపులకు పాల్పడుతున్నారని..దీని బారి నుంచి తమను తాము రక్షించుకునేందుకు ‘మీ టూ మెన్’ ఉద్యమాన్ని ప్రారంభించినట్టు తమిళ సినీ దర్శకుడు వారాహి తెలిపారు. సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవాలన్నా..పైకి రావాలన్నా..పేరు తెచ్చుకోవాలన్నా కమిట్ అవ్వాల్సిందే అంటూ శ్రీరెడ్డి పలు సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు వచ్చిందని.. ఆమె తమిళనాటకు వచ్చినప్పుడే ఆమెకు నిరసన తెలిపామని వారాహి తెలిపారు. 

Image result for sri reddyశ్రీరెడ్డి వంటి వారెందరో ప్రముఖులపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని..ఇలాంటి వారి బారి నుంచి అమాయకులైన పురుషులను కాపాడేందుకే ‘మీటూ మెన్’ ప్రారంభించామని వారాహి తెలిపారు. ఐదేళ్ల క్రితం పరస్పర అంగీకారంతో ఓ పారిశ్రామికవేత్తకు, ఓ సినిమా నటికీ మధ్య చోటు చేసుకున్న వ్యక్తిగత సంబంధానికి సంబంధించిన సంగతులను వెల్లడించకుండా ఉండాలంటే, తనకు రూ.3 కోట్లు ఇవ్వాలంటూ శ్రీరెడ్డి బ్లాక్  మెయిల్ చేస్తున్నట్టు ఆ పారిశ్రామికవేత్త తనకు తెలిపారని వారాహి పేర్కొన్నారు. ఇలాంటి వాటన్నింటినీ ఎదుర్కొనేందుకే ఈ ఉద్యమాన్ని ప్రారంభించానని వారాహి స్పష్టం చేశారు.
 

16:40 - October 4, 2018

ముంబై : క్యాస్టింగ్ కౌచ్ ఈ పదం గత కొంతకాలంగా సంచలనంగా మారిపోయింది. అన్ని రకాల పనిప్రదేశాలలోను ఈ మాట సర్వసాధారణంగా మారిపోయింది. మహిళలను ఆ కోణంలో తప్ప మరో కోణంలో చూడలేని దౌర్భాగ్యపు సమాజంలో ఈ మాట కామన్ గా మారిపోయింది. దీని బారిన పడిన మహిళలు కొందరు మౌనంగా భరిస్తుంటే కొందరు మాత్రం బహిరంగంగా చెప్పటమే కాక ‘మీ టు’ వంటి ఉద్యమంలో పాల్గొని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. దీనిపై పలువురు పలు విధాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తంచేస్తున్నారు. క్యాస్టింగ్ కౌచ్ అనేది సామాన్యులకు ఒకలా సెలబ్రిటీలకు ఒకలా బాదించదు. ఆ బాధ అందరికీ ఒక్కటే. కానీ సెలబ్రిటీలు ఈ విషయంపై మాట్లాడితే అది మరింతగా ప్రచారం అవుతుంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ పాపులర్ తార కాజోల్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. 
తనుశ్రీ దత్తా-నానా పటేకర్ లైంగిక వేధింపుల వ్యవహారంపై ఇప్పుడు బాలీవుడ్ లో సంచలనంగా మారింది. ఈ క్రమంలో లైంగిక వేధింపులు ప్రతి చోటా ఉన్నాయని బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ అభిప్రాయపడింది. ఈ వేధింపులు కేవలం సినీ పరిశ్రమకే పరిమితం కాలేదనీ, అన్నిచోట్లా జరుగుతున్నాయని పేర్కొంది. 
తానెప్పుడూ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులను ఎదుర్కొనలేదనీ..కానీ తన కళ్లముందు ఈ రకమైన వేధింపులు జరిగితే చూస్తూ ఊరుకోబోనని తేల్చిచెప్పింది.  విదేశాల్లో వచ్చిన ‘మీ టూ’ తరహా ఉద్యమం మన దేశంలో కూడా రావాల్సిన అవసరం ఉందని కాజోల్ అభిప్రాయపడింది. ఇది మనకు చాలా అవసరమని కాజోల్ పేర్కొంది. 
 

21:14 - October 1, 2018

ముంబై : క్యాస్టింగ్ కౌచ్ వివాదం సినిమా పరిశ్రను కుదిపివేస్తోంది. టాలీవుడ్ లో శ్రీరెడ్డితో మరోసారి మొదలైన ఈ రచ్చ బాలివుడ్ లో కూడా గత కొన్ని రోజుల నుండి వివాదాస్పదమవుతోంది. దాదాపు అన్ని భాషాల్లోని సినిమా పరిశ్రమపై ఈ అంశం సంచలనంగా మారుతోంది. ఈ నేపథ్యంలో  బాలీవుడ్ లో హీరోయిన్ తనుశ్రీ దత్తా క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తనను సీనియర్ నటుడు నానా పటేకర్ లైంగికంగా వేధించాడని తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. అలాగే  కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య కూడా తనను లైంగికంగా వేధించాడని ఆమె తెలిపింది.  దీంతో ఈ వివాదంపై సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, సోనమ్ కపూర్, ప్రియాంక చోప్రా తనుశ్రీ దత్తాకు మద్దతుగా నిలిచారు. అయితే ఈ వివాదంపై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్పందించేందుకు నిరాకరించారు. ఈ వివాదంపై మాట్లాడటానికి తాను తను శ్రీ దత్తాను కానీ, నానా పటేకర్ ను కానీ కాదని స్పష్టం చేశారు. దీంతో అమితాబ్ వ్యాఖ్యలపై తనుశ్రీ దత్తా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అమ్మాయిల సమస్యల గురించి స్పందించని అమితాబ్ లాంటి వ్యక్తులు సామాజిక కథాంశాల ఆధారంగా ‘పింక్’ వంటి సినిమాలు తీస్తున్నారని విమర్శించింది. ఇలాంటి వ్యక్తులు నిజజీవితంలో కళ్ల ఎదుట జరిగే దారుణాన్ని ప్రశ్నించరనీ, కళ్లు మూసుకుంటారని..ఇటువంటివారు సినిమాల్లో హీరోలు..నిజ జీవితంలో జీరోలు అని వ్యాఖ్యానించింది. క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై తాను చివరివరకూ పోరాడుతానని స్పష్టం చేసింది. 
మహారాష్ట్ర, ముంబై, బాలివుడ్, క్యాస్టింగ్ కౌచ్, తనుశ్రీదత్తా, నానా పటేకర్, అమితాబచ్చన్,టాలీవుడ్, శ్రీరెడ్డి, Maharashtra, Mumbai, Bollywood, Casting Cowch, Tanushree Datta, Nana Patekar, Amitabhachan,Tollywood, Sri Reddy

 

15:24 - September 29, 2018

హైదరాబాద్ : శ్రీరెడ్డి తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా పేరొందిన ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డి నాచురల్ స్టార్ నానిపై మరోసారి విరుచుకుపడింది. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పేరుతో మీడియాలో వైరల్ గా మారిన శ్రీరెడ్డి.. ఇప్పటికి అదే వేడిని కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగులో పాపులర్ అయిన బిగ్ బాస్ 2 సిరీస్ పై  శ్రీరెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో కాస్త చర్చనీయాంశంగా మారింది. కౌశల్ కు మద్దత్తు తెలుపుతూ షో హోస్ట్ అయిన నానిపై మండి పడింది.
100 రోజులకు పైగా ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్న బిగ్ బాస్ షో ఆదివారంతో ముగియబోతోంది. ఐదుగురు ఇంటి సభ్యులు కౌశల్, తనీష్, సామ్రాట్, గీత , గీప్తి ఫైనల్స్ కు చేరుకున్నారు. విజేతగా ఎవరు నిలుస్తారనే ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో శ్రీరెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. బిగ్ బాస్ హౌస్ లో కౌశల్ ని తొక్కేసే ప్రయత్నం జరుగుతోందంటూ శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ పెట్టింది. 

21:45 - June 11, 2018

హైదరాబాద్ : సోషల్‌ మీడియాలో తనపై కొంత కాలంగా ఆరోపణలు చేస్తున్న నటి శ్రీరెడ్డిపై న్యాయపరమైన చర్యలకు దిగుతున్నట్లు సినీ హీరో నాని తెలిపారు. అనవసర ఆరోపణలతో శ్రీరెడ్డి తన పరువుకు భంగం కలిగిస్తోందంటూ లాయర్‌ ద్వారా నోటీసులు ఇచ్చారు. ఏడు రోజుల్లోగా సిటీ సివిల్‌ కోర్టుకు సమాధానం ఇవ్వాలని నాని లాయర్‌ చెప్పారు. ట్విటర్‌లో ఈ నోట్‌ను నాని తన అభిమానులతో పంచుకున్నారు. దీనిపై స్పందించిన శ్రీరెడ్డి న్యాయపరంగానే పోరాడుదాం అని ట్వీట్‌ చేశారు. 

20:10 - May 19, 2018

అయిపోయింది అందరు అనుకున్నదే అయ్యింది.. కర్ణాటక ముఖ్యమంత్రి కుర్చి మీదికెళ్లి యడ్యూరప్ప దిగిపోయిండు..తెలంగాణ ప్రజలారా మీరు కేసీఆర్ ఏం జేస్తలేడు ఏం జేస్తలేడు ఎప్పుడు సూశ్నా ప్రగతి భవన్ల తిని ఫామౌజుల వంటడు.. వారెవ్వ ఇంటిరా చంద్రాలు ముచ్చట.. కర్ణాటకల పరిస్థితి జూస్తుంటే సారువారి గుండె చెర్వైతున్నదట.. అక్కినేని నాగార్జున అనే కబ్జాకోరుడు చెర్వు శిఖం భూములు కబ్జావెడ్తె వానిమీద చర్యలుండయ్..మొన్న నీళ్ల మంత్రి హరీషాలు మాట్లాడుకుంట ఒక సభల ఏమన్నడు..దంతాలు లేని పులి.. గోర్లు లేని సింహం.. మూగ బెబ్బులి శ్రీ నందమూరి బాలికాకయ్య ఇయ్యాళ హిందూపురం బొయ్యినట్టుండు.. ఎంత మోసం ఎంత మోసం జూడుండ్రి.. ఉపాధి పనుల కోసం ఊరోళ్లు ధర్నా జేస్తుంటే.. ఆడంగ వోతున్న శ్రీరెడ్డి కారాపి పొయ్యి ఆ ధర్నాల గూసున్నది..గీ గరం గరం ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయండి. 

16:33 - May 11, 2018

హైదరాబాద్ : సినీనటి శ్రీరెడ్డి, ఆమె అనుచరులపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ జూనియర్‌ ఆర్టిస్ట్‌ వేధించాడని ఫిర్యాదు చేయడానికి వచ్చిన శ్రీరెడ్డి అనుచరులు.. పోలీసుల సమక్షంలోనే చెప్పులతో దాడి చేశారు. దీన్ని సీరియస్‌ తీసుకున్న పోలీసులు శ్రీరెడ్డి, ఇతర జూనియర్‌ ఆర్టిస్ట్‌లపై కేసు నమోదు చేశారు.

06:50 - April 25, 2018

హైదరాబాద్ : టాలీవుడ్‌లో లైంగిక వేధింపులు, కొందరు ప్రముఖులపై ఆరోపణలు.. నిరసనలు.. తెలుగు చిత్రసీమను కుదిపేస్తున్న అంశాలపై చర్చించేందుకు సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో దాదాపు 18 మంది హీరోలు.. ఇతర సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. మెగస్టార్‌ చిరంజీవి చొరవ తీసుకుని ఈ సమావేశం ఏర్పాటు చేశారు. టీవీ చానళ్లు కేవలం సినిమాల మీదే ఆధారపడి బతుకుతున్నాయని.. వాటికి కంటెంట్‌, ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని ప్రతిపాదన వచ్చింది. అంతేకాదు.. టీవీ చానల్స్‌ను ప్రోత్సహించకూడదని, వాటిని సినీ పరిశ్రమ బ్యాన్‌ చేయాలని ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది. సమస్యలేవైనా వస్తే ఐక్యంగా మాట్లాడాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. శ్రీరెడ్డిని మొదట్లోనే పిలిచి మాట్లాడి ఉంటే సమస్య ఇంత దూరం వచ్చేది కాదని కొంతమంది అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. గంటన్నరపాటు జరిగిన ఈ సమావేశంలో ఏ నిర్ణయమూ తీసుకోలేదు. మళ్లీ 4రోజుల తర్వాత కలిసి చర్చించాలని డిసైడ్‌ అయ్యారు. 

11:17 - April 23, 2018

విజయవాడ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ల పరంపర కొనసాగుతూనే ఉంది. కొంతమంది వ్యక్తులు..మీడియాను టార్గెట్ చేస్తూ ఆయన ట్వీట్స్ చేస్తుండడం కలకలం రేపుతున్నాయి. క్యాస్టింగ్ టచ్ పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు..ఆయన వ్యాఖ్యల వెనుక తానున్నట్లు దర్శకుడు రాంగోపాల్ పేర్కొన్నట్లు వీడియో టాలీవుడ్ లో పెను సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పవన్ నేరుగా ఫిలిం ఛాంబర్ వద్దకు వెళ్లి నిరసన తెలియచేశారు. తన తల్లిని తిట్టిన వారిపై...పదే పదే ప్రసారం చేసిన ఛానెళ్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక అప్పటి నుండి పవన్ ట్విట్టర్ లో ట్వీట్స్ పెడుతున్నారు. తాజాగా కొన్ని ట్వీట్స్ చేశారు. టిడిపి సిద్ధాంతం తిట్ల దండకమేనని, ఈ విభాగానికి అధిపతి ఆర్కేనేనని తెలిపారు. తెలుగు సినీ ఇండస్ట్రీలోని ఆడపడుచుల కోసం త్వరలో 'ఆత్మగౌరవ పోరాట సమితి' ఏర్పాటు చేయనున్నట్లు, జనసేన వీర మహిళ విభాగం అండగా ఉంటుందని పవన్ ప్రకటించారు. మరోవైపు చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించిన వివరాలను సాయంత్రంలోగా వెల్లడిస్తానని పవన్ పేర్కొన్నారు. ప్రస్తుతం నడుస్తున్న వివాదం నడుమ ఆయన చిత్తూరు జిల్లా పర్యటనకు వెళుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

Pages

Don't Miss

Subscribe to RSS - శ్రీరెడ్డి