షుగర్

16:08 - July 17, 2017

చిలకడ దుపం..ఈ దుంపలకు ఒక్కో ప్రదేశంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. వీటిని మొరంగడ్డ, కందగడ్డ, స్వీట్ పొటాటో అని కూడా అంటారు. పిండి పదార్థాలను, చక్కెరలను కలిగి ఉండే ఈ ఆహార పదార్థం రుచిని కూడా కలిగి ఉంటుంది. ఇందులో ఉన్నన్ని అద్భుతమైన పోషకాలు ఇంకెందులోనూ ఉండవని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. చిలగడ దుంపలో శరీరానికి కావల్సిన పోషకపదార్థాలను అందించడంలోనే కాదు, వివిధ రకాలుగా శరీరంలో చేరిన విషపదార్థాలను తొలగించడంలో చిలకడ దుంపలకు ప్రత్యేక స్థానం ఉంది. చిలకడదుంపను తినటానికి ఇష్టపడని వారు ఉండరు అనే చెప్పాలి. ఉడికించుకునో, ఆవిరిపై ఉడికించో, కాల్చుకునో, కూరగా వండుకునో.. రకరకాలుగా వీటిని తినొచ్చు. ఇక చిలుగడదుంపలో కార్టినాయిడ్స్‌ మరియు పాలీఫినాల్స్‌ వంటి ఫైటో రసాయనాలు ఉన్నాయి. దుంపలో లభించే పోషక పదార్ధాల వినియోగం దానిని ఉడకపెట్టే విధానంపై ఆధారపడి ఉంటుంది . ఎదిగే పిల్లలకు స్వీట్‌ పొటాటోను ఉడికించి తినిపించడం వల్ల శరీరంలో ఉన్న విషరసాయనాలు సులభంగా బయటకు పంపిస్తుంది. అనేక ఖనిజ లవణాలతో పాటు దుంపలలో పిండి పదార్థాలు(కార్బోహైడ్రేటులు), విటమిన్‌లు(బి,సి,ఇ) ఉన్నాయి.

షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది...

బంగాళాదుంప, కందగడ్డల్లో కన్నా చిలగడదుంపల్లో పీచు మోతాదు చాలా ఎక్కువ. దీంతో నెమ్మదిగా జీర్ణమవుతూ ఎక్కువసేపు కేలరీలు విడులయ్యేలా చేస్తాయి. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్ రక్తంలోని షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది

దండిగా విటమిన్ బీ-6

చిలగడదుంపల్లో విటమిన్‌ బీ6 దండిగా ఉంటుంది. రక్తనాళాలు బలంగా ఉండేందుకు తోడ్పడే హోమోసిస్టీన్‌ను విటమిన్‌ బీ6 విడగొడుతుంది. అందువల్ల వీటితో గుండె, రక్తనాళాల సమస్యలు దూరంగా ఉంటాయి.

అధికంగా పొటాషియం...

ఒంట్లో ఎక్కువగా ఉన్న ఉప్పును తొలగించి, నీటి మోతాదును నియంత్రిస్తూ అధిక రక్తపోటును తగ్గించటంలో పొటాషియం కీలకపాత్ర పోషిస్తుంది. చిలగడదుంపల్లో పొటాషియం మోతాదూ అధికంగానే ఉంటుంది.

అధికంగా మాంగనీసు

పిండి పదార్థాల జీవక్రియల్లో చాలా కీలమైన మాంగనీసు కూడా వీటిల్లో అధికం. అందువల్ల ఇవి రక్తంలో గ్లూకోజు మోతాదులు సాధారణ స్థాయిలో ఉండేలా తోడ్పడతాయి. మ్యాంగనీస్ ఎముకల బలానికి బాగా సహాయపడుతుంది.

అధికంగా విటమిన్ ఇ

విటమిన్‌ ఈ మన చర్మం ఆరోగ్యంగా, నిగనిగలాడేందుకు తోడ్పడుతుంది. వయస్సు మీద పడనియ్యకుండా చేసి, ముడతలను అడ్డుకుంటుంది.

11:58 - July 11, 2017

సన్నని చినుకులు పడుతూ.. ఆహ్లాదకరమైన వాతావరంలో తినేందుకు ఎంతో రుచిక‌రంగా ఉండే మొక్క‌జొన్న అంటే దాదాపుగా అంద‌రికీ ఇష్ట‌మే. ఉడ‌క‌బెట్టినా, నిప్పుల‌పై కాల్చుకుని తిన్నా మొక్కజొన్న రుచే వేరబ్బా.. ఈ సీజ‌న్‌లో మొక్క‌జొన్న ఎక్కువ‌గా ల‌భిస్తుంది. అయితే మొక్కజొన్న‌ను త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలో తెలుసుకుందా..

 

మొక్కజొన్నలో పుష్కలంగా ఉండే థైమీన్‌, నియాసిన్‌ అనే విటమిన్లు నాడీ వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తాయి. ఇంకా పాంటోథెనిక్‌ ఆమ్లం జీవక్రియకు దోహదపడుతుంది. గర్భిణులకు అవసరమైన ఫోలేట్‌ శాతం కూడా మొక్కజొన్నల్లో ఎక్కువే. ఇ-విటమిన్‌ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తూ వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.

మొక్క‌జొన్న‌లో విట‌మిన్ సి, బ‌యో ఫ్లేవ‌నాయిడ్స్‌, కెరోటినాయిడ్స్‌, ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి ర‌క్తంలో ఎక్కువ‌గా ఉన్న కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తాయి. దీనివ‌ల్ల గుండె సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి.

కీళ‌నొప్పులతో బాధ ప‌డేవారు మొక్క‌జొన్న‌ల‌ను త‌మ ఆహారంలో భాగం చేసుకుంటే స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. బీటా కెరోటిన్‌, విట‌మిన్- ఎ లు ఉండ‌డం వ‌ల్ల మొక్క‌జొన్న‌ల‌తో కంటి ఆరోగ్యం కూడా మెరుగు ప‌డుతుంది. దృష్టి సంబంధ స‌మస్య‌లు తొల‌గిపోతాయి. పీచు, కార్బొహైడ్రేట్లు ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల మొక్క‌జొన్న‌ల‌తో శ‌రీరానికి శ‌క్తి బాగా ల‌భిస్తుంది. దీంతో రోజంతా ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉండ‌వ‌చ్చు. మొక్క‌జొన్న‌ల్లో ఐర‌న్ పుష్క‌లంగా ఉండ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. దీంతోపాటు ఎర్ర ర‌క్త క‌ణాల ఉత్ప‌త్తికి ఉప‌యోగ‌ప‌డే ఫోలిక్ యాసిడ్ కూడా మొక్క‌జొన్న‌ల్లో అధికంగానే ఉంటుంది.

ఫోలిక్ యాసిడ్ పుష్క‌లంగా ఉండ‌డం వ‌ల్ల మొక్క జొన్న గ‌ర్భిణీ మ‌హిళ‌ల‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది. వారి క‌డుపులోని బిడ్డ‌కు ఫోలిక్ యాసిడ్ ఎంతో అవ‌స‌రం. కాబ‌ట్టి మొక్క‌జొన్న‌ల‌ను గ‌ర్భిణీలు తింటే పుట్ట‌బోయే పిల్ల‌ల‌కు ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు రావు.

మొక్కజొన్నలో ఖనిజాల శాతమూ ఎక్కువే. ఫాస్ఫరస్‌ మూత్రపిండాల పనితీరుకి తోడ్పడితే, మెగ్నీషియం ఎముక బలాన్ని పెంచుతుంది.

ఇందులోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్‌ నిరోధకాలుగానూ పనిచేస్తాయి. ఫెరూలిక్‌ ఆమ్లం క్యాన్సర్‌ నిరోధకంగా పనిచేస్తూ రొమ్ము, కాలేయ క్యాన్సర్లతో పోరాడుతుంది. వూదారంగు మొక్కజొన్నల్లోని ఆంతోసైనిన్‌లు సైతం క్యాన్సర్‌ కారకాలను అడ్డుకుంటాయి. ఆల్జీమర్స్‌, మధుమేహం, బీపీ, హృద్రోగాలనూ నివారిస్తాయని తాజా పరిశోధనలూ చెబుతున్నాయి. మిగిలిన ఆహారపదార్థాలకు భిన్నంగా ఉడికించడంవల్ల స్వీట్‌కార్న్‌లో యాంటీఆక్సిడెంట్ల శాతం మరింత పెరుగుతుంది.

మొక్కజొన్నల నుంచి తీసిన నూనెలో అన్‌శాచ్యురేటెడ్‌ కొవ్వులూ స్టెరాల్స్‌ ఎక్కువగా ఉండటంవల్ల అవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యానికి దోహదపడతాయట. రక్తనాళాల్లో పాచి పేరుకోకుండా చేయడంద్వారా గుండెపోటు, పక్షవాతం వంటివి రాకుండా చేస్తాయి. బీపీనీ తగ్గిస్తాయట.

మొక్కజొన్నలోని ఫైటోకెమికల్స్‌ శరీరంలో ఇన్సులిన్‌ శాతాన్ని నియంత్రించడం ద్వారా రక్తంలో చక్కెర నిల్వలు పేరుకోకుండా చేస్తుంది. చూశారుగా... మనం సరదాగా కాలక్షేపంకోసం తినే రుచికరమైన మొక్కజొన్నలో ఎంత ఆరోగ్యం దాగుందో... అయితే తియ్యదనంకోసం మొక్కజొన్న నుంచి తీసిన కార్న్‌ సిరప్‌ను ప్రాసెస్‌డ్‌ ఆహారపదార్థాలూ శీతలపానీయాల్లో విరివిగా వాడుతుంటారు. ఈ సిరప్‌లో ఫ్రక్టోజ్‌ శాతం ఎక్కువ. అది ఆరోగ్యానికి అంతగా మంచిది కాదు. కాబట్టి వాటితో మాత్రం కాస్త జాగ్రత్త!

 

11:58 - June 5, 2017

దుంప కూరల్లో కందగడ్డ రుచికి మరొకటి లేదు. అడవులలో తిరిగే మునులు “కందమూలాలు” తిని బతికేవారని పురాణాలు మనకు తెలుపుతున్నాయి. చూపులకు అందంగా కనిపించకపోయినా కంద వంటకాలన్నీ ఎంతో రుచిగా ఉంటాయి. కంద దుంప చాలా బలమైన ఆహారం. ఈ దుంప తింటే షుగర్, ఒబిసిటీలను అదుపులో ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో విటమిన్ ‘ఎ’ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. కందలో పొటాషియం, ఫైబర్ నేచురల్ షుగర్స్ చాలా తక్కువ కేలరీస్‌తోనే ఎక్కువ బలం లభించేలా చేస్తాయి. ఇక గర్భిణులకు చేసే మేలు అంతా ఇంతా కాదు, పుట్టబోయే బిడ్డకు కూడా ఆరోగ్యాన్ని, రోగ నిరోధక శక్తిని ఇస్తుంది. కంద తీసుకోవడం వలన జీర్ణప్రక్రియ వేగమవ్వడమే కాకుండా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. చిన్న కంద గడ్డ ద్వారా మన శరీరానికి దాదాపు ఆరు గ్రాముల ఫైబర్ చేరుతుంది. కేన్సర్ బారిన పడకుండా కాపాడమే కాకుండా ప్రోస్టేట్ క్యాన్సర్ నివారణకు కంద ఓ దివ్యమైన ఔషధంలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. .మీ ఆహరం లో కందని చేర్చుకోండి..ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

12:32 - March 10, 2017

రోజు రోజుకు డయాబెటస్ వ్యాధి గ్రస్తులు ఎక్కువవుతున్నారు. దీనితో వ్యాధి తీవ్రతను తగ్గించుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తుంటారు. ఫలితం కనిపించకపోవడంతో నిరుత్సాహానికి గురవుతుంటారు. మనం నిత్యం తీసుకొనే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ ను కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది.
డ‌యాబెటిస్ ఉన్న‌వారు తేనెను నిత్యం ఏదో ఒక విధంగా తీసుకోవాలి.
వెల్లుల్లిని ఉపయోగించడం వల్ల ఫలితం ఉంటుంది. ఇందులో అలియం సాటివం అనే రసాయనం ఉంటుంది. గ్లూకోజ్ స్థాయిలను అదుపు చేస్తుంది.
ప‌ర‌గ‌డుపున 8 గ్లాసుల నీటిని తాగాలి. ఓ గంట పాటు వాకింగ్ చేయాలి. .
బీట్‌రూట్ దుంప‌, మెంతి ఆకు లేదా మెంతుల పొడి, క‌ల‌బంద‌, వేప‌, తుల‌సి వంటి మొక్క‌ల ఆకుల‌ను ఉద‌యం, సాయంత్రం తిని తేడా గమనించండి.
ఉసిరి రసం, లేదా ఉసిరిని ఇతర ఆహార పదార్ధాలలో కలిపి వాడటం కూడా షుగర్ రోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
గ్రీన్ టీ బ్లడ్ షుగర్ స్ధాయిని తగ్గించి, శరీరంలోని ఇన్సులిన్ స్ధాయిలను పెంచుతుంది.

16:33 - February 10, 2017
15:36 - January 29, 2017

హైదరాబాద్ : ఆధునియ యుగంలో ప్రతొక్కరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టకపోవడం వల్ల దేశంలో బీపీ, షుగర్ రోగులు అధికమౌతున్నారని ప్రముఖ వైద్యులు గోపాలం శివనారాయణ పేర్కొన్నారు. జిందాబాద్ సంస్థ ఆధ్వర్యంలో బీపీ, షుగర్ పేషేంట్ల కోసం అంబేద్కర్ కాలేజీలో ఏర్పాటు చేసిన రెగ్యులర్ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. రోజురోజుకు పెరిగిపోతున్న ఆధునిక జీవన శైలి..ఒత్తిడి వల్లే బీపీ, షుగర్ వ్యాధులు వస్తున్నాయన్నారు. షుగర్ వ్యాధి వచ్చిన వారికి తక్కువ ఖర్చుతో పరీక్షలు చేయడం..మందులు ఇవ్వాలన్న ఉద్ధేశ్యంతో నగరంలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

10:54 - December 24, 2016

నవధాన్యాలలో ఒకటైన అసందల్లో అమోఘమైన పోషక విలువలు ఉంటాయి. వీటిలో పీచుపదర్థాం ఎక్కువగా వుండడం వల్ల జీర్ణ క్రియకు తోడ్పతుంది. అంతే కాదు ఇది షుగర్ వ్యాధి గ్రస్తులకి అద్భుతమైన ఆహారం. రక్తపోటును అదుపులో ఉంచగలిగిన శక్తి అలసందలకు ఉంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే కొన్ని రకాల వ్యాధులను నివారించడంలోనూ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉంచడంలోనూ సహాయపడతాయి.

శరీరంలో హానికరమైన టాక్సిన్స్ ను కూడా నియంత్రిస్తాయి. ఇందులో విటమిన్ కె పుష్కలంగా లభిస్తుంది. నరాలకు కూడా బలాన్నిస్తుంది. ఇందులో ఉండే ఐరన్, మెగ్నీషియం మన ఎనర్జీలెవల్స్ పెరిగేలా చేస్తాయి.

ఇవి రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తాయి. ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్స్, మినిరల్స్ పొటాషియం గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి.ఒంట్లో కొవ్వు తగ్గాలి అనుకునే వాళ్ళు రోజుకో కప్పు నానబెట్టి ఉడికించిన అలసందలు తింటే కొన్ని రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది.

అలసందల్లో గ్లిజమిక్స్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. మధుమేహంతో బాధపడే వారికి లోగ్లిజమిక్ ఇండెక్స్ కలిగిన అలసందలు చాలా ఆరోగ్యకరం .

ఇవి బ్లడ్ షుగర్ లెవల్స్ ను నార్మల్ గా ఉంచడంలో సహాయపడతాయి. వీటిని తినటం వల్ల కడుపు బరువుగా ఉండి ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. లావుగా ఉంది సన్నగా తయారనుకునేవారు కూడా వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలు గమనించవచ్చు.

19:43 - November 14, 2016

హైదరాబాద్ : ఇవాళ వరల్డ్‌ డయాబెటీక్‌ డే. ప్రపంచవ్యాప్తంగా షుగర్‌ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా డయాబెటిక్‌కి భారత దేశం కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోందని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ఆహారపు అలవాట్ల వల్లే ఇవాళ భారత దేశంలో షుగర్‌ పేషంట్లు రోజు రోజుకు పెరుగుతున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆహారపు అలవాట్లను మార్చుకొని నిత్యం వ్యాయామం చేస్తే షుగర్‌ వ్యాధిని కంట్రోల్లో ఉంచుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

 

10:51 - December 7, 2015

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యలేదు అంటారు మన పెద్దలు.. వెల్లుల్లి గురించి తెలియని వారు దాదాపు ఉండరనే చెప్పాలి, నిజానికి వెల్లుల్లి ఆహార పదార్థాలకు అద్భుత రుచిని అందించే మరియు అన్ని రకాల ఆహార పదార్థాలలో వాడే ఇంట్లో ఉండే సహజ ఔషదంగా పేర్కొనవచ్చు. వెల్లుల్లి కొలెస్ట్రాల్ ను తగ్గించడంలోనూ, పెద్దప్రేగు క్యాన్సర్, పురీషనాళ, స్టమక్, రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్, మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ లను నిరోధించటంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది.

బరువు తగ్గించడంలో...

రోజుకు కొన్ని వెల్లుల్లి రెబ్బలు తింటే జీర్ణాశయంలో ఎంజైములను ఉత్తేజపరచడం వల్ల బరువు తగ్గుతాము. అంతే కాదు జీర్ణమైన ఆహారంలోని కొవ్వును వెల్లుల్లి ప్రాసెస్ చేయడమే కాదు అవసరమైన ఫ్యాట్ ను శరీరం నుంచి బయటకు పంపించేస్తుంది.

రక్తాన్ని శుద్ది చేయడంలో...

వెల్లుల్లికి రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంది. అంతే కాదు శరీరం లోపలి భాగాల్ని కూడా శుద్ధి చేస్తుంది. శరీరంలోని ఎర్రరక్తకణాలు వెల్లుల్లిలో ఉండే సల్ఫైడ్స్ ను హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ గా మారుస్తుంది. ఈ గ్యాస్ రక్తపోటును నియంత్రిస్తుంది. వెల్లుల్లి తినడం వల్ల చర్మంపై ముడతలు ఏర్పడవు, ప్రమాదకరమైన విష పదార్థల నుంచి కూడా చర్మాన్ని రక్షిస్తుంది.

కాలేయానికి...

వెల్లుల్లిలో ఉండే ఎలిసిన్, సెలినియం రసాయనాలు ఫ్యాటీ లివర్ జబ్బును ట్రీట్ చేసే బైల్ అనే ఫ్లూయిడ్ ను ఎక్కువగా ఉత్పిత్తి చేస్తాయి. దీనిలో యాంటాక్సిడెంట్లు కూడా బాగా ఉన్నాయి. వీటిల్లో అమినోయాసిడ్స్, ప్రోటీన్లు కూడా ఉన్నాయని అధ్యయనాల్లో వెల్లడయింది. ఇవి కాలేయాన్ని ప్రకృతిసిద్ధమైన విష పదర్థాల నుంచి రక్షిస్తాయి...

బిపి, షుగర్ తగ్గించడంలో....

వెల్లుల్లి తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పది నుంచి ఆరు శాతం వరకూ తగ్గుతుంది. వెల్లుల్లిలో ఉన్న రసాయానాలకు ఆర్డీరియల్ ఫ్లేక్ ఫ్మారేషన్ కాకుండా ఆపగల సామర్థ్యం కూడా ఉంది. వెల్లుల్లిలో గ్లూకోజ్ టాలరెన్స్ ను మెరుగు పరుస్తుంది. కొన్ని వెల్లుల్లి రెబ్బలను తీసుకుని వాటిని గుజ్జులా చేసి గ్లాసుడు గోరువెచ్చటి నీళ్లతో నోట్లో వేసుకుని మింగేయాలి. ఇలా చేయడం వల్ల బ్లడ్ షుగర్ తగ్గుముఖం పడుతుంది. 

15:40 - September 23, 2015

మహబూబ్ నగర్ : యూనియన్ ఏర్పాటు..ఇది వింటేనే కొంతమంది యాజమాన్యాలు భగ్గుమంటాయి. యూనియన్ ఏర్పాటు చేయవద్దని హుకుంలు జారీ చేస్తాయి. తమకు ఎక్కడ భంగం కలుగుతుందోనని భావించి ఆ యూనియన్ లపై ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా ఓ కంపెనీలో యూనియన్ ఏర్పాటు చేసుకోవడంపై ఆగ్రహించిన కంపెనీ కొంతమంది కార్మికులను ఇతర పరిశ్రమలోకి బదలాయించింది. దీనిపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలంలోని కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీలో చోటు చేసుకుంది. సంస్థలో సీఐటీయూ పేరిట కార్మికులు యూనియన్ ను రిజిష్టర్ చేయించుకున్నారు. దాదాపు 18 మంది కార్మికులు అనుకూలంగా సంతాకాలు చేశారు. దీనిపై ఆగ్రహించిన యాజమాన్యం 18 మందిని పులివెందులలోని బట్టల పరిశ్రమకు బదిలీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న బాధిత కార్మికులు సంస్థ ఎదుట ఆందోళనకు దిగారు. బదిలీలను వెంటనే ఆపి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులు ధర్నాతో కంపెనీలో పనులు ఆగిపోయాయి. 

Pages

Don't Miss

Subscribe to RSS - షుగర్