షెడ్యూల్

21:51 - October 12, 2017

సిమ్లా : హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. దీనికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. అక్టోబర్‌ 16న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు తెలిపింది. నవంబర్ 9న హిమాచల్ అసెంబ్లీకి ఎన్నికలు జరపనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మొత్తం 68 అసెంబ్లీ స్ధానాలకు ఒకే దశలో పోలింగ్‌ జరుగుతుందని పేర్కొంది. ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 18న జరుగుతుంది. అదేరోజు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 49 లక్షల మంది ఓటర్లున్న హిమాచల్‌లో మొత్తం 7521 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ఈవీఎంలతో పాటు వీవీపాట్‌ యంత్రాలు ఉపయోగిస్తామని సీఈసీ అచల్‌ కుమార్‌ జ్యోతి చెప్పారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో  నేటి నుంచి ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని తెలిపారు. అభ్యర్థులు భారీ స్ధాయిలో ఓటర్లకు పంపే ఎస్‌ఎంఎస్‌లు, వాయిస్‌ మెసేజ్‌లనూ  ఎన్నికల ప్రచార వ్యయం కింద పరిగణిస్తామని ఆయన స్పష్టం చేశారు. సాంకేతిక కారణం వల్ల గుజరాత్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ పెండింగ్‌లో పెట్టింది. ఆ రాష్ట్రంలో డిసెంబర్‌ 18లోపు ఎన్నికలు జరుగుతాయని తెలిపింది.

 

07:19 - September 5, 2017

హైదరాబాద్ : బాలాపూర్ గణేష్ శోభాయాత్ర మొదలైంది. కానీ షెడ్యూల్ ప్రకారం కంటే కొంత ఆలస్యంగా యాత్ర మొదలైంది. గ్రామాల పురవీధుల్లో తిరుగుతున్న గణనాథుడిని భక్తులు దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాలాపూర్ రోడ్డు మార్గంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రత ఏర్పాట్లు చేశారు. లడ్డూ వేలం కార్యక్రమం 9గంటలకు ప్రారంభించనున్నామని, 1994లో సామాన్యు రైతాంగ కుటుంబం బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారని నిర్వాహక కమిటీ సభ్యుడు పేర్కొన్నారు. ఈసారి లడ్డూ వేలం పాటలో 18 మంది పాల్గొంటున్నారని తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:40 - June 21, 2017

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. ఉదయం 11.30కు జూపాడు మండలం తంగడంచ చేరుకుంటారు. అక్కడ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఓర్వకల్లు మండలంలో 800 కోట్లతో నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అక్కడే 7కోట్ల రూపాయలతో నిర్మించిన బాలభారతి పాఠశాలను ప్రారంభిస్తారు. అనంతరం ఓర్వకల్లులో బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత సాయంత్రం 5గంటలకు నంద్యాలకు చేరుకుంటారు. అక్కడే ఇఫ్తార్‌విందుకు హాజరై రాత్రికి నంద్యాలలో బసచేస్తారు. అనంతరం గురువారం చిత్తూరుజిల్లా పర్యటనకు వెళ్లతారని మంత్రి కాల్వశ్రీనివాసులు చెప్పారు. బహిరంగసభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

19:19 - June 7, 2017

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. జులై 24న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ముగియనుంది. ఈసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా లోక్‌సభ కార్యదర్శిని నియమించింది. రాష్ట్రపతిని ప్రతిపాదించేందుకు 50 మంది, బలపర్చేందుకు 50 మంది సభ్యులు ఉండాలని సీఈసీ అన్నారు. ఒక్కో అభ్యర్థి 4 నామినేషన్లు దాఖలు చేయవచ్చు అన్నారు.

08:36 - May 16, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలకు షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 18 నుంచి రిజిస్ట్రేషన్లు జూన్‌ 4వరకు, వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. విద్యార్థులు 100 రూపాయల రిజిస్ట్రేషన్‌ ఫీజుతో రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలో కళాశాలలకు దరఖాస్తు చేసుకొనే సదుపాయం కల్పించారు. 200 ఆలస్య రుసుంతో జూన్‌ 5, 6 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లకు అవకాశమిచ్చారు. ఈసేవ, మీ సేవలతో హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో తప్పనిసరిగా బయోమెట్రిక్‌ వివరాలు నమోదుచేశాకే.. వెబ్‌ఆప్షన్లు ఇచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

జూన్‌ 10న మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు
జూన్‌ 10న మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు, జూన్‌ 18, 19 తేదీల్లో రెండో విడత వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. జూన్‌ 22న రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు ప్రక్రియను చేపట్టనున్నారు. జూన్‌ 29, 30 తేదీల్లో తుది విడత వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తున్నట్టు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. జులై 3న తుది విడత డిగ్రీ సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. ఓయూ మినహా అన్ని వర్సిటీల పరిధిలో డిగ్రీ ఫీజులను పెంచనున్నట్టు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య పాపిరెడ్డి తెలిపారు. పట్టణ పరిధిలో రూ.7,500, గ్రామీణ ప్రాంతాల్లో రూ.5వేలు పెంచుతున్నట్టు చెప్పారు. పెరిగిన మొత్తం ఫీజు రియంబర్స్‌మెంట్‌ పరిధిలోకి రాదని ఆయన స్పష్టంచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 130 గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలున్నాయి.. వీటిలో అటానమస్ కాలేజీలు 16, ప్రైవేటు ఎయిడెడ్ కాలేజీలు 63, ప్రైవేటు అన్‌ఎయిడెడ్ కాలేజీలు 940,సోషల్ వెల్పేర్ కాలేజీలు 23 ఉన్నాయి.. అన్ని కాలేజీల్లో 4 లక్షల 7 వేల 266మంది విద్యార్ధుల ఇన్‌టేక్ ఉంది. అయితే అడ్మిషన్ల విషయంలో ఏ చిన్న తప్పులు దొర్లినా విద్యార్ధులను ప్రలోభాలకు గురిచేసినా ప్రైవేట్‌ కాలేజీ యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హెచ్చరించారు.

21:38 - November 3, 2016

ఢిల్లీ : షెడ్యూల్ ప్రకారమే జీఎస్టీ అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. జీఎస్టీ మండలి సమావేశంలో పన్ను రేట్ల విధానం, పరిహారంపై సుదీర్ఘంగా చర్చించినట్లు ఆయన చెప్పారు. జీఎస్టీ పన్ను రేటును 5, 12, 18, 28 శాతాలుగా నిర్ణయించినట్లు తెలిపారు. ఆహార ధాన్యాలపై సాధారణ ప్రజలకు పన్ను మినహాయింపు ఇవ్వనున్నట్లు చెప్పారు. సామాన్యులు వినియోగించే వస్తువులపై 5శాతం పన్ను రేటును నిర్ణయించామన్న జైట్లీ.. కూల్‌డ్రింక్స్, పాన్ మసాలా, లగ్జరీ కార్లు, పొగాకు ఉత్పత్తులపై 28శాతం పన్ను విధించనున్నట్లు తెలిపారు.

07:33 - September 20, 2016

హైదరాబాద్ : తెలంగాణాలో ఖాళీ అయిన శాసనమండలి సభ్యుడి ఎన్నిక షెడ్యూల్ వెలువడడంతో.....అధికార పార్టీలో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించడంతో నాయకులంతా సైలెంట్ గా ఉన్నారు. వచ్చే ఏడాది ఖాళీ అవుతున్న స్థానాలపై నేతలు భారీగా ఆశలు పెంచుకున్నారు.
తుమ్మల వదిలేసిన సీటు మరో వలసనేతకే..
శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన తుమ్మల నాగేశ్వరరావ్ ..తర్వాత ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో మండలి  స్థానం ఖాళీ అయింది.  తుమ్మల వదిలేసిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు మరో వలస నేతకే అధికార పార్టీ  ప్రాధాన్యత నిచ్చింది. ఈ స్థానాన్ని మైనార్టీ నేతతో భర్తీ చేయాలనే నిర్ణయించింది అధికాపార్టీ.
మైనార్టీకోటాలో భాగంగా ఫరీదుద్దీన్‌కు ఛాన్స్‌ 
డిప్యూటీ సీఎం గా ఉన్నమహ్మూద్ అలీ  తర్వాత  మైనార్టీల నుంచి ఆ స్థాయి నాయకులు పార్టీలో  పెద్దగా లేరు. దీంతో  మైనార్టీ నేతలకు ప్రాధాన్యత నివ్వాలనే ఉద్దేశ్యంతో  మాజీ మంత్రి ఫరీదుద్దీన్  కు కేసీఆర్‌ ఛాన్స్‌ ఇచ్చినట్టు టీఆర్‌ఎస్‌ నేతలు చెప్పుకుంటున్నారు. 
సీఎం నిర్ణయంతో ఆశలు వదులుకున్న నేతలు
పార్టీలో చేరిన కొద్ది రోజుల్లోనే ఫరీదుద్దీన్ కు  ముఖ్యమంత్రి  శాసనమండలి సభ్యడిగా అవకాశం కల్పిస్తామనే హామీ ఇచ్చారు.  ఈ హామీని పార్టీ అధినేత బహిరంగంగా ప్రకటన చేయడంతో ప్రస్తుతం  మండలిలో సభ్యత్వం దక్కవచ్చని భావించిన నేతలు ఈ విడత ఆశలు వదులు కున్నారు. ఇతర పార్టీలకు కూడా శాసనసభలో  పెద్దగా బలం లేకపోవడంతో అధికార పార్టీకే ఈ స్థానం ఖాయంగా కనిపిస్తోంది. 

16:39 - June 28, 2016

ఢిల్లీ : టీమిండియా మ్యాచ్ షెడ్యూల్ వివరాలను ఈసారి క్రీడాకారులు ప్రకటించారు. అది కూడా సామాజిక మాధ్యమమైన ట్విట్టర్ లో. బీసీసీఐ ట్విట్ట‌ర్ అకౌంట్ల‌లో న్యూజిలాండ్‌తో జ‌రిగే టెస్ట్‌, వ‌న్డే క్రికెట్ సిరీస్ షెడ్యూల్‌ను వెరైటీగా ప్ర‌క‌టించారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఫ‌స్ట్ టెస్టు వివ‌రాల‌ను వెల్ల‌డించారు. సెప్టెంబ‌ర్‌-అక్టోబ‌ర్ నెల‌ల్లో ఈ సిరీస్ జ‌ర‌గ‌నుంది. కాన్‌పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో కివీస్‌తో తొలి టెస్టు జ‌రుగుతుంద‌ని కోహ్లీ ట్వీట్ చేశాడు. కాన్ పూర్ నుండి సెప్టెంబర్ 22 నుండి కొత్త సీజన్ ప్రారంభమౌతుందని పేర్కొన్నాడు.
ఇండోర్‌లోని హోల్క‌ర్ స్టేడియంలో సెప్టెంబ‌ర్ 30 నుంచి రెండో టెస్టు మొద‌లువుతుంద‌ని మరో క్రికెటర్ అజింక్య ర‌హానే ట్వీట్ చేశాడు.
మూడో టెస్టు ఈడెన్ గార్డెన్‌లో అక్టోబ‌ర్ 8 నుంచి మొద‌లువుతుంద‌ని మొహ‌మ్మ‌ద్ స‌మీ ట్వీట్ చేశాడు.
అక్టోబర్ 26వ రాంచికి టీమిండియా చేరుకుంటుదని జేఎస్ సీఏ స్టేడియంలో నాలుగో వన్డే జరుగుతుందని, మద్దతివ్వాలని అశ్విన్ రవిచంద్రన్ ట్వీట్ చేశాడు.
ధ‌ర్మ‌శాల‌లో కివీస్‌తో అక్టోబ‌ర్ 16న తొలి వ‌న్డే జ‌ర‌గ‌నుంది. ఆ త‌ర్వాత ఢిల్లీ, మొహాలీ, రాంచీ, విశాఖప‌ట్ట‌ణంలో మిగ‌తా వ‌న్డే మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. అభిమానులంతా వ‌చ్చి విశాఖ వ‌న్డేలో టీమిండియాకు మ‌ద్దతు ఇవ్వాల‌ని కొత్త కోచ్ అనిల్ కుంబ్లే ట్వీట్ చేశాడు. అలాగే మందీప్ సింగ్, శిఖర్ ధావన్, రిషి ధావన్, మహ్మద్ షమీలు కూడా ట్వీట్ చేశారు.
 

మ్యాచ్ తేదీ వేదిక
మొదటి టెస్టు సెప్టెంబర్ 22-26 కాన్ పూర్
రెండో టెస్టు సెప్టెంబర్ 30-అక్టోబర్ 4 కోల్ కతా
మూడో టెస్టు అక్టోబర్ 8-12 ఇండోర్
మొదటి వన్డే అక్టోబర్ 16 ధర్మశాల
రెండో వన్డే అక్టోబర్ 19 ఢిల్లీ
మూడో వన్డే  అక్టోబర్ 23 మొహాలీ
నాలుగో వన్డే అక్టోబర్ 26 రాంచి
ఐదో వన్డే అక్టోబర్ 29 వైజాగ్

 

 

10:01 - June 23, 2016

సినీ నటుడు బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుకున్న 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఇటీవలే మొరాకోలో షూటింగ్ ముగించుకున వచ్చిన విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం నగరంలో రెండో షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. సోమవారం నుండి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ఐదు నెలల పాటు ఈ షూటింగ్ ఉంటుందంట. పోరాట సన్నివేశాలు...పాటలు..చిత్రీకరిస్తారు. హైదరాబాద్..అమరావతి ప్రాంతాల్లో చిత్ర షూటింగ్ ఉంటుందని సమాచారం. ఈ సినిమా పూర్తి చేయడానికి ఏడాది సమయం పడుతుందని, అందుకే ఏకధాటిగా షూటింగ్ జరపడానికి చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోందని టాక్. డిసెంబర్ చివరి నాటికి ఈ చిత్రాన్ని పూర్తి చేయాలన్నది క్రిష్ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో శ్రియ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

16:47 - June 21, 2016

ఢిల్లీ : షెడ్యూల్ 9, 10 సంస్థల విభజనపై హస్తినలో కీలక సమావేశం జరిగింది. హోం శాఖ అదనపు కార్యదర్శి దిలీప్ కుమార్ నేతృత్వంలో కేంద్ర హోం శాఖ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఇరు రాష్ట్రాల రెసిడెంట్ కమిషన్లు..అధికారులు పాల్గొన్నారు.
షెడ్యూల్ 10కి సంబంధించిన అంశంలో 140 ఉమ్మడి సంస్థలలో ఇంకా విభజన ఓ కొలిక్కి రాలేదు. ఉమ్మడి విద్యా మండలి కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. డబ్బులు..ఆస్తుల విభజన కాకపోవడంపై సుప్రీంకోర్టు ఓ తీర్పు కూడా వెలువరించింది. జనాభా నిష్పత్తి ప్రకారం విభజన చేసుకోవాలని కోర్టు సూచించింది. సుప్రీం తీరును ఇతర రంగాలకు వర్తింప చేయాలని ఏపీ కోరుతోంది. దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలియచేస్తోంది. ఈ భేటీలో ఇతర అంశాలు ఏం చర్చించారో తెలియాల్సి ఉంది. 

Pages

Don't Miss

Subscribe to RSS - షెడ్యూల్