షేవింగ్

12:18 - October 11, 2017

మహిళలు అవాంఛిత రోమాలతో బాధ పడుతుంటారు. ఈ సమస్య నుండి బయటపడటానికి చాలా డబ్బును కూడా ఖర్చు చేస్తుంటారు. కానీ కొన్ని చిట్కాలతో అవాంఛిత రోమాల నుండి బయటపడవచ్చని పలువురు సూచిస్తున్నారు. తిరిగి పెరుగుతున్న జుట్టు నుండి సహజ రెమెడీలున్నాయి. బొప్పాయి..శనగపిండి..పసుపు మూడు పదార్థాలను కలుపుకోవాలి. అవాంఛిత రోమాలున్న చోట రాసి స్నానం చేయాలి. అలోవెరా..శనగపిండి కూడా సహాయ పడుతుంది. ఎందుకంటే వీటిని వాడడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంచడంతో పాటు చర్మం మెరుపు దనం వచ్చే అకాశం ఉంది. పచ్చి బొప్పాయిలో ఒక శక్తివంతమైన ఎంజైమ్ ఉంది. నిరంతరం ఉపయోగించడం వల్ల అవాంఛిత రోమాలను అరికట్టవచ్చు. ట్రై చేసి చూడండి. 

15:38 - July 18, 2016

గడ్డం గీసుకుంటావా..చచ్చిపోనా అంటూ తన భార్య బెదిరిస్తోందంటూ ఓ భర్త మెజిస్ట్రేట్ మెట్లు ఎక్కాడు. క్లీన్ గా షేవింగ్ చేసుకోవాలని లేనిపక్షంలో పిల్లలతో పాటు తాను చచ్చిపోతానని పేర్కొంటోందని వాపోయాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అర్షద్ బద్రుద్దీన్ మీరట్ లోని ఓ మసీదులో ఇమామ్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, నలుగురు పిల్లలున్నారు. ఆ మత ఆచారం ప్రకారం అర్షద్ గడ్డం పెంచుతున్నాడు. దీనిపై దంపతుల మధ్య బేదాభిప్రాయాలు వచ్చేవంట. గడ్డం తీసుకోవాలని..షారుఖ్..సల్మాన్ తరహాలో ఉండాలని వాదించేదంట. గడ్డం తీసేయాలి..లేదంటే చచ్చిపోతానని భార్య బెదిరించేది. మొన్న రంజాన్ పండుగకు పిల్లలకు మోడ్రన్ డ్రెస్సులు కొంటానని భార్య పేర్కొనడం..దీనికి అర్షద్ నో చెప్పడం జరిగిపోయాయి. ఈద్ మరుసటి రోజు ఓ గదిలోకి వెళ్లిన ఆమె గడియపెట్టేసుకుంది. కంగారు పడిన అర్షద్ కిటీలోకి నుండి చూశాడు. ఫ్యాన్ కు తాడు వేసి ఉరి వేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు గమనించి ఇతరుల సహాయంతో తలుపులను బద్దలు కొట్టించాడు. ఎందుకు చనిపోవాలని అనుకుంటున్నావ్ అంటే..మూగనోము పెట్టిదంట. అర్జెంట్‌గా మీరు గనుక గడ్డం తీసేయకపోతే పిల్లలకు విషం ఇచ్చి నేను కూడా చనిపోతా అని అల్టిమేటం ఇచ్చింది. అంతేకాకుండా ఆమె దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్‌తో ఓ వ్యక్తితో రాత్రనక, పగలనక చాటింగ్‌లో మునిగి పోతుందట. భార్య ప్రవర్తన చూస్తూ పెరుగుతున్న పిల్లలు కూడా ఇలాగే మారితే పరిస్థితి ఏమిటనే భయం అతడిలో మొదలైంది. ఒకవేళ ఆమె ఆత్మహత్య చేసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆలోచించాడు. చివరకు మెజిస్ట్రేట్ కు లేఖ రాశాడు. తన గోడును అందులో వెళ్లబోసుకున్నాడు. ఇమామ్ లేఖకు మెజిస్ట్రేట్ స్పందించిందని తెలుస్తోంది. సీనియర్ ఎస్పీకి ఈ విషయం చూడాలని ఆదేశాలు జారీ చేసిందని సమాచారం. మరి అర్షద్ బద్రుద్దీన్ 'గడ్డం' కథ ముగుస్తుందా ? ఎలాంటి మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి.

Don't Miss

Subscribe to RSS - షేవింగ్