సంక్షేమ పథకాలు

19:45 - June 9, 2018

విజయవాడ : రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు అందాలని సీఎం చంద్రబాబు అన్నారు. మెరిట్ ప్రకారం సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాయని చెప్పారు. వినూత్న రీతిలో గ్రామ దర్శిని, గ్రామ సభలు నిర్వహించామని...ప్రజల్లో చైతన్యం తేవడానికి ముందుకుపోయామని తెలిపారు. తాను గ్రామాల్లో తిరిగానని...అందరితో ఇంట్రాక్ట్ అయ్యానని తెలిపారు. లబ్ధిదారులతో మాట్లాడానని అన్నారు. నలబై సంవత్సరాల్లో చేసినదానకంటే..నాలుగు సంవత్సరాల్లో చేసిన పనులు పూర్తి సంతృప్తిని ఇచ్చాయని తెలిపారు. గ్రామాల్లో పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లు వేశామన్నారు. నెల చివరికి కల్ల స్ట్రీట్ లైట్లు అన్ని పూర్తి అవుతాయని తెలిపారు. వీధి దీపాల్లో ఎల్ ఈడీ బల్బులు అమర్చామని తెలిపారు. పేదవారి కళ్లల్లో వెలుగులు చూశానని తెలిపారు. 19 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. అన్ని ఊర్లల్లో తాగునీటి సమస్య పరిష్కరించామని తెలిపారు. అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. అంగన్ వాడీ పిల్లలకు చదువు చెప్పిస్తున్నామని తెలిపారు. 6 వేల స్కూల్స్ లో వర్చువల్ క్లాస్ రూమ్, డిజిటల్ క్లాస్ రూమ్ లను ఏర్పాటు చేశామని తెలిపారు. 
 

10:21 - December 7, 2017

విజయవాడ : వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం పలు చర్యలు తీసుకొంటోంది. బీసీల్లో మరింత వెనుకబడిన వారిని గుర్తించి వారిని పురోగతి సాధించేందుకు...పలు చర్యలు తీసుకొనేందుకు ఎంబీసీ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. కార్పొరేషన్ ఛైర్మన్..ఎండీలను నియమించారు. ఈ సందర్భంగా ఎంబీసీ కార్పొరేషన్ ఎండీ నాగభూషణంతో టెన్ టివి మాట్లాడింది. సంచార జాతుల మహిళల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. పల్లె నిద్ర కార్యక్రమం ద్వారా ఎంబీసీ స్థితిగతులపై అధ్యయనం చేయడం జరుగుతుందని, ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా 90 శౄతం సబ్సిడీతో రుణాలు అందచేస్తామన్నారు. డిస్ట్రిక్ స్పెసిఫిక్ యాక్షన్ ప్లాన్ తో వెనుకబిన ప్రతి బీసీ కులం స్థితిగతులపై అధ్యయనం చేయడం జరుగుతుందన్నారు. అత్యంత వెనుకబడిన బీసీ కులాల అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 

12:16 - October 12, 2017

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వరాలు ఎందుకు ప్రకటించేస్తున్నారు. మూడేండ్ల అనంతరం ఇప్పుడే ఎందుకు వరుసగా సంక్షేమ పథకాల అమలు చేస్తున్నారు ? రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదంగా ఉన్న భూములను ఎందుకు రెగ్యులరైజ్ చేస్తున్నారు ? మధ్యతరగతి ప్రజల కోసం కొత్త పథకం తెస్తున్నారా ? కొత్త కొత్త పథకాలు..వరాలు దేని కోసం? అనే చర్చ జరుగుతోంది.      బాబు ప్రస్తుతం దూకుడు పెంచేశారు..వరుసగా పథకాలు..సంక్షేమ పథకాలు ప్రకటించేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో భాగంగా బాబు ఇప్పటి నుండే వ్యూహాలు రచిస్తున్నారని పొలిటికల్ అనలిస్టుల టాక్. 2018-2019 లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధమేనని బాబు ఇదివరకే ప్రకటించేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఇటీలవలే నంద్యా..కాకినాడలో జరిగిన ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించడంతో బాబు మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. మరోసారి మెజార్టీ సాధించాలని బాబు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచే విధంగా ఇప్పటి నుండే ప్రయత్నాలు చేయాలని కింది కార్యకర్తలకు దిశా..నిర్దేశం చేస్తున్నారు. అందులో భాగంగా పార్టీ నేతలు..కార్యకర్తలతో అప్పుడప్పుడు భేటీ అవుతూ పలు సూచనలు..సలహాలు అందచేస్తున్నారు. ప్రభుత్వం అందచేస్తున్న సంక్షేమ పథకాలు..ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బాబు పేర్కొంటున్నారు. ఇంటింటికి టిడిపి పేరిట ఓ కార్యక్రమాన్ని రూపొందించి ప్రజల మధ్యలోకి వెళుతున్నారు.

అన్ని శాఖలపై రివ్యూ నిర్వహించిన బాబు ప్రస్తుతం..పోలవరం..అమరావతిపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ఎలాగైనా 2019 ఎన్నికల్లో వీటిని పూర్తి చేయాలని..రాష్ట్రంలోని 28 ప్రాజెక్టులను ఓ కొలిక్కి తీసుకరావాలని బాబు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పెన్షన్లు..ఇంటి నిర్మాణాలు..చంద్రన్న పెళ్లికానుక..ఎన్టీఆర్ సృజల స్రవంతి..తదితర పథకాలను ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవలే నూతన గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. చంద్రన్న బీమా కింద ప్రమాదవశాత్తు కింద ఎవరైనా మరణిస్తే రూ. 5లక్షలు ఇచ్చే వారు. ఇప్పుడు సహజ మరణానికి రూ. 2లక్షలు అందిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే ప్రత్యర్థి అయిన వైసీపీని కూడా టార్గెట్ చేశారు. ఆ పార్టీలో ఉన్న కొంతమందిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. బలహీనపరిచేలా ప్లాన్స్ రూపొందిస్తున్నట్లు, రాయలసీమలో పార్టీ బలహీనంగా ఉందనే కారణంతో రెడ్డీ సామాజిక వర్గానికి చెందిన కీలకనేతలను పార్టీలో చేర్చుకొనేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.

కానీ ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలపై బాబు దృష్టి సారించడం లేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని రైతులు..ఇతరులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో బాబు ఇచ్చిన హామీలు ఏమాత్రం అమలు చేయలేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు. కేవలం ఎన్నికల కోసమే బాబు పలు స్కీంలు ప్రవేశ పెడుతున్నారని ఆరోపణలున్నాయి. మరి బాబు చేస్తున్న ప్లాన్స్ వర్కవుట్ అవుతాయా ? లేదా ? అనేది చూడాలి. 

06:55 - August 6, 2017

హైదారబాద్: తెలంగాణలో సంక్షేమ పథకాలు, ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై 18శాతం జీఎస్టీ పన్ను విధించడాన్ని జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో వ్యతిరేకించినట్టు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పన్నును 12శాతానికి తగ్గించడానికి ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఒప్పుకున్నారన్నారు. ఇప్పటికే కొనసాగుతున్న పనులపై జీఎస్టీ తగ్గింపును ఆలోచిస్తామని చెప్పారన్నారు. టెక్స్‌టైల్‌ రంగంలోని జాబ్‌వర్క్స్‌పై ట్యాక్స్‌ను 5శాతం తగ్గించమని కోరామన్నారు. సెప్టెంబర్‌ 9న జరిగే జీఎస్టీ కౌన్సిల్‌ 21వ సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఇందుకు అరుణ్‌జైట్లీ అంగీకరించారని తెలిపారు. 

06:51 - May 27, 2017

హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. జూన్ 2 నుంచి మూడు రోజుల జరగనున్న ఈ ఉత్సవాలను పార్టీపరంగా కూడా ఘనంగా నిర్వహించేందుకు నేతల్ని సమాయత్తం చేస్తున్నారు గులాబీ బాస్. అందులో భాగంగా శనివారం పార్టీ శాసనసభ పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

టీఆర్ఎస్ పగ్గాలు చేపట్టి జూన్ 1కి మూడేళ్లు

తెలంగాణలో టీఆర్ఎస్ పగ్గాలు చేపట్టి మూడేళ్లు కావస్తోంది. జూన్ 2 నాటికి మూడేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకల్ని నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ పరంగా తాము చేపట్టిన పలు కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. పార్టీ నేతల్ని కూడా భాగస్వాముల్ని చేస్తూ కార్యాచరణ అమలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా శనివారం తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటు చేశారు.

రాష్ట్ర అవతరణ వేడుకలతో పాటు, పార్టీ అంశాలపై..

తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లతో పాటు.. పార్టీకి సంబంధించిన అంశాలపై కూడా శాసనసభా పక్ష సమావేశంలో కేసీఆర్ చర్చించనున్నట్లు సమాచారం. టిఆర్ఎస్ చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సోసోగా సాగుతుండంపై కేసీఆర్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టి కమిటీలు, నామినేటెడ్ పోస్టులపై ఈ మీటింగ్‌లో కేసీఆర్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు అనుకుంటున్నారు. మూడు నెలలకొకసారి చేయిస్తున్న సర్వేపై శాసనసభ్యులకు కేసీఆర్ పలు సూచనలు చేసే అవకాశం కూడా ఉంది. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి అన్ని పార్టీలు అభిప్రాయాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో శాసనసభా పక్ష సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.

06:47 - May 27, 2017

కృష్ణా : విజయవాడలో రెండో రోజు కలెక్టర్ల సదస్సులో వైద్యారోగ్య శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, ప్రజా సాధికార సర్వేలపై సీఎం సమీక్షలు నిర్వహించారు. పీపుల్స్‌ హబ్‌ సాఫ్ట్‌ కాపీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ప్రజాసాధికార సర్వే వివరాలను పీపుల్స్ హబ్‌ పేరిట ప్రభుత్వం భద్రపరిచిందని.. ఇలాంటి విధానం ప్రపంచంలో ఎక్కడా లేదని సీఎం అన్నారు. ప్రజాసాధికార సర్వే 80శాతం పూర్తయిందని.. మిగిలిన 20 శాతాన్ని మూడు నెలల్లో పూర్తి చేస్తామని ఐటీ అధికారులు సీఎంకు వివరించారు. సంక్షేమ పథకాల అమలు ద్వారా వచ్చే ఫలితాలను బేరీజు వేసుకోవాలని సూచించారు. ఒక్కపైసా కూడా అవినీతి జరగకుండా వంద శాతం లబ్ధి చేకూర్చాలని చెప్పారు.

ఆస్పత్రుల్లో వైద్యుల కొరతపై సీఎం సీరియస్‌

ఆస్పత్రుల్లో వైద్యుల కొరతను తీవ్రంగా పరిగణించిన సీఎం చంద్రబాబు.. అధికారులను నిలదీశారు. వైద్యుల కొరత సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. అవసరమైతే ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో వైద్యులను రిక్రూట్‌ చేసుకోవాలని సూచించారు. తన స్వగ్రామంలోనూ వైద్యుల కొరత ఉందన్నారు. కిడ్నీ బాధిత ప్రాంతాలైన శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో రీసెర్చ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నెలకు ఒక్కసారైనా జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు ప్రభుత్వాస్పత్రులను సందర్శించాలని పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని పంచాయతీల్లో బాలింతలు, గర్భిణుల కోసం ఆర్గానిక్ కూరగాయల సాగుచేస్తున్నారని.. ఈ విధానాన్ని రాష్ట్రమంతా అమలు చేయాలన్నారు.

అంగన్‌వాడీ స్కూల్‌ టీచర్లకు స్మార్ట్‌ఫోన్లు పంపిణీ

అంగన్‌వాడీ స్కూల్‌ టీచర్లకు స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేస్తామన్నారు చంద్రబాబు. అంగన్‌ వాడీ స్కూళ్ల నిర్వహణపై నెలరోజుల్లో సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గార్డెనింగ్‌ వర్క్‌ నేర్పించాలన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు పాఠశాల ప్రాంగణంలోనే కూరగాయలు పండించాలని చెప్పారు. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల్లో సామాజిక బాధ్యత పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

కీ పెర్మామెన్స్‌ ఇండికేటర్లపై అవగాహన కల్పించేందుకు ...

జీవీఏ, సుస్థిర సమ్మిళిత వృద్ధి, కుటుంబ వికాసం, సమాజ వికాసం, కీ పెర్మామెన్స్‌ ఇండికేటర్లపై అవగాహన కల్పించేందుకు అధికారులకు క్యాంప్‌ కార్యాలయంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. క్యాంప్‌ కార్యాలయాన్ని ఇకపై సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కోసం వినియోగిస్తామన్నారు. పాలన సవ్యంగా జరగాలంటే సమయపాలన ఎంతో ముఖ్యమన్నారు చంద్రబాబు. టెక్నాలజీని ఉపయోగించి అధికారులు విధులను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఐటీ కంపెనీలకు భూ కేటాయింపు,ఇ ప్రగతి, మీ సేవా, స్టేట్‌ న్యూట్రిషన్‌ మిషన్‌ తదితర పథకాలపై సీఎం సమీక్షించారు.

17:57 - April 20, 2017

హైదరాబాద్: రాష్ట్రంలో ఆహారభద్రతా కమిటియే వేయని ప్రభుత్వం సంక్షేమంలో నెంబర్‌ వన్‌ ఎలా అవుతుందని ప్రశ్నించారు పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌. దీనిపై తాము త్వరలోనే కార్యాచరణ చేపట్టబోతున్నామన్నారు. ఇక ప్రజాప్రతినిధులకు చర్చించేందుకు అసెంబ్లీ వేదికయితే ప్రజలకు ధర్నాచౌక్‌ వేదిక అన్నారు.కోర్టులు శాంతి భద్రతల పేరుతో నిరసనలు ఆపడం సమంజసం కాదని తెలిపాయి. సంక్షేమ పథకాలను హక్కుగా పొందే చట్టం వచ్చింది. ఆహారభద్రతా చట్టాన్ని అమలుకు పూనుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల సమస్యను ఇంకా పటిష్టంగా అమలు చేసే అవకాశం వుంది. సుధీర్ కమిటీని దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం వుందని కోదండరామ్ సూచించారు.

21:19 - April 4, 2017

అమరావతి : ప్రభుత్వం సాధించిన విజయాలు, పథకాలను ఎప్పకప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబునాయుడు సూచించారు. వెలగపూడి సచివాలయంలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి ఏపీలో జరుగుతోందని.. ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలకు అనుగుణంగా పనిచేసి ప్రభుత్వ పాలనలో వారిని భాగస్వామ్యులను చేయాలని చంద్రబాబునాయుడు అన్నారు. ఈ సమీక్షలో మంత్రులు నారా లోకేష్‌, కాల్వ శ్రీనివాసులు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర పాల్గొన్నారు.

19:40 - January 31, 2017

ఢిల్లీ : రాష్ట్రపతి ప్రసంగం కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను కళ్లకు కట్టినట్లు ఉందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ఎంచుకున్న మార్గాన్ని రాష్ట్రపతి వివరించారన్నారు. 70కిపైగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను చాలా క్లుప్తంగా చెప్పారని వెంకయ్య అన్నారు.

 

13:02 - January 18, 2017

హైదరాబాద్: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల కింద లబ్ధిదారులకు ప్రభుత్వం సబ్సిడీ మంజూరుచేయడం లేదని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి అన్నారు. ప్రభుత్వం కాగితాల మీద అంకెల గారడీతో ప్రజలను మోసంచేస్తోందని ఆరోపించారు. వెనకబడిన కులాలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

Pages

Don't Miss

Subscribe to RSS - సంక్షేమ పథకాలు