సంగారెడ్డి

07:44 - September 12, 2018

హైదరాబాద్ : సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి... కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.  మానవ అక్రమ రవాణా కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. పాస్‌పోర్టు దుర్వినియోగం, ప్రభుత్వ అధికారులను మోసం చేసిన కేసుల్లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు సికింద్రాబాద్‌లోని సిటీ సివిల్‌కోర్టులో హాజరు పర్చారు. వాద ప్రతివాదనలు విన్న న్యాయస్థానం జగ్గారెడ్డికి 14 రోజుల రిమాండ్‌ విధించడంతో జగ్గారెడ్డిని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

పాస్‌పోర్టు సందర్భంగా జగ్గారెడ్డి చూపించిన పత్రాలు, ప్రస్తుతం వారి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించిన పోలీసులు.. రెండింటికి ఎక్కడా పొంతన లేదని తెలిపారు. ఆధారాల కోసం జగ్గారెడ్డి కుటుంబ సభ్యుల ఆధార్‌ కార్డులు, ఫొటోలు సేకరించారు. తన పాస్‌పోర్టు పోయిందంటూ 2016 జనవరిలో... మరో కొత్త పాస్‌పోర్టును జగ్గారెడ్డి పొందినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే తనను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయించిందంటూ జగ్గారెడ్డి ఆరోపించారు.

మానవ అక్రమ రవాణాకు సంబంధించిన కేసు ఉన్నందున హైకోర్టుకు వెళ్లాలని న్యాయమూర్తి సూచించారు. కేసులో పురోగతి కోసం జగ్గారెడ్డిని పది రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది.

13:39 - September 11, 2018

హైదరాబాద్ : మనుషుల అక్రమ రవాణా కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి రిమాండ్ విధించారు. పోలీసులు సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు ఎదుట హాజరు పరిచారు. 104 రోజుల పాటు రిమాండ్ విధిస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. దీనితో జగ్గారెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలించారు. 2004లో జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తన భార్య నిర్మల, కుమార్తె జయలక్ష్మి, కుమారుడు భరత్‌సాయిరెడ్డి పేర్లతో గుజరాత్‌కు చెందిన ఓ కుటుంబానికి నకిలీ పాస్‌పోర్టులు సృష్టించి.. అమెరికాకు తీసుకెళ్లారనే అభియోగాలతో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.  అనంతరం గాంధీ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు నిర్వహించారు. అనంతరం కోర్టులో హాజరు పరిచారు. మరోవైపు ఈ కేసులో జగ్గారెడ్డి బెయిల్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం.  కేవలం తనను రాజకీయ సాధింపు చర్యలో భాగంగానే తనపై అక్రమ కేసులు పెట్టారని జగ్గారెడ్డి ఆరోపించారు. 

11:16 - September 11, 2018

హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని ఎందుకు అరెస్టు చేశారనే దానిపై ఉత్తర మండల డీసీపీ సుమతి వివరణనిచ్చారు. భార్య పిల్లల పేరిట ఇతరులను అమెరికాకు తీసుకెళ్లి అక్కడే వారిని వదిలేసి వచ్చారనే ఆరోపణలతో ఆయన్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 2004లో జగ్గారెడ్డితో తనతో పాటు భార్య, పిల్లల పేరిట పాస్ పోర్టులు తీసుకున్నారని, వేకొరని అమెరికాకు తీసుకెళ్లారని గుర్తించినట్లు తెలిపారు. ఎవరు వెళ్లిందో గుర్తించాల్సి ఉందని, తెలంగాణకు చెందిన వారు మాత్రం కాదని స్పష్టం చేశారు. సికింద్రబాద్ పీఎస్ ఎస్ఐ అంజయ్యకు వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. అక్రమంగా తరలించిన ముగ్గురి నుండి జగ్గారెడ్డి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించినట్లు వెల్లడించారు. ఆయనపై అధికార దుర్వినియోగం కింద కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. 

09:07 - September 11, 2018

సంగారెడ్డి : మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ పట్టణ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా సంగారెడ్డిలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పలువురు కార్యకర్తలు..నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. జగ్గారెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 14 సంవత్సరాలుగా లేనిది ఇప్పుడు తెర మీదకు ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే జగ్గారెడ్డిని అరెస్టు చేసిన అనంతరం పీఎస్ లో మూడు గంటల పాటు పోలీసులు విచారించారు. అనంతరం గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ చికిత్స నిర్వహించారు. అనంతరం సికింద్రాబాద్ కోర్టు స్పెషల్ జడ్జి ముందు జగ్గారెడ్డిని హాజరు పరచనున్నారు. 

2004లో జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తన భార్య నిర్మల, కుమార్తె జయలక్ష్మి, కుమారుడు భరత్‌సాయిరెడ్డి పేర్లతో గుజరాత్‌కు చెందిన ఓ కుటుంబానికి నకిలీ పాస్‌పోర్టులు సృష్టించి.. అమెరికాకు తీసుకెళ్లారనే అభియోగాలతో అదుపులోకి తీసుకున్నారు. అయితే.. జగ్గారెడ్డి తీసుకెళ్లినవారు 14 ఏళ్లు అయినా.. ఇంకా తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన అమెరికా కాన్సులేట్‌ అధికారులు ఈ విషయంపై ఆరా తీయాలంటూ నార్త్‌జోన్‌ పోలీసులకు సమాచారమిచ్చారు. విచారణ చేపట్టిన పోలీసులు.. జగ్గారెడ్డి 2004లో తన సిఫారసుతో ఇప్పించిన పాస్‌పోర్టుల డాక్యుమెంట్లను పరిశీలించారు. దీంతో... అందులో భార్య, కూతురు, కొడుకు పేర్లు ఉన్నా ఫొటోలు వేరేవిగా గుర్తించారు. 

06:47 - September 11, 2018

సంగారెడ్డి : తన భర్త ప్రాణానికి ముప్పు ఉందని జగ్గారెడ్డి భార్య నిర్మల పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఫేక్ డాక్యుమెంట్లతో పాస్ పోర్టు, వీసా పొందారనే ఆరోపణలతో జగ్గారెడ్డిని పటన్ చెరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కనీసం తనతో మాట్లాడనీయకుండా జగ్గారెడ్డిని ఎటు తీసుకెళ్లారో తెలియడం లేదన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్నందుకు... రాజకీయ కుట్రతోనే తన భర్తను అరెస్ట్‌ చేశారని నిర్మల అంటున్నారు. తన భర్త పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 

06:40 - September 11, 2018

హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్‌ సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్‌ పార్టీ నేతలు... హుటాహుటిన టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయానికి చేరుకున్నారు. జగ్గారెడ్డి అరెస్ట్‌ను కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా ఖండించారు. అనంతరం కుందన్‌బాగ్‌లోని డీజీపీ నివాసానికి చేరుకుని.. వినతిపత్రం సమర్పించారు. పోలీసులు రాత్రి సమయంలో సివిల్‌ డ్రస్‌లో వచ్చి అరెస్ట్‌ చేయడం అప్రజాస్వామికమన్నారు టీ-పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.  నకిలీ పత్రాలతో జగ్గారెడ్డి అమెరికా వెళ్లారని పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 2004లో దొంగ పాస్‌పోర్ట్‌ కేసులు ఉన్న కేసీఆర్‌, హరీష్‌రావులను అరెస్ట్‌ చేయాలన్నారు ఉత్తమ్‌. జగ్గారెడ్డి అరెస్ట్‌పై డీజీపీ సరైన సమాధానమివ్వలేదన్న ఉత్తమ్‌... కాంగ్రెస్‌ న్యాయపోరాటం చేస్తుందన్నారు. 

19:26 - August 31, 2018

సంగారెడ్డి : జిల్లా కలెక్టర్‌గా హనుమంతరావు బాధ్యతలు స్వీకరించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో చార్జ్ తీసుకున్న హనుమంతరావు పరిపాలనా సంస్కరణలపై దృష్టి పెట్టారు. ఇంతకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ.. గడా ప్రత్యేకాధికారిగా పనిచేశారు. ఇటీవల జరిగిన ఐఏఎస్‌ అధికారుల బదిలీల్లో భాగంగా హనుమంతరావు సంగారెడ్డి కలెక్టర్‌గా నియమితులయ్యారు. విద్య, సంక్షేమం, కాలుష్యం నివారణ చర్యలకు ప్రాధాన్యత ఇస్తానంటున్న సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు తెలిపే విశేషాలతో..

08:14 - August 31, 2018

సంగారెడ్డి : రోడ్డు ప్రమాదాలకు చెక్ పడడం లేదు. వేగంగా రావడం...నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతుండడంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ డ్రైవర్ చేసిన తప్పిదం నలుగురు నిండు ప్రాణాలు బలి తీసుకుంది. సదాశివపేట మండలంలోని మద్దికుంట వద్ద ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన పలువురు ఓ శుభకార్యక్రమంలో పాల్గొనేందుకు గుల్బార్గాకు వెళ్లారు. తిరిగి గురువారం రాత్రి హైదరాబాద్ కు బయలుదేరారు. తుపాన్ వాహనంలో 11 మంది వస్తున్నారు. మార్గమధ్యంలో భోజనం నిమిత్తం ఆగారు. ఆ సమయంలో డ్రైవర్ మద్యం సేవించాడని...వద్దు అని చెబుతున్నా పెడచెవిన పెట్టాడని బంధువులు పేర్కొంటున్నారు.

మద్దికుంట వద్ద వేగంగా వెళుతున్న ఓ లారీని తప్పించబోయి మరో లారీని వేగంగా తుఫాన్ వాహనం ఢీకొంది. దీనితో అక్కడికక్కడనే నలుగురు దుర్మరణం చెందగా మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులంతా ఎస్ఆర్ నగర్ వాసులు. శివాజీ (28), వరుణ్ (9), తూప్రీ (16), నాగేందర్ (50)లు మృతి చెందిన వారిలో ఉన్నారు. వాహన డ్రైవర్ తప్పతాగి..నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే ఘోరం జరిగిందని బంధువులు వాపోతునాన్రఉ.

మరోవైపు 65 జాతీయ రహదారిపై విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతుండడంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

06:48 - August 31, 2018

సంగారెడ్డి : జిల్లా ఐడీఏ బొల్లారంలో దారుణం జరిగింది. పదవ తరగతి చదువుతున్న బాలిక నిఖితను బీటెక్‌ మూడవ సంవత్సరం చదువుతున్న అరవింద్‌ కత్తితో గొంతు కోసి హత్య చేశాడు.ఈ ఘటన జరిగిన వెంటనే అరవింద్‌ను స్థానికలు ప్టటుకున్నారు. నిఖితను కూకట్‌పల్లి ఆస్పత్రికి తరలించగా... అప్పటికే మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు. శవ పరీక్ష కోసం నిఖిత మృతదేహాన్ని పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారమే నిఖిత హత్యకు కారణమని భావిస్తున్నారు. అరవింద్‌ మహారాష్ట్రలో చదువుతున్నాడు. సెలవుకు వచ్చినప్పుడల్లా ప్రేమ పేరుతో నిఖితను వేధించేవాడని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

19:21 - August 30, 2018

హైదరాబాద్ : స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు పూర్తవుతున్నా.. ఎవరూ చేయని అభివృద్ధి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిందన్నారు మంత్రి హరీష్‌రావు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన హరీష్‌రావు... త్వరలో వెయ్యి డాక్టర్ల పోస్టులను భర్తీ చేస్తామన్నారు. కాంగ్రెస్‌ హయాంలో నెలకు రెండు ప్రైవేట్‌ ఆస్పత్రులు నెలకొల్పేవారని... కానీ తమ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రుల్లో సమస్యలు తీరుస్తున్నాయన్నారు హరీష్‌రావు. 

Pages

Don't Miss

Subscribe to RSS - సంగారెడ్డి