సందీప్ కిషన్

15:42 - November 8, 2018

మిల్కీబ్యూటీ తమన్నా, సందీప్ కిషన్ జంటగా, బాలీవుడ్ డైరెక్టర్ కునాల్ కోహ్లి దర్శకత్వంలో, రైనా జోషి, అక్షయ్ పూరి నిర్మిస్తున్న చిత్రానికి నెక్స్ట్ ఏంటి అనే టైటిల్ ఫిక్స్ చేసారు. నవదీప్, పూనమ్ కౌర్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో పాటలే సినిమాకి టైటిల్స్‌గా పెట్టడం చూస్తున్నాం. నాని హీరోగా నటించిన నేను లోకల్ మూవీలో, నెక్స్ట్ ఏంటి అనే సాంగ్ పాపులర్ అయింది. ఇప్పుడు ఈ సినిమాకి అదే టైటిల్ పెట్టారు. కునాల్ కోహ్లి  బాలీవుడ్‌లో, అమీర్ ఖాన్‌తో ఫనా, సైఫ్ అలీఖాన్‌తో హమ్‌తుమ్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న నెక్స్ట్ ఏంటి చిత్ర షూటింగ్, లండన్, హైదరాబాద్‌లలో జరగనుంది. తమన్నా ప్రస్తుతం ఎఫ్2, అభినేత్రి 2, క్వీన్ తెలుగు రీమేక్ దటీజ్ మహాలక్ష్మితో పాటు, హిందీలో ఖామోషీ అనే సినిమాలు చేస్తుంది. నెక్స్ట్ ఏంటి  మూవీకి లియోన్ జేమ్స్ సంగీతమందిస్తున్నారు. త్వరలో ఫస్ట్‌లుక్, టీజర్ రిలీజ్ చెయ్యనున్నారు.  

11:40 - December 16, 2016

టాలీవుడ్..బాలీవుడ్..వివిధ వుడ్ లో నటించే హీరోలు..హీరోయిన్స్ సినిమాల్లో నటిస్తూనే వ్యాపారంలో కూడా అడుగుపెడుతుంటారు. కొంతమంది సక్సెస్ కాగా మరికొంతమంది సక్సెస్ కాలేక పోతుంటారు. తాజాగా ఈ జాబితాలోకి టాలీవుడ్ యంగ్ హీరో 'సందీప్ కిషన్' వచ్చి చేరాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో 'వివాహ భోజనంబు' పేరిట ఓ రెస్టారెంట్ ను ప్రారంభించాడు. గురువారం సాయంత్రం ఈ రెస్టారెంట్ ఓపెన్ అయ్యింది. సినీ నటి 'రెజీనా' ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అచ్చమైన తెలుగు వంటకాల రుచిని ఈ రెస్టారెంట్ లో చూపెట్టనున్నారు. అద్వితీయమైన రుచులను అతిథులకు అందించాలనే ఉద్దేశంతోనే ఈ రెస్టారెంట్ ను ప్రారంభించినట్టు సందీప్ తెలిపాడు. గతంలో ఎన్నడూ చూడని రుచులను ఈ రెస్టారెంట్ లో చూస్తారని చెప్పారు.

Don't Miss

Subscribe to RSS - సందీప్ కిషన్