సత్యరాజ్

19:34 - November 23, 2018

నేచురల్ స్టార్ నాని హీరోగా, మళ్ళీ రావా‌తో ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో, పిడివి ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌బ్యానర్‌పై, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న సినిమా, జెర్సీ.. నాని పక్కన శ్రద్ధ శ్రీనాధ్, రెబా మోనికా జాన్ కథానాయికలుగా నటిస్తున్నారు.. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న జెర్సీకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాని 2019 సమ్మర్‌లో రిలీజ్ చెయ్యాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. 2019 ఏప్రిల్ 19న సినిమాని విడుదల చెయ్యనున్నట్టు ఒక పోస్టర్ రిలీజ్ చేసారు. క్రికెట్ బ్యాట్‌పై టైటిల్‌తో పాటు, క్రూ పేర్లు డిజైన్ కూడా చేయడం బాగుంది. 146‌ డేస్ టు గో అంటూ, కౌంట్‌డౌన్ కూడా స్టార్ట్ చేసేసారు.  జెర్సీలో నాని తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చెయ్యబోతున్నాడని తెలుస్తోంది.. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో సత్యరాజ్, బ్రహ్మీజీ కీలక పాత్రలు పోషించనుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నాడు..

 

12:36 - October 17, 2018

నేచురల్ స్టార్ నాని కొత్త చిత్రం జెర్సీ, ఈ ఉదయం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.. మళ్ళీరావా‌తో ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తుండగా, శ్రద్ధ శ్రీనాధ్, రెబా మోనికా జాన్ కథానాయికలుగా నటిస్తున్నారు..
త్రివిక్రమ్ ముహూర్తపు సన్నివేసానికి క్లాప్ కొట్టగా, నిర్మాత చినబాబు, త్రివిక్రమ్ కలిసి దర్శకుడికి కథ అందచేసారు..
జెర్సీలో నాని తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చెయ్యబోతున్నాడని తెలుస్తోంది.. క్రికెట్ నేపధ్యంలో సాగే ఈ సినిమాలో సత్యరాజ్, బ్రహ్మీజీ కీలక పాత్రలు పోషించనుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నాడు..

17:49 - October 6, 2018

విజయ్ దేవరకొండ నటించిన నోటా మూవీ నిన్న ప్రేక్షకులముందుకొచ్చింది.. ఊహించినంత కాదుగానీ, ఓ‌ మోస్తరు టాక్ తెచ్చుకుంది.. తమిళ్‌లోనూ పర్వాలేదనిపించుకుంది.. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, టాక్‌తో సంబంధం లేకుండా, అడ్వాన్స్ బుకింగ్‌తో పాటు, ఓపెనింగ్స్ కూడా ఓ రేంజ్‌లో ఉన్నాయి.. ఫస్ట్‌డే నోటాకి వచ్చిన కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే... ఏపీ, తెలంగాణ షేర్ - 4.55 కోట్లు, తమిళనాడు-రూ.1‌కోటి, కర్ణాటక- 60 లక్షలు, యుఎస్- 75 లక్షలు, మిగతా ఏరియాలు - 45లక్షలు, వరల్డ్‌‌వైడ్ షేర్ - 7.3 కోట్లు..షేర్ వివరాలిలా ఉంటే, వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ దాదాపు 14‌ కోట్లని తెలుస్తోంది.. గీత గోవిందం బజ్‌ తో ఓపెనింగ్స్ రావడం వరకూ ఓకే కానీ, డివైడ్ టాక్‌తోనూ తొలిరోజు కలెక్షన్స్ ఇలా ఉన్నాయంటే, విజయ్ దేవరకొండ స్టామినా ఏంటో అర్ధం చేసుకోవచ్చు.. వీకెండ్ కాబట్టి శని,ఆది వారాల్లోనూ మంచి వసూళ్ళు రాబట్టే అవకాశం ఉంది.
 

09:22 - October 6, 2018

విజయ్ దేవరకొండ నటించిన నోటా చిత్రం భారీ అంచనాల మధ్య తెలుగుతోపాటు తమిళ్‌లోనూ రిలీజ్ అయింది..
విజయ్ క్రేజ్ దృష్ట్యా తెలుగులో ఓపెనింగ్స్ అయితే బాగానే ఉన్నాయి కానీ, మిక్స్డ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది..
ప్రస్తుతం నోటాకి పోటీగా చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు కాబట్టి టాలీవుడ్‌లో బాబు పాస్ అయిపోతాడు...
ఇక కోలీవుడ్ విషయానికొస్తే, అక్కడ ఈరోజు విజయ్ సేతుపతి, త్రిష నటించిన 96, విష్ణు విశాల్, అమలా పాల్ నటించిన రాక్షసన్ సినిమాలు రిలీజ్ అయ్యాయి..96 బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోగా, రాక్షసన్ తమిళ్‌లో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్స్‌లో ఒకటి అంటున్నారు..
విజయ్.. గీత గోవిందంతో తమిళ్ లోనూ గుర్తింపుతెచ్చుకున్నాడు.. ఈ రెండు సినిమాల తాకిడిని తట్టుకుని, విజయ్ దేవరకొండ నోటా ఏమేరకు నిలబడతుందో చూడాలి మరి...

 

11:59 - October 5, 2018

‘గీత గోవిందం’ మూవీతో యంగ్‌హీరో ‘విజయ్ దేవరకొండ’ క్రేజ్ కొండెక్కి కూర్చుంది.. 100 కోట్ల క్లబ్‌లోనూ చేరడంతో ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది.. ఇప్పుడు అందరి చూపు విజయ్ లేటెస్ట్ మూవీ నోటాపైనే ఉంది.. గతకొద్దిరోజులుగా ‘నోటా’ సినిమా రిలీజ్‌పై కొన్నిరాజకీయ పార్టీలు హడావిడి చేసాయి... ఎట్టకేలకు అన్ని అడ్డంకులనీ తొలగించుకుని, శుక్రవారం తెలుగుతో పాటు, తమిళ్‌లోనూ గ్రాండ్‌గా రిలీజ్ అయింది ‘నోటా’..మరి సినిమా ఎలా ఉందో చూద్దాం...

కథ :
 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంపికవుతాడు వాసుదేవ్.. ఒక స్వామీజీ సలహామేరకు తన కొడుకు వరుణ్ని ముఖ్యమంత్రిని చెయ్యాలనుకుంటాడు... అయితే అదే టైమ్‌లో అవినీతి ఆరోపణలతో వాసుదేవ్ జైలుకి వెళ్ళడంతో తప్పక తండ్రి స్ధానంలోకి వచ్చిన వరుణ్ ముఖ్యమంత్రిగా ఏం చేసాడు అనేది నోటా కథ..

నటీనటులు :
విజయ్ దేవరకొండ నటుడిగా సినిమా సినిమాకి డెవలప్ అవుతూ ఉన్నాడు... నోటాలో గంభీరంగా కనిపిస్తూ తన శైలి డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు..హీరోయిన్ మెహరీన్‌ది గెస్ట్ అప్పీరియన్స్‌లా అనిపిస్తుంది.. అయినా ఉన్నంతలో పర్వాలేదనిపిస్తుంది.. సీనియర్ నటులు నాజర్ అండ్ సత్యరాజ్ తమ అనుభవంతో వారి వారి పాత్రలని రక్తి కట్టించారు... మిగతా ఆర్టిస్టులు కూడా ఉన్నంతలో బాగానే చేసారు...శ్యామ్.సి.ఎస్. సాంగ్స్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సో సో‌గా ఉన్నాయి.. సంతాన కృష్ణన్ రవిచంద్రన్ కెమెరా వర్క్ బాగుంది.. రేమండ్ ఎడిటింగ్ ఓకే అనిపిస్తుంది..దర్శకుడు ఆనంద్ శంకర్ నోటాని పొలిటికల్ థ్రిల్లర్‌గా మలిచిన విధానం బాగానే ఉంది కానీ, ఓవర్ డ్రామాతో కాస్త సాగదీస్తూ.. సహనానికి పరీక్ష పెట్టాడు..‘నోటా’ దాదాపు 25 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది.. మన దగ్గర విజయ్ మ్యాజిక్‌తో ఆడేస్తుంది కానీ, తమిళ్‌లో ఏమాత్రం స్కోర్ చేస్తుందో చూడాలి.. ఎందుకంటే, తెలుగులో ఎటువంటి పోటీ లేకుండా రిలీజ్ అయింది నోటా‌.. తమిళ్‌లో ఇవాళే రిలీజ్ అయిన, విజయ్ సేతుపతి, త్రిషల 96, ఎస్.జె.సూర్య రాక్షసన్ మూవీస్ కి హిట్ టాక్ వచ్చేసింది... మరి వాటి మధ్య నోటా ఎంతవరకు నెట్టుకొస్తుందో చూడాలి...

తారాగణం :  విజయ్ దేవరకొండ, మెహరీన్,  నాజర్, సత్యరాజ్..

కెమెరా     :  సంతాన కృష్ణన్ రవిచంద్రన్ 

సంగీతం   :    శ్యామ్.సి.ఎస్.

ఎడిటింగ్   :      రేమండ్ 

నిర్మాత    :   కె.ఇ.జ్ఞానవేల్ రాజా

రేటింగ్  : 2.5\5

మూవీ రివ్యూ - 5 స్టార్ రేటింగ్‌ విధానం...

3.5 స్టార్ - ఉత్తమ చిత్రం
3 స్టార్స్  - చాలా బావుంది! తప్పక చూడాల్సిన సినిమా
2.75 స్టార్స్  - ఉన్నంతలో బావుంది
2.5 స్టార్స్ - సినిమా చూడొచ్చు 
2.25 స్టార్స్ - ఇంకొంచెం శ్రద్ధపెట్టాల్సి ఉంది 
2 స్టార్స్ - చాలా మెరుగుపర్చుకోవాలి
 
 
17:07 - October 2, 2018

గీతగోవిందం తర్వాత విజయ్ దేవరకొండ నటించిన నోటా చిత్రం ఈనెల 5వతేదీ రిలీజ్ కానునన్న సంగతి తెలిసిందే.. గతకొద్ది రోజులుగా నోటా పబ్లిక్ మీట్ పేరుతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రబృందం..
నోటా పబ్లిక్ మీట్కి వచ్చిన ప్రముఖ దర్శకుడు కొరటాల శివ,  విజయ్ దేవరకొండ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. 
పెళ్ళిచూపులు సినిమాచూసి విజయ్కి కథ వ్రాయాలనుకున్నాను, అర్జున్ రెడ్డి చూసాక ఈయనకి ఎలాంటి కథ వ్రాయాలో, అని భయపడ్డాను.. గీతగోవిందం చూసాక కూడా అదే పరిస్ధితి.. ఎప్పటికప్పుడు కన్ఫ్యూజన్‌లో పడేస్తున్నారు.. ఇప్పుడు నోటా చూసాను.. వైవిధ్య భరితమైన సినిమాలు చేస్తున్నారు.. డెఫినెట్‌గా ఒక మంచి కథతో మీదగ్గరకి వస్తాను అని కొరటాల అనగానే విజయ్ కూడా హ్యాపీగా రియాక్ట్ అయ్యాడు.. వరసగా నాలుగు హిట్స్ ఇచ్చిన కొరటాల విజయ్ గురించి ఇలా అన్నాడంటే, ప్రస్తుతం టాలీవుడ్‌లో విజయ్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు..

12:19 - April 22, 2017

బెంగళూరు : కర్ణాటకలో బాహూలి 2 కు లైన్ క్లియర్ అయింది. సత్యరాజ్ క్షమాపణలతో తగ్గిన కన్నడ సంఘాలు వెనక్కు తగ్గాయి. కన్నడ సంఘాల సమాఖ్య సినిమా విడుదలకు అంగీకరించాయి. సత్యరాజ్ బాహుబలిలో కేవలం పాత్ర ధారి అని హీరో, దర్శకుడో కాదని సినిమా విడుదలకు సహకరించాలని దర్శకుడు రాజమౌళి కోరారు. కర్ణాటకలో సినిమా విడుదలు అడ్డుకుంటే తమిళనాడులో కన్నడ సినిమా అడ్డుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ వ్యవరంలో వెనక్కు తగ్గడం మంచిదని భావించి సినిమా విడుదలకు సంఘ నాయకులు ఒకే   చెప్పారు. తొమ్మిది  సంవత్సరాల క్రితం తమిళనాడు సత్యరాజ్ కావేరి జలాలపై కర్ణాటకకు వ్యతిరకంగా మాట్లాడడంతో ఆయన నటించిన బాహుబలి 2 సినిమాను కర్ణాటకలో అడ్డుకుంటామని కన్నడ సంఘాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే.

07:29 - May 30, 2016

సత్యరాజ్‌ ప్రధాన పాత్రధారుడిగా, శిబిరాజ్‌, బిందుమాధవి జంటగా ధరణీధరన్‌ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన 'జాక్సన్‌ దురై' చిత్రాన్ని రత్నా సెల్యులాయిడ్స్ పతాకంపై జక్కం జవహర్‌ బాబు 'దొర' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. నిర్మాత జక్కం జవహర్‌ బాబు మాట్లాడుతూ, 'తమిళంలో రూపొందిన ఈ పిరియాడి కల్‌ హర్రర్‌ ఎంటర్‌టైనర్‌లో సత్యరాజ్‌ కీలక పాత్రలో నటించారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ సిద్ధార్థ్‌ విపిన్‌ వినసొంపైన బాణీలు అందించారు. వెన్నెలకంటి, చంద్రబోస్‌ల సాహిత్యం, శశాంక్‌ వెన్నెలకంటి మాటలు ఆకట్టుకుంటాయి. అనువాద పనులు జరుగుతున్నాయి. జూన్‌ మొదటి వారంలో పాటలను, మూడో వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. తెలుగు, తమిళంలో ఏకకాలంలో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. ఇటీవల వైవిధ్యమైన హర్రర్‌ చిత్రాలను తెలుగు ప్రేక్ష కులు బాగా ఆదరిస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాం' అన్నారు.

12:55 - April 9, 2016

మొన్నీ మధ్య ఓ గోడపై కూర్చొని ఉన్న మహేష్‌బాబు, శ్రుతిహాసన్‌ కాలు పట్టుకుని లాగుతున్న స్టిల్‌ పెద్ద హాట్‌టాపిక్‌గా మారింది. అదే 'శ్రీమంతుడు' చిత్రం కోసం చేసిన సన్నివేశంలోది ఆ స్టిల్‌. ఈసారి మహేష్‌బాబు ఎవరో కాలికి చెప్పులు తొడుగుతున్న స్టిల్‌ గురువారం విడుదల చేశారు. 'బ్రహ్మోత్సవం' చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ ఇది. ఇప్పుడు మహేష్‌ బాబు చెప్పులు ఎవరికి తొడుగుతున్నారో...తెలియాల్సి ఉంది. జనవరి ఒకటిన బ్రహ్మోత్సవం టీజర్‌ విడుదల చేశారు. అందులో కన్పించిన డ్రెస్‌లోనే ఉన్న మహేష్‌బాబు మోకాలి మీదికి వంగి ఓ పెద్ద మనిషికి చెప్పులు తొడుగుతున్న చిత్రాన్ని విడుదల చేసింది చిత్ర బృందం. బహుశా.. తండ్రి సత్యరాజ్‌ కావచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే సత్యరాజ్‌ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. శరవేగంగా ఈ చిత్ర షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ సినిమా ఆడియోను ఈనెల 24న తిరుపతిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మే 6న సినిమాను విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.

Don't Miss

Subscribe to RSS - సత్యరాజ్