సభ

20:20 - April 16, 2018

హైదరాబాద్ : తెలంగాణ జన సమితి సభకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 29న సరూర్‌నగర్‌ గ్రౌండ్‌లో తెలంగాణ జనసమితి ఆవిర్భావ సమావేశాన్ని నిర్వహించనుంది. సభ కోసం అనుమతి ఇవ్వాలని జనసమితి నేతలు పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే సభకు అనుమతి ఇవ్వలేమని ఇటు పోలీసు శాఖ, అటు సరూర్‌నగర్‌ గ్రౌండ్‌ నిర్వాహకులు స్పష్టం చేశారు. దీంతో  తెలంగాణ జన సమితి నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు సభకు అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. మూడు రోజుల్లోగా అనుమతి ఇవ్వాలని కోర్టు పేర్కొంది. 

 

17:03 - April 5, 2018

ఢిల్లీ : రాజ్యసభ వాయిదా పడ్డా సభలోనే టీడీపీ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎంపీలు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు ఎంపీలను బయటకు తీసుకెళ్లేందుకు మార్షల్స్‌ ప్రయత్నిస్తున్నారు. 

19:02 - April 4, 2018

ఢిల్లీ : తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నికైన ముగ్గురు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ ప్రారంభమైన వెంటనే.. చైర్మన్‌ వెంకయ్యనాయుడు జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, బండా ప్రకాశ్ ముదిరాజ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ముగ్గురు సభ్యులు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. వెంకయ్యనాయుడుకు ముగ్గురు సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తమపార్టీ అధినేత కేసీఆర్‌ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతామన్నారు. రాష్ట్ర ప్రజల సమస్యలను సభలో ప్రతిభావంతంగా వినిపిస్తామని టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు తెలిపారు. 

 

15:52 - April 3, 2018

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని పాల్వంచలో జరుగుతున్న  మంత్రి కేటీఆర్‌ సభలో కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. తమ కాలేజీలో కనీస మౌలిక సదుపాయాలు లేవని, లెక్చరర్‌ల కొరత ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను తీర్చాలంటూ విద్యార్థులు పట్టుబట్టారు. విద్యార్థుల నిరసనలతో కేటీఆర్‌ సభ నుండి వెళ్లిపోయారు.

 

19:04 - April 1, 2018

సంగారెడ్డి : కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై సీఐటీయు రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యం బతకాలన్నా... ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు తమ బతుకు తాము బతకాలన్నా బీజేపీ ప్రభుత్వానికి చరమగీతం పాడాలన్నారు. సీపీఎం అఖిలభారత మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ చేపట్టిన బస్సు యాత్ర సంగారెడ్డికి చేరుకున్న సందర్భంగా సభ నిర్వహించారు. రిజర్వేషన్లు ఇచ్చేందుకు రాష్ర్టాలకు అధికారం కావాలనే  కేసీఆర్‌... రిజర్వేషన్లే లేని యూనివర్సిటీలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. 

 

16:22 - March 31, 2018

కృష్ణా : అయేషామీరా హత్య కేసులో అసలైన నిందితులను పట్టుకోవాలని సామాజిక కార్యకర్త దేవి అన్నారు. విజయవాడలో అయేషా మీరా న్యాయపోరాట కమిటీ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దశాబ్ధకాలంగా విచారణ జరుగుతున్నా దోషులను పట్టుకోకపోవడం ప్రభుత్వం వైఫల్యమని విమర్శించారు. కొందరి స్వార్థం కారణంగా యవ్వనమంతా జైల్లో గుడిపానని సత్యంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆర్ధికసాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా, ప్రజా, దళిత సంఘాలు పాల్గొన్నాయి. 

13:04 - March 10, 2018

హైదరాబాద్ : మిలియన్‌ మార్చ్‌ స్పూర్తి సభ సందర్భంగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ రోడ్‌ బస్టాప్‌ వద్ద ఆస్పత్రికి వెళుతోన్న వారిని పోలీసులు అడ్డుకోవడంతో సీపీఎం నేతలు పోలీసులతో వారించారు. దీంతో వారిని పోలీసులు ఆటోలో పంపించారు. 

18:49 - March 6, 2018

నిజామాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ పాలన అవినీతి, దోపిడీకి ఆలవాలంగా మారిందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. టీపీసీసీ చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా నిర్మల్‌లో జరిగిన సభలో కాంగ్రెస్‌ నాయకులు  కేసీఆర్‌ కుటుంబంపై విరుచుకుపడ్డారు. అప్రజాస్వామిక పాలనకు అంతం పలకాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రంలో దోపిడీ పాలన సాగుతోందని జానారెడ్డి అన్నారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు కాలేదని చెప్పారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులు దోచుకుంటున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు.  

15:04 - February 25, 2018
17:52 - January 25, 2018

Pages

Don't Miss

Subscribe to RSS - సభ