సమంత

07:47 - July 23, 2017

వరంగల్ : టాలీవుడ్‌ హీరోయిన్ సమంత వరంగల్‌లో సందడి చేశారు. హన్మకొండ కిషన్‌పూర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన బిగ్‌ సి మొబైల్‌ స్టోర్‌ను ప్రారంభించారు. అయితే సమంత వస్తుందని తెలుసుకున్న అభిమానులు ఆమెను చూసేందుకు భారీగా తరలివచ్చారు. మొబైల్‌ షాప్‌ ప్రారంభం తర్వాత సమంత అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

 

10:46 - July 21, 2017

బాలీవుడ్..టాలీవుడ్..ఇలా ఏ వుడ్ లోనైనా సినిమాల కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు. అందులో ప్రధానంగా సెట్ ల కోసం భారీగా డబ్బులు గుమ్మరిస్తుంటారు. కొన్ని సినిమాల దర్శక, నిర్మాతలు సెట్టింగ్ ల కోసం కోట్లు రూపాయలు ఖర్చు చేస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో వార్తలు వెలువడుతుంటాయి. తాజాగా 'సుకుమార్'..’రామ్ చరణ్' తాజా చిత్రానికి సంబంధించిన ఓ వార్త హల్ చల్ చేస్తోంది.

మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తేజ..సుకుమార్ కాంబినేషన్ లో ఓ క్రేజీ ప్రాజెక్టు రూపొందుతోంది. పూర్తి గ్రామీణ నేపథ్యంలో రూపొందబోయే సినిమాకు ''రంగస్థలం 1985’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇందులో 'రామ్ చరణ్' వెరైటీ పాత్ర పోషించనున్నారు. ‘చెర్రీ' సరసన 'సమంత' నటిస్తోంది. ఈమె కూడా పల్లెటూరి యువతిగా నటిస్తోంది.

ఇదిలా ఉంటే సినిమా కోసం భారీ సెట్ వేస్తున్నారని తెలుస్తోంది. రూ. 5 కోట్లతో ఖరీదైన సెట్ ను రూపొందిస్తున్నారు. 1980ల నాటి వాతావరణం కనిపించేలా ఓ గ్రామాన్ని ఆర్టిఫిషియల్ గా రూపొందిస్తున్నట్లు, దాదాపు 35 రోజులపాటు ఈ సెట్ లోనే షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో 'చరణ్' మాస్ లుక్ తో క‌నిపిస్తున్నాడు. ఇప్పటికే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో గోదావరి నది, కొల్లేరు ప్రాంతంలో విలేజ్ బ్యాక్ గ్రౌండ్ కి సంబంధించిన కొన్ని సీన్స్ ను షూట్ చేశారు.

16:15 - July 9, 2017

వరుస చిత్రాలతో బిజీ బిజీగా మారిపోతున్న 'కాజల్' కు మరో ఆఫర్ వచ్చినట్లు సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి. స్టార్ హీరోల పక్కన మంచి మంచి అవకాశాలు పట్టేస్తూ ప్రేక్షకులను 'కాజల్' అలరిస్తోంది. మెగాస్టార్ 'చిరంజీవి' సరసన 'ఖైదీ నెంబర్ 150’లో చిందేసిన ఈ ముద్దుగుమ్మ తమిళంలో కూడా బిజీగా ఉంది. గ్లామర్ హీరోయిన్ గా హావా కొనసాగిస్తున్న ఈ భామ 'నాగార్జున' నటిస్తున్న 'రాజు గారి గది 2’ సినిమాలో నటిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో 'సమంత' కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమె షూటింగ్‌లో సైతం పొల్గొందని టాక్. పాత్ర నచ్చడంతోనే నటించేందుకు 'కాజల్' ఒప్పుకుందని పుకార్లు షికారు చేస్తున్నాయి. ప్రధాన పాత్ర పోషిస్తున్న సీరత్ కపూర్ సరసన 'కాజల్' నటించందా ? లేక 'నాగార్జున' సరసన నటించిందా అనేది చూడాలి. 'రానా' సరసన 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రంలో 'కాజల్' నటిస్తోంది.

15:34 - July 9, 2017

టాలీవుడ్ లో వరుసగా చిత్రాలు చేస్తున్న 'సమంత' ఇతర భాషా చిత్రాలపై కూడా దృష్టి పెడుతోంది. తమిళ సినీ రంగంలో పలు చిత్రాలు చేస్తూ అక్కడి ప్రేక్షకులను కూడా అలరిస్తోంది. తాజాగా మోహన్ రాజా దర్శకత్వంలో 'వేలైక్కారన్' చిత్రంలో 'సమంత' నటిస్తోంది. కొన్ని రోజులుగా సినిమా షూటింగ్ కొనసాగుతోంది. శుక్రవారం నుండి 'సమంత' షూటింగ్ లో పాల్గొంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆమెకు ఘన స్వాగతం పలికింది. హీరోగా నటిస్తున్న 'శివకార్తియన్'..’సమంత'లకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. 14 ఏఎం ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 'సిమ్రాన్'..’నెపోలిన్' ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

16:00 - July 5, 2017

టాలీవుడ్ మన్మథుడు 'నాగార్జున' తనయుడు 'నాగ చైతన్య' వివాహం త్వరలో 'సమంత' తో జరుగనున్న విషయం తెలిసిందే. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం కూడా జరిగింది. 'నాగార్జున' తనయుడు 'అఖిల్' కాబోయే వదిన 'సమంత'తో కరీంనగర్ లో సందడి చేశాడు. మెయిన్ సెంటర్ లోని నూతనంగా ఏర్పాటు చేసిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ను బుధవారం వీరు ప్రారంభించారు. వీరు వస్తున్న విషయం తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్యలో ఆ ప్రాంతానికి రావడంతో అక్కడంతా సందడి వాతావరణం ఏర్పడింది. సౌతిండియా షాపింగ్ మాల్ ప్రచారకర్తలుగా 'అఖిల్'..'సమంత'లున్న విషయం తెలిసిందే.

08:47 - June 28, 2017

సినిమా : ఓ స్టార్ హీరోయిన్ మొబైల్ లేకుండా వారం రోజుల పాటు గడిపారు. ఆ హీరోయిన్ షూటింగ్ కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్లడంతో ఫోన్ లేకుండా ఉన్నట్టు తెలుస్తోంది. హీరోయిన్ ఎవరంటే ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న రంగస్థలం 1985 షూటింగ్ లో ఉన్న హీరోయిన్ సమంత సినిమా షూటింగ్ కోసం రంపచోడవరం అటవీ ప్రాంతంలో జరిగింది. కనీస వసతులు కూడా లేని ఈ ప్రాంతంలో కీలక సన్ని వేశాల చిత్రీకరణ చేశారు. అయితే అలాంటి పరిస్థితుల్లో సమంత ఎలాంటి కంప్లెంట్ చేయకుండా షూటింగ్ చేశారు.

షూటింగ్ లొకేషన్ లో సమంత స్టిల్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా షూటింగ్ కు సంబంధించి సమంత చేసిన ట్వీట్ మరింత ఆసక్తికరంగా మారింది. '' వారం పాటు ఫోన్ లేకుండా..అంత ఇబ్బందిగా లేదు..నేను మరోసారి కూడా ఇలా ఉండగలను..!'' అంటూ ట్వీట్ చేసింది. సమంత ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. సినిమాలన్ని అక్టోబర్ లోపు పూర్తి చేసి నాగచైత్యనతో పెళ్లికి రెడీ అవుతోంది. 

14:52 - June 26, 2017

టాలీవుడ్ నటి 'సమంత' పూర్తిగా కొత్తగా కనిపించనుంది. గత చిత్రాల పాత్రలకు భిన్నంగా ఓ పాత్ర చేయబోతోంది. మెగాస్టార్ చిరంజీవి తనయుడు 'రామ్ చరణ్'..దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'రంగస్థలం 1985’ చిత్రంలో 'సమంత' నటిస్తున్న సంగతి తెలిసిందే. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో 'సమంత' కొత్తగా కనిపించనుంది. చెర్రీ పక్కా పల్లెటూరి యువకుడిగా లుంగీలో కనిపించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో కనిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఫొటోను 'సమంత' రిలీజ్ చేసింది. ఈ ఫొటోలో లాంగా వోణి ధరించి పల్లెటూరి అమ్మాయిల..కాలువ గట్టు కూర్చొని సూర్యాస్తమయం చూస్తున్నట్లు ఉంది. ‘అలసట..బాధ పెద్ద విషయం కాదు..కెమెరా కేవలం అద్బుతాన్నే చిత్రీకరిస్తుంది' అంటూ 'సమంత' పోస్టు చేశారు.

11:13 - June 21, 2017

టాలీవుడ్ లో ఓ వెలుగు వెలుగొందిన 'సిమ్రాన్' మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఆమె పలు విజయవంతమైన సినిమాల్లో నటించారు. సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ సినిమాలో విలన్ గా నటిస్తోందని తెలుస్తోంది. శివ కార్తికేయన్, పొన్ రామ్ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో శివ కార్తీకేయన్..సమంత తొలిసారిగా నటిస్తున్నారు. వీరితో పాటు 'సిమ్రాన్'..’నెపోలియన్' కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో 'శివ కార్తికేయన్' తండ్రి పాత్రలో 'నెపోలియన్' నటిస్తున్నట్లు..ప్రతి నాయకిగా 'సిమ్రాన్' నటిస్తోందని తెలుస్తోంది. అంబ సముద్రంలో ఇటీవలే పూజా కార్యక్రమాలు జరిగాయి. శివ కార్తికేయన్‌తో 'రెమో’, 'వేలైక్కారన్‌' చిత్రాన్ని నిర్మించిన 24 ఎ.ఎం. స్టూడియోస్‌ సంస్థ ఈ చిత్రాన్నీ నిర్మిస్తోంది.

11:59 - June 20, 2017

మెగాస్టార్ చిరంజీవి తనయుడు 'రాం చరణ్' నెక్ట్స్ మూవీ కోసం చాలా కష్టపడుతున్నాడంట. ఆయన నటించిన 'ధృవ' ఘన విజయం సాధించడంతో తదుపరి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ప్రస్తుతం యమ స్పీడుగా షూటింగ్ కొనసాగుతోంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ 'రంగస్థలం 1985’ గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. తూర్పుగోదావర జిల్లాలో అధిక శాతం షూటింగ్ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం 'రాంచరణ్' ఏకంగా రోజంతా షూటింగ్ లో పాల్గొంటున్నాడని చిత్ర యూనిట్ వర్గాల కథనం..ఉదయం షూటింగ్ స్టార్ట్ చేస్తే రాత్రి వరకు కొనసాగుతోందని సమాచారం. అటవీ ప్రాంతాల్లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోందని, ఇందులో ‘రాం చరణ్’ కు కొన్ని గాయాలైనా లెక్క చేయడం లేదని సోషల్ మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నెలాఖరువరకు ఈ షూటింగ్ కొనసాగుతుందనీ, అనంతరం హైదరాబాద్‌లో నిర్మించిన గ్రాండ్‌ సెట్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ పేర్కొంటోంది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వర్షపు సీన్లలో కూడా సుకుమార్ షూటింగ్ కొనసాగిస్తున్నారంట. లుంగీ క‌ట్టుకొని న్యూలుక్‌లో చెర్రీని చూసి అక్క‌డి అభిమానులు మురిసిపోతున్నార‌ట‌. స‌మంతా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోందంట. మరి 'చెర్రీ' కష్టానికి ప్రతిఫలం దక్కుతుందా ? లేదా ? అనేది చూడాలి.

13:19 - June 12, 2017

'సమంత' జోరు కొనసాగిస్తోంది. పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ యమ బిజీగా మారనుంది. టాలీవుడ్ మన్మథుడు 'నాగార్జున' తనయుడు 'అక్కినేని నాగ చైతన్య'..’సమంత' మధ్య ప్రేమాయణం నడుస్తున్న సంగతి తెలిసిందే. మరో నాలుగు నెలల్లో వీరిద్దరి వివాహం జరగనుంది. దీనితో నాలుగు నెలల్లో సినిమాలు కంప్లీట్ చేయాలని 'సమంత' యోచిస్తోందని తెలుస్తోంది. 'రామ్‌చరణ్‌' తో 'రంగ స్థలం 1985' చిత్రం..విజయ్ తో..విశాల్‌కి జోడీగా నటిస్తున్న 'ఇరుంబు థిరై' చిత్రాలుండగా, తాజాగా మరో చిత్రంలో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 'శివకార్తికేయన్‌' హీరోగా నటించే చిత్రంలో నటించనుంది. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్‌ కార్యక్రమాలు ఈనెల 16 నుంచి చెన్నైలో ప్రారంభం కానున్నాయి. పెళ్లి సమయం వచ్చే సరికి ఈ నాలుగు సినిమాలు కంప్లీట్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నాలుగు ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలనే లక్ష్యంతో క్షణం తీరిక లేకుండా షూటింగ్‌ల్లో గడిపేస్తున్నట్టు ట్వీట్‌ ద్వారా అభిమానులతో సమంత షేర్‌ చేసుకుంది.

Pages

Don't Miss

Subscribe to RSS - సమంత