సమన్లు

21:55 - July 10, 2017

ఢిల్లీ : ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కూతురు మీసా భారతికి ఈడీ సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్‌ కేసులో మంగళవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఢిల్లీలోని మీసా ఫాంహౌస్‌ను ఈడీ అటాచ్‌ చేసే ఆలోచనలో ఉంది. రెండు రోజుల క్రితం మనీ లాండరింగ్‌ కేసులో మీసా నివాసంతో పాటు ఫామ్‌హౌస్‌లో ఈడీ సోదాలు నిర్వహించింది. మీసా భర్త శైలేష్‌ను ఈడీ ప్రశ్నించింది. అక్రమ ఆస్తుల కేసులో మీసా, ఆమె భర్త శైలేష్‌ గతనెల ఐటి అధికారుల ముందు హాజరైన విషయం తెలిసిందే. అతి తక్కువ ధరలకే భూములు కొనుగోలు చేసి పెద్ద మొత్తంలో ఆస్తులు కూడ బెట్టారని మీసా ఆమె భర్తపై ఆరోపణలున్నాయి. 

07:07 - July 7, 2017

హైదరాబాద్ : అక్రమాస్తుల కేసులో వైఎస్‌ జగన్‌కు ఈడీ కోర్టు సమన్లు జారీచేసింది. ఇండియా సిమెంట్స్‌ వ్యవహారంలో ఈడీ చార్జీషీట్‌ను పరిగణలోకి తీసుకున్న కోర్టు..ఆగస్టు 4న కోర్టుకు హాజరుకావాలని జగన్‌కు ఆదేశాలు జారీచేసింది. జగన్‌తో పాటు ఇండియా సిమెంట్స్‌ అధినేత శ్రీనివాసన్‌, విజయసాయిరెడ్డి, ఐఏఎస్‌ అధికారి ఆదిత్యనాథ్‌ దాస్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ శామ్యూల్స్‌కూ కూడా ఈడీ కోర్టు సమన్లు జారీచేసింది.

 

21:33 - May 23, 2017

ఢిల్లీ : బొగ్గు కుంభకోణంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్‌ మాజీ ఎంపీ నవీన్‌ జిందాల్‌కు ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. మధ్యప్రదేశ్‌లోని బొగ్గు క్షేత్రం కేటాయింపుకు సంబంధించిన కేసులో కోర్టు ఈ చర్య తీసుకుంది. నవీన్ జిందాల్‌తో పాటు జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ కంపెనీకి చెందిన మాజీ డైరెక్ట్ సుశీల్ మరూ, మాజీ డిప్యూటీ ఎండీ ఆనంద్ గోయల్, సీఈఓ విక్రాంత్ గుజ్రాల్‌లకు కూడా సమన్లు జారీ అయ్యాయి. ఉర్తన్ నార్త్ కోల్ బ్లాకు కేటాయింపులో వీరు మోసానికి పాల్పడ్డారని, నేరపూరిత కుట్ర జరిపారని సీబీఐ ఆరోపించింది. సిబిఐ సమర్పించిన అభియోగపత్రాన్ని విచారణకు స్వీకరించిన ప్రత్యేక కోర్టు ఈ సమన్లను జారీ చేసింది. వీరంతా సెప్టెంబరు 4న జరిగే విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.

11:38 - May 9, 2017

ఢిల్లీ : వివిధ బ్యాంకులకు 9వేల కోట్లు రుణాలు ఎగ్గొట్టి యూకేలో ఉన్న లిక్కర్ కింగ్విజయ్‌ మాల్యాకు సుప్రీంకోర్టు మరోషాక్‌ ఇచ్చింది. కోర్టు ధిక్కరణ కింద విజయ్‌మాల్యాకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. జూలై 10న హాజరుకావాలని ఆదేశించింది.

15:31 - April 21, 2017

ఇటీవల పలువురు హీరోలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇటీవలే సోనూ నిగమ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. తాజాగా ప్రముఖ నటుడు కమల్ హాసన్ కు కోర్టు సమన్లు జారీ చేయడంపై చర్చానీయాంశమైంది. మహాభారతం..ద్రౌపదిపై కమల్ పలు వ్యాఖ్యలు చేశారని, హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా ఉన్నాయంటూ హిందూ మక్కల్ కట్చి పార్టీ కోర్టుకెక్కింది. దీనితో వల్లియార్ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 5వ తేదీన కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశాల్లో పేర్కొంది. మరి కమల్ కోర్టుకు హాజరౌతారా ? లేదా ? అనేది చూడాలి.

16:33 - March 28, 2017

విజయవాడ : ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్ మళ్లీ జైలుకెళుతారా ? అనే సందేహాలు వెలువడుతున్నాయి. సీబీఐ సమన్లు జారీ చేయడమే ఇందుకు కారణం. పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ షరతులతో కూడిన బెయిల్ పొందిన సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో సీబీఐ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఆయనకు షరతులతో జారీ చేసిన బెయిల్ ను రద్దు చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. కేసును ప్రభావితం చేసే విధంగా జగన్ ప్రయత్నిస్తున్నారని, సీబీఐకి వ్యతిరేకంగా జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. సీబీఐ సరిగ్గా దర్యాప్తు చేయడం లేదని కేసుల్లో సాక్షిగా ఉన్న రమాకాంత్ రెడ్డి ఆరోపించారని, కేసులపై ప్రభావం పడుతుందని సీబీఐ పేర్కొంది. సాక్షులను తారుమారు చేస్తారని పలుసార్లు తాము పేర్కొనడం జరిగిందని ప్రస్తుతం అది రుజువవుతోందని తెలిపింది. ఏప్రిల్ 7వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని జగన్ కు సూచించింది. ఇందులో రాజకీయ అంశాలు ముడిపడ్డాయని జగన్ తరపు న్యాయవాది పేర్కొంటున్నారు.

21:30 - March 24, 2017

హైదరాబాద్: ఎయిర్‌ ఇండియా సీనియర్‌ ఉద్యోగిని చెప్పుతో కొట్టినందుకు శివ‌సేన ఎంపీ ర‌వీంద్ర గైక్వాడ్‌ను ఎఫ్‌ఐఏ నిషేధించింది. దీంతో ఆయన ఏ ప్రయివేట్‌ విమానంలోనూ ప్రయాణించడానికి వీలు లేకుండా పోయింది. ఇవాళ ఢిల్లీ నుంచి పుణెకు వెళ్లాల్సిన గైక్వాడ్‌ విమాన టికెట్‌ను ఇండిగో రద్దు చేసింది. చేసిన తప్పుకు క్షమాపణ చెప్పేందుకు నిరాకరించిన గైక్వాడ్‌-దమ్ముంటే పోలీసులు తనను అరెస్ట్ చేయాలని సవాల్‌ విసిరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది.

సమాజంలో బాధ్యతాయుతంగా మెలగాల్సిన ఈయ...

శివసేనకు చెందిన రవీంద్ర గైక్వాడ్‌ సాధారణ వ్యక్తి కాదు పార్లమెంట్‌ సభ్యుడు. సమాజంలో బాధ్యతాయుతంగా మెలగాల్సిన ఈయన- విమానంలో బిజినెస్‌ క్లాస్‌ సీటు కోసం విచక్షణ కోల్పోయాడు. ఎయిర్‌ ఇండియా సెక్యూరిటీ అధికారిని 25 సార్లు చెప్పుతో కొట్టాడు. పక్కనే ఉన్న సిబ్బంది ఎంత వేడుకున్నా వెనక్కి తగ్గలేదు. పైగా ఆ ఉద్యోగిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కిందకు తోసేందుకు యత్నించాడు.

రోల్‌ మాడల్‌గా ఉండాల్సిన మీరే ఇలా ప్రవర్తిస్తే ఎలా...

రోల్‌ మాడల్‌గా ఉండాల్సిన మీరే ఇలా ప్రవర్తిస్తే ఎలా అంటూ మహిళా అధికారి ఎంపీని సముదాయించే ప్రయత్నం చేశారు. మీరు ప్రజా ప్రతినిధి.... ఇలా చేయడం సబబు కాదు సర్... అంటూ ఎంపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.అయినప్పటికీ గైక్వాడ్ వెనక్కి తగ్గక పోగా...తన స్థాయిని మరచి మిగతా సిబ్బందిపై చిందులేశాడు...

శివసేన ఎంపీ తీరుపై విమాన సంస్థలు సీరియస్‌గా తీసుకున్నాయి

శివసేన ఎంపీ తీరుపై విమాన సంస్థలు సీరియస్‌గా తీసుకున్నాయి. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ రవీంద్ర గైక్వాడ్‌ పేరును బ్లాక్‌ లిస్టులో పెట్టింది. దీంతో ఆయన ఏ ప్రయివేట్‌ విమానంలోనూ ప్రయాణించడానికి వీలు లేకుండా పోయింది. ఎయిర్‌ ఇండియా బ్లాక్‌ లిస్టులో చేరిన తొలి వ్యక్తి రవీంద్ర గైక్వాడే కావడం గమనార్హం.

ఇంతజరిగినా...సదరు ఎంపీ పశ్చత్తాపం చెందలేదు...

ఇంతజరిగినా...సదరు ఎంపీ పశ్చత్తాపం చెందలేదు.... క్షమాపణ చెప్పడానికి నిరాకరించడమే కాదు... దమ్ముంటే ఢిల్లీ పోలీసులు తనను అరెస్ట్ చేయాలని రవీంద్ర గైక్వాడ్-సవాల్‌ విసిరారు. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతుండడంతో సదరు ఎంపీకి శివసేన సమన్లు జారీ చేసింది.

16:55 - February 6, 2017

హైదరాబాద్: హీరో ప్రిన్స్ మహేశ్‌బాబుకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. తన నవల కాపీ కొట్టి శ్రీమంతుడు సినిమా తీశాడని రచయిత చంద్ర కోర్టును ఆశ్రయించాడు. కేసును విచారణకు స్వీకరించిన కోర్టు మహేశ్ బాబుతో పాటు డైరెక్టర్ కొరటాల, నిర్మాత నవీన్‌లకు సమన్లు జారీ చేసింది. మార్చి 3న కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.

09:42 - January 12, 2017

టాలీవుడ్ లో అప్పట్లో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో 'రంభ' ఒకరు. అగ్రహీరోలతో నటించిన 'రంభ' ప్రస్తుతం వివాదంలో చిక్కుకుంది. వర్నకట్నం వేధింపుల కేసులో ఆమెకు పోలీసులు సమన్లు అందచేశారు. 'రంభ' సోదరుడు శ్రీనివాసరావుకు 1999లో పల్లవితో వివాహం జరిగింది. తనను భర్త...అత్తమామలు..ఆడపడుచు (రంభ) వేధించారంటూ 2014 జులైలో పల్లవి కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఆదేశాలతో ముగ్గురిపై కేసు నమోదైంది. ‘రంభ'కు సమన్లు అందచేయాలని పోలీసులు ప్రయత్నించినా వీలు కాలేదు. అమెరికాలో 'రంభ' ఉండడంతో వీలు కాలేదని తెలుస్తోంది. చివరకు పోలీసుల నిరీక్షణ ఫలించింది. ఓ టీవీ ఛానల్ రియాల్టీ షో కోసం 'రంభ' హైదరాబాద్ కు చేరుకుంది. ఈ విషయం పోలీసులకు తెలిసింది. వెంటనే పద్మాలయ స్టూడియోకు చేరుకున్నారు. అనంతరం అక్కడున్న 'రంభ'కు సమన్లు అందించారు. మరి ఈ సమన్లపై 'రంభ' ఎలా స్పందిస్తుందో చూడాలి.

21:36 - January 9, 2017

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దుపై పార్లమెంటరీ కమిటీ ప్రధానమంత్రి నరేంద్రమోదిని వివరణ కోరనుంది. 50 రోజులు దాటినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో పీఏసీ ప్రధానికి సమన్లు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయంలో ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌కు పిఏసి ఇప్పటికే సమన్లు జారీ చేసింది.

నరేంద్రమోది పార్లమెంటరీ కమిటీ ముందు హాజరు కాక తప్పదా?
నోట్ల రద్దు వ్యవహారంలో ప్రధాన మంత్రి నరేంద్రమోది పార్లమెంటరీ కమిటీ ముందు హాజరు కాక తప్పదా? ఈ విషయంలో కాంగ్రెస్‌ నేత పార్లమెంట‌రీ క‌మిటీ చీఫ్ వీకే థామ‌స్ ప్రధానికి సమన్లు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఏ కార‌ణంతో నోట్ల ర‌ద్దును చేప‌ట్టార‌ని తెలుసుకునేందుకు ప్రధానిని వివరణ కోరతామని వి.కె.థామస్‌ తెలిపినట్లు పీటీఐ పేర్కొంది. నోట్ల రద్దు తర్వాత 50 రోజుల్లో పరిస్థితి చక్కబడుతుందని ప్రధాని చెప్పారని...గడువు దాటినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని థామస్‌ అన్నారు.

ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌కు ఇప్పటికే పిఏసి సమన్లు
నోట్ల రద్దుపై ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌కు ఇప్పటికే పిఏసి సమన్లు జారీ చేసింది. జనవరి 20న తమ ముందు హాజరుకావాలని పటేల్‌ను ఆదేశించింది. నోట్లరద్దు నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు?...ఈ నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడనుందన్న విషయంపై పటేల్‌ను పిఎసి వివరణ కోరనుంది. నగదు రహిత లావాదేవీలపై ఎంతవరకు సన్నద్ధమయ్యారని కూడా ఆయను ప్రశ్నించనుంది. నగదు రహిత డిజిటల్‌ లావాదేవీలు భారత్‌లో ఎలా సాధ్యమని ఆర్బీఐ గవర్నర్‌ను ప్రశ్నించే అవకాశముంది. నోట్ల రద్దు నిర్ణయం వెనక ఎవరెవరున్నారని పిఏసి ఆరా తీయనుంది.

నోట్ల ర‌ద్దు అంశంపై ప్రశ్నించే అధికారం పీఏసీకి ఉంది : థామ‌స్
నోట్ల ర‌ద్దు అంశంపై ఎవ‌రినైనా ప్రశ్నించే అధికారం పీఏసీకి ఉంద‌ని థామ‌స్ తెలిపారు. అయితే జ‌న‌వ‌రి 20న ఉర్జిత్ పటేల్‌తో జ‌రిగే స‌మావేశం అనంత‌రం ప్రధానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. పీఏసీ స‌భ్యులంతా ఏక‌గ్రీవంగా నిర్ణయిస్తే నోట్ల ర‌ద్దు అంశంపై ప్రధానిపై కూడా విచారణ జరుపుతామని థామ‌స్ స్పష్టం చేశారు.

న‌వంబ‌ర్ 85వందలు, వెయ్యి నోట్లను ర‌ద్దు చేస్తూ ప్రధాని ప్రకటన
న‌వంబ‌ర్ 8న 5వందలు, వెయ్యి నోట్లను ర‌ద్దు చేస్తూ ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా నగదు కొరత ఏర్పడింది. బ్యాంకులు, ఎటిఎంల ముందు జనాలు క్యూకట్టారు. ఇటీవల పరిస్థితి కొంత మెరుగైనా...పెద్దగా మార్పు లేదు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆర్థికవ్యవస్థ మందగించనుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానిని విచారించే దిశగా పిఏసి అడుగులు వేస్తోంది.

Pages

Don't Miss

Subscribe to RSS - సమన్లు