సర్కార్ తెలుగు మూవీ రివ్యూ

16:23 - November 6, 2018

దళపతి విజయ్, స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్‌ల కాంబినేషన్‌లో, తుపాకి, కత్తి లాంటి సూపర్ హిట్స్ తర్వాత తెరకెక్కిన సినిమా, సర్కార్.. సమకాలీన రాజకీయాల నేపథ్యంలో రూపొందిన సర్కార్, భారీ అంచనాల మధ్య, దీపావళి కానుకగా తమిళ్‌, తెలుగులో ప్రపంచవ్యాప్తంగా  ఈరోజు రిలీజ్ అయిన సర్కార్ ఎలా ఉందో చూద్దాం.
కథ : 
ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈఓ, సుందర్ రామస్వామి (విజయ్), తన సొంత ఊర్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయని తెలిసి, ఓటు హక్కు వినియోగించుకోవడానికి అమెరికా నుండి ఇండియాకి వస్తాడు. తీరా ఓటు వెయ్యబోయే సరికి, తన ఓటు వేరెవరో వేసేసారని తెలిసి షాక్ అవుతాడు.తగ్గే ప్రసక్తే లేదని న్యాయపోరాటానికి దిగుతాడు. సుందర్ మళ్ళీ ఓటువేసే వరకూ ఎన్నికలు రద్దు చేస్తున్నట్టు కోర్టు తీర్పిస్తుంది. 
ఈలోగా అతనికి తోడు మరికొంత మంది బాధితులు యాడ్ అవుతారు. దీంతో ఎన్నికలే రద్దవుతాయి. ఆకోపంలో అధికార పార్టీ కవ్వింపు చర్యలకు పాల్పడడంతో, సుందర్ ఏకంగా ముఖ్యమంత్రి మీదే పోటీకి దిగుతాడు. చివరకు సుందర్ ఏం చేసాడు, అతనికి న్యాయం జరిగిందా, లేదా అనేది సర్కార్ స్టోరీ అన్నమాట.

నటీనటులు & సాంకేతిక నిపుణులు : 

సీన్స్‌కి తగ్గట్టు విజయ్ నటన అభిమానులను ఆకట్టుకుంటుంది. డాన్స్, ఫైట్స్ పరంగానూ బాగానే చెయ్యడంతోపాటు, అక్కడక్కడా కాస్త అతి చేసిన ఫీలింగ్ కూడా కలిగించాడు. కీర్తి సురేష్ ఏదో ఉంది అంటే ఉంది అన్నట్టుంది తప్ప, ఆమె క్యారెక్టర్ చెప్పుకునేంత గొప్పగా ఏమీ లేదు. ఇక వరలక్ష్మి, విజయ్ ముందు తేలిపోయింది. రాధారవి, ప్రేమ్ కుమార్, పాల కరుపయ్య, యోగిబాబు తదితరులు ఉన్నంతలో పర్వాలేదనిపిస్తారు. సినిమాలో విజయ్‌ని ఢీకొట్టే స్థాయి విలన్ లేకపోవడం మైనస్.
ఏ.ఆర్. రెహమాన్ పాటలు గుర్తుంచుకునేలా లేవుకానీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. గిరీష్ గంగాధరన్ కెమెరా, రామ్, లక్ష్మణ్ ఫైట్స్ బాగానే ఉన్నాయి. లాస్ట్‌బట్ నాట్ లీస్ట్.. కొన్నాళ్ళ క్రితం వరకూ సినిమా ప్రారంభంలో,‌ ఈ నగరానికేమైంది అనే యాడ్ వచ్చినట్టు, ఈ మురుగదాస్‌కి ఏమైంది, ఓ వైపు స్పైడర్, మరోవైపు సర్కార్, ఆయన బ్రెయిన్‌కేమైంది  అనే డౌట్ వస్తుంది ప్రేక్షకులకు. సంవత్సరానికి రూ. 1800 కోట్ల శాలరీ తీసుకునే సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈఓ, తను ఏదేశంలో అడుగుపెడితే అక్కడున్న కార్పొరేట్ కంపెనీలన్నిటినీ కొనెయ్యడం, తర్వాత వాటిని మూయించెయ్యడం ఎందుకో అర్ధం కాదు. డైరెక్ట్‌సీఎమ్‌ని ఢీ కొని, ఈజీగా ప్రభుత్వాన్ని పడగొట్టడం చూస్తే, నవ్వాలో, ఏడవాలో కూడా తెలీదు. చాలా చోట్ల మురుగ, లాజిక్ మిస్సయ్యాడు. తమిళ రాజకీయాలు, అక్కడి నేటివిటీ మనోళ్ళకేమాత్రం ఎక్కదు. విజయ్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని చేసిన సినిమా కాబట్టి, వాళ్ళకు మాత్రమే సర్కార్ భీభత్సంగా నచ్చుతుంది.. తెలుగులో సూపర్ అనిపించడం కష్టం అనే చెప్పాలి. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి.


తమిళ తంబీలకు నచ్చే సర్కార్...

తారాగణం :   విజయ్, కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్ కుమార్, రాధారవి, ప్రేమ్ కుమార్, పాల కరుపయ్య, యోగిబాబు

 కెమెరా    :    గిరీష్ గంగాధరన్ 

 సంగీతం   :      ఏ.ఆర్. రెహమాన్

నిర్మాత   :     అశోక్ వల్లభనేని

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : ఏ.ఆర్.మురుగదాస్‌

రేటింగ్  : 2/5

 

మూవీ రివ్యూ - 5 స్టార్ రేటింగ్‌ విధానం...
3.5 స్టార్ - ఉత్తమ చిత్రం
3 స్టార్స్  - చాలా బావుంది! తప్పక చూడాల్సిన సినిమా
2.75 స్టార్స్  - ఉన్నంతలో బావుంది
2.5 స్టార్స్ - సినిమా చూడొచ్చు 
2.25 స్టార్స్ - ఇంకొంచెం శ్రద్ధపెట్టాల్సి ఉంది 
2 స్టార్స్ - చాలా మెరుగుపర్చుకోవాలి

 

 

 

Don't Miss

Subscribe to RSS - సర్కార్ తెలుగు మూవీ రివ్యూ