సర్వే సత్యనారాయణ

21:42 - December 6, 2018

హైదరాబాద్: ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ కొరడా ఝళిపించింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నాయకులు, అభ్యర్థులపై కేసులు నమోదు చేసింది. కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి, టీడీపీ నేత జూపూడి ప్రభాకర్, శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థి భవ్య ఆనంద్ ప్రసాద్, సంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి, మేడ్చల్ టీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డి, కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణలపై సెక్షన్ 171(ఈ) కింద కేసులు నమోదు చేశారు. నామినేషన్ల ప్రక్రియ మొదలు ఇప్పటివరకు 7వేల 852 కేసులు నమోదు చేసినట్టు ఈసీ తెలిపింది. ఇక పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈసీ పిలుపునిచ్చింది.

 

10:27 - November 14, 2018

హైదరాబాద్ : రాజకీయాలు..రాజకీయాలే..బంధుత్వం బంధుత్వమే...అంటున్నారు..ప్రస్తుత నేతలు. తమకు టికెట్ రాలేదని సొంత వారిపైనే పోటీకి దిగుతున్నారు. గతంలో కూడా ఇలాంటివి జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్ నెలలో తెలంగాణ రాష్టంలో ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ లో టికెట్ ఆశించి భంగపడిన వారు రెబెల్స్ గా పోటీ చేసేందుకు సిద్ధమౌతున్నారు.Image result for congress leaders krishank అందులో క్రిశాంక్ కూడా ఒకరు. ఇతను మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణకు అల్లుడు. కంటోన్మెంట్ టికెట్ కోసం క్రిశాంక్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం సర్వేపైనే మొగ్గు చూపింది. 
టికెట్ సర్వేకు దక్కడంతో క్రిశాంక్ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. మూడు సార్లు ఓడిన సర్వేకు టికెట్ ఎలా కేటాయిస్తారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఓయూ విద్యార్థికి కూడా టికెట్ కేటాయించకపోవడం బాధాకరమని, నాలుగేండ్లుగా సర్వే ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదని, తాను రెబల్‌గా పోటీ చేయబోతున్నట్టు సిద్ధమవుతున్నానని స్పష్టం చేశారు. మరి కాంగ్రెస్ పెద్దలు బుజ్జగిస్తారా ? లేదా ? అనేది చూడాలి. Image result for congress leaders krishank vs Ex MP Sarve Satyanarayana

  • పేరు : సర్వే సత్యనారాయణ 
  • భార్య పేరు : సునీత సత్యనారాయణ
  • పిల్లలు : ఒక్క కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. 
  • పుట్టిన తేదీ : 04-04-1954
  • విద్యార్హతలు : బీఏ, ఎల్ఎల్ బీ, ఎల్ఎల్ఎం (ఓయూ)
  • వృత్తి : న్యాయవాది 
  • రాజకీయ నేపథ్యం : సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుండి 1985లో టీడీపీ ఎమ్మెల్యేగా తొలిసారిగా విజయం సాధించారు. 2004లో సిద్ధిపేట నుండి కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలుపొందారు. 2009లో మల్కాజ్ గిరి పార్లమెంట్ నుండి కాంగ్రెస్ తరపున బరిలో దిగి ఎన్నికయ్యారు. 2014 మల్కాజ్ గిరి నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం చెందారు. 2015 వరంగల్ ఉప ఎన్నికల్లో సైతం ఓటమిని చవి చూశారు. 
20:53 - November 13, 2018

హైదరాబాద్ : ఎన్నికల వేళ టిక్కెట్ల కోసం నేతలు పడిగాపులు కాస్తున్నారు. వారినే నమ్ముకున్న బంధుగణం టిక్కెట్స్ రాకపోవటంతో వారిపై కారాలు మిరియాలు నూరుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణకు ఇప్పడు ఏం చేయాలోపాలుపోవటంలేదు. ఇంటిపోరుతోసర్వే బుర్ర బొప్పి కడుతోంది. పిల్లనిచ్చిన పాపానికి టిక్కెట్ రాలేదని సర్వే సత్యనారాయణ అల్లుడు క్రిశాంక్ మామపై మండిపడుతున్నారు. అంతేకాదు మామ సర్వేపై క్రిశాంక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తొలి జాబితాలో ఆయనకు టికెట్ దక్కకపోవడంపై  హైదరాబాద్ లోని గాంధీ భవన్ వద్ద ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కంటోన్మెంట్ ప్రజలకు సర్వే సత్యనారాయణ అంటే ఎవరో తెలియదని..‘గర్భిణీగా వున్న నా భార్యను ఇంట్లోనే వదిలేసి కంటోన్మెంట్ లో ఉన్న మొత్తం 17 బస్తీల్లో ఐదు నెలల పాటు ‘బస్తీ నిద్ర’ చేశానని అయినా తనకు టిక్కెట్ కేటాయించలేదనీ..సీనియర్ నేత అయిన తన మామకూడా తనకు ఏమి చేయలేకపోయాడని వాపోయాడు. బాధాకరమైన విషయమేంటంటే.. నాలుగున్నరేళ్ల నుంచి కూడా ఆ నియోజకవర్గంపై ఒక్క ప్రెస్ మీట్ కూడా సర్వే సత్యనారాయణ గారు పెట్టలేదు..’ అంటూ విమర్శించారు. కొంతమంది తనకు టికెట్ రాకుండా అడ్డుకున్నారని క్రిశాంక్  ఆరోపించారు. యువత రాజకీయాలు చేయాలంటే వారికి గాడ్ ఫాదర్ కావాలన్న విషయం తనకు అర్థమైందని, గాడ్ ఫాదర్ లేని వారికి ఎటువంటి అవకాశాలు రావని ఆవేదన వ్యక్తం చేశారు.  
 

21:59 - November 27, 2016

హైదరాబాద్ : మాదిగ ధర్మయుద్ధ సభ వేదికగా సర్వే సత్యనారాయణ టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. తెలంగాణ ఉద్యమంలో వెన్నుదన్నుగా నిలిచిన మాదిగలను రాష్ట్ర విభజన తర్వాత సీఎం కేసీఆర్ కేసీఆర్‌ వారిని మరిచిపోయారని ఆయన ధ్వజమెత్తారు. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదని ప్రజల చేతుల్లోనే పార్టీల భవిష్యత్‌ ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఎన్నికల ప్రణాళికలో దళితులకు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్‌ కేసీఆర్‌ విస్మరించారని టీటీడీపీ నేత ఎల్‌ రమణ మండిపడ్డారు. 

 

21:03 - August 30, 2016
17:30 - November 27, 2015

హైదరాబాద్ : వరంగల్ విజయం టీఆర్‌ఎస్‌ది కాదని...అది ఈవీఎంల విజయమని కాంగ్రెస్‌ మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ అన్నారు. తనకు పోలైన నాలుగు బ్యాలెట్‌ ఓట్లే నిజమైన ప్రజాతీర్పు అని..ఈవీఎంలలో తీర్పు ట్యాంపరింగ్‌తో వచ్చిందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమ సారధి అని చెప్పుకునే కేసీఆర్‌కు ఎప్పుడూ భారీ మెజార్టీ రాలేదని...అది ఆయన ఒప్పుకోవాలని సర్వే అన్నారు.

 

19:05 - November 22, 2015

హైదరాబాద్ : భారీ మెజారిటీతో వరంగల్‌లో గెలుస్తామని వరంగల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి సర్వే సత్యనారాయన ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలు కాంగ్రెస్‌ పార్టీకి నూతన ఉత్తేజాన్ని ఇచ్చాయని సర్వే అన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరుగులెత్తించామని ఆయన తెలిపారు. అధికార పార్టీ విచ్చలవిడిగా డబ్బులు పంచిపెట్టిందని, ఓటర్లను ప్రలోభ పెట్టిందని సర్వే ఆరోపించారు.

 

13:55 - November 15, 2015

వరంగల్ : టీఆర్ ఎస్ నేతలు ప్రజలను దోచుకుంటుందని వరంగల్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ విమర్శించారు. ఈమేరకు ఈయన టెన్ టివితో మాట్లాడారు. టీఆర్ ఎస్ ను ప్రజలు తిరస్కరించే రోజు వచ్చిందన్నారు. హరీశ్ రావు కరీంనగర్ వాసి కాడని.. సిద్దిపేటలో ఎందుకు పోటీ చేశారని నిలదీశారు. తమను విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదన్నారు. మెదక్ లో పుట్టిన కేటీఆర్ సిరిసిల్లలో ఎందుకు పోటీ చేశారని ప్రశ్నించారు. చెల్లని నోట్లంటూ కరెన్సీ అవమానిస్తున్నాని చెప్పారు. 

11:34 - November 4, 2015

హైదరాబాద్ : వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ వైపు కాంగ్రెస్ హై కమాండ్ మొగ్గు చూపింది. జిల్లా ఎంపీ స్థానానికి అభ్యర్థిగా ఉన్న సిరిసిల్ల రాజయ్య నివాసంలో విషాదం నెలకొన్న సంగతి తెసింది. రాజయ్య కోడలు, ముగ్గురు మనవళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ప్రస్తుత తరుణంలో తాను పోటీ చేయలేనని కాంగ్రెస్ అధిష్టానాన్ని రాజయ్య స్పష్టం చేశారు. వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై దృష్టి సారించింది. సర్వే సత్యనారాయణ, కొండేటి శ్రీధర్, రాజరపు ప్రతాప్, అద్దంకి దయాకర్ పేర్లను పరిశీలిస్తున్నారు. కానీ మొదటి నుండి కాంగ్రెస్ హై కమాండ్ సర్వే వైపు మొగ్గు చూపినా పోటీ చేయడానికి అనాసక్తి చూపడంతోనే రాజయ్య పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రాజయ్యతో కాంగ్రెస్ పెద్ద దిగ్విజయ్ సింగ్, టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ లు సర్వేతో మాట్లాడడంతో ఆయన బరిలో నిలవడానికి అంగీకరించినట్లు సమాచారం.
2009లో స‌ర్వే స‌త్య‌నారాయ‌ణ మ‌ల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచారు. ఈ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో సెటిల‌ర్లు అధికంగా ఉంటారు. స‌ర్వే ఏనాడూ తెలంగాణ ఉద్య‌మంలో పాల్గొన‌లేని, నొప్పించ‌క తానొవ్వ‌క అన్న‌ట్లుగా త‌ట‌స్థంగా వ్య‌వ‌హ‌రించడంతో అత‌నికి కేంద్ర‌మంత్రి ప‌ద‌విని తెచ్చిపెట్టిందని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. 2014లో స‌ర్వే కూడా ఓడిపోయారు. వ‌రంగ‌ల్ స్థానానికి కడియం రాజీనామా చేయ‌గానే ఆ స్థానానికి ఇటీవలే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. 

08:10 - November 4, 2015

వరంగల్ : జిల్లా ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో నిలిచిన సిరిసిల్ల రాజయ్య ఇంట్లో చోటు చేసుకున్న పరిణామాలతో కాంగ్రెస్ హై కమాండ్ ఆలోచనలో పడింది. బుధవారం ఉదయం సిరిసిల్ల రాజయ్య నివాసంలో జరిగిన అనుమానాస్పదస్థితిలో కోడలు, ముగ్గురు మనవళ్లు దుర్మరణం చెందారు. అగ్నిప్రమాదం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే వరంగల్ ఎంపీ స్థానానికి నామినేషన్ లు వేసేందుకు చివరి రోజు కావడంతో రాజయ్య కాకుండా ఇతర అభ్యర్థిని బరిలోకి దించాలని కాంగ్రెస్ హై కమాండ్ ఆలోచిస్తోంది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, సర్వే సత్యనారాయణ పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కొద్దిసేపటిలో ఎవరు బరిలో నిలుస్తారనే తేలిపోనుంది. 

Don't Miss

Subscribe to RSS - సర్వే సత్యనారాయణ