సినిమా

15:53 - July 21, 2018

తెలుగు సినిమా పరిశ్రమలో మరో వారసుడు బెల్లంకొండ శ్రీను. అల్లుడి శీను అంటు వచ్చి మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఈ శీను తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు 'సాక్ష్యం' తో రానున్నాడు. దర్శకుడు శ్రీవాస్ గత చిత్రాలు కూడా మాస్ ఆడియన్స్ ను మెప్పించినవే కావటం మరో విశేషం. ఈ ఇద్దరి మాస్ కాంబినేషన్ లో రూపొందిన 'సాక్ష్యం' చిత్రం ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకి రావలసి వుంది. కాగా ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి అధికారులు నిరాకరించినట్టుగా సమాచారం.

'పంచభూతాల సాక్షిగా' ట్యాగ్ లైన్
'పంచభూతాల సాక్షిగా' అనే మాటను బేస్ చేసుకునే ఈ సినిమా కథ కొనసాగుతుంది. అందువలన ఈ సినిమాలో కొన్ని పక్షులను .. జంతువులను కూడా వాడారట. అయితే అందుకు సంబంధించిన అనుమతులను మాత్రం రాలేదు. దీంతో సెన్సార్ చేయడానికి అధికారులు నిరాకరించినట్టుగా తెలుస్తోంది. జంతు సంరక్షణ చట్టాలు కఠినంగా వున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్ఓసీలు తీసుకురావడం కూడా అంత తేలిక కాదు. ఈ విషయం విడుదల తేదీపై ప్రభావం చూపుతుందేమోననే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. 

13:11 - July 16, 2018

'మహానటి'గా కీర్తి సురేశ్ నటన విమర్శకులు ప్రశంసల్ని అందుకుంది. తన ముగ్ధ మనోహరమైన నటనతో హేమా హేమీలను మెప్పించటమేకాకుండా వారి ప్రశంసల్ని కూడా పొందింది కీర్తీ సురేశ్. ఇక ఆ సినిమా దేశ విదేశాలలో సాధించిన వసూళ్లు బాక్సాఫీస్ ను షేక్ చేశారు. కీర్తీకి మహానటి సినిమా ఒక వరమనే చెప్పాలి. అవకాశం రావటం ఒక ఎత్తు అయితే..నటనలో మహానటిని గుర్తు చేయటం సాధారణవిషయం కాదు. ఆ సినిమాను ఒప్పుకోవటం పండించటం ఎవ్వరికీ సాధ్యం కాదు. అటువంటిది కీర్తి అసాధ్యాన్ని సుసాధ్యం చేయటం ఆమె నటనకు తార్కాణంగా చెప్పవచ్చు..మరి ఒకసారే కాదు మహానటిగా కీర్తీ సురేశ్ మరోసారి వెండితెరపై అభిమానులను, ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయినట్లుగా సినీ వర్గాల భోగట్టా..

'ఎన్టీఆర్' బయోపిక్ లో సావిత్రిగా కీర్తి..
క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' బయోపిక్ రూపొందుతోంది. బాలకృష్ణ .. విద్యాబాలన్ .. రానా .. ప్రకాశ్ రాజ్ .. మోహన్ బాబు .. సీనియర్ నరేశ్ ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. ఎన్టీఆర్ నట ప్రస్థానంలో సావిత్రి పాత్రను టచ్ చేయకుండా ఉండటం కష్టం. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అందువలన 'ఎన్టీఆర్' బయోపిక్ లో సావిత్రి పాత్ర కూడా కనిపించనుంది.

ప్రత్యేక పాత్రలో రకుల్..
'మహానటి' లో సావిత్రిగా నటించిన కీర్తి సురేశ్ నూటికి నూరు మార్కులు కొట్టేసింది. ఇప్పుడు సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ ను కాకుండా మరో కథానాయికను ప్రేక్షకులు ఊహించుకోవడం కష్టం. అందువలన ఆమెను తీసుకోనున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఆమె ఎంపిక ఖరారైపోయిందనేది సినీవర్గాల నుంచి అందుతోన్న సమాచారం. ఇక ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాటలో రకుల్ కనిపించనుందనే టాక్ కూడా బలంగానే వినిపిస్తోంది.

 

19:04 - July 12, 2018

'విజేత' సినిమా తెలుగు ఆడియన్స్ ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో, ఎంత వరకు రీచింగ్ ఉందొ సినిమా చూసొచ్చిన వాళ్ల మాటల్లోనే...'విజేత’ సినిమా చూసిన ప్రేక్షకుల ఫీలింగ్స్. చూశాం 'విజేత' సినిమాపై టెన్ టివి సినీ డెస్క్ రివ్యూ...ప్రేక్షకుల స్పందనతో పాటు టెన్ టివి సినీ డెస్క్ రివ్యూ కూడా తీసుకున్న తర్వాత 'విజేత సినిమాకి 10టీవీ ఇచ్చే రేటింగ్ కోసం వీడియో క్లిక్ చేయండి.

 

12:13 - July 6, 2018

కాజల్ అంటే కాటుక అని అర్థం..కళ్లకు కాటుక ఎంత అందాన్నిస్తుందో వెండి తెరపై కాజల్ అందం అలా వుంటుంది. సినీ పరిశ్రమలో పెద్ద హీరోలందరితోను నటించిన కాజల్ మోగా స్టార్ చిరంజీవితో కలిసి స్టెప్ లేసింది. కమర్షియల్‌ కాజల్ అనే కాకుండా హిస్టరీ కాజల్ గా ఫాంటసీ కాజల్ గా ‘మగధీర’తో నిరూపించుకుంది. యువరాణి మిత్రవిందగా కాజల్‌ ఆ పాత్రలో ఒదిగిపోయింది. అయితే ఇప్పుడు ఆమె మరో చారిత్రక. చిత్రంలో నటించే అవకాశాలు ఉన్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం.

రావణాసురుడి సోదరి శూర్ఫణఖగా కాజల్?..
దర్శకుడు భార్గవ్‌ ఓ చారిత్రక సినిమాను తెరకెక్కించబోతున్నారట. ఈ సినిమాలో కాజల్‌ రావణాసురుడి సోదరి శూర్పణక పాత్రలో నటించనున్నట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. రామాయణంలోని చాలా పాత్రల గురించి మనం విని ఉంటాం కానీ శూర్పణక గురించి చాలా మందికి అంతగా తెలీదని.. అందుకే ఈ సినిమాలో ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులకు తెలియజేయాలని చిత్రబృందం భావిస్తోందట. అయితే ఈ విషయం గురించి చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

10:48 - July 6, 2018

"దేవదాసు''సినిమా అక్కినేని నాగేశ్వరావు సినీ చరిత్రలో కలికితురాయిగా మిగిలిపోయింది. నూనూగు మీసాల యువకుడి వయస్సులోనే బరువైన పాత్రలో నటించిన పెద్ద అక్కినేనికి "దేవదాసు''ఓ చరిత్ర అని చెప్పవచ్చు. నాగేశ్వరరావు నటించిన ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో "దేవదాసు'' కి ఒక ప్రత్యేక స్థానం వుంది. ఈ సినిమా తెలుగులోనే కాక దక్షిణభారత చలనచిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించింది. ఇప్పడు తాజాగా ఇదే టైటిల్‌తో సీనియర్ అక్కినేని వారసుడుగా పరిశ్రమలో అడుగు పెట్టిన నాగార్జున మరో దేవదాసుతో రానున్నారు. ఈ సినిమాలో మల్టీస్టారర్ గా రూపొందుతోంది. ఈ సినమాలో మరో స్టార్ నాచ్యురల్ స్టార్ నాని.

'దేవదాస్' అనే టైటిల్ గుర్తుకు వస్తేనే చాలు మందు సీసాలు గుర్తుకొస్తాయి. అలాంటిది 2018 'దేవదాస్' టైటిల్ పోస్టర్‌లో మాత్రం తుపాకులు, బుల్లెట్లు ఉండటం చూస్తుంటే.. మూవీ వైవిధ్యంగా ఉంటుందనే విషయం ఇట్టే అర్థమైపోతోంది.

ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ తన సొంత బ్యానర్ వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మించనున్నారు. ఈ మల్టీస్టారర్ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ చిత్రానికి దేవదాస్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని జూలై 5వ తేదీన అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో హీరో నాగార్జున ఫస్ట్ లుక్ పోస్టర్ ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. "మీ అండ్ దాస్" అంటూ ట్వీట్ చేశారు. ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించనున్నారు. మణిశర్మ సంగీత బాణీలు సమకూర్చనున్నారు. నాగార్జున సరసన ఆకాంక్షా సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. "ఛలో" ఫేం రష్మిక మందన నానికి జోడీగా ఎంపిక చేసినట్టు సమాచారం. ఇప్పటికే 65 శాతానికిపైగా షూటింగ్‌ పూర్తి చేసుకున్న దేవదాస్ సెప్టెంబర్‌‌లో విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. 

11:53 - July 5, 2018

తెలుగు సినిమా తెరపై ఇలవేలుపుగా నిలిచిన గొప్ప నటుడు..యుగపురుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఎన్ని తరాలు గడిచినా ఆయన సినీ నట జీవితంలోను..రాజకీయ రంగంలోను ఆయన ఒక దృవతార అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన బయోపిక్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్టీఆర్ పాత్రతో పాటు ఆయన చుట్టు అల్లుకున్న అన్ని పాత్రలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆ పాత్రల్లో ఏ పాత్రకు ఎవరు సరిపోలతారనే సెలక్షన్..వారిని నటింపజేయటం కూడా కత్తిమీద సామువంటిదే. ఈక్రమంలో ఎన్టీఆర్ జీవన సహచరి బసవ తారకం పాత్రలో బాలివుడ్ నటి విద్యాబాలన్ అయితే ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు. నటనలో విద్యా బాలన్ ఎటువంటి సమర్థత వున్న నటో కొత్తగా చెప్పనక్కరలేదు.

ప్రఖ్యాత నటుడు దివంగత ఎన్టీ రామారావు బయోపిక్ గా 'ఎన్టీఆర్' చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి విదితమే. బాలకృష్ణ ప్రధాన పాత్రధారిగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నేటి నుంచి హైదరాబాదులో జరుగుతుంది. ఇందులో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రను విద్యాబాలన్ పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది. 

12:09 - July 4, 2018

టాలీవుడ్ లో ఇప్పటికే ఎంతో మంది వారసులు హల్ చల్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో వారసుడు ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆ వారసుడి ఎంట్రీ కోసం ఎప్పటి నుండో ప్రేక్షకుల్లో ఆసక్తి కొనసాగుతున్నండగా తాతగారి బయోపిక్ ద్వారా నందమూరి వారసుడు ఎంట్రీ ఇవ్వనున్నాడు. అందరు సినిమా క్లైమాక్స్ లో అద్బుతమైన ఎంట్రీతో అలరించిన అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా ఇప్పటికే రెండు సినిమాలు చేసాడు. మరి బాలయ్య వారసుడు ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చి హీరోగా ఎన్ని మార్కులు కొట్టేస్తాడో చూడాలి..

యంగ్ ఎన్టీఆర్ గా మోక్షజ్ఞ..
క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' బయోపిక్ రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో యంగ్ ఎన్టీఆర్ గా శర్వానంద్ కనిపించే అవకాశం వున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది. యంగ్ ఎన్టీఆర్ గా మోక్షజ్ఞ కనిపిస్తేనే నందమూరి అభిమానులు సంతృప్తి చెందుతారని బాలకృష్ణతో క్రిష్ చెప్పారట.

బాలయ్య ఆమోదంతో సింగపూర్ కు మోక్షజ్ఞ
ఈ సినిమా ద్వారానే మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తే బాగుటుందని భావించిన బాలకృష్ణ .. అందుకు మోక్షజ్ఞను సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. మోక్షజ్ఞ కాస్త బొద్దుగా ఉంటాడు .. ఈ సినిమాలో పాత్ర కోసం ఆయన కాస్త సన్నబడితే బాగుటుందని క్రిష్ సూచించాడని చెబుతున్నారు. దాంతో తన పోర్షన్ షూటింగ్ సమయానికి సన్నబడి ఫిట్ నెస్ ను సాధించడం కోసం మోక్షజ్ఞ సింగపూర్ వెళ్లాడని అంటున్నారు. ఈ సినిమాలో హరికృష్ణ .. కల్యాణ్ రామ్ కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నట్టు తెలుస్తోంది.   

15:11 - June 28, 2018

రజనీకాంత్ ఆ పేరు చెబితే చాలు అభిమానులు నిలువెల్లా పులకించిపోతారు. సినిమాలో ఒక స్లైల్ కు కేరాఫ్ అడ్రస్ గా రజనీకాంత్ ప్రముఖులుగా చెప్పవచ్చు. అసలు స్లైల్ అంటే రజనీదే అంటారు సినిమా పరిశ్రమతో పాటు అభిమానులు, ప్రేక్షకులు. ఒక సాధారణ బస్ కండక్టర్ స్థాయి నుండి స్వశక్తితో కష్టపడి 'సూపర్ స్టార్ ' స్థాయికి ఎదిగిన మనసున్న, మానవత్వం వున్న నటుడు రజనీకాంత్. అటువంటి రజనీ కెరీర్లో 'బాషా' చిత్రానికొక ప్రత్యేకత వుంది. ఆ రోజుల్లో బ్లాక్ బస్టర్ మూవీ అది. దీనికి సీక్వెల్ చేసే ఉద్దేశంతో సాయిరమణి అనే దర్శకుడు ఇటీవల రజనీని కలసి, కథ వినిపించాడట. రజనీకి కథ నచ్చినప్పటికీ, సీక్వెల్ చేయడానికి ఆయన అంగీకరించలేదని సమాచారం. క్లాసిక్స్ వంటి కొన్ని సినిమాలకు సీక్వెల్స్ చేయకూడదన్నది రజనీ అభిప్రాయమట.

15:05 - June 28, 2018

తెలుగు సినిమాల్లో హీరోయిన్స్ కు సినిమాల్లో పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా వారి గ్లామర్ కు మాత్రం సినిమాల్లో పెద్దపాత్ర వుంటుంది. అందులోను కొంతమంది హీరోయిన్స్ తో ముందు జాబితాలో వుండే అందాల భామలు కాజల్, తమన్నాలు. ప్రస్తుతం గ్రీస్ లోని ఏథెన్స్ లో వున్నారు. 'క్వీన్' హిందీ సినిమా తెలుగు రీమేక్ షూటింగ్ కోసం తమన్నా, తమిళ రీమేక్ కోసం కాజల్ ప్రస్తుతం ఏథెన్స్ నగరంలో వున్నారు. తమిళ వెర్షన్ కి రమేశ్ అరవింద్ దర్శకత్వం వహిస్తుండగా, తెలుగు వెర్షన్ కి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.

14:58 - June 28, 2018

సినిమా పరిశ్రమలో జక్కన్నగా పేరు తెచ్చుకున్న దర్శకుడు రాజమౌళి. దర్శకుడిగా ఇప్పటి వరకూ ఒక్క ప్లాప్ కూడా రాజమౌళివైపు కన్నెత్తికూడా చూడలేదు. స్టూడెంట్ నంబర్ వన్ నుండి అంతర్జాతీయ ఖ్యాతి సాధించిన బాహుబలి వరకూ విజయాల పరంపరం జక్కన్నకు ఒక్కడికే సొంతమయ్యింది. హిట్ దర్శకులు ఎంతమంది ఉన్నా ఒక్క ప్లాప్ కూడా లేని ఒకే ఒక్క దర్శకుడు రాజమౌళి. అందుకే అతనితో సినిమాలు చేసేందుకు పెద్ద పెద్ద హీరోలు కూడా వేచి చూస్తుంటారు. బాహుబలి స్వీక్వెల్స్ తో దాదాపు ఐదు సంవత్సరాల పాటు బైటప్రపంచం గురించి కూడా పట్టించుకోని జక్కన్న నెక్ట్స్ మూవీపై ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. అటువంటి జక్కన్న మెగా మెగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అదికూడా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ తో . ఇక ప్రేక్షకుల అంచనాలు ఊహకు అందకుండా వున్నాయి. మరి ఈ మెగా మల్టీ స్టారర్ లో ఆ బిగ్గెస్ట్ హీరోలు ఎవరో ప్రేక్షకులకు తెలిసిపోయింది. మరి వారి రేంజ్ కు తగినట్లుగా హీరోయిన్స్ కూడా వుండాలి కదా మరి!. మరి ఆ హీరోయిన్స్ ఎవరాని ప్రేక్షకులు ఆసక్తికి అంతులేకుండా వుంది.

డిసెంబర్లో షూటింగులో పాల్గొననున్న చరణ్
రాజమౌళి తాజా చిత్రంగా భారీ మల్టీ స్టారర్ చిత్రానికి అందుకు సంబంధించిన సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా నటించనున్న ఈ సినిమా, అక్టోబర్లో పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. నవంబర్లో ఎన్టీఆర్ .. డిసెంబర్లో చరణ్ షూటింగులో జాయిన్ కానున్నారు. ఈ ఇద్దరు హీరోల సరసన కథానాయికలుగా ఎవరు నటించనున్నారనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతూ వస్తోంది.

Pages

Don't Miss

Subscribe to RSS - సినిమా