సిబ్బంది

12:11 - December 6, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ముందస్తు ఎన్నికలు ఆర్టీసీకి వరంలా మారింది. నష్టాల ఊబిలో కూరుకపోయిన ఆర్టీసీ గట్టెక్కుతోంది..పార్టీల సమావేశాలు..సభలు..ప్లీనరీల గిరాకీ పెరుగుతోంది. దీని ద్వారా ఆర్టీసీ సంస్థ నాలుగు కాసులను చూస్తోంది. ఎలక్షన్ పుణ్యమా అని కలెక్షన్లు వస్తున్నాయి. అసెంబ్లీ రద్దుకు ముందు గులాబీ దళం నిర్వహించిన కొంగరకలాన్ సభ మొదలు ఎన్నికల సిబ్బంది తరలించే వరకు ఆర్టీసీకి బాగానే గిరాకీ పెరిగింది. ప్రతి దానికి ఆర్టీసీ బస్సులకు ఓటు వేస్తున్నాయి. తాజాగా ఎన్నికల సిబ్బంది తరలించేందుక తమకు మూడు వేల ఆర్టీసీ బస్సులు కావాలని ఎన్నికల సంఘం చెప్పడంతో ఆర్టీసీ దూకుడుకు బ్రేకులు లేకుండా పోయింది.
ఒక్క బస్సు అద్దె రూ. 21వేలు...
2014 సాధారణ ఎన్నికల్లో 2 వేల 3 వందల బస్సులను ఉపయోగించగా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన అనంతరం 31 జిల్లాలను అదనంగా ఏర్పాటు చేయడంతో అదనంగా మరో 7వందల బస్సులు సమకూర్చుకొంటోంది. గత ఎన్నికల్లో బస్సుకు రూ. 14వేల అద్దెను ఈసీ చెల్లించగా...ప్రస్తుతం వినియోగం..డీజిల్ ధరలు పెరగడంతో అద్దెను పెంచాలని...ఒక్క బస్సు అద్దె రూ. 21వేలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం..దీనికి ఈసీకి సర్కార్ విన్నవించడం జరిగింది. దీనికి ఈసీ కూడా అంగీకరించడంతో ఎలక్షన్స్ ఆర్టీసీకి కలెక్షన్స్‌గా మారాయి. 
ఆర్టీసీ ఖుషీ..ఖుషీ...
ఒక్కో నియోజకవర్గానికి 2 నుండి 3 బస్సులు..ఎన్నికల విధుల కోసం 32 నియోజకవర్గాల నుండి 4 బస్సులు నడుపనుంది. భద్రత కోసం 700 బస్సులు..వీరిని తీసుకరావడానికి ఇప్పటికే 400 బస్సులు బయలుదేరాయి. సెప్టెంబర్ - డిసెంబర్ వరకు రూ. 150 కోట్ల ఆదాయం వచ్చిందని తెలుస్తోంది. టీఆర్ఎస్ నిర్వహించిన కొంగర్ కలాన్ సభ ద్వారా రూ. 75 కోట్ల ఆదాయం వచ్చిందని సమాచారం. ఇరత పార్టీలు నిర్వహించిన సభల ద్వారా రూ. 25 కోట్లు...ఎన్నికల కమిషన్ ద్వారా రూ. 61 కోట్ల ఆదాయం...వచ్చిందని తెలుస్తోంది. మొత్తానికి కలెక్షన్లు భారీగానే రావడంతో ఆర్టీసీ ఖుషీఖుషీ అవుతోంది...

15:20 - October 10, 2018

ఢిల్లీ : జెట్ ఎయిర్ వేస్ ఆర్థిక సంక్షోభంలో కూరుకపోయింది. పైలట్లకు..ఎయిర్ క్రాఫ్్ట సిబ్బందికి వేతనాలు ఇవ్వలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. సెప్టెంబర్ నెల వేతనాలు ఇంకా ఇవ్వకపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.  11, 26వ తేదీల్లో రెండు దఫాలుగా వేతనాలు చెల్లిస్తామని జెట్ ఎయిర్ వేస్ యాజమాన్యం గతంలో హామీనిచ్చింది. కానీ ఈనెల 11న జీతాలు చెల్లించలేమని..వీలైనంత త్వరగా ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని బుధవారం వెల్లడించింది. అక్టోబర్ 11న సెప్టెంబర్ నెలకు సంబంధించిన 50 శాతం వేతనం, ఆగస్టులో చెల్లించకుండా మిగిలిపోయిన 25 శాతం వేతనం చెల్లించాల్సి ఉంది. 

వేతనాలు వస్తాయని ఆశించిన పైలట్లు..ఎయిర్ క్రాఫ్్ట సిబ్బంది తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. కొంత సంయమనం  పాటించాలని యాజమాన్యం పేర్కొంది. ఆగస్టు నెలలో ఉద్యోగులకు 75 శాతం మాత్రమే వేతనాలు చెల్లించింది. మిగతా 25 శాతం తరువాత చెల్లిస్తామని చెప్పింది. వేతనాలు ఇవ్వలేమని జెట్ ఇండియన్ జెట్ ఇండియన్ పైలట్్స యూనియన్, నేషనల్ ఏవియేటర్్స గిల్్డ తో సమావేశమై పరిస్థితిని వివరించింది. వేతనాలు ఎప్పుడిస్తామనేది త్వరలో తెలియచేస్తామని పేర్కొంది. 

13:08 - August 26, 2018

మంచిర్యాల : జిల్లాలోని చెన్నూరు ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్వాకంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిబ్బంది తక్కువగా ఉన్నారనే నెపంతో అధికారులు... రోజువారీ వేతనంతో వేరే వ్యక్తులతో పనులు కానిచ్చేస్తున్నారు. అయితే.. ఎలాంటి వైద్య పరిజ్ఞానం లేని.. ఓ టీ స్టాల్‌ నిర్వహించే వ్యక్తితో రోగులకు వైద్య సేవలు అందించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులని రోగుల బంధువులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఆస్పత్రికి రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. రోగులు, బంధువులు భయాందోళనలో ఉన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

15:24 - August 24, 2018

ఢిల్లీ : మరోసారి ఎయిరిండియా సిబ్బంది నిర్వాకంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఓ ఇటాలియన్‌ డీజేపై ఎయిరిండియా సిబ్బంది దురుసుగా ప్రవర్తించడమే కాకుండా.. చేయి చేసుకున్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మెర్సీ కుజ్‌.. విమానం ఆలస్యంపై సిబ్బందిని ప్రశ్నించగా ఆమెపై దాడి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తన బాధను వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో వీడియోలు పోస్ట్‌ చేసింది. 

12:32 - August 10, 2018

శ్రీకాకుళం : సిక్కోలు రిమ్స్ ఆసుపత్రికి మాయరోగం ఆవహించింది. కోట్లాది రూపాయలు నిధులు ఖర్చుపెడుతున్నా.. బాధ్యతాయుతమైన సేవలు కరువవుతున్నాయి. వైద్యుల ఇష్టారాజ్యం.. సిబ్బంది నిర్లక్ష్యం.. ప్రజాప్రతినిధుల అలసత్వంతో ... సిక్కోలు పెద్దాసుపత్రికి నిర్లక్ష్యపు జబ్బు పడుతోంది. ఇటీవల ఇంజక్షన్ వికటించి ముగ్గురు మృతిచెందగా.. మరో పదిహేడు మంది పరిస్థితి విషమంగా మారడం ఈ పరిస్థితులకు అద్దం పడుతోంది.
నిధులు ఫుల్...సేవలు నిల్
శ్రీకాకుళంలోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రిమ్స్ ఆసుపత్రి ఇది.. దాదాపు జిల్లాలోని ముప్పై ఎనిమిది మండలాల్లోని రోగులకు పెద్ద దిక్కుగా మారిన ఈ ఆసుపత్రికి నిలువునా నిర్లక్ష్యపు జబ్బు చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఇంజక్షన్ వికటించి ముగ్గురు మృతి చెందడంతో పాటు, మరో పదిహేడు మంది ప్రాణాల మీదకు రావడానికి కారణం వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమేనన్న ఆరోపణలున్నాయి. 
రిమ్స్ కు వందల కోట్ల బడ్జెట్ కేటాయింపులు 
వందలాది మంది వైద్యులు, సిబ్బంది విధులు నిర్వర్తించే రిమ్స్ ఆసుపత్రికి వందల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నారు. ఆసుపత్రి భవనాలు సైతం కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. అయినప్పటికీ.. జిల్లాలో ఉన్న ఏకైక ఈ ధర్మాసుపత్రిలో బాధ్యతాయుత సేవలు కరువుతున్నాయి. ఆసుపత్రిలో చేరుతున్న రోగులకు సరైన సేవలు అందడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. వైద్య పరీక్షలు, స్కానింగ్ లు, ఇతర రిపోర్టులు అవసరమైనప్పుడు బయట ప్రయివేటు లేబొరేటరీలపై ఆధారపడాల్సివస్తోందని బాధితులు వాపోతున్నారు. వీటికి తోడు.. వైద్యులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియదని రోగులు చెబుతున్నారు. నర్సుల పరిస్థితీ అంతే.  రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణం అంతా అపరిశుభ్రంగా తయారవుతున్నా పట్టించుకునే నాధుడు కరువయ్యాడని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
నీరుగారిపోతోన్న రిమ్స్ లక్ష్యం  
అయితే లక్షలాదిమంది జిల్లా వాసులకు పెద్ద దిక్కుగా ఉన్న ఈ ఆసుపత్రి మరింత భరోసా కల్పించేలా రోగులకు సేవలందించాలని స్థానికులు కోరుతున్నారు. రిమ్స్ లక్ష్యం ఇలాంటి పరిణామాలతో నీరుగారిపోతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిపట్ల  ప్రభుత్వం ముందస్తు కార్యాచరణతో కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  

 

18:24 - July 18, 2018

హైదరాబాద్ : ఈ సారి ఉజ్జయిని మహాంకాళి బోనాలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు నార్త్‌ జోన్‌ డీసీపీ సుమతి. 3 వేల మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోలీసు సిబ్బందితో పాటు 6 వందల నుంచి 8 వందల వరకు వాలంటీర్ల సహకారం తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. బోనం ఎత్తుకున్న మహిళలకు వీఐపీల తాకిడితో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. ప్రత్యేకమైన క్యూ లైన్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీసీ కెమెరాలను గతంలో కంటే ఈ ఏడాది ఎక్కువ ఏర్పాటు చేసి భద్రతను పరిశీలిస్తున్నామంటున్న డీసీపీ సుమతితో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:21 - July 2, 2018

హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో ఫుట్ పాత్ లపై అక్రమంగా నిర్మితమయిన నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు మూడో రోజు సోమవారం కూల్చివేతలను కొనసాగించారు. ఆరు ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. శని, ఆదివారాల్లో 2341 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. కానీ సోమవారం కూకట్ పల్లి, కాచిగూడలో సిబ్బంది, అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వీరివల్ల చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వికలాంగ మహిళ నడుపుకుంటున్న టీ స్టాల్ ను కూల్చివేయడంతో ఆమె లబోదిబోమంటోంది. కూకట్ పల్లిలోని ఓ ప్రాంతంలో అక్రమంగా నిర్మాణమైన రెండో అంతస్తు స్టేర్ కేస్ కూల్చివేశారు. దీనితో పైనున్న వారు కిందకు వచ్చేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

14:50 - January 8, 2018

కర్నాటక : బెంగళూరులో కుంబారా సంఘా భవనంలోని కైలాశ్ బార్ అండ్ రెస్టారెంట్‌లో ఆదివారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బార్‌లో నిద్రిస్తున్న ఐదుగురు సిబ్బంది సజీవ దహనమయ్యారు. ఆదివారం రాత్రి 2.30 గంటల సమయంలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు పక్కనున్న భవనాల్లోకి వ్యాపించకుండా అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై బార్ యజమాని దయాశంకర్‌ను  పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుల్లో స్వామి 23, ప్రసాద్ 20, మహేశ్ 35 అనే ముగ్గురు వ్యక్తులు కర్నాటకలోని తుముకూర్ ప్రాంతంవారు కాగా..మంజునాథ్ 45, హాసన్ అండ్ కీర్తి 24 మాండ్యకు చెందినవారిగా గుర్తించారు. 

 

21:58 - November 29, 2017

హైదరాబాద్‌ : నాచారం ఈఎఎస్ ఐ ఆస్పత్రిలో ఘోరం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన చిన్నారులను ఆస్పత్రి సిబ్బంది తారుమారు చేశారు. ఒకరి శిశువును, వేరొకరికి అప్పగించారు. దీంతో ఎవరి బిడ్డ.. ఎవరిదన్న విషయంలో గందరగోళం ఏర్పడింది. చివరకు డీఎన్ ఏ టెస్ట్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సిబ్బంది నిర్లక్ష్యంపై బంధువులు ఆందోళనకు దిగారు.     


 

07:28 - November 19, 2017

సంగారెడ్డి : అది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెచ్చిన కలెక్టరేట్‌.  అన్ని జిల్లాల కలెక్టరేట్లు అదే నమూనాలో నిర్మించాలని సంకల్పించిన కలెక్టరేట్‌ అది. ప్రజలకు పాలన చేరువ చేసేందుకు నిర్మించిన ఆ కలెక్టరేట్‌లో.. ప్రభుత్వం ఆశించిన ఫలాలు అందడం లేదు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. 
కార్పొరేట్‌ కార్యాలయాన్ని తలదన్నే బిల్డింగ్‌..
కార్పొరేట్‌ కార్యాలయాన్ని తలదన్నే బిల్డింగ్‌..40 కోట్ల రూపాయలతో  అధునాతన బిల్డింగ్‌ నిర్మాణం..మూడు ఫోర్లు - 38 శాఖలు... వందలాది మంది అధికారులు, సిబ్బంది..ఇదీ సంగారెడ్డి కలెక్టరేట్‌ ట్రాక్‌ రికార్డ్‌. ప్రజల సమస్యలు తీర్చేందుకు, పాలనలో పారదర్శకత తీసుకొచ్చేందుకు... ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం 31 జిల్లాలను ఏర్పాటు చేసింది. నూతనంగా ఏర్పడిన జిల్లాల్లో కలెక్టరేట్ల కార్యాలయాలను నిర్మిస్తోంది. అయితే సంగారెడ్డిలో మాత్రం కలెక్టర్‌ కార్యాలయం కార్పొరేట్‌ కార్యాలయాన్ని తనదన్నేలా నిర్మించింది.  నలభైకోట్ల రూపాయలతో అత్యంత ఆధునికంగా తీర్చిదిద్దింది.  కానీ ప్రభుత్వం ఆశించిన ఫలితం మాత్రం రావడం లేదు.
సమయపాలన పాటించని అధికారులు, సిబ్బంది 
ప్రజలకు సేవలందించే అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. ఎవరూ సమయానికి రావడం లేదు. ఎవరు ఎప్పుడు వస్తారో... ఎప్పుడు బయటకు వెళ్తారో తెలియని పరిస్థితి. సమయం 10 గంటలు దాటినా కుర్చీలన్నీ ఖాళీగానే దర్శమిస్తున్నాయి. 
ప్రజల సమస్యలు పట్టించుకునే వారే కరువు 
కలెక్టరేట్‌కు ఆశతో వచ్చిన ప్రజల సమస్యలు పట్టించుకునే వారే కరువయ్యారు.  సకాలంలో కార్యాలయానికి వచ్చి ప్రజలకు సేవలందించేందుకు సిద్దంగా ఎవరూ లేరు.  వారికి ఇష్టం వచ్చినప్పుడు కలెక్టరేట్‌కు వస్తారు.. ఆ కాసేపటికే బయటకు వెళ్లిపోతారు. అదేమంటే ఫీల్డ్‌ వర్కని చెబుతారు. దీనిపై టెన్‌టీవీ అధికారులను నిలదీస్తే ఏం చెప్తున్నారో మీరే వినండి. ఆఫీసుకు ఆలస్యంగా రావడానికి ఒక్కొక్కరు ఒక్కో కారణాన్ని వెతికి మరీ చెబుతున్నారు. పనిచేసే ప్రాంతంలో ఉండకుండా.. చాలా మంది అధికారులు హైదరాబాద్‌ నుంచి రాకపోకలు సాగిస్తుండడంతో వారికి ఆలస్యం అవుతుంది. దీంతో వారికోసం పడిగాపులు కాస్తున్న జనం తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. సమస్యలు పరిష్కారం కాక కలెక్టరేట్‌కు ప్రదక్షిణలు చేస్తున్నారు.  ఒక్క శాఖని కాదు.. అన్ని శాఖల్లో పనిచేస్తున్న అధికారుల పరిస్థితి ఇంతే. మరికొంత మంది తాము ఆలస్యంగా వచ్చినా దాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేదు. తాము వేరేపనిమీద బయటకు వెళ్లి వస్తున్నామని బుకాయిస్తున్నారు. కలెక్టర్‌ ఆదేశాలను బేఖాతర్‌ చేస్తున్నారు. 
ప్రజలకు అందుబాటులో ఉండని అధికారులు
బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యం సంగారెడ్డి కలెక్టరేట్‌ అధికారులు భాగస్వామ్యం అవుతారో లేదో తెలియదు కానీ... పనుల మీద వచ్చే ప్రజలకు మాత్రం వీరు అందుబాటులో ఉండరు. మధ్యాహ్నం అయినా అధికారులు రాకపోవడంతో ఆ కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో పనుల మీద వ్యవప్రయాసల కోసం సుదూర ప్రాంతం నుంచి వచ్చిన ప్రజలు నిరాశతో వెనుదిరుగుతున్నారు. అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు , సిబ్బంది సమయ పాలన పాటించేలా కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - సిబ్బంది