సిమ్రాన్

17:31 - October 13, 2018

త్రిష చిరకాల కోరిక ఇప్పుడు తీరబోతుంది.. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన పేట్టా చిత్రంలో త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ మూవీలో మరో హీరోయిన్‌గా సిమ్రాన్ కనిపించనుంది.. పిజ్జా ఫేమ్ కార్తీక్ సుబ్బరాజు డైరెక్ట్ చేస్తున్నాడు.. రజనీకాంత్‌తో కలిసి దైవ దర్శనం చేసుకున్న త్రిష, ఆ ఫోటోలని ట్విట్టర్లో పోస్ట్ చేసింది.. రజనీ నుదుటి నిండా బొట్టు, మెడలో దండలతో ఉంటే, త్రిష ఆయన పక్కనే బొట్టుతో, చేతిలో దండ పట్టుకుని నిలబడి ఉంది.. దర్శన్ డన్ రైట్ విత్ ది గాడ్ లైక్ మ్యాన్ హిమ్‌సెల్ఫ్ అని కొటేషన్ కూడా ఇచ్చింది.. పేట్టాలో, విజయ్ సేతుసతి, బాబీసింహా, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తదితరులు నటిస్తుండగా, అనిరుధ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.. త్రిష పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

 

12:48 - April 11, 2018

మానాన్నకు పెళ్లి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయి..తెలుగు ప్రేక్షకులను గ్లామర్ పరంగాను .. నటన పరంగాను ప్రభావితం చేసిన కథానాయికలలో సిమ్రాన్ ఒకరు. పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన అవలీలగా చాన్స్ లు కొట్టేసి గ్లామర్ గాల్ గా మెప్పించి 'సమర సింహా రెడ్డి' .. 'కలిసుందాం రా' .. 'నరసింహనాయుడు' .. 'మృగరాజు' వంటి సినిమాలు ఆమె అగ్రకథానాయకులతో చేసింది. అటువంటి సిమ్రాన్ వివాహం తరువాత తెలుగు తెరకు పూర్తిగా దూరమైంది. కానీ తమిళంలో కొంతకాలం క్రితమే రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె, అక్కడ ముఖ్యమైన పాత్రలను చేస్తోంది.

గ్లామర్ గా కనిపిస్తున్న అమ్మ,అత్త పాత్రలు..
ప్రస్తుతం తెలుగు తెరపై అమ్మ, అత్త క్యారక్టర్లంటే హీరోయిన్ కు అక్కల్లాగా కనిపించేంత గ్లామర్ గా కనిపిస్తున్నాయి. ప్రగతి,రాశి,తులసి,రోహిణి వంటి మంచి నటీమణులు అత్తలుగా, అమ్మలుగా మెప్పిస్తున్నారు. ఈ క్రమంలో సిమ్రాన్ కూడా అత్త పాత్రలో తెలుగు తెరపై రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఒక తెలుగు సినిమాను కూడా సిమ్రాన్ అంగీకరించిందనీ .. అందులో అత్త పాత్రలో కనిపించనుందనేది తాజా సమాచారం. సప్తగిరి హీరోగా ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. ఇది అత్తకి తగిన అల్లుడు తరహాలో కొనసాగే కథనట. అందువల్లనే అత్త పాత్ర కోసం సిమ్రాన్ ను ఓకే చెసినట్టు తెలుస్తోంది. వినోదమే ప్రధానంగా సాగే ఈ సినిమా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది .. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.        

10:38 - August 28, 2017

వికెఎ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ తన ద్వితీయ చిత్రంగా నిర్మిస్తున్న చిత్రం "ఇగో". విజయ్ కరణ్-కౌసల్ కరణ్-అనిల్ కరణ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆశిష్ రాజ్-సిమ్రాన్ లు జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుబ్రమణ్యం దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలె రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ను గోదావరి పరిసర ప్రాంతాల్లో తీయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. "ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ రోమాంటిక్ సస్పెన్స్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న "ఇగో" రెండు షెడ్యూల్స్ పూర్తయ్యిందని తెలిపారు. . భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కథానాయకుడి క్యారెక్టరైజేషన్ సరికొత్తగా ఉంటుందన్నారు. అనుకొన్నదానికంటే ముందుగానే షూటింగ్ పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఎక్కడా రాజీపడకుండా ప్రేక్షకులకు క్వాలిటీ ఔట్ పుట్ ఇచ్చేందుకు సర్వ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను విడుదల చేయనున్నట్లు సమాచారం.. ఆశిష్ రాజ్, సిమ్రాన్, దీక్షాపంత్, రావురమేష్, పోసాని కృష్ణమురళి, పృధ్వి, గౌతంరాజు, షకలక శంకర్, చంద్ర, వేణు, శివన్నారాయణ, భద్రం, రైజింగ్ రాజు, గుండు మురళిలు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, సినిమాటోగ్రఫీ: ప్రసాద్ జి.కె, ఆర్ట్: ఆర్.కె, ఫైట్స్: నందు, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే, నిర్మాతలు: విజయ్ కరణ్-కౌసల్ కరణ్-అనిల్ కరణ్, రచన-దర్శకత్వం: సుబ్రమణ్యం. 

11:13 - June 21, 2017

టాలీవుడ్ లో ఓ వెలుగు వెలుగొందిన 'సిమ్రాన్' మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఆమె పలు విజయవంతమైన సినిమాల్లో నటించారు. సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ సినిమాలో విలన్ గా నటిస్తోందని తెలుస్తోంది. శివ కార్తికేయన్, పొన్ రామ్ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో శివ కార్తీకేయన్..సమంత తొలిసారిగా నటిస్తున్నారు. వీరితో పాటు 'సిమ్రాన్'..’నెపోలియన్' కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో 'శివ కార్తికేయన్' తండ్రి పాత్రలో 'నెపోలియన్' నటిస్తున్నట్లు..ప్రతి నాయకిగా 'సిమ్రాన్' నటిస్తోందని తెలుస్తోంది. అంబ సముద్రంలో ఇటీవలే పూజా కార్యక్రమాలు జరిగాయి. శివ కార్తికేయన్‌తో 'రెమో’, 'వేలైక్కారన్‌' చిత్రాన్ని నిర్మించిన 24 ఎ.ఎం. స్టూడియోస్‌ సంస్థ ఈ చిత్రాన్నీ నిర్మిస్తోంది.

07:20 - October 8, 2015

సిమ్రాన్‌.. తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథనాయకులతో నటించి ఓ ఊపు ఊపేసిన స్టార్‌ హీరోయిన్‌. పెళ్ళి చేసుకున్న తర్వాత దాదాపు సినిమాలకు దూరమైంది. తాజాగా విడుదలైన 'త్రిష ఇల్లాన నయనతార' చిత్రంలో మెరిసిన సిమ్రాన్‌ ఇప్పుడు హీరోయిన్‌గా నటించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. అంతేకాదు పూర్తి స్థాయిలో హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇచ్చేందుకు భర్త సహకారంతో సొంతంగా ప్రొడక్షన్‌ హౌస్‌ని కూడా స్థాపించింది. తొలి ప్రయత్నంలో భాగంగా ఓ మహిళా ప్రధాన చిత్రాన్ని ఎంపిక చేసుకుంది. బాలీవుడ్‌లో రాణీముఖర్జీ నటించిన 'మర్దానీ' సినిమా తరహాలో పవర్‌ఫుల్‌గా కనిపించేందుకు అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకుందట. డబుల్‌ రోల్‌లో సిమ్రాన్‌ అలరించనున్న ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు నవంబర్‌ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ చిత్రానికి గౌరీశంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

Don't Miss

Subscribe to RSS - సిమ్రాన్