సీఎం

20:40 - October 3, 2016

జయలలితకు ఏమయింది? ఉత్కంఠ ఎందుకు వీడటం లేదు?పార్టీ వర్గాల్లో, సగటు కార్యకర్తల్లో ఉత్కంఠ ఎందుకు వీడటం లేదు..?జయ తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? శశికళ అత్యవసర సమావేశం దేన్ని సూచిస్తోంది? తమిళనాట రాజకీయాలు ఏ మలుపుతిరగనున్నాయి? ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం..ఒంటిచేత్తో రాష్ట్ర రాజకీయాలను చక్రంతిప్పే మహిళ ఆస్పత్రి పాలవటంతో తమిళనాడు అంతటా అయోమయం..గందరగోళం.. అందరిలో అనేక ప్రశ్నలు. అత్యున్నత స్థాయిలో నిజాలు తెలిసినప్పటికీ బయటకి వివరాలు రాకపోవటంతో ప్రజల్లో, కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది.

జయలలిత ఆరోగ్యంపై నెట్లింట్లో రకరకాల పుకార్లు కొనసాగుతున్నాయి. సోషల్ మీడియాలో జయ ఆరోగ్యంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే అమ్మకు సంబంధించిన ఒక ఫొటో వైరల్‌గా మారింది. జయలలిత ఆసుపత్రి బెడ్‌పైన ఆక్సిజన్‌ మాస్క్‌ పెట్టుకుని చికిత్స తీసుకుంటున్నట్లు ఉన్న ఫొటో ఒకటి నెట్లో చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన అభిమానులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమిళ నాట ఆమె ఓ వ్యక్తి కాదు.. ఓ శక్తి. ఆమె రూటే సెపరేటు..

ఆమె సింగిల్ హ్యాండ్ తో పాలిటిక్స్ ని నడిపించగల సత్తా ఉన్న ఉక్కు మహిళ..కంటిచూపుతో పార్టీని శాసించగల నేర్పు..అవరోధాలను, ప్రతికూలతలను ఎదుర్కొనే సత్తా...ఒక్కమాటలో చెప్పాలంటే జయ అంటే తమిళనాట ఓ వ్యక్తి కాదు.. ఓ శక్తి.. అలాంటి జయలలిత ఆస్పత్రి పాలైతే సగటు అభిమాని జీర్ణించుకోవటం అంత తేలిక కాదు..

నమ్మిన బంటు పన్నీరు సెల్వంకు సీఎం పగ్గాలు అప్పగించి, తన కనుసన్నల్లో ప్రభుత్వాన్ని నడిపించిన ఘనత ఆమెది. తన ఆజ్ఞల్ని ధిక్కరించిన ఉద్యోగుల్ని రాత్రికి రాత్రే తొలగించినా, డీఎంకే అధినేత కరుణానిధిని అరెస్టు చేయించినా, కక్ష సాధింపు ధోరణి అనుసరించే రీతిలో డీఎంకే మాజీ మంత్రుల్ని కట కటాల్లోకి నెట్టినా జయలలిత రూటే సెపరేటు.

ఇప్పుడు తమిళనాడు మాత్రమే కాదు.. దేశమంతటా ఉత్కంఠగా చూస్తోంది. జయ ఆరోగ్యం కోసం ఆమె అభిమానులు, అన్నాడీఎంకె కార్యకర్తలు ఆందోళన చెందుతూ ఎదురు చూస్తున్నారు. అమ్మ ఎప్పుడు బయటికి వస్తుందా అని పడిగాపులు కాస్తున్నారు. తమిళనాట రాజకీయాలను శాసిస్తున్న జయలాంటి మహిళ ఆస్పత్రి పాలైతే ఇలాంటి పరిస్థితి ఏర్పడటంలో ఆశ్చర్యం లేదు. మరో పక్క పార్టీలో తానే తిరుగులేని శక్తిగా ఉండి.. నంబర్ టూ అంటూ ఎవరూ లేని తరుణంలో భవిష్యత్తుపై ఆసక్తి, ఆందోళన ఉండటం కూడా సహజమే.

17:44 - February 25, 2018

విశాఖ : రాష్ట్రానికి లక్ష ఎలక్ట్రానిక్‌ వాహనాలు తీసుకువస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇందుకు ఎమ్‌వోయూ కుదుర్చుకుంటున్నట్లు ఆయన CII సదస్సులో చెప్పారు. ఎలక్ట్రిక్‌ వాహనాలతో కాలుష్యం తగ్గుతుందన్న సీఎం.. రాష్ట్రంలో సోలార్‌, పవన విద్యుత్‌కు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. ఎలక్ట్రిక్‌ వాహనాలతో రాష్ట్రంలో టూరిజం కూడా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు తెలిపారు.  

15:22 - February 24, 2018
08:23 - February 23, 2018

అనంతపురం : జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచిలో నిర్మాణంలో ఉన్న కియా మోటార్స్‌ పరిశ్రమకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. దక్షిణ కొరియా దిగ్గజ కార్ల తయారీ సంస్థ కియా 13 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ పరిశ్రమను ఏర్పాటు చేస్తోంది. ఈ సంస్థలో ప్రత్యక్షంగా 4 వేల మందికి, పరోక్షంగా ఏడు వేల మందికి ఉపాధి లభిస్తుంది. భూమిపూజ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, కియా మోటార్స్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

కియా మోటార్స్‌కు భూమిపూజ
కియా మోటార్స్‌కు భూమిపూజ అనంతరం ఎర్రమంచి సభలో పాల్గొన్న చంద్రబాబు.. ప్రత్యేక హోదా అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై రాజ్యసభ సాక్షిగా ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోవడాన్ని తప్పుపట్టారు. అరకొరసాయంతో చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్న కేంద్రంపై మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తున్నప్పుడు ఏపీకి ఎందుకివ్వరని చంద్రబాబు ప్రశ్నించారు. ఇది కేంద్ర ప్రభుత్వ బాధ్యతని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఏపీ హక్కని స్పష్టం చేసిన చంద్రబాబు, ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ఏపీ ప్రజల ప్రత్యేక హోదా డిమాండ్‌ సహేతుకమైనదని, ఈ విషయంలో పద్ధతి ప్రకారం ఆందోళన చేసేవారిని అభినందిస్తానన్న చంద్రబాబు.. శాంతిభద్రతల సమస్య సృష్టిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు రావన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని కోరారు. 

13:26 - February 22, 2018

అనంతపురం : జిల్లా పెనుకొండలో కియోమోటార్స్‌కు చంద్రబాబు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా... ముఖ్యమంత్రి... ప్లాంట్ కోసం భూములిచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో మౌళిక వసతుల సదుపాయాలకు లోటు లేదన్నారు సీఎం. కియో మోటార్స్‌కు అన్ని విధాల సహకరిస్తామని.. నీటి సమస్య లేకుండా హంద్రీనీవా నుంచి త్వరలోనే సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. చెన్నై-కృష్ణపట్నం కారిడార్‌ సమీపంలోనే ఉండటంతో... ఎగుమతులు కూడా సులభంగా చేసుకోవచ్చని సీఎం తెలిపారు. ఈఫ్లాంట్ ప్రపంచంలోనే అత్యధికంగా కార్లను ఉత్పత్తి చేసే కేంద్రం కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. 

18:14 - February 14, 2018
08:11 - February 5, 2018

హైదరాబాద్ : కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ముసాయిదా బిల్లు పురోగతి, నూతన గ్రామ, నగర పంచాయతీల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్త పంచాయతీలకు నిధులు కేటాయింపు, ఆర్థిక సంఘం నిధుల విడుదల, బడ్జెట్‌లో నిధుల కేటాయింపు, ఆస్తి పన్ను వసూలు ద్వారా వచ్చే నిధులు తదితర అంశాలపై కేసీఆర్‌ అధికారులతో చర్చించారు. ఇందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా ఏర్పాటయ్యే పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు ఎలా పొందాలో అధ్యయనం చేయాలని అధికారుల దృష్టికి తెచ్చారు.

వచ్చే నెల 11న పాస్ బుక్ లు
వచ్చే నెల 11న రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదారు పాపు పుస్తకాలు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో వీటి ముద్రణను వేగవంతం చేయలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. త్వరతగతిన అనుకున్న సమయానికి పూర్తయ్యేటట్టు చూడాలిన కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించి, కళ్లద్దాలు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ఈ విషయంలో ఇసక్తి ఉన్న ప్రభుత్వేతర సంస్థల సహకారాన్ని తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.

అటవీ భూములను రక్షణ
రోజు రోజుకు శరవేగంగా అభివృద్ధిపథంలో పయనిస్తూ, భౌగోళికంగా శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌ నగరాన్ని అన్ని విధాల కాపాడుకోవాల్సిన అవసరాన్ని కేసీఆర్ అధికారుల దృష్టికి తెచ్చారు. నగరానికి అన్ని వైపుల 50 నుంచి 60 కి.మీ.పరిధిలో లక్షన్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అటవీ భూములను రక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ప్రాంతాల్లో ఫారెస్ట్‌ బ్లాక్‌లను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ను అభివృద్ధిచేసి, కేబీఆర్‌ పార్క్‌ తరహాలో వాక్‌ వేని నిర్మించాలని కేసీఆర్‌ ఆదేశించారు. సేవ్‌ హైదరాబాద్‌ కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ చేపట్టాలని కోరారు. 

09:13 - February 4, 2018

గుంటూరు : కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. ఈ సమావేశానినికి టీడీపీ లోక్ సభ, రాజ్యసభ సభ్యులు హాజరుకానున్నారు. ఈ భేటీలో ప్రధానంగా కేంద్రంపై ఒత్తిడి పెంచె అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీకి టీడీపీకి చెందిన కేంద్రమంత్రులు అశోక్ జగపతి రాజు, సుజాన చౌదరి కూడా హాజరుకానున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

07:19 - January 25, 2018

దావోస్ : దావోస్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు... వివిధ సంస్థల అధిపతులు, ప్రతినిధులతో భేటీ అయ్యారు. ముందుగా ఎయిర్‌బస్ డిఫెన్స్ సీఈవోతో సమావేశమయ్యారు. సంస్థకు చెందిన ట్రాన్స్‌పోర్టు ఎయిర్ క్రాఫ్ట్‌ C-295 తయారీని ప్రారంభించడానికి.. అనుమతులను సమకూర్చుకునే ప్రయత్నంలో ఎయిర్ బస్ సంస్థ ప్రతినిధులు సీఎంతో భేటీ అయ్యారు. ఈ విషయంలో గత ఏడాది ఏపీ ప్రభుత్వంతో ఎయిర్‌బస్‌ సంస్థ సంప్రదింపులు జరిపింది. ఏపీలో అడుగుపెట్టడానికి సహకరిస్తామని సీఎం చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. అనంతరం... సింగపూర్‌కు చెందిన నన్యాంగ్ టెక్నలాజికల్ వర్సిటీ ప్రెసిడెంట్ సుబ్రా సురేశ్‌తో సమావేశమయ్యారు. సింగపూర్‌లోని వర్సిటీ క్యాంపస్‌ను సందర్శించాలని వారు బాబును ఆహ్వానించారు.

07:32 - January 20, 2018

గుంటూరు : పదిరోజుల పాటు కొనసాగిన జన్మభూమి-మావూరు కార్యక్రమంలో ప్రజల సమస్యలను పరిష్కరించామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. జన్మభూమి కార్యక్రమం నిర్ణహణలో అధికారుల పనితీరు తనకు ఆనందం కలిగించిందన్నారు. రాష్ట్రంలో రియల్‌టైం గవర్నరెన్స్‌తో ప్రజాసమస్యలను సత్వరం పరిష్కరిస్తున్నామన్నారు చంద్రబాబు. జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం అయ్యారని కితాబునిచ్చారు. రియల్‌టైటం గవర్నెన్స్‌, ఈ ప్రగతి , సాధికార సర్వే, పరిష్కార వేదిక.. కార్యక్రమం ఏదైనా ' ప్రజలే ముందు' అనే కాన్సెప్ట్‌తోపనిచేస్తున్నామన్నారు. మొత్తం 16వేల గ్రామాలకు వెళ్లిన నోడల్‌ అధికారులు.. 9 మస్యలపైనా సమీక్షలు చేసి.. పరిష్కారానికి కృషిచేశారన్నారు. జన్మభూమి దరఖాస్తులను రాజకీయాలతో సంబంధం ఏప్రిల్‌ 1 నుంచి పరిష్కరిస్తామన్నారు.

మూడు నెలల్లోనే సమస్య పరిష్కారం
వ్యవసాయ రంగంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ మంచి ప్రగతి సాధిస్తుంద్నారు. ఈ ఖరీఫ్‌సీజన్‌లో వర్షపాతం 13.5శాతం తక్కువగా పంట దగుబడిలో మంచి ప్రగతి సాధించామన్నారు. ఇక రాష్ట్ర విభజన సమయంలో ఏపీ 22.5 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కొరతతో ఉందన్న చంద్రబాబు.. అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే సమస్యను పరిష్కరించామన్నారు. ప్రస్తుతం విద్యుత్‌ కష్టాలను అధిగమించామని, భవిష్యత్తులో కరంటుబిల్లులు పెంచేయోచన లేదన్న ముఖ్యమంత్రి.. అవసరమైతే విద్యుత్‌బిల్లులు తగ్గిస్తామన్నారు.

ప్రజలను ప్రభుత్వ అతిథులు
జన్మభూమి సభల్లో సమస్యలు చెప్పుకోడానికి వచ్చిన ప్రజలను ప్రభుత్వ అతిథులుగా చూస్తూ.. సమస్యల పరిష్కారానికి కృషిచేశారని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. చీఫ్‌ సెక్రెటరీ నుంచి గ్రామస్థాయిలో వీఆర్‌వో, పంచాయతీ కార్యదర్శివరకు అందరూ బాగా పనిచేశారని ప్రశంశించారు. 10రోజుల పాటు జరిగిన జన్మభూమి -మావూరు కార్యక్రమంలో సమస్యలు సత్వరం పరిష్కారం కావడంతో 63శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో సాధించబోయే స్వర్ణాంధ్రప్రదేశ్‌కు అధికారులు తమ పనితీరుతో పునాధులు వేశారని ప్రశంశించారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - సీఎం