సుజీత్

11:16 - August 16, 2017

'బాహుబలి'..'బాహుబలి-2' సినిమాల అనంతరం 'ప్రభాస్' నటిస్తున్న న్యూ ఫిల్మ్ 'సాహో' చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. చిత్రం షూటింగ్ ప్రారంభం కాకముందే చిత్ర టీజర్ విడుదలయిన సంగతి తెలిసిందే. కానీ సినిమాకు సంబంధించిన విషయాలు మాత్రం బయటకు పొక్కడం లేదు. 'ప్రభాస్' సరసన హీరోయిన్ ఎవరు నటిస్తారనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వెలువడ్డాయి. 

'ప్రభాస్' సరసన నయనతార, అనుష్క, కాజల్ నటిస్తారని, బాలీవుడ్ హీరోయిన్స్ లను ఎంపిక చేస్తారని టాక్ వినిపించింది. దీనికంతటికీ ఫుల్ స్టాప్ పడింది. 'సాహో' లో హీరోయిన్ గా 'శ్రద్ధాకపూర్' నటించబోతోంది. 'ఆషికి-2'తో పాటు పలు హిందీ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ మంచి పేరే తెచ్చుకుంది. ఆమె తెలుగులో నటిస్తున్న తొలి చిత్రం 'సాహో' కావడం విశేషం.

సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ లు భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో చిత్రం నిర్మితమౌతోంది. ఈ చిత్రం కోసం అంతర్జాతీయ నిపుణులు పనిచేస్తున్నట్లు టాక్. యాక్షన్ కి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ స్టైలిష్ గా ఇదివరకటి కంటే భిన్నంగా తెరపై కనిపించేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. 

09:23 - August 11, 2017

'బాహుబలి', 'బాహుబలి-2' చిత్రంతో జాతీయస్థాయిలో పేరొందిన నటుడు 'ప్రభాస్' తాజా చిత్రంతో బిజీ బిజీగా మారిపోయాడు. దాదాపు కొన్ని సంవత్సరాల వరకు ఒక్క సినిమాకే పని చేసిన ఆయన మరో చిత్రంలో నటిస్తుండడంతో భారీ అంచనాలు నెలకొంటున్నాయి.

సుజీత్ సింగ్ దర్శకత్వంలో 'సాహో' సినిమా తెరకెక్కుతోంది. షూటింగ్ మొదలు కాకుండానే టీజర్ ను ముందుగా రిలీజ్ చేసి ఆసక్తిని రేకేత్తించారు. చాలా ఏళ్ల తర్వాత 'ప్రభాస్‌' తెర మీద మోడరన్‌ గెటప్‌తో కనిపించనుండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈసినిమా వివరాలు మాత్రం ఏ మాత్రం బయటకు పొక్కడం లేదు. తాజాగా సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న మది తమిళ మీడియాతో మాట్లాడినట్లు సోషల్ మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు 7 రోజుల షూటింగ్‌ ముగిసిందని ఇంకా 180 రోజుల పాటు షూటింగ్‌ జరగాల్సి ఉందని అన్నారు. హీరోయిన్‌ ఎవరనేది దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటిస్తారని అన్నారు. రానున్న రోజుల్లో వివరాలు తెలిసే అవకాశాలున్నాయి. 

10:19 - August 2, 2017

'భళీ..భళీ రా...భళీ..సాహోరో బాహుబలి' అనిపించుకున్న టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ 'ప్రభాస్' తన తాజా చిత్రం 'సాహో'పై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. యాక్షన్ చిత్రమా..సైన్స్ ఫిక్షన్..సోషియో ఫాంటసీ నేపథ్యంలో చిత్రం ఉంటుందా అని సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి. కానీ ఈ సినిమాకు సంబంధించిన విషయాలు మాత్రం తెలియరావడం లేదు. 'సాహో' చిత్రాన్ని మాత్రం హాలీవుడ్ రేంజ్ కు తగ్గట్టు రూపొందించనున్నారని టాక్.

'బాహుబలి'..'బాహుబలి-2' సినిమాల అనంతరం సుజీత్ దర్శకత్వంలో 'సాహో' చిత్రంలో నటించేందుకు 'ప్రభాస్' అంగీకరించారు. 'రన్ రాజా రన్' చిత్రం అనంతరం సుజీత్ చేస్తున్న సినిమా ఇదే. చిత్ర షూటింగ్ కంటే ముందుగానే చిత్రా టీజర్ విడుదల చేయడం గమనార్హం. చిత్ర హీరోయిన్స్..విలన్స్..ఇతరత్రా పాత్రలు ఎవరు పోషిస్తున్నారనే దానిపై క్లారిటీ రావడం లేదు. దాదాపు రూ. 150 కోట్లతో సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

'సాహో' పక్కా యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ గా సినిమా ఉంటుందని..హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని 'ప్రభాస్' పేర్కొన్నట్లు తెలుస్తోంది. సాహో కోసం బరువు తగ్గిపోయి స్టైలిష్ గా కనిపించబోతున్నాడు. ఇటీవలే 'ప్రభాస్' కు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ దుబాయిలో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 'ప్రభాస్' కు విలన్ గా బాలీవుడ్ నటుడు 'నీల్ నితిన్ ముఖేష్' నటించనున్నట్లు తెలుస్తోంది. మరి 'ప్రభాస్' ఎలా మురిపిస్తాడో వెయిట్ అండ్ సీ...

13:59 - July 18, 2017

ప్రభాస్..’బాహుబలి'..’బాహుబలి-2’ సినిమాల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న నటుడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరుతో పాటు భారీ కలెక్షన్లు కొల్లగొట్టాయి. ఈసినిమాలో కండలతో భారీకాయంతో..’ప్రభాస్' నటించాడు. ప్రభాస్ మాస్ ఫాలోయింగ్ తో పాటు లేడీస్ ఫాలోయింగ్ కూడా అధికంగానే ఉంది.
ప్రస్తుతం 'ప్రభాస్' సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమాలో నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన విశేషాలు మాత్రం బయటకు రావడం లేదు. హీరోయిన్..విలన్ ఎవరనే దానిపై చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా న్యూ యంగ్ లుక్ లో కనిపిస్తున్న ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ లుక్ 'సాహో' చిత్రంలోనేదా ? లేక మాములుదేనా అనే సందేహాలు నెలకొన్నాయి. ఈ ఫొటోలో 'ప్రభాస్' కిందుకు చూస్తూ ఒకింత సిగ్గు పడుతూ చిరు నవ్వు చిందిస్తూ ఉన్న ఫొటో అభిమానులను అలరిస్తోంది. ఆరెంజ్‌ కలర్‌ రౌండ్‌నెక్‌ టీ షర్ట్‌ ధరించి.. దానిపై మెడ చుట్టూ చెక్‌ షర్ట్‌ వేసుకొని ఉన్న ఈ ఫొటో ఇప్పటికే అభిమానులు తెగ ఆకట్టుకుంటోంది.

12:07 - July 6, 2017

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ 'ప్రభాస్' తాజా చిత్రం 'సాహో' లో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు ? అనే దానిపై తెగ చర్చ జరుగుతోంది. దీనిపై పలువురి హీరోయిన్ల పేర్లు ఎన్నో వినిపించాయి. ‘బాహుబలి'..’బాహుబలి-2’.. సినిమాల అనంతరం 'ప్రభాస్' సుజిత్ దర్శకత్వంలో 'సాహో' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్ర టీజర్ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. కానీ హీరోయిన్ విషయంలో చిత్ర యూనిట్ తర్జనభర్జనలు పడుతున్నట్లు సమాచారం.
చివరకు 'అనుష్క'ను ఎంపిక చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు రమేశ్‌ బాలా ట్వీట్ చేయడం గమనార్హం. కానీ చిత్ర బృందం మాత్రం ఎలాంటి కన్ఫామ్ చేయలేదు. గతంలో ప్రభాస్..అనుష్కలు నటించిన పలు సినిమాలు విజయవంతమైన సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్ బాగుంటుందని అభిమానులు సైతం అనుకుంటుంటారు. గతంలో వీరి కాంబినేషన్‌లో 'బిల్లా', 'మిర్చి', 'బాహుబలి' సినిమాలు వచ్చాయి. మరి అనుష్క నటించనుందా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది.

11:21 - July 3, 2017

ప్రభాస్...‘బాహుబలి'..’బాహుబలి-2’..చిత్రాల ద్వారా ఒక్కసారిగా జాతీయ స్థాయిలో పేరొందిన నటుడు. ప్రస్తుతం ఇతడి కోసం దర్శకులు క్యూ కడుతున్నారు. బాలీవుడ్ లో నటింప చేయాలని పలువురు దర్శకులు ప్రయత్నాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో 'సాహో' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అనంతరం ఆయన ఎవరి దర్శకత్వంలో నటిస్తారనే దానిపై చర్చ జరుగుతోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్..ఇండియన్ మైకెల్ జాక్సన్ గా పేరొందిన 'ప్రభుదేవా' దర్శకత్వంలో 'ప్రభాస్' నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే 'ప్రభుదేవా' దర్శకత్వంలో పలు చిత్రాలను వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుదేవా, తమన్నా జంటగా నటిస్తున్న 'ఖామోషి' చిత్రంలో 'ప్రభాస్‌' అతిథి పాత్రలో చేస్తున్నాడని తెలుస్తోంది. దీనిపై 'ప్రభుదేవా' మీడియాతో మాట్లాడారు..కేవలం బిజినెస్‌ కోసం తామిద్దరం కలిసి సినిమా చేయడంలో అర్థం లేదని, ‘ప్రభాస్‌'తో సినిమా తీయాలనుందని స్పష్టం చేశారు. 'సాహో' సినిమాతో ప్రభాస్ బిజీగా ఉన్నారని, ఈ సినిమా అయ్యాక ఏ విషయం అనేది ప్రకటిస్తామన్నారు.

16:05 - June 7, 2017

ప్రస్తుతం సోషల్ మాధ్యమాల్లో ఈ ఫొటో వైరల్ గా మారుతోంది. ఈ హీరో ఎవరు అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. తెలిసిన వారు చెబుతున్నారు...తెలియని వారు చెప్పండంటూ పోస్టులు చేస్తున్నారు. తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం 'బాహుబలి'..’బాహుబలి-2’ సినిమాలు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలకు సంవత్సరాల తరబడి 'ప్రభాస్' కష్టపడి నటించిన సంగతి తెలిసిందే. అనంతరం సుజీత్ దర్శకత్వంలో 'సాహో' చిత్రానికి సైన్ చేశాడు. చిత్ర షూటింగ్ ప్రారంభం కాకముందే టీజర్ ను విడుదల చేసి అంచనాలను మరింతగా రేకేత్తించారు. ఇటీవలే ప్రముఖ కేశాలంకరణ నిపుణుడితో ఫొటో బయటకు వచ్చింది. అందులో 'ప్రభాస్' కొద్దిగా స్లిమ్ గా కనిపించాడు. దీనితో 'సాహో' చిత్రంలో ఇలా కనిపిస్తారా ? అని అభిమానులు అనుకున్నారు. కానీ తాజాగా 'ప్రభాస్'కు కు చెందిన ఫొటో వైలర్ అయిపోయింది. 'బాహుబలి'లో పొడవాటి జుట్టు, మెలి తిరిగిన మీసం, గడ్డంతో కనిపించిన 'ప్రభాస్' ఈ ఫోటోలో క్లీన్ షేవ్ లో కనిపిస్తున్నాడు. క్లీన్ షేవ్ లో 'ప్రభాస్' ఇప్పటి వరకు కనిపించ లేదనే సంగతి తెలిసిందే. ఒక్కసారిగా 'ప్రభాస్' ఇలా మారిపోవడానికి కారణం ఏంటబ్బా అని అభిమానులు తెగ ఆలోచిస్తున్నారంట.

09:04 - June 3, 2017

టాలీవుడ్ రెబల్ స్టార్ 'ప్రభాస్' తదుపరి చిత్రాలపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. కొన్ని సంవత్సరాల వరకు 'బాహుబలి'..’బాహుబలి-2’ చిత్రాల వరకు మాత్రమే 'ప్రభాస్' పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన సంగతి తెలిసిందే. తాజాగా సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమాలో 'ప్రభాస్' నటిస్తున్నాడు. సినిమాకు సంబంధించిన టీజర్ ను షూటింగ్ కంటే ముందుగానే రిలీజ్ చేశారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలు సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇంకా కథానాయికగా కూడా ఫైనల్ కాలేదు. ప్రతి నాయక పాత్రలో బాలీవుడ్ నటుడు 'నీల్ నితిన్ ముఖేష్' నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. మురుగదాస్ చిత్రం 'కత్తి'లో విలన్ గా ఇతను నటించిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా సల్మాన్ ఖాన్ 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' చిత్రంలో కూడా 'నీల్ నితిన్ ముఖేష్' విలన్ గా కనిపించి మెప్పించాడు. మరి హీరోయిన్ ఎవరు ? విలన్ ఎవరు ? తదితర వివరాలు రానున్న రోజుల్లో తెలియనున్నాయి.

 

15:03 - May 16, 2017

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ 'ప్రభాస్' రేంజ్ ‘బాహుబలి -2’ సినిమా అనంతరం ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రపంచస్థాయిలో ఆయన పేరు మారుమాగుతోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే రూ. వేయి కోట్లు వసూలు చేసిన 'బాహుబలి -2’ సినిమా రూ. 1500 కోట్ల వైపుకు పరుగులు తీస్తోంది. ఈ సినిమా అనంతరం సుజీత్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాకు సైన్ చేశాడు. ఈ సినిమాకు 'సాహో' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఇటీవలే చిత్ర టీజర్ కు భారీ స్పందన వచ్చింది. కానీ 'ప్రభాస్' సరసన ఏ హీరోయిన్ నటించబోతోందునేది తెలియ రావడం లేదు. రోజుకో హీరోయిన్ పేరు తెరమీదకు వస్తోంది. బాలీవుడ్ నటిని ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. కత్రినా కైఫ్..పూజాహెగ్గే ఇలా చాలా మంది పేర్లు వినిపించాయి. తాజాగా శద్ధకపూర్..దిశా పటానీని పేర్లు వినిపించాయి. వీరు ఎక్కువగా పారితోషకం డిమాండ్ చేస్తుండడంతో టాలీవుడడ్ నటీమణులనే ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందని టాక్.

10:22 - May 7, 2017

‘బాహుబలి'..’బాహుబలి-2’ సినిమాలు ఘన విజయం సాధించడంతో నటుడు 'ప్రభాస్' క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ చిత్రాలకు సంవత్సరాల టైం కేటాయించిన 'ప్రభాస్' ప్రస్తుతం తన న్యూ మూవీపై నజర్ పెట్టాడు. సుజీత్ దర్శకత్వంలో 'సాహో' చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. కానీ ఈ చిత్రంలో ఎవరు నటిస్తారనే విషయం ఇంతవరకు తెలియడం లేదు. డార్లింగ్ పక్కన ఎవరు హీరోయిన్ గా నటిస్తారు ? ఎవరు విలన్ గా నటిస్తారు ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. కానీ 'తమన్నా' పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 'ప్రభాస్' సరసన పలు మూవీల్లో 'తమన్నా' నటించిన సంగతి తెలిసిందే. ఇక విలన్ గా 'అరవింద్ స్వామి' అయితేనే సరిగ్గా సరిపోతాడని చిత్ర యూనిట్ భావిస్తోందంట. తెలుగు..తమిళ..హిందీ భాషల్లో చిత్రం తెరకెక్కుతోంది కాబట్టి అతను విలన్ అయితే బాగుంటుందని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 'అరవింద్' విలన్ గా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. చిత్రం గురించి పలు వార్తలు త్వరలోనే తెలియనున్నాయి.

Pages

Don't Miss

Subscribe to RSS - సుజీత్