సూపర్ స్టార్

19:42 - January 27, 2018

చెన్నై : తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ స్థానికతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి రానివ్వమంటూ దర్శకుడు, తమిళన్‌ పార్టీ నేత సీమన్ హెచ్చరిస్తున్నారు. రజనీకాంత్‌కు నిజంగా దమ్ముంటే కర్ణాటకకు వెళ్లి తాను తమిళుడినని ప్రకటించాలని సవాల్‌ విసిరారు. 44 ఏళ్లపాటు తమిళనాడులో ఉన్నంత మాత్రాన రజనీ తమిళుడు కాదని సీమన్‌ స్పష్టం చేశారు. సినిమాల్లో డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చిన వ్యక్తి ఇపుడు రాజకీయాలంటూ ప్రజలను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

10:52 - December 31, 2017

చెన్నై : తాను రాజకీయాల్లోకి వస్తున్నానని సూపర్ స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. ఆరో రోజు అభిమానులతో రజనీకాంత్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రావడం ఖాయమన్నారు. 234 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీ స్థాపిస్తానని తేల్చి చెప్పారు. అధికారం, డబ్బు కోసం తాను రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేశారు. కొందరు నేతల వల్ల తమిళనాడు పరువుపోయిందన్నారు. అవినీతిని అంతం చేయాలని పిలుపునిచ్చారు. 

 

16:44 - May 19, 2017
10:50 - May 7, 2017

సూపర్ స్టార్ 'రజనీ కాంత్' వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా మారనున్నారు. గత ఏడాది ఆయన 'కబాలి' తో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న 'రోబో 2’ లో రజనీ నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి ప్రారంభంలో రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే తాజాగా మరో చిత్రానికి రజనీ సైన్ చేశారని టాక్. 'కబాలి' సినిమాను తెరకెక్కించిన పా.రంజిత్ దర్శకత్వంలో మరోసారి 'రజనీ' నటించనున్నారు. ధనుష్ కు చెందిన వండర్ బాయ్ ఫిలిమ్స్ సంస్థ దీనిని నిర్మించనుంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం వహించనున్నట్లు తెలుస్తోంది. మళ్లీ పా.రజింత్, సంతోష్ నారాయణన్, రజనీ కాంబినేషన్ లో రూపొందబోయే ఈ చిత్రంపై ఇప్పుడే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. మే 28న ఈ చిత్రం ప్రారంభం కానుందని టాక్. ముంబై బ్యాక్ గ్రౌండ్ లో ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. మరి ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

10:48 - April 20, 2017

రాంగోపాల్ వర్మతో సినిమా చేయాలని ఉందని మలయాళ సూపర్ స్టార్ తన అభిమతాన్ని తెలిపారు. వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఎక్కే వర్మ పలు సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. కానీ ఆ చిత్రాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందడం లేదు. దీనితో పలువురు హీరోలు వర్మపై ఆసక్తిని కనబరుస్తుండడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో 'సర్కార్ 3’ చిత్రం రూపొందుతోంది. ఇదిలా ఉంటే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మాత్రం 'వర్మ'తో సినిమా చేయాలని ఉందని పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. మలయాళంలో వరుస విజయాలతో ‘మోహన్ లాల్’ దూసుకపోతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య తెలుగు సినిమాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఆయన నటించిన పలు సినిమాలు తెలుగులో విడుదలవుతున్నాయి. అంతేగాకుండా ప్రముఖ హీరోల సినిమాల్లో ఆయన నటించి మెప్పిస్తున్నారు. బాలీవుడ్ పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలనుకున్నారేమో 'వర్మ' దర్శకత్వంలో చేయడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. గతంలో వర్మ సినిమా 'కంపెనీ' లో మోహన్ లాల్ నటించిన సంగతి తెలిసిందే. మరి వర్మ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

13:13 - March 22, 2017

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ 'రజనీకాంత్' తో నటించాలని చాలా మంది హీరోయిన్లు కోరుకుంటుంటారు. అలాంటి ఛాన్స్ కొంతమందికి మాత్రమే వస్తుంది. తాజాగా 25 ఏళ్ల తరువాత అలనాటి హీరోయిన్ నటించనుందని టాక్ వినిపిస్తోంది. ఆమె ఎవరో కాదు 'ఖుష్బూ'....’కబాలి' లాంటి డిజాస్టర్ ఇచ్చిన పా.రంజిత్ తోనే 'రజనీ' మరో సినిమా చేయనున్నాడని వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఖుష్బూ కీలక పాత్ర పోషించనుందని సోషల్ మాధ్యమాల్లో వార్త చక్కర్లు కొడుతోంది. 1988లో 'ధర్మాతినై తలైవన్' సినిమాలో 'రజనీ'తో 'ఖుష్బూ' నటించారు. ముంబై బ్యాక్ డ్రాప్ అంటే మళ్లీ మాఫియా రిలేటెడ్ స్టోరీనే అయి ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. గతంలో పలు హిట్ చిత్రాలలో నటించిన వీరిద్దరూ ఇప్పుడు పా రంజిత్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో నటించనున్నారు. అధికారికంగా మాత్రం ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించలేదు. రానున్న రోజుల్లో దీనిపై మరింత క్లారిటీ రానుంది. ప్రస్తుతం 'రజనీకాంత్' శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రోబో 2.0'లో నటిస్తున్నారు.

12:06 - March 14, 2017

సూపర్ స్టార్ అంటే ఎవరు అంటే 'శ్రీదేవి' అని బాలీవుడ్ కండల వీరుడు 'సల్మాన్ ఖాన్' పేర్కొంటున్నాడు. 'శ్రీదేవి' ప్రధాన పాత్ర పోషించిన 'మా' చిత్ర పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమానికి సల్లూ భాయ్ హాజరయ్యాడు. సల్మాన్ వేదిక మీదకు వచ్చే సమయంలో 'స్టార్‌ ఆఫ్‌ ది మిలీనియమ్‌' అని యాంకర్ వ్యాఖ్యలు చేశారు. దీనిపై 'సల్మాన్' స్పందించాడు. తాను..అమీర్, షారూఖ్, అక్షయ్ కుమార్ చాలా సినిమాలు చేయడం జరిగిందని షారూఖ్, తాను, అక్షయ్ లు కలిసి సుమారు 275 సినిమాలు చేసి ఉండవచ్చునని, అలాగే అమీర్ సంవత్సరానికి ఓ సినిమా చొప్పున 50 సినిమాల్లో నటించాడని తెలిపాడు. కానీ శ్రీదేవి బాల నటిగా తన సినీ జీవితాన్ని మొదలు పెట్టి చిత్ర సీమలో 300కి పైగా సినిమాల్లో నటించారని గుర్తు చేశాడు. ఆమెలాంటి లెజెండ్‌తో తమ పనిని పోల్చుకోలేమని, నిజం చెప్పాలంటే ఆమెనే నిజమైన సూపర్‌ స్టార్‌ అని పేర్కొన్నారు. శ్రీదేవి నటిస్తున్న 'మా' చిత్రాన్ని బోనీ కపూర్‌ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 

11:13 - January 4, 2016

హైదరాబాద్: సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి మలయాళ సూపర్ స్టార్ ముమ్ముటి సరసన నటించనుంది. త్వరలో తమిళ్ లో రామ్ దర్శకత్వంలో పెరనాబు అనే చిత్రం సెట్స్ కు వెళ్లనుంది. చక్కని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో మమ్ముటి పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తండ్రి పాత్ర. కానీ అంజలి మాత్రం తల్లి పాత్ర కాదు. ఈ నేపథ్యంలో ఆమెది సెకెండ్ లీడ్ అని తెలుస్తోంది. దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ మమ్ముటి తమిళ్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన చివరిసారిగా నటించిన తమిళ్ సనిమా వందే మాతరం. ఈ సినిమా వచ్చే వారం కొడైకెనాల్ తోమొదటి షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. మొత్తానికి 2016 లో అంజలి కెరీర్ మెరుపు వేగంతో దూసుకుపోతుంది. కొత్త ఏడాదంతా ఇప్పటికే కాల్షీట్లు నిండిపోయాయి. తెలుగు - తమిళ్ భాషల్లో ఒకటే కమిట్ మెంట్లు. ప్రస్తుతం చేతిలో ఇరు భాషల్లోనూ అరడజనకు పైగా సినిమాలున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ సరసన డిక్టేటర్ లో నటిస్తోంది. అటు మంచు కాంపౌండ్ లోనూ సరదా అనే సినిమాలో నటిస్తోంది. 

07:33 - November 9, 2015

సూపర్ స్టార్ 'రజనీకాంత్' నటిస్తున్న 'కబలి' పూర్తే కాలేదు. అప్పుడే మరో సినిమాకు 'రజనీ' ఒప్పుకున్నారా ? ఆ చిత్రానికి దర్శకుడు ఎవరు ? అంటూ ఏవోవో ఊహించుకోకండి. ఏంటో తెలుసుకోవాలంటే ఇది చదవండి..
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా తమిళ చిత్రం కబలి. కబాలీశ్వరన్ అనే పాత్ర పేరు ఆధారంగా తమిళ టైటిల్ ను 'కబలి'గా ఫిక్స్ చేసిన చిత్ర బృందం తెలుగు వెర్షన్ కి 'మహాదేవ' అనే టైటిల్ ని ఖరారు చేశారట. కొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకశాముందంటూ చెన్నై సినీ వర్గాలు చెబుతున్నాయి. రంజిత్ దర్శకత్వంలో, కలైపులి థాను నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా మలేషియాలో జరుగుతోంది. రాధిక ఆప్టే, జేడీ చక్రవర్తి, కిషోర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న సంతోష్ నారాయణ్ సంగీతాన్నందిస్తున్నాడు. 

07:39 - September 13, 2015

చిత్రంలో కనిపిస్తున్నది ఎవరో గుర్తు పట్టారా ? లేదు కదూ..ఆయనో సూపర్ స్టార్..ప్రపంచ వ్యాప్తంగా ఆయన ఎంతో మంది అభిమానులున్నారు. ఇప్పుడు గుర్తు వచ్చింది..కదూ..ఆయనే 'రజనీ కాంత్'...ఎందుకు గెటప్ లో ఉన్నారు ? ఏ చిత్రంలో నటిస్తున్నారు ? అనే ప్రశ్నలు వస్తున్నాయి కదా..ఇది తెలుసుకోవాలంటే చదవండి..
సూపర్ స్టార్ 'రజనీకాంత్' 'కబాలీ' గెటప్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. రోజుకో గెటప్ తో అదరగొడుతోంది మూవీ యూనిట్. రంజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ కాంబినేషన్ సినీ హిస్టరీని షేక్ చేస్తోంది. వరుసగా వస్తున్న 'రజనీ' గెటప్స్ అంచనాల్ని పెంచేస్తున్నాయి. లెటెస్ట్ గా జోకర్ గెటప్ లో కనిపించారు సూపర్ స్టార్. ఫ్యాన్స్ గుర్తు పట్టలేనంతగా మేకప్ చేసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఒకటి డాన్ క్యారెక్టర్..మరొకటి పోలీసు వేషం చుట్టూ తిరుగుతుందని ప్రచారం జరుగుతోంది. ఒకప్పటి కర్నాటక డాన్ కబాళీశ్వర్ క్యారెక్టర్ తో ఈ చిత్రం తెరకెక్కుతోందని మరో ప్రచారం కూడా ఉంది. 'రజనీ' కెరీర్ లో మరో 'భాషా'లా ఉండొచ్చని అభిమానులు అంచనాలు పెంచేసుకుంటున్నారు. 

Don't Miss

Subscribe to RSS - సూపర్ స్టార్