సూర్యాపేట

12:25 - December 5, 2017

సూర్యాపేట : చిలుకూరుకు చెందిన ముగ్గురు పోలీసులపై ఎస్పీ చర్యలు తీసుకున్నారు. ఎస్పీ హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేశారు. సస్పెండైనా వారిలో హెడ్ కానిస్టేబుల్ జగన్నాథం, కానిస్టేబుల్స్ అబ్దుల్ సమ్మద్, సాంబయ్యలు ఉన్నారు. బేతవోలులో పేకాట ఆడుతున్న వారి నుంచి డబ్బులు వసూలు చేశారని వీరిపై చర్యలు తీసుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

17:39 - November 7, 2017

సూర్యాపేట : జిల్లాలో విషాదం నెలకొంది. తామరపువ్వుల కోసం వెళ్లి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. నీటిలో మునిగి ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందారు. తిరుమలగిరి మండలం వెలశాలలో ఇద్దరు చిన్నారులు తామర పువ్వుల కోసం నీటిలోకి దిగారు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చిన్నారులు మృతి చెందారు. చిన్నారులు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామంలో విషాదం ఛాయలు అలుముకున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

18:39 - October 26, 2017

సూర్యాపేట : జిల్లాలో సెక్షన్ 30 అమలు చేశారు. ఈనెల 30 వరకు సెక్షన్‌ అమల్లో ఉంటుందని.. జిల్లా ఎస్పీ ప్రకాశ్ జాదవ్ తెలిపారు. కాంగ్రెస్ చలో అసెంబ్లీ, నూతన కలెక్టరేట్‌ స్థల ఎంపికపై..విపక్షాలు, ప్రజా సంఘాల నిరసన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే... చలో అసెంబ్లీకి సిద్ధమైన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్షన్ 30 అమలుపై ప్రజాసంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆదేశాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

 

16:23 - October 25, 2017

సూర్యాపేట : జిల్లా నూతనకల్‌ మండలం వెంకెపల్లిలో అర్ధరాత్రి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గ్రామ అభివృద్ధి జరగలేదంటూ తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ చేపట్టిన పల్లె నిద్రను గ్రామస్తులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యే.. నిరసనకారులపై పోలీసులతో ఉక్కుపాదం మోపారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే కిశోర్ కాన్వాయిని అడ్డుకున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, మహిళలపై పోలీసులు లాఠీ చార్జ్‌ చేశారు. పలువురిని అరెస్ట్ చేసి నూతనకల్ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి బందోబస్తు మధ్య ఎమ్మెల్యే కిశోర్ పల్లె నిద్రను కొనసాగించారు. నిరసన తెలిపిన తమపై అకారణంగా పోలీసులతో దాడి చేయించి, అర్ధరాత్రి వరకు స్టేషన్‌లో బంధించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని బాధిత మహిళలు కోరుతున్నారు. 

08:12 - October 25, 2017

నల్గొండ : తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ 'పల్లె నిద్ర' తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ కొనసాగింది. సూర్యాపేట జిల్లాలో నిన్న సాయంత్రం నుండి ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎమ్మెల్యే గాద కిశోర్ 'పల్లె నిద్ర' పేరిట పలు గ్రామాల్లో నిద్ర చేస్తున్న సంగతి తెలిసిందే. నూతనల్ కల్ (మం) వెంకెపల్లి గ్రామానికి చేరుకన్న సమయంలో చాలా మంది గ్రామస్తులు..ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. గ్రామానికి ఎన్నడూ రాని ఎమ్మెల్యే పల్లె నిద్రతో రావద్దూ అంటూ నినదించారు. ఈ ఘటనతో అధికార పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే..ఇతరుల మధ్య విబేధాలు పొడచూపాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.

డీఎస్పీ, సీఐ, ఎస్ఐలు గ్రామానికి చేరుకుని పల్లె నిద్రను వ్యతిరేకిస్తున్న వారిపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. 12 మందిని అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు. చివరకు ఎమ్మెల్యే గాద కిశోర్ పల్లె నిద్ర భారీ బందోబస్తు మధ్య కొనసాగుతోంది. గ్రామాభివృద్ధికి ఏ మాత్రం సహకరించడం లేదని..వారి వర్గానికి మాత్రమే ఎమ్మెల్యే వత్తాసు పలుకుతున్నారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. వెంటనే దీనిపై సీఎం కేసీఆర్ స్పందించాలని కోరుతున్నారు. 

11:31 - October 16, 2017

సూర్యాపేట : జిల్లా తాళ్లగడ్డలో వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆరు నెలల క్రితం కిరణ్‌తో భవానికి వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె నాలుగు నెలల గర్భవతి. నిన్న సాయంత్రం భవాని ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఎస్పీ ఆఫీస్‌లో కిరణ్‌ జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. పూర్తి వివరాలకువ వీడియో చూడండి.

21:43 - October 12, 2017

సూర్యపేట : సమైక్య పాలనలో, కాంగ్రెస్ నేతల హయాంలో దక్షిణ తెలంగాణ దగాపడిందన్నారు సీఎం కేసీఆర్. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలోనూ ఆనాడు కాంగ్రెస్ నేతలే దగా చేశారని కేసీఆర్ ఆరోపించారు. సూర్యాపేటలో పర్యటించిన కేసీఆర్.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 

సూర్యాపేటలో పర్యటింటిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని చివ్వెంల మండలం కుడకుడలో నూతన కలెక్టరేట్ భవన సముదాయం, ఎస్పీ కార్యాలయ భవన నిర్మాణాలకు భూమిపూజ నిర్వహించారు. తరువాత కేసీఆర్ 1600కోట్ల రూపాయలతో నిర్మించిన 400 కెవి సబ్‌స్టేషన్‌ను.. ప్రారంభించారు. తరువాత స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. తమ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే కాంగ్రెస్ నేతలు అడుగడుగునా అడ్డుపడుతున్నారని కేసీఆర్ విమర్శించారు. ఈరోజు నష్టపరిహారం గురించి మాట్లాడుతున్న  ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తన నియోజకవర్గంలో భూములు మునిగితే ఎంత నష్టపరిహారం ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. లక్ష ఉత్తమ్ కుమార్‌ రెడ్డిలు అడ్డుకున్నా సరే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. 

నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో ఆనాటి సమైక్యవాదులైన కాంగ్రెస్ నేతలు దగా చేశారని ఆరోపించారు సీఎం కేసీఆర్. ఏలేశ్వరం దగ్గర ప్రాజెక్టు నిర్మాణం జరిగి ఉంటే నల్లగొండ జిల్లాలో లక్షల ఎకరాల్లో నీరు పారేదని అన్నారు. అప్పుడు, ఇప్పుడు నల్లగొండ జిల్లా ప్రయోజనాలను కాపాడేందుకు తెలంగాణ కాంగ్రెస్ చేసిందేమీ లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి టీఆర్ఎస్‌తోనే సాధ్యమన్నారు. 

17:44 - October 12, 2017

సూర్యాపేట : జిల్లాలో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని చివ్వెంల మండలం కుడకుడలో నూతన కలెక్టరేట్ భవన సముదాయం, ఎస్పీ కార్యాలయ భవన నిర్మాణాలకు భూమిపూజ నిర్వహించారు. తరువాత కేసీఆర్ 1600కోట్ల రూపాయలతో నిర్మించిన 400 కెవి సబ్‌స్టేషన్‌ను.. ప్రారంభించారు.

13:47 - October 5, 2017

సూర్యాపేట : జిల్లాలోని తుంగతుర్తి మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. మైనార్టీ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న జాల వేణు అనే విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు పాల్పడ్డాడు. పురుగుల మందు తాగిన వేణును.. సూర్యపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ.. ప్రాణాలు విడిచాడు. కాగా వేణు మెల్లచెర్వు మండలం..వేపలమదపురం గ్రామానికి చెందిన వ్యక్తి. దసరా సెలవులకు ఇంటికి వెళ్లేటప్పుడే తాను మళ్లీ హాస్టల్ కు రానని ... హాస్టల్ లో ఉండడం ఇష్టం లేదని తోటి విద్యార్థుతో చెప్పినట్లు సమాచారం. అయితే ఇదే విషయంపై ఇంటి దగ్గర చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇంటి నుంచి వచ్చినప్పుడే వేణు పరుగుల మందు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

09:04 - October 1, 2017

సూర్యాపేట : జిల్లాలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండలం మొద్దలుచెర్వు గ్రామ సమీపంలో ఆగివున్న లారీని ఆర్టీసీ బస్సు-వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. 14 మంది గాయపడ్డారు. గాయపడ్డవారిలో మరో 6గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కృష్ణాజిల్లా అవనిగడ్డ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. ఏపీ 16జెడ్ 0216 ఆవనిగడ్డకు చెందిన ఆర్టీసీ బస్సుగా గుర్తించారు. సత్తయ్య, ఏడుకొండలు, వరప్రసాద్ లు మృతులుగా గుర్తించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Pages

Don't Miss

Subscribe to RSS - సూర్యాపేట