సెక్రటేరియట్

16:34 - June 27, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు పాలనపై పట్టు లేదని, సచివాలయానికి రానీ సీఎం ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ అని కాంగ్రెస్ నేత రేవంత్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...సెక్రటేరియట్ లో ఏ ఫైల్ ఎక్కడుందో అధికారులకు తెలియదని, పాలన పతనావస్థలోకి చేరుకుందన్నారు. సెక్రటేరియట్ శిథిల భవనాన్ని తలపిస్తోందన్నారు. తన నియోజవకర్గంలో కాలేజీల విషయంలో ఇంతవరకు స్పందించలేదన్నారు. 

21:18 - November 14, 2017

కర్నూలు : జగన్‌ ప్రజా సంకల్పయాత్ర ఎనిమిదోరోజు కర్నూలు జిల్లాలోకి ప్రవేశించింది. జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గం, చాగల మర్రి గ్రామం నుండి పాదయాత్ర ప్రారంభించారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ జగన్‌ పాదయాత్ర సాగింది. జగన్ యాత్ర ఇవాళ వంద కిలోమీటర్లు దాటింది. గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు పొందాలంటే జన్మభూమి కమిటీలకు లంచం ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. తాను అధికారంలోకి వస్తే ప్రతి గ్రామంలో సెక్రటేరియట్‌ ఏర్పాటు చేసి గ్రామస్థులకే ఉద్యోగం కల్పిస్తామన్నారు జగన్. 

17:22 - November 4, 2017

హైదరాబాద్ : కొత్త సెక్రటేరియెట్‌ నిర్మాణంపై కాంగ్రెస్‌ సీనియర్ నేత వి హనుమంతరావు మండిపడ్డారు. ప్రజల నుండి వ్యతిరేకత వస్తున్నప్పటికీ కేసీఆర్‌లో మార్పు రావడంలేదన్నారు. మూడున్నర సంవత్సరాలలో కేసీఆర్‌ ఏం సాధించారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌ విధానాలపై తిరగబడే సమయం ఆసన్నమైందని వీహెచ్‌ అన్నారు. 

11:52 - July 30, 2016

హైదరాబాద్ : కృష్ణా పుష్కరాల ముగింపుతో తెలంగాణ సెక్రటేరియట్ కూల్చివేసేందుకు సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఆగస్టు చివరివారంలో కూల్చివేత పనులు మొదలుపెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ బ్లాక్‌లను కూల్చివేసి కొత్తబ్లాక్‌లను నిర్మించనుంది సర్కార్.

7నుండి 9 అంతస్థులతో కొత్త సెక్రటేరియట్ ..
సెక్రటేరియట్‌కు వాస్తుదోషాలు ఉన్నాయని గతంలో సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. దీంతో ఎర్రగడ్డలో కొత్త సెక్రటేరియట్‌ను కట్టాలనుకున్నారు. కానీ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ స్థానంలోనే కొత్త సెక్రటేరియట్‌ను నిర్మించాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా కొత్త సెక్రటేరియట్ సుమారు 7 నుండి 9 అంతస్థులలో ఉండేలా ప్లాన్ చేస్తోంది సర్కార్ .

J, K, L, H బ్లాక్‌లు ఏపీకి కేటాయింపు ..
రెండు టవర్ల రూపంలో నూతన సెక్రటేరియట్‌ను నిర్మించి మంత్రుల కార్యాలయంలోనే సమావేశ మందిరాలు నిర్మించనున్నారు. నయా రాయ్‌పూర్, ఢిల్లీ కంటే..అధునాతన పద్ధతుల్లో భవనాన్ని నిర్మించనున్నట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సచివాలయ భవనాలను తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు పంపకాలు చేశారు. తెలంగాణకు A,B,C,D బ్లాక్‌లు రాగా...ఏపీకి J, K, L, H బ్లాక్‌లను కేటాయించారు. అయితే ఏపీకి కేటాయించిన సెక్రటేరియట్ బ్లాక్‌లన్నీ ప్రస్తుతం ఒక్కొక్కటిగా ఖాళీ అవుతున్నాయి. అయితే ఎల్ బ్లాక్‌ను తమ అవసరాలకు వాడుకొని మిగతా వాటిని తెలంగాణకు ఇచ్చేస్తున్నట్లు ఏపీ ఇప్పటికే ప్రకటించింది.

మిగతా బ్లాక్ లు దగ్గరలోని ప్రభుత్వ కార్యాలయాల్లోకి మార్చాలని ప్లాన్
ప్రస్తుతం ప్రధానవిధులు నిర్వర్తించే అధికారులను హెచ్ , సౌత్ నార్త్ బ్లాక్‌ల్లోకి మార్చాలనుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. మిగిలిన శాఖలను దగ్గర్లోని ప్రభుత్వ కార్యాలయాలకు తరలించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అన్ని ఒకే సారి కాకపోయిన ఒక్కో బ్లాక్‌ను విడతలుగా మార్చేందుకు అవకాశాలున్నాయంటున్నారు. ఉద్యోగులు విజిటర్స్‌కు ఎలాంటి అసౌకర్యం లేకుండా..పార్కింగ్ తో పాటు అన్ని వసతులతో కొత్త సెక్రటేరియట్ నిర్మాణం జరగనుంది.

ఏపీకి కేటాయించిన బ్లాక్‌లు కలిపితే 10లక్షల స్వ్కేర్ ఫ్లీట్లు
ప్రస్తుతమున్న సెక్రటేరియట్ భవనం సుమారు 5 నుండి 6 లక్షల స్క్వేర్ ఫీట్లలో ఉంది. ఏపీకి కేటాయించిన స్థలాన్ని కూడా కలుపుకుంటే..మొత్తం10 లక్షల స్వ్కేర్ ఫీట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం ఏ,బీ,సీ బ్లాక్‌లను కూల్చివేయాలని భావిస్తున్న సర్కార్ త్వరలోనే సీఎం ఉండే డీ బ్లాక్‌కి సైతం ముహూర్తం ఖరారు చేయనుంది.

17:21 - May 20, 2016

కేరళ : కాబోయే సీఎంగా పినరాయి విజయన్ పేరు ఖరారైంది. కేరళ సీపీఎం కార్యదర్శి వర్గం... పినరాయి విజయన్ పేరును ఖరారు చేసింది. తిరువనంతపురంలో ఉదయం సమావేశమైన సీపీఎం కార్యదర్శి వర్గంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశానికి సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరయ్యారు. సెక్రటేరియట్ రాష్ట్రకమిటీ సమావేశం లో సినరాయి విజయన్ ని సీఎంగా ఎన్నుకుంటూ సభ్యులు ఏకీభవించారు. అనంతరం ఆయన పేరును ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అధికారికంగా ప్రకటించారు. అచ్యుతానందన్ పార్టీకి చేసిన సేవలను ఏచూరి ఈ సందర్భంగా కొనయాడారు. ఆయన కేరళ ఫిడెల్ కాస్ట్రోగా అభివర్ణించారు. కేరళ ఎన్నికలలో పనిచేసిన కార్యవర్గానికి, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అచ్యుతానందన్ ప్రస్తుతం 92 సంవత్సరాలు.. కాబట్టి విసృత్తంగా తిరగలేడని, భౌతికంగా ఆయన శరీరం సహకరించకపోవచ్చనే కారణంతో విజయన్ ను సీఎం అభ్యర్థిగా ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. 

21:20 - February 15, 2016

విజయవాడ : ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఐదుగంటల పాటు జరిగిన ఈ భేటీలో పలు అంశాలను చర్చించారు. ఇసుక విధానంపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించారు. ఈ విధానాన్ని పారదర్శకంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. క్యూబిక్‌ మీటర్‌ 500 రూపాయలకు మించి ఎక్కడా విక్రయించరాదని ఆదేశించారు. ప్రైవేటు నర్సింగ్‌హోంల ఏర్పాటుకు కేంద్ర చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని భేటీలో నిర్ణయించారు.మరోపక్క ఏపీ తాత్కాలిక సెక్రటేరియట్‌పైనా చర్చ జరిగింది. నీటి పారుదల శాఖలో నిధుల వినియోగంపైనా సమావేశంలో చర్చకు వచ్చింది. శాఖల తరలింపు, అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణ, తాత్కాలిక సెక్రటేరియట్‌ శంకుస్థాపన తదితర అంశాలను మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు సియాచిన్‌లో అమరులైన జవాన్లకు మంత్రివర్గం నివాళులర్పించింది. వీరజవాను ముస్తాక్‌ కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సహాయం అందించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించింది. కేబినెట్‌ భేటీ అనంతరం పార్టీ విషయాలపై మంత్రులతో బాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో లోకేష్‌, కళా వెంకట్రావు, పలువురు నేతలు పాల్గొన్నారు. 

Don't Miss

Subscribe to RSS - సెక్రటేరియట్