స్టార్ హోటల్స్

16:20 - December 6, 2018

ముంబై  (మహారాష్ట్ర) : శ్రీమంతుల ఇంట్లో పెళ్లి అంటే అంతా హడావిడే. ఎక్కడ చూసినా రిచ్ లుక్సే. ఏది చేసినా ఘనంగా వుండాలి. అందరూ గొప్పగా చెప్పుకోవాలి. ఇటువంటి వివాహాలు ఎక్కడా జరగలేదబ్బా అనుకునేంత గొప్పగా..రిచ్ గా వుండాలి. దాని కోసం ఫుడ్, కాస్ట్యూమ్స్, ఎకామిడేషన్,  నుండి అన్ని అరేంజ్ మెంట్స్ అన్నీ అంటే అన్నీ ఘనంగా వుండాలి.అటువంటిది అంబానీవారింటో పెళ్లి అంటే మాటలా? ఎంతటి రిచ్ గా వుంటుందో ఊహించటానికి కూడా సాధ్యంకానంత రిచ్ గా వుండబోతోంది అంబానీగారి గారాల పట్టి ఇషా అంబాని వివాహం. 
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా వివాహం డిసెంబర్ 12న జరగనుంది. ముంబైలోని ‘ఆంటిల్లా’లో వీరి పెళ్లిని అంగరవైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు భారీ నుండి అతి భారీగా జరుగుతున్నాయి. అంబానీల ఇంట పెళ్లంటే.. ఎంత గ్రాండ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లికి ముందే కుటుంబ సభ్యులు, సన్నిహితులకు అంబానీ, పిరమాళ్ కుటుంబాలు ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ నిర్వహిస్తున్నాయి. ఈ వేడుకలకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదిక కానుంది. ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసం అతిథులను తీసుకెళ్లడానికి అంబానీ ఫ్యామిలీ 30 నుంచి 50 చార్టర్డ్ ఎయిర్ క్రాఫ్ట్‌లను ఉపయోగించనున్నట్టు సమాచారం. సాధారణ రోజుల్లో మహారాణా ప్రతాప్ విమానాశ్రయంలో రోజుకు 19 విమానాలు మాత్రమే రాకపోకలు సాగిస్తాయి. ఎన్నికల ఎఫెక్ట్, అంబానీ కూతురి ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కారణంగా ఆ విమానాశ్రయానికి రద్దీ భారీగా పెరగనుంది. ఉదయ్‌పూర్‌లో భారీ సంఖ్యలో ఫైవ్ స్టార్ హోటళ్లను కూడా అంబానీ కుటుంబం బుక్ చేసిసేసారు. ఇషా పెళ్లి వేడుకలను సెలబ్రిటీ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ తన కెమెరాలో బంధించనున్నారు. ప్రియాంక-నిక్, అనుష్క-విరాట్‌ల పెళ్లికి కూడా ఆయనే ఫొటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఉదయ్‌పూర్‌లో ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ తర్వాత ముంబైలో నాలుగు రోజులపాటు అంబానీ కూతురి పెళ్లి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. గతంలో కర్ణాటక మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్థన్ రెడ్డి కుమార్తె వివాహం పెద్ద నోట్ల రద్దు సమయంలో జరిగినా ఎంత ఘనంగా చేశాడో తెలిసిన విషయమే. 

 

06:54 - November 27, 2017

హైదరాబాద్ : దేశీయ మద్యం సేవించి బోరుకోట్టిందా.. లోకల్ బ్రాండ్ అంటేనే వెగటుగా ఉందా.. అయితే నగరంలో మద్యం ప్రియులకు ఇది శుభావార్తే .. చేతిలో సోమ్ములుంటే చాలు ఏ స్టార్ హోటల్‌కైనా వెళ్లి ..సీమసరుకును చప్పరించే ఛాన్స్‌ తెలంగాణ ఎక్సైజ్‌శాఖ కల్పించింది. నగరంలో జరగనున్న జీ.ఈ.యస్ సదస్సు నేపథ్యంలో .. అతిథులకోసం స్టార్ హోటల్స్ ఫారన్‌ బ్రాండ్స్‌ను రెడీ చేశాయి. ఇన్నాళ్లు పారన్ బ్రాండ్స్ మద్యం సేవించాలంటే.. ఎన్నో షరతులు, నిబంధనలు. సిటీలో ఎక్కడైనా ధనికుల ఇళ్లలో ఏదైనా పార్టీలు జరిగితే..ఎందో తీర్థం పుట్టుకున్నట్లు..ఒకటి, రెండు పెగ్గులతో సరిపుచ్చుకోవడం మద్యం ప్రియులకు అలవాటే. వేల రూపాయాలు చెల్లిస్తే తప్పా చేతికి రానీ విదేశీ మద్యం జీ.ఈ.యస్ సదస్సు పుణ్యమాఅని పెద్ద ఎత్తున నగరానికి దిగుమతి అవుతోంది.

హైదారాబాద్ లో మూడు రోజుల పాటు జరిగే పారిశ్రామిక వేత్తల గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో నగరంలోని స్టార్‌ హోటళ్లలో విదేశీ మద్యం బాటిళ్లు మెరిసిపోతున్నాయి. సమ్మిట్‌లో పాల్గొనే అతిధులను ఆకర్షించేందు.. నగరంలో స్టార్ హోటల్స్ మద్యం బాటిళ్లతో సిద్ధం అయ్యాయి. హైటెక్స్ పరిసరాల్లోని వివిధ స్టార్ హోటల్స్ బస ఏర్పాటు చేశారు.. హైటెక్ సిటీ పరిసరాల్లోనే పదుల సంఖ్యలో ఉన్న స్టార్ హోటల్స్ లోని వివిద దేశాల నుంచి వచ్చే పారిశ్రామిక వేత్తలకు కావాల్సిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రభుత్వం పెద్దఎత్తున చేసింది. ముఖ్యంగా విదేశీయులు ఎక్కువగా ఇష్టపడే విదేశీ బ్రాండ్లను సేల్స్‌లో పెట్టేందుకు ఇప్పటికే స్టార్‌హోటల్స్‌ తెలంగాణ ఎక్సైజ్ శాఖ కు దరఖాస్తు పెట్టుకున్నాయి. ఎక్సైజ్ శాఖ తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని 16 సార్ట్ హోటల్స్ కు ఎలాంటి లిక్కర్ అయినా విక్రయించేందుకు అనుమతి పొందాయి. దీంతో స్టార్‌ హోటళ్లలో ఈ వారం రోజులు ఫారిన్‌ సరుకును చప్పరించొచ్చని మందుబాబులు ఉత్సాహపడుతున్నారు.

28 నుంచి30 వతేది వరకుజరగనున్న గ్లోబల్ సమ్మిట్ ను ద్రుష్టిలో పెట్టుకుని, ఒక్కో స్టార్ హోటల్ ఇంతకు ముందు కంటే 10నుంచి 15 శాతం మేరకు అదనపు ఇండెంట్లతో మద్యాన్ని స్టోర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గత రెండు నెలలో 31,34,877 కేసుల మద్యంలో.. విదేశీ బ్రాండ్లే ఎక్కువగా సేల్స్‌ అయినట్టు తెలుస్తోంది. ఇది రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా కానున్నట్లు ఎక్సైజ్‌ శాఖ అంచనా వేస్తోంది. మొత్తానికి.. నగరంలో విదేశీ సరుకును భారీగా దించడం మద్యంప్రియులను ఊరిస్తోంది. అయితే స్టార్‌హోటళ్లో తప్పితే ఎక్కడా విదేశీ మద్యం అమ్మకాలకు అనుమతి లేకపోవడంతో కొంత అసంతృప్తిగా ఉందని సాధారణ మందుబాబులు నిట్టూరుస్తున్నారు. 

Don't Miss

Subscribe to RSS - స్టార్ హోటల్స్