స్థానికత

16:44 - May 19, 2017
07:12 - July 28, 2016

విజయవాడ : స్థానికత అంశం విద్యార్థులకు చుక్కలు చూపిస్తోంది. ప్రభుత్వం నాన్చుడు ధోరణితో సీట్ల భర్తీపై గందరగోళం నెలకొంది. రాష్ట్రానికి వచ్చే వారందరికీ స్థానికత కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇంకా ఉత్తర్వులు వెలువడకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికతపై స్పష్టత లేకపోవడంతో ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ కౌన్సెలింగ్‌ ప్రక్రియను నిలిపివేసింది.

విద్యార్థుల పాలిట శాపంగా మారిన స్థానికత..
ఆంధ్రప్రదేశ్‌లో స్థానికత అంశం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. స్థానికతపై ప్రభుత్వం చేస్తున్న జాప్యంతో విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచి మార్కులు సాధించినా.. స్థానికత సమస్యతో విద్యార్థులు పలు కోర్సుల్లో సీట్లు పొందలేని పరిస్థితి నెలకొంది.

371డిలో సవరణలు పూర్తైనా వెలువడని ప్రభుత్వ ఉత్తర్వులు
అయితే.. ఇప్పటికే విభజన తర్వాత రాష్ట్రానికి వచ్చే వారికి స్థానికత కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జూన్‌ 2, 2017 నాటికి ఏపీకి తరలివచ్చే వారికి...వారు కోరుకున్న చోటు స్థానికత కల్పించాల్సి ఉంది. దీనికి సంబంధించి ఆర్టికల్‌ 371డిలో సవరణలు పూర్తయినప్పటికీ.. ప్రభుత్వం నుంచి విధి విధానాలతో కూడిన ఉత్తర్వులు రాకపోవడంతో ఈ ప్రక్రియ మరింత ఆలస్యమవుతోంది.

29 నుండి జరగాల్సిన మెడికల్‌ వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ వాయిదా..
మరోవైపు స్థానిక, స్థానికేతర కోటాపై స్పష్టత లేకపోవడంతో ఈనెల 29 నుండి జరగాల్సిన మెడికల్‌ వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియను ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ వాయిదా వేసింది. స్థానికతపై స్పష్టత వచ్చిన తర్వాత ఆగస్టు మొదటివారంలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని ప్రకటించారు.

కోర్సుల్లో సీట్లు దక్కడం లేదంటున్న తల్లిదండ్రులు..
ఇదిలావుంటే స్థానికత కారణంగా తెలంగాణ నుంచి వస్తున్న విద్యార్థులకు పలు కోర్సుల్లో సీట్లు దక్కడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులంటున్నారు. ముఖ్యమంత్రి వెంటనే దీనిపై దృష్టి సారించి.. విద్యార్థులకు న్యాయం చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు.

07:33 - July 20, 2016

హైదరాబాద్ : తెలంగాణ స్థానికతో ఏపీ సచివాలయంలో పని చేస్తున్న అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్లు రెండేళ్లుగా చేస్తున్న ఆందోళనకు తెపరడింది. 68 మంది ఏఎస్ వో లను ఏపీ ప్రభుత్వం రిలీవ్‌ చేసింది. దీంతో వీరంతా తెలంగాణ సచివాయలంలోని సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేశారు. రెండేళ్లుగా ఏపీ సచివాలయంలో పని చేస్తున్న తెలంగాణ స్థానికత ఉన్న అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్లను విధుల నుంచి విముక్తి కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రెండేళ్లుగా ఆందోళన ...

ప్రాంత స్థానికత ఉన్న ఉద్యోగులను ఏపీకి కేటాయించారు. దీంతో వీరంతా ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో పనిచేయాల్సి వచ్చింది. తెలంగాణకు ఆప్షన్‌ ఇచ్చిన తమను ఏపీకి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ రెండేళ్లుగా ఆందోళన చేస్తూ వచ్చారు. సొంతరాష్ట్రంలో పని చేసేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ వీరంతా ప్రభుత్వం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మతోపాటు, పాలకులకు విజ్ఞప్తి చేశారు. రెండేళ్లు చేస్తున్న పోరాటం ఇప్పటికి ఫలించడంతో వీరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ స్థానికత ఉన్న ఉద్యోగులను వెనక్కి పంపాలి ...
మరోవైపు తెలంగాణ సచివాలయంలో వివిధ కేడర్లలో పనిచేస్తున్న ఏపీ స్థానికత ఉన్న ఉద్యోగులను వెనక్కి పంపించాలని సెక్రటేరియట్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేస్తోంది. అలాగే తెలంగాణ స్థానికతతో ఏపీ సచివాలయంలో పని చేస్తున్న మూడు, నాల్గవ తరగతి ఉద్యోగులను కూడా సొంత రాష్ట్ర సచివాలయంలో పనిచేసే అవకాశం కల్పించాలి కోరుతున్నారు. ఏఎస్‌వోల సమస్య పరిష్కారమైన నేపథ్యంలో పదోన్నతుల అంశాన్ని పరిశీలించాలని కోరుతున్నారు. 

19:57 - July 4, 2016

హైదరాబాద్ : ఏపీలో స్థానికతపై ముసాయిదా సిద్ధమైంది. ప్రస్తుతం ఈ ప్రతి సీఎం పరిశీలనలో ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా.. తెలంగాణ నుంచి తరలి వచ్చే ఇతర రంగాల వారికీ స్థానికత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. స్థానికత కల్పించే బాధ్యతను స్థానిక తహశీల్దార్లకు అప్పగించనున్నట్లు భోగట్టా. 
ఏపీకి వచ్చే అందరికీ స్థానికత
తెలంగాణ నుంచి ఏపీకి తరలివచ్చే వారికి స్థానికత అంశంపై రూపొందించిన మార్గదర్శకాలకు తుది కసరత్తు జరుగుతోంది. విభజన అనంతరం ఏపీకి వెళ్ళేవారికి స్ధానికత కల్పించేందుకు ఇప్పటికే రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువరించారు. దీంతో అధికారులు మార్గదర్శకాలనూ సిద్ధం చేశారు. తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే వారు కోరుకున్న ప్రాంతంలోనే స్థానికత ఇచ్చేలా మార్గదర్శకాలు రూపొందించినట్లు సమాచారం. 
అన్ని రంగాల వారికీ స్థానికత 
తెలంగాణలోని పది జిల్లాల్లో నివసిస్తూ ఏపీకి శాశ్వతంగా తరలి వచ్చేవారికి మాత్రమే స్థానికత వర్తించనుంది.  కేవలం ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు మాత్రమే స్ధానికతను పరిమితం చేయకుండా, ఇతర రంగాల వారికీ వర్తింపచేయనున్నారు. దీంతో ప్రయివేటు సంస్థల్లో పనిచేసే వారు, వ్యాపార రంగాల్లో స్థిరపడ్డవారు, ఇతర కార్మికులు కూడా ఏపీకి భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. 
జోనల్‌ స్థానికత ఇచ్చేందుకు కూడా ప్రతిపాదన
ఇక తెలంగాణ నుంచి ఏపికి తరలివెళ్లే వారికి జిల్లాల ఆధారంగా జిల్లా, జోనల్‌ స్థానికతపై కూడా స్పష్టత ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. ఉద్యోగి, లేదా ప్రయివేటు రంగానికి చెందిన వారు ఏ జిల్లాకు వెళ్తే వారికి ఆ జిల్లాలోనే స్థానికత కల్పించడం.. ఆ ప్రాంతానికి చెందిన జోనల్‌ స్థానికత ఇవ్వడంపైనా ప్రభుత్వం నిర్దిష్టమైన నిర్ణయానికి వచ్చింది. 
స్థానికత ధ్రువీకరణ జారీలో తహశీల్దార్లకు అధికారం 
ఏపికి తరలివెళ్లిన వారు తమకు నచ్చిన జిల్లాల్లోని ప్రాంతాల్లో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి. ఆయా ప్రాంతాల్లోని తహశీల్దార్లకు దరఖాస్తులను సమర్పిస్తే.. వారు పరిశీలించి స్థానికత ధృవీకరణ పత్రాలను అందించనున్నారు. కేవలం విద్యా సంబంధిత సంస్ధల్లోనే కాకుండా,  ఉద్యోగాల్లో సైతం స్థానికత కల్పించేలా మార్గదర్శకాలు రూపొందించారు. 

 

13:00 - June 10, 2016

హైదరాబాద్ : తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులకు రాష్ట్రప్రతి ప్రణబ్‌ముఖర్జీ శుభవార్త అందించారు. ఏపీ స్థానికత అంశంపై ఏపీ ప్రభుత్వ ప్రతిపాదన నోట్‌పై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. రాష్ట్రపతి సంతకం చేసిన వెంటనే ఏపీ స్ధానికతపై కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్ని విడుదల చేసింది. గతేడాది అక్టోబర్‌ 9న స్థానికత అంశంపై సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. అయితే సీఎం పంపిన లేఖలపై ఇన్నాళ్లూ కేంద్రహోంశాఖ , న్యాయశాఖ, ప్రధాని కార్యాలయం కసరత్తు చేసింది. ఎట్టకేలకు ప్రధాని కార్యాలయం నుంచి ఫైలు రాష్ట్రపతి వద్దకు చేరింది. దీనిపై తాజాగా రాష్ట్రపతి సంతకం చేశారు. ఆర్డికల్‌ 371 (డి)ని సవరిస్తూ..రాష్ట్రపతి సంతకం చేయడంతో జూన్‌2, 2017లోపు ఏపీకి తిరిగొచ్చే వారికి ఏపీ స్థానికత వర్తింస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత మూడేళ్లలో ఏపీకి తిరిగొచ్చే ఉద్యోగులకు మాత్రమే ఏపీ స్థానికత వర్తిస్తుంది. ఏపీ స్ధానికత అంశం ఫైలుపై రాష్ట్రపతి సంతకం చేయడంతో ఏపీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంత త్వరగా ఈ అంశం కొలిక్కి వస్తుందని ఊహించలేదని..కానీ కేంద్రం దీనిపై స్పందించడం సంతోషకర విషయమన్నారు. ఏపీ స్థానికత అంశంపై రాష్ట్రపతి ఆమోదముద్ర తెలపడం ఏపీ ఉద్యోగులకు ఓ వరంలాంటిదని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌ అన్నారు. పిల్లల చదువు, నిరుద్యోగులకు ఉద్యోగాల విషయంలో ఈ పరిణామం పెద్ద ఊరటనిస్తుందన్నారు. జూన్‌ 2, 2014 నుంచి జూన్‌ 2, 2017 లోపల ఏపీకి తరలివెళ్లే ఉద్యోగులకు స్థానికత వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు.

11:38 - June 10, 2016

ఢిల్లీ : తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులకు రాష్ట్రప్రతి ప్రణబ్‌ముఖర్జీ శుభవార్త అందించారు. ఏపీ స్థానికత అంశంపై ఏపీ ప్రభుత్వ ప్రతిపాదన నోట్‌పై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. రాష్ట్రపతి సంతకం చేసిన వెంటనే ఏపీ స్ధానికతపై కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్ని విడుదల చేసింది. గతేడాది అక్టోబర్‌ 9న స్థానికత అంశంపై సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. అయితే సీఎం పంపిన లేఖలపై ఇన్నాళ్లూ కేంద్రహోంశాఖ , న్యాయశాఖ, ప్రధాని కార్యాలయం కసరత్తు చేసింది. ఎట్టకేలకు ప్రధాని కార్యాలయం నుంచి ఫైలు రాష్ట్రపతి వద్దకు చేరింది. దీనిపై తాజాగా రాష్ట్రపతి సంతకం చేశారు. ఆర్డికల్‌ 371 (డి)ని సవరిస్తూ..రాష్ట్రపతి సంతకం చేయడంతో జూన్‌2, 2017లోపు ఏపీకి తిరిగొచ్చే వారికి ఏపీ స్థానికత వర్తింస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత మూడేళ్లలో ఏపీకి తిరిగొచ్చే ఉద్యోగులకు మాత్రమే ఏపీ స్థానికత వర్తిస్తుంది.

19:06 - October 13, 2015

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. స్ధానికత సమస్య పరిష్కారం కోరుతూ కేంద్ర హోంశాఖ మంత్రి రాజనాధ్ సింగ్ కు బాబు మంగళవారం లేఖ రాసారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు కేంద్ర సాయం కోరుతూ ఈ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ కు తరలి వెళ్ళే ఉద్యోగులు.. ఇతర వర్గాల వారి స్ధానికత సమస్యను పరిష్కరించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే ఈ విషయమై న్యాయసలహాలు తీసుకున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని అంశాలతో కూడిన లేఖను కేంద్ర హోంశాఖమంత్రి రాజనాధ్ సింగ్ కు పంపారు. రాష్ట్రంలో స్ధానికత ఆవశ్యకత సమస్య పరిష్కారమార్గం తదితర అంశాలను లేఖలో పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు చెందిన వారికి విద్య, ఉపాధి రంగాలలో సమాన అవకాశాలు కల్పించేందుకు 32 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 371 డి,371ఈ లను రాజ్యాంగంలో చేర్చారు. వీటి ఫలితంగా విద్యార్ధి క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ నాటికి వరుసగా నాలుగేళ్లు ఏ ప్రాంతంలో చదువుకుంటే ఆ ప్రాంతానికి స్థానికునిగా నిర్ణయిస్తారు.

ఆందోళనలో ప్రభుత్వ ఉద్యోగులు...
మధ్యలో అవాంతరం వస్తే వరుసగా నాలుగేళ్లు ఆ ప్రాంతంలో నివాసం ఉన్నట్లుగా చూపినా అక్కడ స్థానికత వర్తిస్తుంది. అయితే ప్రస్తుతం రాష్ట్ర విభజన అనంతరం పరిణామాలు కొత్త రాజధానికి తరలివచ్చే ఉద్యోగులకు, ఇతర వర్గాల వారి పిల్లలకు స్థానికత పొందేందుకు ఈ నిబంధన ప్రతి బంధకం అయ్యింది. తమ పిల్లలు విద్యా, ఉపాధి అవకాశాలను కోల్పేయే ప్రమాదం ఉందని ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర వర్గాలవారు ఆందోళన చెందుతున్నారు. కాగా ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించేందుకుగాను గతంలో ఇచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలనీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి రాసిన లేఖలో కోరారు. ఇక రాష్ట్రానికి తరలివచ్చే వారికి స్ధానికత అందించే విషయాన్ని కూడా బాబు లేఖలో పేర్కొన్నారు. విభజన తేదీ నుంచి మూడేళ్లలోపు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు తరలివచ్చేవారికి, స్థానికతను కల్పిస్తామన్నారు చంద్రబాబు. మొత్తంగా.. ఓ పక్క నూతన రాజధాని అమరావతి నగర శంఖుస్ధాపన జరుగుతున్న సమయంలో ఉద్యోగుల తరలింపుపై కూడా అంతే వేగంగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం.

21:11 - September 15, 2015

హైదరాబాద్ : రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో స్థిరపడిన ఆంధ్ర ప్రజలు, ఉద్యోగులు, వారి పిల్లలపై స్థానికత అంశంపై స్పష్టత వస్తోంది. తెలంగాణలో స్థిరపడినా...ఏపీ ప్రజలకు స్వరాష్ట్రంలోనూ స్థానికత వర్తింపజేయాలని ఏపీ అడ్వొకేట్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ నివేదిక సమర్పించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని స్థానికత పదాన్ని సవరించాలని నివేదికలో ఏజీ కోరారు.  

11:27 - August 26, 2015

ప.గో: తన కుమార్తెకు ఏ తెలుగు రాష్ట్రంలోనూ ఉద్యోగం రాదన్న మనస్తాపంతో ఓ తండ్రి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. రాష్ట్ర విభజన అనంతరం నెలకొన్న పరిస్థితులు, తెలుగు ప్రభుత్వాల బాధ్యతారాహిత్యం ఎలా ఉందన్న విషయానికి ఈ ఘటన సజీవ సాక్ష్యం. వివరాల్లోకి వెళితే, పశ్చిమ గోదావరి జిల్లా ఉంగటూరుకు చెందిన దుర్గా ప్రసాద్ కు నిఖిల అనే కుమార్తె ఉంది. ఆమె వరుసగా నాలుగేళ్లు రంగారెడ్డి జిల్లాలో చదువుకుంది. రాష్ట్ర విభజన తరువాత, నిఖిలకు స్థానికత లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేయగా, వరుసగా నాలుగేళ్లు ఏపీలో చదవలేదన్న కారణం చూపుతూ, డీఎస్సీ రాసేందుకు ఆంధ్రా అధికారులు నిరాకరించారు. దీంతో తన కూతురికి ఉద్యోగం రాదని మనస్తాపం చెందిన దుర్గా ప్రసాద్, ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దుర్గా ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన్ను తాడేపల్లి గూడెం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పలువురు రాజకీయ నాయకులు ప్రసాద్ ను పరామర్శించారు. 

Don't Miss

Subscribe to RSS - స్థానికత