హరీష్ రావు

17:19 - October 13, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు టీప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 23 లేదా 25 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగునున్నాయి. ప్రజా సమస్యలపై చర్చకు ప్రతిపక్షాలు సమయం కోరితే సమావేశాలు పొడిగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి హరీష్ రావు తెలిపారు. పేకాటపై పీడీ యాక్టు చట్టం తీసుకొస్తామని చెప్పారు.  మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:13 - October 12, 2017

కేంద్రమంత్రులకు తెలంగాణ కానుకలు, కొడ్కు అల్లుడిని పొగిడె తందుకే సభల?, పేదలకు బియ్యమిస్తమంటే అడ్డుకుంటున్నరు, ఏసీబోళ్లకు దొర్కిపోయిన పోలీసు, ప్రేమించి పెళ్లి చేసుకుంటే కుల బహిష్కరణ.. ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

20:22 - October 6, 2017

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న పార్టీ ఏదో తెల్సా..? టీఆర్ఎస్ పార్టీ.. ఈ మాట ఉత్తంకుమార్ రెడ్డో.. కోదండరాం సారో.. రేవంత్ రెడ్డో చెర్కు సుధాకరో అంటలేడు సుమా..? ఇది విపక్షాల మాటగాదు.. నీళ్ల మంత్రి తన్నీరు హరీష్ రావు సారే అంటున్నడు.. తెలంగాణ అభివృద్ధికి అడ్డం బడ్తున్నది టీఆర్ఎస్ పార్టేనట.. కావాల్నంటే ఆయన నోటితోనే ఎలా జెప్పిండో వీడియోలో సూనుండ్రి..

21:22 - October 5, 2017

నల్లగొండ : కాళేశ్వరం ప్రాజెక్టు పనులను నిలుపుదల చేయాలన్న ఎన్జీటీ ఆదేశాలపై సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరంపై ఎన్జీటీ ఆదేశాలు తాత్కాలిక అడ్డంకేనని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో పర్యటించిన ఆయన కాళేశ్వరానికి స్టే ఇవ్వడం కాంగ్రెస్‌కు ఆనందంగా ఉందని ఎద్దేవా చేశారు. 

07:16 - October 3, 2017

భూపాలపల్లి : గతంలో టీడీపీ, కాంగ్రెస్‌ పాలకులు మధ్యలోనే వదిలేసిన ప్రాజెక్టులను తమ ప్రభుత్వం పూర్తి చేస్తోందని నీటిపారుదల శాఖా మంత్రి హరీశ్‌రావు అన్నారు. భూపాలపల్లిజిల్లా వెంకటాపూర్‌ మండలంలో పాలెం ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 10వేల 132 ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి తెలిపారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో మంత్రి తుమ్మలనాగేశ్వరరావు, ఇరిగేషన్‌ అధికారులు కూడా పాల్గొన్నారు.

18:22 - September 25, 2017

నల్లగొండ : జిల్లాలోని నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లం వద్ద ఉదయసముద్రం ఎత్తిపోతల పథకం పనులను మంత్రులు హరీష్‌రావు, జగదీశ్‌రెడ్డిలు ఆకస్మికంగా పరిశీలించారు. సమాచారం తెలుసుకుని ఉన్నతాధికారులు, ఇంజనీర్లు ప్రాజెక్ట్‌ వద్దకు పరుగులు తీశారు. అనుకున్న సమయానికి ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యమన్నారు హరీష్‌రావు. వచ్చే మూడు నెలల్లో టన్నెల్‌ పన్నులు పూర్తవుతాయని... డిసెంబర్‌లో ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తామన్నారు హరీష్‌రావు. ప్రతి 15 రోజులకోసారి పనులను పర్యవేక్షించాలని కలెక్టర్‌ను కోరామని... పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కాంట్రాక్ట్‌ ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామని హరీష్‌రావు హెచ్చరించారు. 

21:58 - September 24, 2017

సిద్దిపేట : రైతు సమన్వయ సమితుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పేద రైతులకు మేలు జరుగుతుందన్నారు మంత్రి హరీష్‌ రావు. ఈ మేరకు ఆయన సిద్దపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సిద్దిపేట ఆర్డీవో కార్యాలయ ఆవరణలో నియోజకవర్గంలోని లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. 10 కోట్ల 27 లక్షలతో సిద్దిపేట నియోజకవర్గం ప్రజలకు సహాయం చేశామని తెలిపారు. 

08:51 - September 16, 2017

హైదరాబాద్ : తెలంగాణ మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు జలసౌధలో కేంద్ర జౌళిశాఖ కార్యదర్శి అనంతకుమార్‌సింగ్‌తో సమావేశమయ్యారు. పత్తికొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించారు. పత్తి మద్దతు ధర 4320 రూపాయలకన్నా తగ్గిన వెంటనే సీసీఐ రంగంలోకి దిగి కొనుగోళ్లు ప్రారంభించేందుకు ఏర్పాటు చేయాలని హరీశ్‌రావు కోరారు. పత్తిని తీయడానికి రైతులకు కాటన్‌ ప్లకింగ్‌ యంత్రాలు సబ్సిడీపై సరఫరా చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. రాష్ట్రం లో పత్తి సాగు పెరుగుతున్న నేపథ్యంలో క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్ లు తెలంగాణలోని ఈ-నామ్ మార్కెట్లలో ఏర్పాటు చేయాలని కోరారు. అక్టోబర్‌ 20లోపు 143 పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కోరారు.

జీన్నింగ్‌ మిల్లులపై నోటిఫై
పత్తి కొనుగోలులో ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన సీసీఐ సిబ్బందిని నియమించాలని హరీశ్‌రావు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బంది కొరత ఉంటే మార్కెటింగ్‌ శాఖ నుంచి తాత్కాలిక ప్రాతిపదికన కొంతమందిని సీసీఐ ఎంగేజ్‌ చేసుకోవచ్చని సూచించారు. పత్తి క్రయ విక్రయాలను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలన్నారు. రైతులు పత్తి ఎక్కువ దూరం తీసుకెళ్లకుండా వారికి దగ్గరలోని జిన్నింగ్‌ మిల్లులపై నోటిఫై చేయాలని కేంద్ర జౌళిశాఖ కార్యదర్శి అనంతకుమార్‌సింగ్‌ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. నోటిఫై చేసిన కేంద్రాల పరిధిలోనే ఆయా గ్రామాల రైతులు పత్తిని అమ్ముకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది పత్తి రైతులకు మద్దతు ధర కల్పించే విషయంలో పూర్తి సహాయ సహకారాలను కేంద్రం అందిస్తుందని హరీశ్‌రావుకు హామీనిచ్చారు. 

21:24 - September 8, 2017

హైదరాబాద్ : స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్‌ అబద్ధాలను ప్రచారం చేస్తుందన్నారు మంత్రి హరీష్‌రావు. ప్రభుత్వ పథకాలతో రైతులు సంతోషంగా ఉంటే ఓర్వలేని కాంగ్రెస్‌ నేతలు... లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని హరీష్‌రావు అన్నారు. 

15:17 - September 8, 2017

Pages

Don't Miss

Subscribe to RSS - హరీష్ రావు