హాజరు

10:37 - June 19, 2018

గుంటూరు : ఎట్టకేలకు నాయిబ్రాహ్మణుల కత్తిడౌన్‌ సమ్మెకు తెరపడింది. ముఖ్యమంత్రితో నాయిబ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు నిన్న జరిపిన చర్చలు సఫలమయ్యాయి. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, రూ.15000 వేతనం ఇవ్వాలని డిమాండ్‌తో క్షురకులు సమ్మెకు దిగారు. నాయిబ్రాహ్మణుల డిమాండ్లపై సీఎం సానుకూలంగా స్పందించడంతో.. ఇవాళ్టి నుంచి విధులకు హాజరవుతున్నట్లు ప్రకటించారు.

 

13:26 - June 12, 2018

మహారాష్ట్ర : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ముంబైలోని  భీవండీ కోర్టుకు హాజరయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్‌ వేసిన పరవునష్టం కేసులో రాహుల్  కోర్టుకు హాజరయ్యారు. మహాత్మా గాంధీ హత్యవెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ హస్తం ఉందంటూ గతంలో రాహుల్ చేసిన  వ్యాఖ్య లపై కేసు నమోదు కావడంతో రాహుల్‌ కోర్టుకు హాజరయ్యారు. 

 

16:13 - June 6, 2018

ఢిల్లీ : కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరానికి కష్టాలు తొలగడం లేదు. ఐఎన్ ఎక్స్ మీడియా కేసులో ఇవాళ ఆయన సిబిఐ ముందు హాజరయ్యారు. ఈ కేసులో సిబిఐ ఆయనను ప్రశ్నిస్తోంది. ఈ కేసులో చిదంబరాన్ని సిబిఐ ప్రశ్నించడం ఇదే తొలిసారి. ఎయిర్‌ సెల్‌ మ్యాక్సిస్‌ కేసులో ఈడీ నిన్న ఆరున్నర గంటల పాటు చిదంబరాన్ని ప్రశ్నించింది. చిదంబరం విచారణకు పూర్తిగా సహకరించారని ఈడీ పేర్కొంది. ఈ కేసులో చిందబరాన్ని జులై 10 వరకు అరెస్ట్‌ చేయొద్దని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించడం కొంత ఊరట కలిగించింది. ఈ నెల 12న విచారణకు హాజరు కావాలని చిదంబరానికి ఈడీ మళ్లీ సమన్లు జారీ చేసింది. ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ ఒప్పందంలో మలేషియా కంపెనీ నుంచి 1230 కోట్లు లంచం తీసుకున్నట్లు ఈడీ ఆరోపిస్తోంది.

 

13:40 - April 22, 2018

హైదరాబాద్ : నేటితో సీపీఎం జాతీయ మహాసభలు ముగియనున్నాయి. రాజకీయ నిర్మాణంపై మహాసభల్లో సుదీర్ఘ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సాయంత్రం సరూర్‌నగర్‌ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అనేక ప్రాంతాల నుంచి కార్యకర్తలు మహాసభకు హాజరవుతున్నారు. ఈ మేరకు నంద్యాల నర్సింహ్మారెడ్డి టెన్ టివితో మాట్లాడారు. సభకు మూడు లక్షల మందికిపైగా వస్తారని అంచనా ఉందన్నారు. స్టేడియం బయట 12 ఎల్ ఈడీ స్క్రీన్ లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఎల్ బీ నగర్ నుంచి వీఎం మెట్రో స్టేషన్ వరకు మైకులు ఏర్పాటు చేశామని తెలిపారు. 20 వేల కుర్చీలు ఏర్పాటు చేశామని చెప్పారు. గ్రౌండ్ లో ప్లేస్ సరిపోకపోవడంతో ఒక సైడ్ రోడ్డును పూర్తిగా వినియోగించుకుంటున్నామని తెలిపారు.

11:58 - January 9, 2018

ఢిల్లీ : ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ ప్రార్లమెంటు వద్ద యువ హుంకార్ ర్యాలీ జరగనుంది. గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ, అఖిల్ గొగోయ్, కన్హయ్య కుమార్లతో పాటు దళిత, విద్యార్ధి, రైతు, మహిళా సంఘాల నేతలు ఈ ర్యాలీలో పాల్గొంటారు. పీఎంవో కు వెళ్లి ప్రధాని ముందు మనుస్మృతి, రాజ్యాంగం రెండు పుస్తకాలు ఉంచుతానని ఆయన ఏది ఎంచుకుంటారో తేల్చుకోవాలని గత వారం జిగ్నేష్ మేవానీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిగ్నేష్ ర్యాలీకి సిద్ధమవుతున్నారు. మరోవైపు ఢిల్లీ పోలీసులు ర్యాలీకి అనుమతి లేదంటున్నారు. యువర్యాలీ నేపథ్యంలో సెంట్రల్ ఢిల్లీలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:41 - January 8, 2018

హైదరాబాద్ : టీవీ యాంకర్‌ ప్రదీప్‌ కౌన్సిలింగ్‌కు హాజరయ్యారు. గోషా మహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తండ్రితో కలిసి వచ్చారు. న్యూ ఇయర్‌ రోజు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ ప్రదీప్‌ ఆ తరువాత ప్రదీప్ ఇన్నిరోజులు కౌన్సిలింగ్‌ వాయిదా వేస్తూ వచ్చారు.  బిజీ షెడ్యూల్ ఉన్నందునే ఇన్నిరోజులు కౌన్సెలింగ్‌కు హాజరు కాలేకపోయానని ప్రదీప్ స్పష్టం చేశారు. కౌన్సెలింగ్‌ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను. మద్యం ఆరోగ్యానికి హానికరమని ప్రదీప్ తెలిపారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా తనకు తెలిసిన విషయాలు మిగతా వారికి తెలియజేస్తాను. తాను చేసినట్లు ఎవరూ కూడా చేయవద్దని విజ్ఞప్తి చేశారు. 

 

17:40 - January 8, 2018

హైదరాబాద్ : టీవీ యాంకర్‌ ప్రదీప్‌ కౌన్సిలింగ్‌కు హాజరయ్యారు. గోషా మహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. న్యూ ఇయర్‌ రోజు ప్రదీప్‌ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డారు. ఆ తరువాత ప్రదీప్ ఇన్నిరోజులు కౌన్సిలింగ్‌ వాయిదా వేస్తూ వచ్చారు. ఈరోజు గోషామహల్ ట్రాఫిక్‌ పీఎస్‌కు హాజరయ్యారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

07:23 - November 3, 2017

హైదరాబాద్ : కొంతమంది నాయకులు పార్టీ నుంచి వెళ్లిపోయినా.. కార్యకర్తలతో తనకున్న అనుబంధాన్ని ఎవరూ దూరం చేయలేరన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. హైదరాబాద్‌ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జరిగిన టీటీడీపీ విస్తృత స్ధాయి సమావేశానికి బాబు హాజరయ్యారు.  పార్టీకి ఎన్నో సంక్షోభాలు వచ్చినప్పుడు కార్యకర్తలే అండగా ఉన్నారని గుర్తు చేసుకున్నారు. తనను నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉంటానని చంద్రబాబు స్పష్టం చేశారు. 

18:33 - October 20, 2017

హైదరాబాద్ : అక్రమాస్తుల కేసు విచారణలో కోర్టు హాజరు నుంచి తనకు ఆరు నెలలు మినహాయింపు ఇవ్వాలన్న జగన్ పిటిషన్‌పై తీర్పును... సీబీఐ కోర్టు ఈ నెల 23 తేదీకి వాయిదా వేసింది. ఇవాళ అటు సీబీఐ, ఇటు జగన్ తరుపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. 11 కేసుల్లో జగన్ నిందితుడని... విచారణ కీలక దశలో ఉన్న నేపథ్యంలో జగన్‌‌కు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వకూడదని సీబీఐ కోరింది. సహేతుక కారణాలతో ఒకటి, రెండు వారాలు హాజరు నుంచి మినహాయింపు కోరచ్చని.. కానీ రాజకీయ కారణాలతో ఏకంగా ఆరు నెలలు మినహాయింపు సరికాదని సీబీఐ లాయర్ వాదించారు. అయితే జగన్ రాజకీయ నాయకుడని.. ఏపీలో సమస్యలపై ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన తరపు లాయర్ వాదించారు. ఇరువురు వాదనలు విన్న న్యాయమూర్తి... తమ నిర్ణయాన్ని ఈనెల 23కు వాయిదా వేశారు. నవంబర్ 2 నుంచి కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు జగన్ పాదయాత్ర చేస్తానని గతంలోనే నిర్ణయించుకున్నారు.

 

17:10 - October 20, 2017

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేస్తారా ? చేయరా ? ఇందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతినిస్తుందా ? అనే ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం కోర్టు ఎదుట జగన్ హాజరౌతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తనకు హాజరు మినహాయింపు ఇవ్వాలంటూ జగన్ సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి ప్రతిగా సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. నవంబర్ 2వ తేదీ నుండి ఆరు నెలల వరకు పాదయాత్ర చేయనుందున..తనకు హాజరు మినహాయింపు ఇవ్వాలని జగన్ తరపు న్యాయవాదులు కోరారు. ఎట్టి పరిస్థితుల్లో పాదయాత్రకు అనుమతినివ్వవద్దని సీబీఐ తరపు న్యాయవాదులు వాదించారు. హాజరు మినహాయింపు కేసులో వాదనలు పూర్తయ్యాయి. తదుపరి విచారణను ఈనెల 23కి వాయిదా వేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. మరి ఆ రోజున ఎలాంటి తీర్పు వస్తుందో వేచి చూడాలి. 

Pages

Don't Miss

Subscribe to RSS - హాజరు