హామీలు

07:39 - July 17, 2018

తెలంగాణలో చేనేత కార్మికులకు ఎన్నికల నాడు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని చేనేత కార్మికుల పట్ల మాటల్లో ఒకరకంగా చేతల్లో ఒక రకంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని చేనేత కార్మికుల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తుంది. చేనేత కార్మికుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తానని ఇప్పటికీ చేయలేదని..... చేనేతకు, జౌలికి ప్రత్యేక బడ్జెట్‌కు కేటాయిస్తామని అది కూడా అమలు చేయలేదని.... చేనేత కార్మికుల కోసం ఏర్పాటు చేస్తామని చెప్పిన మెగా టెక్స్‌టైల్స్‌ పార్క్‌ ఇంకా నిర్మాణ పనులే మొదలు కాలేదని వారు ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తున్నారు. మరి నేతన్నలకు సమస్యలేమిటి? వారికిచ్చిన హామీలేమిటి? చేనేతకు జౌలికి ప్రత్యేక బడ్జెట్‌ కేటాయిస్తామని చేనేత కార్మిక సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామని హామీల కోసం నేతలన్నల డిమాండ్స్ ఏమిటి? అనే అంశాలపై తెలంగాణ చేనేత సంఘం నాయకులు రమేశ్‌ మాటల్లోనే తెలుసుకుందాం..

08:17 - July 14, 2018

రాష్ట్ర విభజన చట్టం హామీలు అమలులో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ కార్యక్రమంలో రాజకీయ విశ్లేషకులు వినయ్ కుమార్, టీఆర్ ఎస్ నేత చంద్రశేఖర్ రెడ్డి, బీజేపీ నేత లక్ష్మీనారాయణ, టీడీపీ నేత చందూసాంబశివరావు పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

06:31 - April 28, 2018

విజయవాడ : భవిష్యత్‌లో బీజేపీ - వైసీపీ కలిసి పోటీ చేస్తాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వైసీపీ తోడుందన్న నమ్మకంతోనే కేంద్రం టీడీపీని దూరం చేసుకుందని దుయ్యబట్టారు. కేంద్రంలోని పెద్దలు, వైసీపీ కలిసి రాష్ట్రం మీద కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వస్తున్నా మీకోసం పాదయాత్ర చేపట్టి 5ఏళ్లు పూర్తైన సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. పాదయాత్ర సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినట్లు స్పష్టం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో చేపట్టిన వస్తున్నా .. మీకోసం పాదయాత్ర చేపట్టి 5 సంవత్సరాలు పూర్తైంది. ఈ సందర్భంగా చంద్రబాబు తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. అనేక అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రతిపక్షాల తీరును ఎంగట్టడంతో పాటు.. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు.

బీజేపీ - వైసీపీలపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ - వైసీపీలది మొన్నటి వరకు రహస్య అజెండా అని.. ఇప్పుడు వారి అజెండా బహిర్గతమైందన్నారు. వైసీపీ తోడు ఉంటుందన్న నమ్మకంతోనే కేంద్రం టీడీపీని దూరం చేసుకుందని ధ్వజమెత్తారు. రేపో.. మాపో ఆ రెండు పార్టీలు కలుస్తాయని... వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీచేసినా ఆశ్చర్య పోనక్కర్లేదని దుయ్యబట్టారు.

వస్తున్నా.. మీకోసం పాదయాత్ర చేపట్టినప్పుడు ప్రజలకు ఏ హామీలు ఇచ్చానో.. వాటికంటే ఎక్కువే చేశానని చంద్రబాబు తెలిపారు. ఏపీకి అన్యాయం చేసిన వారికి కర్నాటకలో తెలుగు ఓటర్ల గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాలు గెలిపించాలని ప్రజలను కోరుతున్నానని... అలా అయితేనే ప్రధాని ఎవరనేది మనమే నిర్ణయించే అవకాశం వస్తుందని చంద్రబాబు చెప్పారు.

విభజన హామీల సాధనకుగా తాము ఎంతో కృషి చేస్తున్నామని చెప్పారు. ఈనెల 30న తిరుపతిలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రధాని అభ్యర్థిగా మోదీ ఏ స్థలంలో అయితే హామీలు ఇచ్చారో.. అదే స్థలంలో ఏపీకి చేసిన అన్యాయాన్ని వివరిస్తామన్నారు. తిరుమల వెంకన్న సాక్షిగా మోదీ ఇచ్చిన హామీలపై నిలదీస్తామని చెప్పారు. నమ్మక ద్రోహం - కుట్ర రాజకీయాలు పేరిట తిరుపతి సభ నిర్వహిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. సభను విజయంతం చేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.

06:38 - April 11, 2018

గుంటూరు : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు... చేనేత కార్మికులను నిలువునా ముంచారని వైసీపీ అధినేత జగన్‌ విమర్శించారు. నేతన్నలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు అమలు చేయలేదన్నారు. చేనేతలకు బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే చేనేత కార్మికులను అన్నివిధాలా ఆదుకుంటామన్నారు. నేతన్నలకు రెండువేల రూపాయల పెన్షన్‌ ఇస్తామన్నారు. అందరికీ ఇళ్లు కట్టిస్తామని హామీనిచ్చారు.

 

06:32 - April 2, 2018

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఇవాళ రాత్రి ఆయన హస్తినకు బయలుదేరి వెళ్లనున్నారు. ఆరుగుర సభ్యులునన బృందం పర్యటనను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. రేపు, ఎల్లుండి చంద్రబాబు ఢిల్లీలో వివిధ పార్టీల నేతలు, ఎంపీలను కలుస్తారు. విభజన హామీల అమలు సాధనకు కేంద్రంతో పోరాడేందుకు పార్టీల మద్దతుకూడగట్టనున్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని వివిధ పార్టీలకు చంద్రబాబు వివరించనున్నారు. కేంద్రం ఏపీకి చేసిన అన్యాయాన్ని పార్టీలకు వివరించడానికి అవసరమైన సమగ్ర వివరాలతో పుస్తకాలను తయారు చేయించారు. ప్రజెంటేషన్లను సిద్ధం చేశారు. కొందరు నిపుణులతో సమావేశమై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను చంద్రబాబు సిద్ధం చేసుకున్నారు. ఎంపీలకు అందజేయడానికి ఒక పుస్తకం కూడా సిద్ధం చేయించారు. విభజన వల్ల ఏపీకి కలిగిన నష్టం, దాని భర్తీకి కేంద్రం విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, అంతేకాదు... పార్లమెంట్‌ వేదికగా ఏపీకి ఇచ్చిన వాగ్దానాలు... అవి అమలైన తీరుతోపాటు పూర్తి సమాచారాన్ని ఇందులో పొందుపర్చారు.

రేపు, ఎల్లుండి చంద్రబాబు హస్తినలోనే మకాం వేస్తున్నారు. వివిధ పార్టీల నాయకులు, ఎంపీలతో ఆయన వరుసగా భేటీ కానున్నారు. టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుకు మద్దతు తెలిపిన పార్టీల నాయకులు, ఆయా పార్టీల ఎంపీలను కలిసి వారికి కృతజ్ఞతలు చెబుతూ మరిన్ని వివరాలు వారికి అందించాలన్నది సీఎం యోచనగా కనిపిస్తోంది. ఆయన ఢిల్లీలో వివిధ పార్టీల నాయకులను కలవడం, ఏపీకి జరిగిన అన్యాయం వివరించడంతో కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

హస్తినలో రాజకీయాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. ఎన్డీయేకు టీడీపీ గుడ్‌బై చెప్పిన తర్వాత ఢిల్లీ రాజకీయాల్లో పూర్తిస్థాయి కదలిక వచ్చింది. ఎప్పుడూ లేని విధంగా బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన వెంటనే టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి గంటలోపే పదకొండు పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఆ తర్వాత కాంగ్రెస్‌, సీపీఎం స్వయంగా అవిశ్వాస నోటీసులు ఇచ్చాయి. దీంతో ప్రతిపక్ష పార్టీలన్నీ మోదీకి వ్యతిరేకంగా కలిసి పోరాటానికి సిద్ధమయ్యాయి. ఎన్నికల పొత్తుల గురించి ఆలోచించకుండా... ఇప్పటికైతే కేంద్రాన్ని టార్గెట్‌ చేయడానికి ఏకమవుతున్నాయి.

ఏపీ విభజన హామీలు, ప్రత్యేకహోదా సాధన కోసం ఢిల్లీతో ఢీకొట్టడానికి సిద్ధమని చంద్రబాబు ఇప్పటికే అసెంబ్లీలోనే ప్రకటించారు. తిరుపతిలో ప్రత్యేకహోదా ఇస్తామన్న మోదీ హామీని, ఢిల్లీని మించేస్థాయిలో అమరావతిని నిర్మిస్తామని చెప్పిన హామీల వీడియోలను ప్రదర్శించి జాతీయ స్థాయిలో తన విధానానికి క్లారిటీ ఇచ్చారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కేంద్రంపై పోరాడటానికి వెనుకాడేదిలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. తాను చెప్పే మాటలకు ఆధారాలతో సహా ఆయన ఢిల్లీకి పయనమవుతున్నారు. కేంద్రం ఇచ్చిన హామీలు, అమలు తీరును హస్తినలో తేల్చుకోనున్నారు. భవిష్యత్‌ పోరాటానికి సంబంధించి వ్యూహాత్మక అడుగులు వేయనున్నారు.

20:43 - March 21, 2018

ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్రతిపత్తి కి సంబంధించి విభజన చట్టంలోని హామీలను నెరవేర్చామని కేంద్రం పేర్కొంటోంది. దీనికి పూర్తి భిన్నంగా..రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనను తెలుపుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభత్వం దేనికి ఎంత విడుదల చేశామని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తోంది. మరి దీంట్లో వాస్తవాలు ఎంత? అవాస్తవాలు ఎంత? అసలు విభజన చట్టంలో ఎటువంటి అంశాలను పొందుపరిచారు? ప్రత్యేక హోదాకు, ప్రత్యేక ప్యాకేజీకి తేడా ఏమిటి? దేనివ ల్ల ఎటువంటి లబ్ధి వుంది? అనే అంశాలను వివరించేందుకు మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు వివరించేందుకు 10టీవీలోవున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు..విభజన వల్ల ఏపీ చాలా నష్టపోయిందన్నారు. కాబట్టి విభజన చట్టంలోవున్న హామీలన్నీ కేంద్ర ప్రభుత్వం నెరవేర్చి తీరాలని డిమాడ్ చేశారు. 

17:46 - March 17, 2018

ఢిల్లీ : బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మాట తప్పారని ఆయన మండిపడ్డారు. పార్లమెంట్‌లో సోమవారం అవిశ్వాసం పెడితే తాము తప్పకుండా మద్దతు తెలుపుతామన్నారు. నాలుగేళ్ల తర్వాత టీడీపీ కళ్లుతెరిచి ఎన్డీయే నుంచి బయటకు వచ్చిందని ఏచూరి అన్నారు.  

18:43 - March 16, 2018

గుంటూరు : రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటులో ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చాల్సిందే అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ శాసన మండలిలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిపై ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ మాట తప్పారని అన్నారు. అమరావతి నిర్మాణానికి  శంకుస్థాపన సమయంలో ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు మర్చిపోయారని బాబు ప్రశ్నించారు. తాజాగా కేంద్ర బడ్జెట్‌లో అహ్మదాబాద్‌, ముంబైలో మెట్రో ప్రాజెక్టులకు వందల కోట్లు కేటాయించిన మోదీ ప్రభుత్వానికి అమరావతి ఎందుకు కనిపించడంలేదని సభలో సీఎం నిలదీశారు. ఏపీ ప్రజల పట్ల బీజేపీ పాలకులకు ఎందుకు ఈ వివక్ష..? అని ప్రశ్నించారు.
పోలవరం ప్రాజెక్టుపై క్లీయర్‌గా నివేదిక 
2014లో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌  మంత్రివర్గం చివరి సమావేశంలో పోలవరం ప్రాజెక్టుపై క్లీయర్‌గా నివేదిక ఇచ్చారని... చంద్రబాబు అన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే వ్యయం అంతా కేంద్రమే భరిస్తుందని ఆరోజు పేర్కొన్నారని బాబు చెప్పారు. తర్వాత 2014 మేనెలలో ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసిన రోజే తాను పోలవరం ప్రాజెక్టుపై చర్చించాన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలోని 7 మండలాలను ఏపీలో కలపాలని తానే పట్టుపట్టానన్నారు. తన పట్టుదలతోనే 7మండలాలను ఏపీలో కలిపారని చంద్రబాబు సభకు తెలిపారు. 
అమరావతి నిర్మాణం పూర్తిచేయాల్సిన బాధ్యత కేంద్రానిదే...
అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు.. శానమండలిలో ఏపీ ఆర్థిక పరిస్థితి, కేంద్రం సహాయ నిరాకరణపై ఆయన మాట్లాడారు. అమరావతి నిర్మాణానికి పుణ్యక్షేత్రా నుంచి పవిత్ర, జలాలు, మట్టి తీసుకొచ్చిన ప్రధానిమోదీ.. డబ్బులివ్వడం మాత్రం మర్చిపోయారని బాబు విమర్శించారు. అటు దుగరాజపట్నం పోర్టును విషయంలో కూడా 4ఏళ్లు తాత్సారం చేసి..ఇపుడు ప్రత్నామ్నాయం చూసుకోవాలని అంటున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే  బీజేపీ పాలకులు ప్రయత్నిస్తున్నారని ఏపీ సీఎం విమర్శించారు. 
జగన్‌పై విమర్శలు గుప్పించిన చంద్రబాబు 
ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌పై ఏపీ శాసన మండలిలో సీఎం చంద్రబాబు విమర్శలతో విరుచుకు పడ్డారు. 2017లో ప్రధానిని కలిసిన జగన్‌ ఏపీకి ప్రత్యేక హోదా అడగబోమని చెప్పారన్నారు. అటు రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్‌ను ప్రకటించగానే బీహార్‌కు వెళ్లి ఆయన కాళ్లమీద పడి.. రాబోయే రోజుల్లో తమపై కేసులు లేకుండా చేయించుకోడానికి ప్రయత్నించారని బాబు విమర్శించారు. మోదీ,  రామ్‌నాథ్‌ కోవింద్‌తో ఫోటోలు దిగి..తమకు కేంద్రం పెద్దల అండఉందన్న మెసేజ్‌ను  సీబీఐ, ఈడీలకు పంపించే ప్రయత్నిం చేశారని చంద్రబాబు  విమర్శించారు. జగన్‌ మాటలు వినే ప్రధాని మోదీ ఏపీకి నిధులు రాకుండా చేస్తున్నారని సీఎం అన్నారు. 

 

18:45 - March 13, 2018

గుంటూరు : కేంద్రం ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ అసెంబ్లీలో ఆయన ప్రసంగించారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని తెలిపారు. 14వ ఫైనాన్ష్ కమిషన్ ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వవద్దని ఎక్కడా చెప్పలేదని పేర్కొన్నారు. ఏపీకి అన్యాయం జరిగిందని..రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. సెంటిమెంట్ ఆధారంగా నిధులు రావని జైట్లీ అన్నారని...సెంటిమెంట్ కారణంగా తెలంగాణ ఇచ్చింది వాస్తవం కాదా అని అన్నారు. స్పెషల్ స్టేటస్ ఇవ్వమని బీజేపీ అనడం సరికాదన్నారు. విష్ణుకుమార్ రాజు.. స్పెషల్ స్టేసస్ ను సింప్లిఫై చేసి మాట్లాడడం సరికాదన్నారు. తానే దేశంలో సీనియర్ నాయకున్ని అని..తనకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని తెలిపారు. హైదరాబాద్ కంటే మిన్నగా అమరావతిని అభివృద్ధి చేస్తానని చెప్పారు. ప్రత్యేకహోదా రాష్ట్రాలకు పన్ను రాయితీ ఇచ్చారని పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం డబ్బులు ఇవ్వలేదని చెప్పారు. 1995లో సీఎం అయ్యాయని తెలిపారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎన్ టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని పేర్కొన్నారు. బీజేపీతోసహా లెఫ్ట్ ఫ్రంట్ పార్టీలను ఒకతాటిపైకి తెచ్చారని తెలిపారు. తాను ఎప్పుడూ పదవులు, డబ్బులు అడగలేదన్నారు. తాము కష్టపడి డబ్బులు సంపాదించుకుంటామని చెప్పారు. ఆర్థిక సంస్కరణలు, టెక్నాలజీపై మాట్లాడింది తానేనని అన్నారు. బీజేపీ మద్దతుతోనే రాష్ట్ర విభజన బిల్లు పాస్ అయిందన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో డబుల్ డిజిట్ రాలేదని..ఏపీలో వచ్చిందన్నారు. భారతదేశంలో సంపద, మానవ వనరులున్నాయన్నారు. ఇంకా తెలంగాణ, ఏపీ మధ్య ఆస్తుల విభజన జరగలేదన్నారు. పెన్షన్స్ జనాభా ప్రకారం ఇచ్చారని తెలిపారు. 'ఎందుకు మీరు, మేము కలిసి పోటీ చేశామో తెలుసా అని  అన్నారు. రాష్ట్రాన్ని విభజించినందుకు 120సం.రాల కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. అది ఆ పార్టీ స్వయంకృత అపరాదమన్నారు. ఆ విషయాన్ని బీజేపీ గుర్తు పెట్టుకోవాలన్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎన్ టీఆర్ టీడీపీ పార్టీని స్థాపించారు. ప్రత్యేకహోదాను సింపుల్ ఫై చేసి మాట్లాడడం సరికాదన్నారు. పోలవరం రాష్ట్రానికి జీవనాడి, వరం అని అన్నారు. 

 

21:40 - March 12, 2018

హైదరాబాద్ : ప్రధాని మోదీపై నమ్మకంతోనే ఎన్డీఏలో చేరాం.. కాని మోదీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక పోయారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ శాసన మండలిలో ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర పరిస్థితిపై సీఎం మాట్లాడారు. ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలో హామీలన్నీ నెరవేర్చాల్సిందే అని చంద్రబాబు స్పష్టంచేశారు. తనను విమర్శించడం మానుకుని.. ఏపీకి న్యాయం జరిగేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర బీజేపీ నేతలకు చంద్రబాబు సభాముఖంగా సూచించారు. ప్రత్యేక హోదాతో సహా విభజన చట్టంలో ప్రకటించిన హామీలన్నీ అమలు కావాల్సిందే అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రం పట్ల కేంద్రం చిన్నచూపు చూస్తోందన్న చంద్రబాబు.. ఏపీ పరిస్థితిపై శాసన మండలిలో సుదీర్ఘంగా మాట్లాడారు.

మోదీపై నమ్మకంతోనే ఎన్డీఏలో చేరాం
ఏపీకి న్యాయం చేసే విషయంలో ప్రధాని మోదీపై నమ్మకం ఉందని వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను చంద్రబాబు ఎద్దేవా చేశారు. తాముకూడా అదే నమ్మకంతో ఎన్డీయే ప్రభుత్వంలో చేరామన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని బయటపడేసేందుకు ప్రతిపక్షంగా పలు విలువైన సూచనలు ఇవ్వాల్సిన వైసీపీ ప్రజాప్రతినిధులు.. తమ బాధ్యతను దులపరించుకుని రోడ్లపై తిరుగుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర బీజేపీ నేతల తీరుపై కూడా సీఎం నిరసన వ్యాఖ్యలు చేశారు. తనను విమర్శించడం మానుకుని రాష్ట్రానికి మేలుజరిగేలా ప్రధాని మోదీపై ఒత్తడి తీసుకురావాలని చంద్రబాబు సూచించారు.

అమరావతిలో కేంద్ర సంస్థలు ఎందుకు ఏర్పాటు చేయరు ?
హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలో ఏర్పాటు చేసినట్టు.. అమరావతిలో కేంద్ర సంస్థలు ఎందుకు ఏర్పాటు చేయరని సీఎం సభలో ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం ఏర్పాటు చేసిన సందర్భంలో నయారాయ్‌పూర్‌ నిర్మాణానికి సహకరించినట్టే అమరావతి నిర్మాణానికి చేయూతనివ్వాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఏపీ విషయంలో ఎందుకు వివక్షాపూరితంగా ప్రవర్తిస్తున్నారు.. ఏపీ ఇండియాలో భాగంకాదా అని సభా ముఖంగా చంద్రబాబు కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించారు.

మొదటిసారి విద్యుత్‌ సంస్కరణలు చేసిన ఘనత
దేశంలో మొదటిసారిగా పవర్‌సెక్టార్‌లో సంస్కరణలు విజయవంతంగా అమలు చేసింది తానేనన్నారు ఏపీ సీఎం చంద్రబాబు.. వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అమలును సభకు వివరించారు. సోలార్‌ ఎనర్జీ విషయంలో దేశంలోనే మొదటిసారిగా దారి చూపింది తానేనన్నారు. హుద్‌హుద్‌ తుఫాన్‌లో తీవ్రంగా నష్టపోయిన విశాఖలో సోలార్‌ విద్యుత్‌ వ్యవస్థను ఇంప్లిమెంట్‌ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన తర్వాతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సోలార్‌ ఎనర్జీ గురించి మాట్లాడారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మరోవైపు రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీలు పెంచే ప్రసక్తేలేదని ముఖ్యమంత్రి సభకు వివవరించారు.

రైతు రుణమాఫీలో రాజీ పడలేదు
అటు రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉన్నా.. రైతురుణమాఫీ విషయంలో రాజీపడలేదని చంద్రబాబు అన్నారు. కేంద్రం సహకరించక పోయినా.. ఆర్బీఐ వద్దన్నా ..ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేశామన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రాష్ట్ర రైతులకు 24వేల 5వందల కోట్ల రూపాయల రుణాలు మాఫీచేశామన్నారు. అటు డ్వాక్రా సంఘాలకు కూడా పదివేల కోట్లరూపాయల రుణాలు ఇచ్చామన్నారు.

సెంటిమెంటుకు డబ్బులు రావనడంపై బాబు ఆగ్రహం
ఇక సెంటిమెంటుకు డబ్బులు రావన్న కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు సభాముఖంగా ఖండించారు. సెంటిమెంట్‌ ను అనుసరించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని కేంద్రం పెద్దలు మర్చిపోయారా అని బాబు ప్రశ్నించారు. తాను హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది తెలుగు ప్రజల కోసమే అని ఉద్వేగంగా ప్రసంగిచారు ఏపీ ముఖ్యమంత్రి.

బీజేపీ, వైసీపీలపై బాబు విమర్శలు
మొత్తానికి అటు కేంద్రంలో బీజేపీ, ఇటు రాటు రాష్ట్రంలో వైసీపీ తీరును సభా ముఖంగా ఖండించిన సీఎం.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకున్నా.. సంక్షేమ పథకాల అమలులో రాజీపడేది లేదని ఏపీ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికైనా కేంద్రం ప్రభుత్వం ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిచేయాలని చంద్రబాబు కోరారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - హామీలు