హిందూపురం

18:40 - March 9, 2018

అనంతపురం : హిందూపురంలోని ముక్కడిపేటలో విషాదం నెలకొంది. ఆహారం, కూల్‌డ్రింక్‌ సేవించిన ముగ్గురు యువకుల్లో ఇద్దరు చనిపోయాడు. మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ముక్కడిపేటకు చెందిన ప్రదీప్‌, శివ, బాలాజీ స్నేహితులు. ఈ మధ్యాహ్నం ముగ్గురు కలిసి భోజనం చేసిన తర్వాత కూల్‌డ్రింగ్‌ తాగారు. వెంటనే స్పృహతప్పి పడిపోయారు. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఇద్దరు యువకులు చనిపోయారు. మరో యువకుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

18:07 - January 29, 2018

అనంతపురం : జిల్లా 'పవన్' పర్యటనలో తీవ్ర అపశృతి చోటు చేసుకుంది. 'పవన్' అభిమాని ఒకరు మృతి చెందారు. జిల్లాలో గత మూడు రోజులుగా పవన్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. వివిధ రంగాలకు చెందిన వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. మూడో రోజు హిందూపురంకు వచ్చిన పవన్ అభిమానులనుద్ధేశించి ప్రసంగించారు. అనంతరం పర్యటన ముగించుకుని బెంగళూరుకు వెళ్లారు. పవన్ చూసేందుకు హిందూపురం..అంబేద్కర్ నగర్ కు చెందిన రామకృష్ణ వచ్చాడు. ఇతను ప్రయాణిస్తున్న వాహనాన్ని బొలెరో వాహనం ఢీకొంది. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. దీనితో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. 

16:07 - January 29, 2018

అనంతపురం : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లా పర్యటన ముగిసింది. పలు రంగాల వారితో ఆయన నేరుగా మాట్లాడారు. వారి వారి సమస్యలను ఆలకించి ఆయా సమస్యలపై ఆయన స్పందించారు. జిల్లాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని, పలు సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళుతానని పేర్కొన్నారు. రాయలసీమలో హైకోర్టు నిర్మాణం అయ్యే విధంగా చూస్తానని పవన్ పేర్కొన్నారు. అసలు పవన్ పర్యటనపై జనసేన కార్యకర్తలు, అభిమానులు ఏమనుకుంటున్నారు ? తదితర వివరాలు తెలుసుకొనేందుకు టెన్ టివి ప్రయత్నించింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

14:40 - January 29, 2018

అనంతపురం : సినీ నటుడు, జనసేన అధినేత 'పవన్ కళ్యాణ్' జిల్లా పర్యటన కొనసాగుతూనే ఉంది. సోమవారం హిందూపురంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. పవన్ సీఎం అంటూ నినాదాలు చేయడం..కేరింతలు..విజిల్స్ తో సభలో గందరగోళం ఏర్పడింది. పవన్ చూసేందుకు ఆయనతో కరచాలనం చేసేందుకు అభిమానులు తీసుకొచ్చారు. పవన్ చాలామార్లు వారించినా పరిస్థితిలో మార్పు రాలేదు. కొద్దిసేపు బయటకు వెళ్లి వచ్చిన తరువాత 'పవన్' తన స్పీచ్ ను మొదలు పెట్టారు.

రాయలసీమకు అండగా ఉంటానని, కరవు ప్రారదోలేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ముందుకొచ్చే వారితో కలుస్తామని తేల్చిచెప్పారు. జనసేనలో ఉండే వారు జనసైనికులై దేశం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. 

18:43 - January 20, 2018

కర్నూలు : బాలకృష్ణ హీరోగా నటించిన జైసింహా చిత్రం యూనిట్‌ హిందూపురంలో సందడి చేసింది. దీంతో బాలయ్య అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా 102 మంది బ్రాహ్మణులకు సినిమాను ఉచితంగా ప్రదర్శించారు. ఈ చిత్రంలో హీరో బ్రాహ్మణుల గురించి వివరించిన విధానం అర్చకులకు ఎంతో నచ్చిందని బాలకృష్ణ అభిమానులు అన్నారు. సినిమా విజయవంతం అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు నటి హరిప్రియ. తాను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సినిమాలోని పాత్ర మంగ పేరుతోనే పిలవడం మరింత ఆనందంగా ఉందన్నారు. 

 

14:10 - January 12, 2018

అనంతపురం : జిల్లాలోని హిందూపురంలో కసాయి కొడుకుల నిర్వాకం వెలుగు చూసింది. మానవత్వం మర్చిపోయిన కసాయి కొడుకులు వృద్ధులైన  తల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటేశారు. ముద్దిరెడ్డిపల్లికి చెందిన వృద్ధ దంపతులు కిష్టప్ప, ఓబులమ్మలను లక్ష్మీనారాయణ, లోకేశ్ ఇద్దరు కొడుకులు. పెద్ద కుమారుడు లక్ష్మీనారాయణ స్ధానికంగా బట్టల దుకాణం నడుపుతున్నాడు. రెండో కొడుకు లోకేశ్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. వారిద్దరూ తల్లిదండ్రులను ఇంట్లోంచి గెంటేసి తాళం వేసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడంతో దంపతులిద్దరూ ఆరుబయటే కాలం గడుపుతున్నారు. వృద్ధుల కష్టాలు చూసి స్ధానికులు చలించిపోతున్నారు. కిష్టప్ప, ఓబులమ్మ పేరిట ముద్దిరెడ్డిపల్లి, అనంతపురాల్లో ఇళ్లు, స్థలాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

20:28 - December 26, 2017

అనంతపురం : జిల్లాలోని హిందూపురంలో టమోటా రైతులు రోడ్డెక్కారు. కేజీ టమోటా ధర 50 పైసలు మాత్రమే పలుకుతుండటంతో.. రోడ్డుపైన పారబోయి నిరసన తెలిపారు. టమోటా పండిస్తే లాభం మాటామోగానీ కూలీ డబ్బులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఎకరం టమోటా సాగు చేస్తే దాదాపు 50 వేల రూపాయలు ఖర్చు అవుతుందని.. టమోటా పంటకు 5 వేల రూపాయలు కూడా రావడం లేదన్నారు. ప్రభుత్వం టమోటా రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కేజీ టమోటాకు కనీసం 15 రూపాయల మద్దతు ధరైనా వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. హిందూపురంలో కోల్డ్‌ స్టోరేజీ సౌకర్యం ఏర్పాటు చేయాలని టమోటా రైతులు డిమాండ్‌ చేశారు. 

 

20:52 - September 27, 2017
10:07 - September 7, 2017

అనంతపురం : జిల్లా హిందూపురం మార్కెట్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. వర్షం వల్ల బురదమయమైన మార్కెట్ లో ఇబ్బదులు ఎదుర్కొంటున్నామని అధికారుల సరైన వసతులు కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు. కూరగాయలు కిందపారబోసి వారు నిరసన తెలుపుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

17:19 - July 25, 2017

అనంతపురం : ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గమైన హిందూపురంలో నకిలీ నోట్ల ముఠా పట్టుబడింది. ఆరుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు. నిందితుల నుండి రూ. 27.37 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హిందూపురంలో ఓ గ్రామ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. దీనితో ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు ముఠాను అరెస్టు చేశారు. నోట్లు తయారు చేసే ప్రింటింగ్ మిషన్ ను స్వాధీనం చేసుకున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - హిందూపురం