హిందూ మక్కల్ కట్చి పార్టీ

15:31 - April 21, 2017

ఇటీవల పలువురు హీరోలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇటీవలే సోనూ నిగమ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. తాజాగా ప్రముఖ నటుడు కమల్ హాసన్ కు కోర్టు సమన్లు జారీ చేయడంపై చర్చానీయాంశమైంది. మహాభారతం..ద్రౌపదిపై కమల్ పలు వ్యాఖ్యలు చేశారని, హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా ఉన్నాయంటూ హిందూ మక్కల్ కట్చి పార్టీ కోర్టుకెక్కింది. దీనితో వల్లియార్ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 5వ తేదీన కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశాల్లో పేర్కొంది. మరి కమల్ కోర్టుకు హాజరౌతారా ? లేదా ? అనేది చూడాలి.

Don't Miss

Subscribe to RSS - హిందూ మక్కల్ కట్చి పార్టీ