హీరోయిన్ కీర్తి సురేష్

10:42 - October 20, 2017

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. పవన్ 25వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన స్టిల్స్ తో పాటు మ్యూజికల్ వీడియో ఫ్యాన్స్ ఆనందాన్ని రెట్టింపు చేసింది. అనేక టైటిల్స్ వినిపించినప్పటికి ఇంకా క్లారిటీ రాలేదు. కానీ దీపావళికి వస్తుందని అభిమానులు భావించారు. కాని అభిమానుల ఊహాగానాలని తలక్రిందులు చేస్తూ యూనిట్ ఓన్లీ శుభాకాంక్షలతో సరిపెడుతున్నట్లుగా ఓ పోస్టర్ని రిలీజ్ చేసింది . దీంతో అభిమానులకి మరోసారి నిరాశ తప్పలేదు. అయితే చిత్ర టైటిల్ పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధా కృష్ణ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ రవి చంద్రన్ సంగీతం అందించనున్న సంగతి తెలిసిందే. పవన్ 25 చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుందని తెలుస్తుండగా, ఇందులో పవన్ స్టార్ స్టైలిష్ లుక్ లో కనిపించనున్నాడు.

13:29 - September 11, 2017

హైదరాబాద్‌: అలనాటి మేటి తార సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం మహానటి. ఇందులో సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్‌ ఒదిగిపోయారు. సమంత, దుల్కర్‌ సల్మాన్‌, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే సావిత్రిగా కీర్తి ఎలా కనిపించనున్నారనే విషయంపై ఆసక్తినెలకొంది. కాగా మహానటి సెట్‌లో తీసిన కొన్ని ఫొటోలు బయటికి వచ్చాయి. వీటిలో కీర్తి సావిత్రి గెటప్‌లో చాలా చక్కగా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వైజయంతి మూవీస్‌ పతాకంపై ప్రియాంకా దత్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్‌, మలయాళ భాషల్లో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజయ్‌ దేవరకొండ, షాలిని పాండే, ప్రగ్యా జైశ్వాల్‌ కూడా ఇందులో నటిస్తున్నట్లు సమాచారం.

Don't Miss

Subscribe to RSS - హీరోయిన్ కీర్తి సురేష్