హీరో నిఖిల్

21:15 - March 16, 2018

స్వామి రారా నుంచి కంటెంట్ ఓరియంటెడ్ కథలను ఎంచుకుంటు.. ప్రామిసింగ్ హీరోగా మారిన నిఖిల్.. కిరిక్ పార్టీ అనే కన్నడ బ్లాక్ బాస్టర్ మూవీని కిరాక్ పార్టీ అనే పేరుతో రిమేక్ చేసి ఆడియన్స్ ముందుకు వచ్చాడు.. ఆల్ రెడీ బ్లాక్ బాస్టర్ హిట్ అయిన సినిమాకు సుథీర్ వర్మ స్క్రీన్ ప్లే, చందు మెండేటి డైలాగ్స్ అందించడంతో మరింత హైప్ క్రియేట్ అయ్యింది.. అలా భారీ అంచనాలు పెంచిన కిరాక్ పార్టీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం...
కథ విషయానికి వస్తే..   
కథ విషయానికి వస్తే హ్యాపీగా తన ఫ్రెండ్స్ తో కలిసి ఇజనీరింగ్ కాలేజిలో ఎంజాయిబుల్ స్టూడెంట్ గా లైఫ్ ను గడిపేస్తుంటాడు కృష్ట. అతను సీనియర్ అయిన మీరాను చూసి, ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె కూడా కృష్టను ఇష్టపడుతుంది.. అనుకోని ఇన్సిడెంట్ వలన మీరా చనిపోతుంది.. ఆ తరువాత రెబంల్ గా మారిన కృష్ణ.. కాలేజి పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అయ్యి, ప్రెసిడెంట్ అవుతాడు.. అక్కడ నుండి అతను ఆటిట్యూడ్ ఎలా టర్న్ అయ్యింది.. ఎలా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి బయటకు వచ్చాడు లాంటి ఇన్సిడెంట్స్ తో కథ ముగుస్తుంది..
నటీనటుల విషయానికి వస్తే..  
నటీనటుల విషయానికి వస్తే..  తన ప్రతి సినిమా లాగే ఈ సినిమాకు కూడా నటన పరంగా పూర్తి న్యాయం చేశాడు నిఖిల్..ఇంజనీరింగ్ లోని వివిధ దశల్లో ఉన్న స్టూడెంట్ లా కనిపించడానికి, బాడీ పరంగా మెకోవర్ కూడా అయ్యాడు.. ఫీల్ పరంగా, అల్లరి పరంగా కృష్ణ పాత్రలోని వేరియేషన్స్ బాగా ప్రసెంట్ చేశాడు.. కాకపోతే అక్కడక్కడ కథ పక్కదారి పట్టడంతో చేసేది ఎం లేక నిఖిల్ కూడా చూస్తూ ఉండిపోయాడు.. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే.. మీరా పాత్ర చేసిన సిమ్రాన్ పరింజ లుక్స్ పరంగా మెప్పించింది.. యాంక్టింగ్ పరంగా ఓకే అనిపించింది.. ఇక కన్నడ కిరీక్ పార్టీలో సెకండ్ హీరోయిన్ గా నటించిన సంయుక్త హెగ్డే.. తెలుగు వర్షన్ లో సత్య పాత్రలో కనిపించింది.. ఆమె లుక్స్ పరంగా యావరేజ్ గా ఉన్నప్పటికి ఎనర్జీలెవల్స్ బాగున్నాయి.. కొన్ని చోట్ల మాత్రం ఆమె నటన అతిగా అనిపించింది.. ఇక నిఖిల్ ఫ్రెండ్స్ గా కనిపించిన యూత్ బ్యాచ్.. చాలా వరకు మెప్పించారు.. మిగతా నటీనటులు పాత్రల పరిది మేర పర్వాలేదు అనిపించారు.. 
టెక్నీషియన్స్ విషయానికి వస్తే..   
టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. ఈ సినిమాతో డైరక్టర్ గా పరిచయం అయిన చందు మొండేటి అసోసియోట్ శరణ్ కొప్పిశెట్టి బెస్ట్ అవుట్ పుట్ అవ్వడంలో మాత్రం పూర్తిగా సక్సెస్ అవ్వలేదు అని చెప్పాలి. యూత్ ఫుల్ కంటెంట్ ను, ఎమోషనల్ ట్రాక్ ను, పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ను బాలన్స్  చేయడంలో పూర్తిగా తడబడ్డాడు.. దానివలన సినిమా ప్లో అర్ధరహితంగా తయారుఅయ్యింది.. అయితే దీనికి పూర్తిగా అతన్ని బాధ్యున్ని చేయలేం.. సుధీర్ వర్మ లాంటి టాలేంటెడ్ అండ్ ఎక్స్ పీరియన్సడ్ స్క్రీన్ ప్లే రైటర్ పేపర్ మీద రాసిన దాన్ని అతను స్క్రీన్ పై ప్రజంట్ చేయడానికి ట్రై చేశాడు.. ఇక చందూ మొండేటి డైలాగ్స్ కూడా చెప్పుకోనేంత గొప్పగా లేవు... కాలేజీ బ్యాగ్ డ్రాప్ ఎపిసోడ్ లో వాట్సప్ జోకులను.. అలాగే పాత జోకులను కొత్త పేపర్ లో చూట్టి అందించడానికి ట్రై చేశాడు.ఇక కన్నడ కిరీక్ పార్టీకి బ్యాక్ బోన్ గా నిలిచిన అజనీష్ లోక్ నాథ్ సంగీతం, ఈ కిరాక్ పార్టీకి కొంత వరకు హెల్ప్ అయ్యింది. మిగతా వాటిల్లో నెటివిటీ అని పాకులాడిన మేకర్స్, మ్యూజిక్ విషయంలో పెద్దగా దృష్టి పెట్టలేదు అని చెప్పాలి...  కెమెరా మెన్ అద్వైత గురుమూర్తి పనితనం మెప్పిస్తుంది.. లిమిటెడ్ లొకేషన్స్ లో తక్కువ ఖర్చులో కలర్ఫుల్ విజ్యూవల్స్ అందించడంలో అతను చాలా వరకు సక్సెస్ అయ్యాడు.. ఎడిటర్ ఎమ్మార్ వర్మ ఇకాస్త కేర్ తీసుకుని సినిమాను ట్రిమ్ చేయాల్సి ఉంది.. 
ఓవర్ ఆల్ గా చెప్పాలి అంటే..   
ఓవర్ ఆల్ గా చెప్పాలి అంటే,, కన్నడలో అక్కడ నెగిటివిటీతో కాలేజ్ ఇన్సిడెన్స్ ఒక ఫ్రెష్ పాకేజ్ లా తెరకెక్కిన కిరీక్ పార్టీనీ ఇక్కడ ఇంకా గొప్పగా తీయాలి అన్న ఉద్దేశ్యంతో చిన్న చిన్న మార్పులు చేశారు.. దాంతో సినమాలో ఉన్న ఫీల్ మిస్ అయ్యి ఫన్ పలుచబడిపోయింది.. కిరాక్ పార్టీ కాస్త, ఆర్డినరీ పార్టీ అయిపోయింది.. అయితే మేకర్స్ అనుకున్నట్టు స్టుడెట్స్ కి, మిగత టార్గెటెడ్ ఆడియన్స్ కి ఈవారం రోజుల పాటు కాలక్షేపంగా అనిపిస్తే మాత్రం బాక్సాఫీస్ దగ్గర తన ప్రభావం చూపించగలుగుతుంది కిరాక్ పార్టీ.. లేదంటే మాత్రం, డిస్స్పాయింటెడ్ మూవీగా మిగులుతుంది..   
    
ప్లస్ పాయింట్స్
నిఖిల్ మేకోవర్ 
సినిమాటోగ్రఫీ
రెండు పాటలు
మైనస్ పాయింట్స్
స్క్రీన్ ప్లే
డైలాగ్స్ 
ఓల్డ్  కామెడీ..
ఫీల్ లేని లవ్ ట్రాక్స్

రేటింగ్
1.5 / 5

11:25 - July 17, 2017

హైదరాబాద్: ‘స్వామిరారా’తో కెరీర్ టర్నింగ్ తీసుకుని ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ లాంటి సినిమాలతో నిఖిల్ 'కార్తికేయ' తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద నిఖిల్ హీరోగా అనిల్ సుంకర నిర్మించనున్న న్యూ మూవీకి ముగ్గురు డైరెక్టర్లు పనిచేయడం విశేషం. శరణ్ కొప్పిశెట్టి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ మూవీకి నిఖిల్ కెరీర్‌కి టర్న్ ఇచ్చిన సుధీర్ వర్మ స్ర్కీన్‌ప్లే అందిస్తుంటే.. ‘కార్తికేయ’తో మరో సక్సెస్ ఇచ్చిన చందూ మొండేటి మాటలు అందించడం విశేషం. ప్రస్తుతం రీసెంట్ రిలీజ్ ‘కేశవ’ కూడా సాదాసీదా సినిమా అయినప్పటికీ ప్రొడ్యూసర్‌కి ప్రాఫిట్ తెచ్చిపెట్టింది. దాంతో నిఖిల్‌తో సినిమా తీస్తే లాస్ వచ్చే భయం లేకపోవడంతో అతనితో సినిమాలు తీయడానికి ప్రొడ్యూసర్లు క్యూ కడుతున్నారు.

18:55 - May 19, 2017

చిన్న సినిమాలకు పెద్ద హీరోగా మారి ..తన బ్లాక్ బస్టర్ రన్ ని కంటిన్యూ చేస్తున్న నిఖిల్ కేశవ అనే ఇంటెన్సిఫైడ్ సబ్జెక్ట్ తో ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పోస్టర్స్, టీజర్స్ తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథవిషయానికొస్తే..హీరో ఫ్యామిలీ మొత్తాన్ని ఒక యాక్సిడెంట్ ద్వారా నాశనం చేసిన పోలీసుల మీద పగతీర్చుకోవడం అనే సింగిల్ ఎలిమెంట్. వినడానికి ఇంత సింపుల్ గా ఉన్న ఈ కథని తన స్క్రీన్ ప్లేతో కొత్తగా మార్చి .. ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చెయ్యాలని చూశాడు డైరెక్టర్ సుధీర్ వర్మ. కథనం గురించి క్లుప్తంగా చెప్పాలంటే..కేశవ అనే లా స్టూడెంట్ చిన్నప్పుడే ఒక యాక్సిడెంట్ లో తన తల్లితండ్రులనుకోల్పోతాడు. ఆ యాక్సిడెంట్ కి కారణమైన పోలీస్ ఆఫీసర్స్ ని చంపుతూ.. ఒక్క క్లూ కూడా వదలకుండా..పోలీస్ డిపార్ట్ మెంట్ కి తలనొప్పిగా మారతాడు. అతని కేస్ ని ఇన్వెస్టిగేట్ చెయ్యడానికి స్పెషల్ ఆఫీసర్ గా అపాయింట్ అయిన ఈషాకొప్పికర్ తన తెలివితేటలతో.. ఆ హత్యలు చేసింది కేశవ అని కనుక్కొని అతన్ని అరెస్ట్ చేస్తుంది. ఇంటర్వెల్ లోనే హంతుకుడు అని తెలిసిన కేశవని స్పెషల్ ఆఫీసర్ ఈషా ఎలా డీల్ చేసింది..? అరెస్టయిన కేశవ ఎలా విడుదల అయ్యాడు..? తన పగను తీర్చుకున్నాడా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల విషయానొకస్తే.. తన పర్ ఫార్మెన్స్ తో సినిమాను నిలబెట్టే సత్తా ఉన్న నిఖిల్ ఈ సినిమాకు కూడా బ్యాక్ బోన్ లా నిలిచాడు. ఓపెనింగ్ టూ ఎండింగ్ ఇంటెన్సిటీ నిండిన చూపులతో , మెచ్యూర్డ్ యాక్టింగ్ తో అద్బుతమైన హావభావాలను పలికిస్తూ.. కేశవ క్యారెక్టర్ ను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేశాడు. ఓపక్క తన పగ తీర్చుకుంటూ.. మరోపక్క రైట్ సైడ్ హార్టెడ్ పర్సన్ గా తన స్ట్రగుల్ చూపిస్తూ.. రెండు షేడ్స్ ని బాగా పోషించి మెప్పించాడు. పెళ్లిచూపులు సినిమాతో మంచి పర్ఫార్మర్ గా పేరుతెచ్చుకున్న రీతూవర్మకి ఈ సినిమాలో లిమిటెడ్ క్యారెక్టర్ దక్కినప్పటికీ ..దానిక పూర్తి న్యాయం చేసింది. ఇక ప్రియదర్శి, వెన్నెలకిషోర్, సత్య, కామెడీతో నవ్వించారు. ఇక ఒకప్పుడు తన బ్యూటీతో ఆడియన్స్ ని తెగ మెప్పించిన ఈషా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా మెప్పించడానికి ట్రై చేసింది. అయితే పూర్తిగా సక్సెస్ కాలేకపోయింది. ఇక రావురమేష్ , అజయ్, బ్రహ్మాజీ, రవిప్రకాష్ , జీవా తదితరులు అందరూ తమ పాత్ర పరిధిమేరకు 100పర్సెంట్ నటించారు.

ఇక టెక్నీషియన్స్ విషయానొకస్తే.. స్వామిరారాతో సెన్సేషనల్ హిట్ , దోచెయ్ తో డిజాస్టర్ అందుకున్న డైరెక్టర్ సుధీర్ వర్మ మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి, కసిగా, పకడ్బందీగా కేశవ స్క్రిప్ట్ ను తయారుచేసుకున్నాడు. ఈ ధ్రిల్లర్ మూవీని అవసరమైన మేరకు కామెడీతో టచప్ చేస్తూనే .. బాగానే డీల్ చేశాడు. అయితే ఫస్టాఫ్ వరకూ చాలా పక్కాగా , గ్రిప్పింగ్ గా నడిచిన సినిమా.. సెకండాఫ్ లో గాడి తప్పింది. సింగిల్ పాయింట్ తో స్టోరీ అల్లుకోవడం వల్ల, ఇంటర్వెల్ తోనే కథ క్లైమాక్స్ కి చేరుకోవడంతో, ఛాలెంజింగ్ గా మారిన సెకండాఫ్ ని కాస్త తడబడుతూ నడిపించాడు. తాను అనుకున్నంత స్తాయిలో సినిమా అవుట్ పుట్ లేకపోయినా.. చాలావరకూ మేనేజ్ చేశాడు. కెమెరామెన్ దివాకర్ మణి.. ఈ సినిమా డైరెక్టర్ కి చాలా సపోర్ట్ గా నిలిచాడు, కామెడీని, థ్రిల్లర్ మూడ్ ని అతను బ్లెండ్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. సినిమాలో చాలాచోట్ల అతని పనితనం కనిపిస్తుంది. ఇక సుధీర్ వర్మ కి పర్మెనెంట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన సన్నీ.m.r పాటలకు స్కోప్ తక్కువగా ఉండడంతో.. ఉన్నంతలోనే తన మార్క్ ఎలివేట్ అయ్యేలా మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన ప్రశాంత్ పిళ్లై సినిమాకి హార్ట్ లాంటి నేపధ్య సంగీతంతో చాలా ప్రయోగాలు చేశాడు. అవన్నీ బాగా వర్కవుట్ అయ్యి సినిమా మూడ్ ని కాపాడాయి. ప్రొడ్యూసర్ అభిషేక్ నామా.. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాకు అవసరమైన మేర ఖర్చు చేశారు. కష్ణచైతన్య, అర్జున్ కార్తీక్ ఇద్దరూ కలిసి సుధీర్ వర్మ పాయింట్ ఆఫ్ వ్యూ లో కరెక్ట్ గా సింక్ అయ్యేలా తక్కువ మాటలతో ఎక్కువ భావాలు కన్వే అయ్యేలా చేశారు. మిగతా డిపార్ట్ మెంట్స్ అన్నీ.. డైరెక్టర్ విజన్ ను ఎలివేట్ చేస్తూ.. హండ్రెడ్ పర్సెంట్ అవుట్ పుట్ ఇచ్చాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే.. ఈ సినిమాకు ఫుల్ ఫామ్ లో ఉన్న నిఖిల్ తో పాటు.. గంటా 59 నిమిషాల షార్ట్ రన్ టైమ్ బాగా హెల్ప్ అయ్యింది. బి, సి సెంటర్స్ లో కాస్త్ అటూ, ఇటూ గా రిసీవింగ్ ఉన్నా,, మల్టీప్లెక్స్ లో మాత్రం బాగా ఫేర్ చేస్తుంది అనడంలో మాత్రం నోడౌట్. థ్రిల్లర్ ఎలిమెంట్స్, కామెడీ పంచెస్, కరెక్ట్ గా కనెక్ట్ అయితే.. సినిమా రేంజ్ మరో విధంగా ఉంటుంది.

 

ప్లస్

నిఖిల్ పర్ఫార్మెన్స్

గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే

సినిమాటోగ్రఫీ

కామెడీ

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

 

మైనస్..

స్పాన్ లేని కథ

సెకండాఫ్ లో గాడి తప్పిన కథనం

రాంగ్ కాస్టింగ్

తేలిపోయిన క్లైమాక్స్

 

రేటింగ్ కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

21:17 - July 30, 2016

యంగ్ డైనమిక్ హీరో నిఖిల్ తో టెన్ టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నిఖల్ మాట్లాడారు. తన సినీ కెరీర్ గురించి వివరించారు. సినిమాల అనుభవాలను తెలిపారు. డైరెక్టర్ చందు ముండేటి, నిఖిల్ బావ అమర్ ఫ్రాంక్ కాల్ చేసి ఆటపట్టించారు. నిఖిల్ తెలిపిన మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే...'సినిమాలతో బాల్యం ఎంజాయ్ గా ఉండేది. నేను చాలా లక్కీ. నేను ఫస్టు క్లాసులో ఉన్నప్పుడు గ్యాంగ్ లీడర్ సినిమా చూశాను. ప్రతి ఆడిషన్ లో సెలెక్ట్ అయ్యేవాన్ని..కానీ సినిమా ఆగిపోయేది. అప్పుడు నాకు చాలా బాధేసేది. హ్యాపీ డేస్ తర్వాత నుంచి నా సినిమాలకు ఏ అడ్డంకి రాలేదు. హీరో అవ్వాలనే వచ్చా. సినిమా అంటే ఎంటో తెలుసుకోవాలి. అసిస్టెంట్ డైరెక్టర్ ద్వారా నేను సినిమాలకు వచ్చాను. సినిమాకి టచ్ లో ఉండాలి. హ్యాపీడేస్ ఆడిషన్స్ నాకు చాలా నచ్చాయి. కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. బ్రహ్మానందాన్ని తలచుకుంటే నవ్వు వస్తుంది. నేను ఫుడ్ ఎక్కువగా తినను. కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఫుడ్ ఎక్కువగా తినను. స్వాతి యాక్టింగ్ బాగుంటుంది. నాకు నచ్చిన హీరోయిన్ నిత్యామీనన్. నాకు రవితేజ అంటే ఇష్టం. ప్లాప్స్ వచ్చినప్పుడు లోపాలను తెలుసుకోవాలి. డైరెక్టర్ లేకపోతే సినిమా ఇండస్ట్రి లేదు. చిన్నప్పుడు లైబ్రరీలో బుక్, చర్మాస్ లో ఒక వస్తువును దొంగతనం చేశాను. లివ్ ఆండ్ లెట్ లివ్. నన్ను అర్థం చేసుకునే అమ్మాయి నాకు భార్యగా రావాలి అని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.....

 

13:01 - January 6, 2016

హైదరాబాద్: యంగ్ హీరో నిఖిల్ హీరో తన పెళ్ళి గురించి ఆసక్తికర విషయాన్నీ చెప్పాడు. మూడు పదుల వయసులోకి అడుగుపెట్టిన ఈ యంగ్ హీరోకు వాళ్ళ అమ్మ నాన్నలు చూసిన అమ్మాయినే చేసుకుంటాడట. ఈ విషయాన్నీ చెబుతూ తానూ సినిమాల్లో అమ్మాయిల వెనుక పడుతుంటాను కాని రీయల్ లైఫ్ లో మా అమ్మానాన్న లు చెప్పిన అమ్మాయినే పెళ్లాడుతా అని వివరించాడు. నన్ను అర్ధం చేసుకునే భార్య దొరికితే చాలు, నాకు తెలిసి నా కంటే మంచి మనసున్న అమ్మాయినే నాకు భార్య తెస్తారు మా అమ్మ నాన్నలు అని చెప్పేశాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది చివరి కల్లా పెళ్లి పీటలు ఎక్కుతా అని సిగ్గుపడుతూ చెప్పాడు నిఖిల్.

18:42 - December 4, 2015

తాను ఇచ్చిన 72 సీన్లు అలాగే చిత్రీకరించి ఉంటే రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమా హిట్ అయి ఉండేదని....రీసెంట్ గా రైటర్ కోన వెంకట్ కామెంట్స్ చేశాడు. ఇది నిజమేనేమో అనుకున్నారు కొంతమంది. కానీ...శంకరాభరణం సినిమా చూశాక మాత్రం అది ఖచ్చితంగా నిజం అయి ఉండదని తెలిసిపోతుంది. ఆ 72 సీన్లు అలాగే తీసి ఉంటే...బ్రూస్ లీ మరో పదిరెట్లు అట్టర్ ఫ్లాప్ సినిమా అయి ఉండేదని అర్థమైపోతుంది. ఎందుకంటే కోన వెంకట్ కథ, మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ చేసిన శంకరాభరణం అలా ఉంది మరి. రీమేక్ సినిమాలు నేటివిటీ కుదరకో, ఆర్టిస్టులు సెట్ అవకో ప్రేక్షకులకు నచ్చకుండా తయారవుతాయి...కానీ బాలీవుడ్ ఫిల్మ్ పస్ గయారే ఒబామా ఫ్రీమేక్ శంకరాభరణం మాత్రం....ఆడియెన్స్ కు పీడకలగా మిగిలిపోతుంది. అలా రూపొందించారీ సినిమాను. క్లాసిక్ సినిమా పేరును అంతే గొప్పగా చెడగొట్టారు.....

తండ్రి అప్పుల్లో మునిగిపోగా..

తండ్రి అప్పుల్లో మునిగిపోగా...బీహార్ లో తల్లికున్న ప్యాలెస్ ను అమ్మడానికి ఇండియా వస్తాడు కొడుకు నిఖిల్. ఇక్కడ ప్యాలెస్ లో రెండు డజన్ల మంది బంధువులు తిష్ట వేసి ఉంటారు. పాతికేళ్లుగా ఉంటున్నారు కాబట్టి వాళ్ల అంగీకారం లేనిదే ప్యాలెస్ అమ్మడానికి లేదు. అప్పనంగా ఉంటున్నారు కాబట్టి అమ్మడానికి వాళ్లు ఒప్పుకోరు. నిఖిల్ తల్లి ప్రేమ పేరుతో తమని వదిలేసి వెళ్లిందనే కోపంతో అతనితో మాట్లాడరు. కానీ వాళ్ల ప్యాలెస్ లో ఉండటానికి మాత్రం వాళ్లకేం ఇది లేదు. ఆ ప్యాలెస్ అమ్మడానికి రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో తంటాలు పడుతుంటాడు హీరో. ఈ లోగా...నిఖిల్ కు మరదలు వరసయ్యే నందిత...తన బావ వందల కోట్లకు వారసుడని..ఊళ్లో చాటింపు చేయిస్తుంటుంది. దీంతో...లోకల్ గా ఉన్న బంధిపోట్లు..మన కథానాయకుడిని కిడ్నాప్ చేస్తారు. సినిమా హీరో కాబట్టి...వాళ్లందరిని తన ప్లాన్లతో బురిడీ కొట్టించి....కథను సుఖాంతం చేస్తాడు......

కథపై సింపథీని క్రియేట్ చేయాల్సింది.....

కథపై సింపథీని క్రియేట్ చేయాల్సింది అందులోని పాత్రలే. క్యారెక్టర్లు ఒకటి రెండు తేడాగా ఉంటే ఫర్లేదు. మొత్తం ఉన్న పాత్రలన్నీ తలతిక్కగా ఉంటే ఆ సినిమా శంకరాభరణంలా తయారవుతుంది. తల్లి, తండ్రి అప్పుల్లో కొంపా గోడూ పోయి రోడ్డున పడితే...ఆ కష్టాలు తీర్చేందుకు ఇండియా వచ్చిన మన హీరో....తాగి తందనాలు ఆడుతుంటాడు. హీరో పరిస్థితి ఇదైతే....అమెరికా నుంచి వచ్చిన అడవి పందైనా తాను పెళ్లి చేసుకోవాడనికి ఓకే అంటుంది హీరోయిన్ నందిత. అమెరికా నుంచి వచ్చింది కమెడియన్ సప్తగిరి అనుకుని అతన్ని లవ్ చేస్తుంటుంది. హీరోయిన్ క్యారెక్టర్ ఇక్కడే కిల్ అయ్యింది. చెల్లెలు ప్రేమ పెళ్లి చేసుకుందని ద్వేషించే రావు రమేష్.. ఆ చెల్లిలి ఇంట్లోనే ఎందుకుంటున్నాడో అర్థం కాదు. ఆ ప్యాలెస్ లో పని పాటా లేకుండా తిని తిరుగుతున్న ఓ రెండు డజన్ల మంది...ఓ సందర్భంలో ఇంటి పెద్ద రావు రమేష్ ను చంపేద్దామనుకుంటారు. దీంతో ఆ పాత్రలన్నింటికీ విశ్వాసం లేనట్లయింది. ఇక రౌడీ గ్యాంగుల్లోనూ నిజాయితీ లేదు. అటు క్రూరంగా కాకుండా...ఇటు కామెడీకి లేకుండా పోయారు. ఇక మున్నీ అనే బంధిపోటు పాత్ర అంజలిది. అసలీ క్యారెక్టర్ ఎందుకు పెట్టారో సదరు క్రియేటివ్ జీనియస్ లకే తెలియాలి...

మొదటి సీన్ లోనే తెలిసిపోతుంది.....

ఇవాళ టైం బాగా లేక సినిమాకు వచ్చామని శంకరాభరణం మొదటి సీన్ లోనే తెలిసిపోతుంది. బీహార్ మనుషులు తెలుగులో మాట్లాడుతారు.. లాజిక్ వదిలేసి సినిమాలోని మ్యాజిక్ చూడండని స్క్రోల్ వేయిస్తారు..కానీ ఎన్ ఆర్ ఐ గా వచ్చిన నిఖిల్ మాత్రం అర్థంకాని అమెరికన్ యాసలో మాట్లాడుతుంటాడు. సినిమా స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ దాకా...ఒక టార్చర్ ఐతే....ఇంటర్వెల్ నుంచి పిచ్చి పీక్స్ కు చేరుకుంటుంది. అమెరికా నుంచి వచ్చిన ఎవడైనా పెళ్లి చేసుకుంటానని చెప్పి కమెడియన్ ను లవ్ చేసే హీరోయిన్ నందిత...కుటుంబ సంబంధాలు, మనుషుల మధ్య ప్రేమ గురించి ఉపన్యాసాలు ఇస్తుంటుంది. ఇలా సన్నివేశాలు, పాత్రలు, కథ, మొత్తం సినిమా గొప్పదనం చెబితే చాలదు.. చూసి తరించాల్సిందే.

సినిమాలో ఏమీ లేదు......

సాంకేతికంగానూ శంకరాభరణం సినిమాలో ఏమీ లేదు. మ్యూజిక్ వరస్ట్ గా ఉంటే, ఎడిటింగ్ చేయడం మర్చిపోయారా అని డౌట్ వస్తుంటుంది. దర్శకత్వ పర్యవేక్షణ అనే గొప్ప విషయాన్ని వదిలేస్తే....దర్శకుడు ఉదయ్ తనతో ఇండస్ట్రీకి ముప్పు పొంచి ఉందనే సిగ్నల్స్ పంపించాడు. స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య సినిమాలతో నటనలో తన ప్రత్యేకత చూపించిన నిఖిల్...శంకరాభరణంతో ఆ గుడ్ విల్ తుడిచేసుకున్నాడు. ఇక ఇలాంటి సినిమాలకు దూరంగా ఉంటేనే ఆరోగ్యానికి మంచిదనేది ప్రేక్షకులే చెబుతున్న మాట.....

ఫ్లస్ పాయింట్స్

ఏమీ లేవు

మైనస్ పాయింట్స్

1. కథ, స్క్రీన్ ప్లే, మాటలు

2. దర్శకత్వ పర్యవేక్షణ

3. నిఖిల్

4. నందిత

5. అంజలి

Don't Miss

Subscribe to RSS - హీరో నిఖిల్