హీరో సునీల్

14:01 - December 28, 2017

'2 కంట్రీస్' సినిమా హీరో సునీల్ తో 10 టివి చిట్ చాట్ నిర్వహిచింది. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ సినిమా విశేషాలు తెలిపారు. సినిమా అనుభవాలను వివరించారు. కామెడీ చేయడం చాలా కష్టమన్నారు. సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం.. 

20:14 - September 13, 2017

హీరో సునీల్ తో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడారు. ఉంగరాల రాంబాబు సినిమా విశేషాలను వివరించారు. తన సినీ కెరీర్ పై మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:17 - February 19, 2016

ఫిల్మ్ ఇండస్ట్రీలో దర్శకుడి పని దర్శకుడు..నిర్మాత పని నిర్మాత చేయాలి...లొకేషన్లు, అక్కౌంట్స్, ఆర్టిస్టుల కోఆర్టినేషన్, ప్రొడక్షన్.. ఇలాంటి పనులు చేయాల్సిన నిర్మాత...కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వ శాఖల్లో అనవసర జోక్యం చేసుకుంటే...కాస్తో కూస్తే బెటర్ గా రావాల్సిన సినిమా అట్టర్ ఫ్లాప్ గా తయారవుతాయి. దీనికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ సునీల్ హీరోగా నటించిన కృష్ణాష్టమి...

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ కథ...

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ కథ, ఎన్ఆర్ఐ క్యారెక్టర్, కొంత కామెడీ టచ్...ఈ లైన్ తో కృష్ణాష్టమి సినిమాను తెరకెక్కికించాడు దర్శకుడు వాసువర్మ. కథలోకి వెళ్తే...రాయలసీమలో ఫ్యాక్షన్ హత్యలు చేసే ఓ ఫ్యామిలీ అంటే అక్కడి జనాలకు హడలు. కళ్లముందే నేరాలు జరుగుతున్నా...ఎవరూ నోరెత్తరు. సాక్ష్యం కోసం చూస్తున్న పోలీసులకు సునీల్ భయం లేకుండా హంతకులను చూపిస్తాడు. సాక్ష్యం చెప్పిన సునీల్ ను చంపేందుకు ఆ హంతకులు వేట మొదలుపెడతారు. ఇదంతా చిన్నప్పటి స్టోరీ. రౌడీల బారి నుంచి కొడుకును తప్పించేందుకు బాల్యంలోనే అతన్ని అమెరికా పంపిస్తాడు సునీల్ బాబాయ్. పెద్దయ్యాక ఇండియా రాకుండా ఆపుతుంటాడు. ఐతే...సొంతూరును, ఇంట్లో వాళ్లను చూడాలనే కోరికతో బాబాయ్ కి చెప్పకుండా ఇండియా వస్తాడు సునీల్. నాటకీయంగా తాను చంపుదామని వెతుకుతున్న రౌడీ ఇంటికే చేరుతాడు. ఇక అక్కడి నుంచి కథ ఎలాంటి మలుపులు తిరిగిందన్నది క్లైమాక్స్...

హీరోకు సరిపోయే కథతో సినిమా చేయాలి గానీ.....

హీరోకు సరిపోయే కథతో సినిమా చేయాలి గానీ...అప్పటికే నలుగురు హీరోలకు చెప్పిన కథను...సునీల్ రెడీగా ఉన్నాడని అతనితో తీస్తే ఇలాగే ఉంటుంది సినిమా. వాస్తవానికి కృష్ణాష్టమి ఓ స్టైలిష్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించాల్సిన సినిమా. సునీల్ ను హీరోగా పెట్టడంతో స్టైలిష్ అన్నదే లేకుండా పోయింది. ఇక యాక్షన్ సన్నివేశాలు ఉన్నా...మనోడి కామెడీ ఫేస్ కు అస్సలు సరిపోలేదు. కథలో అవకాశమున్న కామెడీని హీరోయిజం కోసం నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా కృష్ణాష్టమి ఎందుకు కొరగాని సినిమా అయ్యింది. బాగా ఉబ్బిపోయి పేషంట్ లా ఉన్నాడు సునీల్. సినిమాకు పెద్ద మైనస్ గా మారాడు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ టీవీ సీరియల్ లా ఉన్నాయి. ఖర్చు తగ్గించడం కోసం కొన్ని సీన్స్ విదేశాల్లో తీయకుండా గ్రాఫిక్స్ చేశారు. సునీల్ హీరో అని లైట్ తీసుకున్నారేమో నిర్మాతలు. ఇక పరమ రొటీన్ కామెడీ సినిమాకు మరో మైనస్ గా మారింది. ఆర్టిస్టులకు చెప్పించిన డబ్బింగ్ మొదలు...హీరోయిన్స్ నిక్కీ గల్రానీ, డింపుల్ చొపాడే ఓవరాక్షన్, కార్టూన్ క్యారెక్టర్లలా నటించే ముఖేష్ రుషి, అషుతోష్ రానా...సినిమా డ్యామేజీలో పార్ట్ అయ్యారు. డింపుల్ చొపాడే తో అసభ్యకరమైన సీన్స్ చేయించారు. ఈ సీన్స్ ఫ్యామిలీ ఆడియోన్స్ చాలా ఇబ్బందికరంగా తయారయ్యాయి....

బాగోలేని ట్యూన్స్.....

సంగీత దర్శకుడు దినేష్ ట్యూన్స్ ఒక్కటీ బాగా లేదు. ఇలాంటి సినిమాకు కనీసం పాటలన్నా బాగుండాలి. దర్శకుడిగా వాసు వర్మ మరోసారి తేలిపోయాడు. హీరోతో సహా ప్రధాన పాత్రలేవీ సహజంగా అనిపించవు. ఏదో సినిమా కోసం ప్రవర్తించినట్లు ఉంటాయి. కథను, కథనాన్ని ఆసక్తి కరంగా చెప్పకుండా...సాగదీశాడు. ఇంటర్వెల్ తర్వాత స్టోరీ పూర్తిగా అర్థమైపోతుంది. ఇక క్లైమాక్స్ వరకు ప్రేక్షకులను ఎలా థియేటర్లో కూర్చోబెట్టాలో ఈ మేకర్స్ కు అర్థం కాలేదు. దాంతో అప్పుడెప్పుడో అమెరికాలో మర్చిపోయిన పోసాని క్యారెక్టర్ ను అల్లుడిగా దించారు. ఇలా కలగాపులగం స్క్రీన్ ప్లేతో క్లైమాక్స్ కు చేరుకుంటుంది కృష్ణాష్టమి. సునీల్ సినిమాల్లో కాస్త కామెడీ ఐనా చూడొచ్చు అనుకునే ఆడియెన్స్ ఈ సినిమాపై అలాంటి ఆశలేం పెట్టుకోవద్దు....

ఫ్లస్ పాయింట్స్

ఏమీ లేవు

మైనస్ పాయింట్స్

సునీల్

ప్రొడక్షన్ వ్యాల్యూస్

పాత కథ, బోరింగ్ స్క్రీన్ ప్లే

దర్శకత్వం

రొటీన్ కామెడీ సీన్స్

సంగీతం

Don't Miss

Subscribe to RSS - హీరో సునీల్