హెబ్బా పటేల్

16:50 - November 23, 2018

అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100 సినిమాల ప్రభావం వల్ల, వాటి తర్వాత తెరకెక్కిన చాలా సినిమాల్లో, సందర్భం ఉన్నా లేకపోయినా, మూతి ముద్దులకు ఇంపార్టెన్స్ ఉండేలా చూసుకుంటున్నారు దర్శక, నిర్మాతలు. అలాంటి టైమ్‌లో కేవలం కిస్సెస్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక సినిమా రూపొందితే ఎలా ఉంటుంది? 24 కిస్సెస్.. ఆ తరహా సినిమానే. టీజర్, ట్రైలర్‌తో కుర్రాళ్లకి కంటిమీద కునుకు లేకుండా చేసిందీ సినిమా. ఈ రోజు (నవంబర్ 23) రిలీజైన 24 కిస్సెస్ ఎలా ఉందో చూద్దాం..


కథ :
ఆనంద్ (అరుణ్ అదిత్) చిన్న పిల్లలకి సంబంధించిన ఫిలింస్ తీస్తుంటాడు. పౌష్టికాహార లోపంతో అలమటించే పిల్లల కోసం ఏదైనా చెయ్యాలనుకుంటాడు. తనకి తెలిసిన సినిమా ద్వారానే ఆ సమస్య గురించి సమాజానికి తెలియ చెయ్యాలనుకుంటాడు. ఒక వర్క్‌షాప్‌‌లో ఆనంద్‌కి, శ్రీ లక్ష్మి పరిచయం అవుతుంది. అతని బిహేవియర్ నచ్చి, లవ్‌లో పడుతుంది. ఆనంద్ కూడా ఆమెని ఇష్ట పడతాడు, లివింగ్ రిలేషన్ అయితే ఓకే కానీ, పెళ్ళీ, గిల్లీ జాన్తానయ్ అంటాడు. ఇద్దరూ లవ్‌లో ఉండగానే, శ్రీ లక్ష్మికి ఆనంద్‌కి మిగతా అమ్మాయిలతో ఉన్న ఎఫైర్‌లగురించి తెలిసి అతనితో బ్రేకప్ చేసుకుంటుంది. తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఈ కిస్సెస్ స్టోరీ..

నటీనటులు & సాంకేతిక నిపుణులు : 

అరుణ్ అదిత్ తన రోల్‌కి న్యాయం చేసాడు కానీ, అసలు అతగాడి క్యారెక్టరే గందరగోళంగా ఉండడం వల్ల ఆహా, ఓహో అనడానికేం లేకుండా పోయింది. హెబ్బా పటేల్ కొన్ని సీన్స్ వితౌట్ మేకప్‌తో చెయ్యడం వల్ల డల్‌గా కనిపిస్తుంది. ముద్దు సీన్లు మినహా ఇస్తే, ఆమె గురించి చెప్పడానికేం లేదు. రావు రమేష్, సీనియర్ నరేష్ క్యారెక్టర్లు చెప్పుకోదగ్గవి కాదు. జోయ్ బారువా కంపోజ్ చేసిన పాటలు పర్వాలేదనిపించేలా ఉన్నాయి. ఉదయ్ గుర్రాల కెమెరా వర్క్ ఆకట్టుకునేలా ఉంది. సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల సినిమాకి తగ్గట్టే ఖర్చు పెట్టారు. ఇక దర్శకుడు అయోధ్య కుమార్ విషయానికొస్తే.. మిణుగురులు సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్నాడు. దాని తర్వాత అతను చేస్తున్న సినిమా అంటే కాస్తో కూస్తో అంచనాలుంటాయి. ట్రైలర్, మేకింగ్ వీడియోలో ముద్దుల మోత మోగించి, అబ్బే, ఇది ఆ టైపు సినిమాకాదు, ట్రైలర్‌లో ముద్దులే చూసారు, సినిమాలో విషయం ఉంది.. అదీ, ఇదీ అన్నాడు. కట్ చేస్తే అయోధ్య చెప్పిన దాంట్లో ఏమాత్రం వాస్తవం కాదు కదా.. అసలు సినిమాలో విషయమే లేదని తేల్చిపారేసారు ఆడియన్స్.. ఫస్ట్‌హాఫ్‌లో కొన్ని ముద్దు సీన్లు కుర్రాళ్ళకి నచ్చుతాఏమో కానీ, ఓవరాల్‌‌గా సినిమా అయితే వేస్ట్, వరెస్ట్..
24 కిస్సెస్.. ముద్దులు తప్ప మేటర్ లేదు..

తారాగణం : అరుణ్ అదిత్, హెబ్బా పటేల్, రావు రమేష్, నరేష్ తదితరులు..

కెమెరా     :   ఉదయ్ గుర్రాల 

సంగీతం  :  జోయ్ బారువా

నిర్మాతలు : సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల 

దర్శకత్వం : అయోధ్య కుమార్

 

 

11:52 - October 25, 2018

హెబ్బా పటేల్...కుర్రకారు గుండెలను కొల్లగొట్టిన భామ. 2014 సంవత్సరంలో తిరుమనం ఎనుం నిఖా చిత్రం ద్వారా తమిళ సినీ రంగంలోకి ప్రవేశించింది. తెలుగులో వచ్చిన ‘కుమారి 21 ఎఫ్’తో సంచలనంగా మారిపోయింది. ఈ సినిమా ద్వారా యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. కొన్ని చిత్రాలు చేసినా అంతగా విజయాలు సాధించలేదు. తాను బోల్డ్ రోల్స్‌ కూడా చేస్తానని వెల్లడించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.
‘24 కిస్సెస్’...లో హెబ్బా నటిస్తోంది. ఇందులో అరుణ్ అదిత్ హీరోగా నటిస్తున్నాడు. రొమాంటిక్ లవ్ డ్రామా తెరకెక్కుతున్న ఈ సినిమాను అయోధ్య కుమార్ తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. సినిమా టైటిల్ లాగానే హెబ్బా రెచ్చిపోయింది. ముద్దుల వర్షం కురిపించారు. అందచందాలను ఆరబోసిన హెబ్బా మరోసారి కనువిందు చేయనుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఓ సూపర్ హిట్ సాంగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. హెబ్బ...అరుణ్ మధ్య సన్నివేశాలను హాట్ హాట్‌గా తెరకెక్కించారు. 
మొత్తం కథని రావు రమేష్‌కు హీరో ఆదిత్ వివరిస్తుంటాడు. రావు రమేష్ డైలాగులు హాస్యాన్ని పండించే విధంగా ఉన్నాయి. యువతని ఆకర్షించేలా రొమాంటిక్ సీన్స్ రూపొందించినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 13న చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

15:24 - July 12, 2018

తెలుగులో బిగ్ బాస్ 2ఇప్పుడిప్పుడే ముదిరి పాకాన పడుతోంది. కొంతమంది సభ్యుల మధ్య వుండే గ్రూప్స్ ను సున్నితంగానే కాకుండా సూటిగా బిగ్ నిర్వాహకులు విడదీసి వారిలో వారికే పోటీలు,టార్గెట్ లు పెట్టి వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. బిగ్‌బాస్ మొద‌టి సీజ‌న్ హిట్ కావ‌డంతో బిగ్‌బాస్ రెండో సీజ‌న్ భారీ అంచనాల మ‌ధ్య మొద‌లైంది. సీజన్ 1కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పెషల్ అట్రాక్షన్ అయితే.. సీజన్ 2కి నేచురల్ స్టార్ నాని అట్రాక్షన్. కానీ ఎన్టీఆర్ ఆకట్టుకున్నంతగా నాని ఆకట్టుకోలేకపోతున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ ఎన్టీఆర్ బిగ్ బాస్ సభ్యులను అలరించేలా వ్యాఖ్యానిస్తే..నాని మాత్రం షో జరిగే పరిణామాలను..ఆ సందర్భాలను విశ్లేషిస్తు సభ్యుల వివరణలు కోరుతున్నాడు. ఆ సమయంలో సభ్యులు కొంచెం ఎమోషన్ గా మాట్లాడుతున్న సందర్భంగా నాని వాటిని సున్నితంగా కట్ చేస్తునే..పదునుగా మాట్లాడుతు..సమాధానాలు వారి ద్వారానే చెప్పిస్తుంటం విశేషం. దీన్ని పెద్ద గమనించిన పలువురు నాని ఎన్టీఆర్ లా యాంకరింగ్ చేయలేకపోతున్నాడనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ షోలో సెలబ్రిటీస్ ఎవ‌రూ పెద్దగా ఫేమ‌స్ కాక‌పోవ‌డంతో పెద్దగా ఆక‌ట్టుకోవ‌డం లేదనే వాదన కూడా వినిపిస్తోంది. దీనికితోడు హోస్‌మెట్స్ మ‌ధ్య జరుగుతున్న అర్థం పర్థం లేని తగాదాలు..సాగదీత ధోరణులు ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తున్నాయని టాక్. దీంతో షోకి సీజన్ 1కి వచ్చినంత రేటింగ్ రావట్లేదని తెలుస్తోంది.

దీంతో ఎలాగైనా మంచి రేటింగ్స్‌తో ఈ షోను ముందుకు తీసుకెళ్లాలని బిగ్‌బాస్ టీం భావిస్తోందట. దీనిలో భాగంగానే షోలోకి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా ఓ యువ హీరోయిన్‌ని తీసుకురాల‌ని బిగ్‌బాస్ టీం ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికే వైల్డ్‌కార్డు ద్వారా నందిని ఎంట్రీ ఇచ్చింది. అయితే నందిని వ‌ల్ల షోకి పెద్దగా ఉప‌యోగం లేదు. ఎందుకంటే నందిని అనుకున్నంతగా మసాలా దట్టించలేకపోతోంది. దీనికి కారణం ఆమె సాఫ్ట్ నేచర్ ధోరణి కావచ్చు. దీంతో కుమారి 21 ఎఫ్ సినిమాలో రాజ్ తరుణ్ సరసన నటించి యూత్‌కి నిద్ర పట్టకుండా చేసిన హెబ్బా ప‌టేల్‌ని ఈ షోలోకి వైల్డ్‌కార్డ్ ద్వారా తీసుకురావడానికి ప్రయ‌త్నాలు జరుగుతున్నాయని సమాచారం. కానీ ఆమె అంగీకరించిందా.. లేదా? అన్నది తెలియడం లేదు. ఈ వీకెండ్‌లో ఈ విషయమై ఒక క్లారిటీ వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

14:38 - November 3, 2017

నాగ అన్వేష్, హెబ్బా పటేల్ జంటగా 'ఏంజిల్' సినిమా రూపొందింది. 'బాహుబలి' పళని దర్శకుడిగా పరిచయం అయ్యారు. సుమన్, ప్రదీప్ రావత్, షాయాజీ షిండే, రఘుబాబు తదితరులు ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ప్రేక్షకులతో కలిసి నాగ అన్వేష్..హెబ్బా పటేల్ సినిమాను వీక్షించారు. అనంతరం టెన్ టివితో వారు ముచ్చటించారు. చిత్రానికి సంబంధించిన విశేషాలు వారు తెలియచేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

16:01 - June 14, 2017

ఇప్పుడిప్పుడే వరుస అవకాశాలు చేజిక్కించుకుంటూ వెళుతున్న 'హెబ్బా పటేల్' కు మరో సూపర్ ఛాన్స్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. తమిళంలో పాగా వేయాలని హెబ్బా అనుకొంటోంది. తెలుగులో ఘన విజయం సాధించిన '100% లవ్' ను తమిళంలో రీమెక్ చేయనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటించబోతున్నారు. అయితే ఇందులో తొలుత 'లావాణ్య త్రిపాఠి' హీరోయిన్ గా నటిస్తోందని ప్రచారం జరిగింది. అంతేగాకుండా చిత్ర యూనిట్ కూడా ఆమెను ఖరారు చేశారని టాక్. అంతలోనే 'లావణ్య' స్థానంలో 'హెబ్బా పటేల్' ను ఎంపిక చేశారని తెలుస్తోంది. గతంలో సుకుమార్ నిర్మించిన 'కుమారి 21ఎఫ్' లో హెబ్బా హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. సుకుమార్ ప్రమేయం వల్లే ఆమెకు ఈ చాన్స్ దక్కిందని పుకార్లు షికారు చేస్తున్నాయి. మరి హెబ్బాకు తమిళంలో ఎలాంటి గుర్తింపునిస్తుందో చూడాలి.

07:42 - May 28, 2017

రాజ్ తరుణ్..’ఉయ్యాల జంపాల' సినిమాతో కథనాయకుడిగా పరిచయమైన ఈ నటుడు వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ముందుకెళుతున్నాడు. హిట్ ట్రాక్ లో దూసుకెళుతున్న ఈ నటుడు తాజాగా 'అంధగాడు'తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరోసారి ‘రాజ్ తరుణ్’ తో ‘హెబ్బా పటేల్’ జత కట్టింది. ఈ సందర్భంగా టెన్ టివి వారితో ముచ్చటించింది. రోటిన్ కు భిన్నంగా ఈ పాత్రను పోషించడం జరిగిందని, సినిమా మొత్తం అంధగాడిగా ఉండనని 'రాజ్ తరుణ్' పేర్కొన్నారు. పలు సినిమాల్లో ఇద్దరం కలిసి నటించడం వల్ల అవగాహన పెరిగిందని 'హెబ్బా పటేల్' తెలిపారు. వరుసగా ఇద్దరూ కలిసి సినిమాల్లో నటించడంలో ఎంటీ అనే ప్రశ్నకు అలా జరిగిపోతోందని 'రాజ్ తరుణ్' తెలిపారు. వచ్చే సినిమాల్లో 'హెబ్బా పటేల్'తో నటించడం జరగదని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి...

20:03 - December 17, 2016

నేను నాన్న నా బాయ్ ఫ్రెండ్ సినిమా సక్సెస్ మంచి ఖుషీగా వున్న నటుడు..రాపర్..డాన్సర్..నోయల్ ఆసక్తికర అంశాలను తెలిపాడు. సినిమా గురించే బాస్కెట్ బాల్ నేర్చుకున్నాను. రాజ్ తరుణ్ పై నాకు చాలా కోపంగా వుందన్నాడు నోయల్..హెబ్బా పటేల్ ను పెళ్ళిచేసుకోవాలనుకుంటున్నాని నోయల్ తెలిపారు. ఇంతకీ ఎందుకు ఇలా అన్నాడు ఏంటీ మ్యాటర్ తెలుసుకోవాలంటే ఫుల్ ఇంటర్వ్యూ చూడాల్సిందే. నోయల్ తో మాట్లాడుతుంటే అస్సలు సమయమే తెలీనీయకుండా పంచ్ లపై పంచ్ లు వేసేస్తుంటాడు..హాయిగా నవ్విస్తుంటాడు..మరి నోయల్ తో నవ్వుల్ని పంచుకోవాలంటే ఈ వీడియో చూడండి.. 

18:57 - December 16, 2016

లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ నిర్మించిన కామెడీ ఎంటర్ టైనర్ నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ . బండి భాస్కర్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ లవ్ స్టోరీ జనాన్ని మెప్పించిందా లేదా అన్నది ఈ రివ్యూలో చూద్దాం. టాలీవుడ్ లో కొత్త కొత్త దర్శకులు, అందులోనూ కుర్ర దర్శకులు వస్తుండడం వల్ల ఒక విధంగా మంచే జరుగుతోంది. కొత్తగా ఆలోచిస్తున్నారు, కొత్తగా తీయాలని ఆలోచిస్తున్నారు, జనానికి ఏది కావాలో అదే ఇవ్వాలనుకుంటున్నారు, నేల విడిచి సాము చేయకుండా ఉన్నంతలోనే సినిమాని జనరంజకంగా మలిచి నిర్మాతలకు కాసులు కురిపించాలని తపిస్తున్నారు. అలాంటి ఓ మంచి ప్రయత్నమే నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరుకూ ప్రేక్షకుల్ని నవ్వించడమే పనిగా పెట్టుకున్నాడు కొత్త దర్శకుడు బండి భాస్కర్. అంతేకాదు కథను ఏమాత్రం డీవియేట్ చేయకుండా, తనేం చెప్పాలనుకున్నాడో అదే విషయాన్ని చాలా సెన్సిటివ్ గా స్మూత్ గా చెప్పాడు దర్శకుడు. ఒకమ్మాయి ముగ్గురు అబ్బాయిల్ని ప్రేమించి ఫైనల్ గా ఒకర్ని సెలెక్ట్ చేసుకోవాలనుకోవడం చాలా ఫన్నీ పాయింట్ . అలాంటి ఫన్నీ ఆలోచనతోనే బోలెడన్ని కామెడీ సీన్స్ రాసుకొని ప్రేక్షకులకు కావల్సిన వినోదాన్ని అందించాడు దర్శకుడు. ఈ సినిమాకు టెన్ టీవీ ఇచ్చింన రేటింగ్ కోసం ఈ వీడియో చూడండి..

Don't Miss

Subscribe to RSS - హెబ్బా పటేల్