హైకోర్టు

17:05 - November 14, 2017

హైదరాబాద్ : టీఆర్‌టీ(టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్) నోటిఫికేషన్ పై ఇంకా గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇటీవలే టీఎస్పీఎస్సీ ఈ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కానీ కొత్త జిల్లాల వారీగా కాకుండా పాత జిల్లాల వారీగా నోటిఫికేషన్ వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. దీనితో హైకోర్టులో దీనిపై పిటిషన్ దాఖలైంది. కొత్త జిల్లాల మాదిరిగా కాకుండా పాత జిల్లాల ప్రకారమే నోటిఫికేషన్ విడుదల చేయాలని పిటిషన్ లో కోరారు. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణనను వారం రోజులకు వాయిదా వేసింది. 

09:57 - November 9, 2017

ఇడ్లీ...రూ. 20...ఛాయ్ రూ. 10 ఉంటుంది కానీ ఇంత తక్కువగా ఎక్కడిస్తున్నారు అనేగా మీ ప్రశ్న..ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో వ్యాపారులు ఈ ధరలకు ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారు. తిరుమల కొండపై ఉన్న దుకాణాల్లో అధిక ధరలకు ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారని ఓ స్వచ్చంద సంస్థ హైకోర్టు మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే. దీనితో హైకోర్టు టిటిడి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధరలను తగ్గించాలని సూచించింది.

హైకోర్టు దెబ్బతో తిరుమలలో వ్యాపారులు దిగి వచ్చారు. ఇప్పటి వరకు వందల రూపాయలు దండుకున్న హోటల్ యజమానులు..మనస్సు మార్చుకున్నారు. హైకోర్టు సూచనలు..టిటిడి అధికారుల సూచనల మేరకు పలు హోటళ్ల ఎదుట ధరల పట్టీకలను ఉంచారు. రెండు ఇడ్లీల ధర మొన్నటి వరకు రూ. 25 ఉండగా..ప్రస్తుతం రూ. 7.50గా నిర్ణయించారు. ఏకంగా రూ. 15 అమ్మిన టీ ధర రూ. 5 దొరుకుతోంది. వెజిటబుల్ బిర్యానీ ధర రూ. 50 నుంచి రూ. 19... ఉప్మా ధర రూ. 20 నుంచి రూ. 9..ప్లేట్ మీల్స్ ధర రూ. 60 నుంచి రూ. 22.50కు తగ్గాయి. అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ధరలూ సగానికి పైగా తగ్గాయి. పట్టికలో చూపిన ధరలకన్నా ఎక్కువకు అమ్మితే, ఎవరికి ఫిర్యాదు చేయాలో సూచించే ఫోన్ నంబర్లను సైతం హోటళ్లలో ప్రదర్శిస్తున్నారు.

మరోవైపు నెలవారి చెల్లిస్తున్న అద్దెలు భారీగా ఉంటున్నాయని హోటళ్ల యజమానులు పేర్కొంటున్నారు. చెల్లిస్తున్న అద్దెలు భారీ స్థాయిలో ఉండడంతో తాము అధిక ధరలకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని టిటిడి అధికారులు పేర్కొంటున్నట్లు సమాచారం. కానీ ప్రస్తుతం ఉన్న ధరలు కొన్ని రోజుల వరకు ఉంటాయా ? లేదా ? అనేది చూడాలి. 

12:24 - November 8, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్య పరిష్కరించాలని టీజేఏసీ పోరు చేస్తున్న సంగతి తెలిసిందే. టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం జిల్లాల్లో యాత్రలు కూడా చేపట్టారు. అందులో భాగంగా సరూర్ నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ జరపాలని టీజేఏసీ తలపెట్టింది. కానీ తాము యాత్రలు..సభలకు ప్రభుత్వం అనుమతినివ్వడం లేదంటూ ప్రొ.కోదండరాం ఇటీవలే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాము సరూర్ నగర్ స్టేడియంలో తలపెట్టిన భారీ బహిరంగసభకు అనుమతినివ్వాలని కోదండరాం ప్రభుత్వాన్ని, పోలీసులను కోరారు. చివరకు టీజేఏసీ హైకోర్టు మెట్లు ఎక్కింది. దీనిపై బుధవారం విచారించిన హైకోర్టు సభకు అనుమతినిచ్చింది. హైకోర్టు అనుకూలంగా తీర్పునివ్వడంతో టీజేఏసీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. మూడు రోజుల్లో సభ తేదీని జేఏసీ ప్రకటించనుంది. 

19:47 - October 31, 2017
19:43 - October 31, 2017
17:32 - October 31, 2017

హైదరాబాద్ : తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ విషయంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. కమిషన్ చైర్మన్, సభ్యులను నియమిస్తామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో అఫడవిట్ దాఖలు చేసింది. ఈ అంశంపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కన్వీనర్ పద్మనాభ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు.

13:18 - October 31, 2017

ఖమ్మం : తన్విత వ్యవహారంలో కన్నతల్లి, పెంచిన తల్లి మధ్య జరిగిన వివాదం హైకోర్టుకు చేరింది. పెంపుడు తల్లి హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. ఇల్లందు పీఎస్‌లో నమోదైన ఎఫ్ ఐఆర్ ను కొట్టివేయాలని క్వాష్‌ పిటిషన్‌ వేసింది. అదేవిధంగా సీడబ్ల్యుసీ అధికారుల తదుపరి చర్యలు నిలిపివేయాలని మరో పిటిషన్‌ దాఖలు చేసింది. తన్వితను తనకే ఇచ్చేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో పేర్కొంది స్వరూపం. అయితే.. ఈ పిటిషన్లు గురువారం నాడు విచారణకు వచ్చే అవకాశం ఉంది. 

 

13:01 - October 31, 2017

హైదరాబాద్ : వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణకు 15 రోజుల్లో డబ్బులు చెల్లించాలని హైకోర్టు సూచించింది. సదావర్తి భూమలు కొనుగోలుకు సంబంధించి... ఆర్కే హైకోర్టుకు రూ.27.44 కోట్లు చెల్లించాడు. అయితే... తాజాగా తన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆర్కై హైకోర్టులో పిటిషన్‌ వేశాడు. దీనిపై విచారించిన హైకోర్టు... రెండు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఎండోమెంట్‌ శాఖను ఆదేశించింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. 

 

16:14 - October 30, 2017

హైదరాబాద్ : వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి టీఎస్ పీఎస్ సీ నిర్వహించిన గ్రూప్‌-2 పరీక్షను రద్దు చేయాలని అసెంబ్లీలో కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ఈ పరీక్ష నిర్వహణలో పలు లోపాలు జరిగాయని ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్‌ సభ దృష్టికి తెచ్చారు. ఆన్సర్‌ షీట్ల కోడిండ్‌, డీకోడింగ్‌, ఓఎమ్మార్ షీట్లను దిద్దడం వంటి తప్పులు చోటు చేసుకున్నాయన్న అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. గ్రూప్‌-2 కేసులో హైకోర్టులో ఉన్న విషయాన్ని సభ దృష్టికి తెచ్చింది. న్యాయస్థానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. 

 

20:41 - October 26, 2017

హైదరాబాద్ : టీఆర్టీ నోటిఫికేషన్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కొత్త జిల్లాల వారిగా కాకుండా పాత జిల్లాల వారిగా నోటిఫికేషన్ వేయాలని పిటిషన్ వేశారు. దీనిని హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం వారం రోజుల గడువు కోరింది. అడిషనల్ అడ్వకేట్ జనరల్ సలహా తీసుకొని అభిప్రాయం చేస్తామన్న తెలిపింది. మరో 4 రోజుల్లో టీఆర్ టీకి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

Pages

Don't Miss

Subscribe to RSS - హైకోర్టు