10Max

18:41 - February 24, 2017

టుడే అవర్ రీసెంట్ రిలీజ్  "విన్నర్ ’'. 'సాయి ధరమ్ తేజ్'  హీరోగా నటించిన ‘విన్నర్ ’ సినిమా ఇవాళ్టి మన నేడే విడుదల రివ్యూ టైం లో ఉంది. 'పిల్ల నీవు లేని జీవితం' సినిమాతో తన ఫిలిం కెరీర్ ని స్టార్ట్ చేసిన మెగా ఫామిలీ హీరో 'సాయి ధరమ్ తేజ్'.  యాక్షన్ అండ్ లవ్ ఎంటర్టైనర్ తో 'విన్నర్' గా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మెగా ఫామిలీలో చాల స్పీడ్ గా సంవత్సరానికి రెండు సినిమాలు చేస్తూ మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ కి దగ్గరైన హీరో 'సాయి ధరమ్ తేజ్'. 'విన్నర్' సినిమాలో తన ప్రేమను గెలిపించుకునే ప్రేమికుడిగా యాక్ట్ చేసాడు.

డైరెక్టర్ గోపిచంద్..
యాక్షన్ లో లవ్ మిక్స్ చేసి మాస్ ని అట్రాక్ట్ చెయ్యగల డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఇతని  డైరెక్షన్ లో వచ్చిన విన్నర్ వరల్డ్ వైడ్ గా ఇవాళ  రిలీజ్ అయింది. ఎనర్జిటిక్ హీరో సాయిధరమ్ తేజ్, బ్యూటీ టాలెంటెడ్ రకుల్ ప్రీత్ సింగ్, ట్రెండీ విలన్ జగపతిబాబు   నటించిన ఈ సినిమాకి నల్లమలపు బుజ్జి, ఠాగూర్ మధు నిర్మాతలు. ఈ సినిమా కి  థమన్ అందించిన మ్యూజిక్ ఇప్పటికే జనాల్లోకి వెళ్ళింది. ఒక క్యూట్ లవ్ స్టోరీకి హార్స్ రేస్ ని కనెక్ట్ చేసి ఆడియన్స్ని కట్టిపడేసే ప్రయత్నం చేసాడు డైరెక్టర్.

మంచి రెస్పాన్స్..
ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరియు టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ లోనే పవర్ఫుల్ డైలాగ్స్ ని చూపించిన 'సాయి ధరమ్ తేజ్' మంచి మాస్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. 'రకుల్ ప్రీత్ సింగ్' అథ్లెట్ గా నటించిన ఈ సినిమాలో స్క్రీన్ మీద గ్లామర్ ని స్ప్రెడ్ చేసింది. ఈ సినిమాలో జగపతిబాబుతో పాటు అనూప్ ఠాకూర్ మరో విలన్ గా నటించారు. మరి ఈ ‘విన్నర్ ’ సినిమా తెలుగు ఆడియన్స్ ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసింది ? ఎంత వరకు రీచింగ్ అయ్యింది ? టెన్ టివి రేటింగ్ ఎంతో వీడియో క్లిక్ చేయండి.

13:22 - February 17, 2017

స్టార్ హీరోల ఫామిలీ నుండి హీరో లు వారసులుగా రావడం చాల కామన్ పాయింట్. కానీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ స్టార్ ఫామిలీ హీరోయిన్. ఇక్కడి వరకు ఒకే అసలే తెలుగు ఇండస్ట్రీ లో తెలుగు హీరోయిన్స్ రావట్లేదు అనుకుంటున్నా ఈ టైం లో తమిళ్ సినిమా రంగంలోకి వెళ్తా అంటుంది ఈ స్టార్ ఫామిలీ హీరోయిన్. తెలుగు తెలిసిన అమ్మాయిలు హీరోయిన్స్ గా రావట్లేదు మొర్రో అని మొత్తుకుంటున్నా టైం లో మెగా మోనాలిసాలా మెరిసింది ఈ ముద్దపప్పు అమ్మాయి. 'ఆవకాయ ముద్దపప్పు' అనే వెబ్ సిరీస్ తో యూట్యూబ్ ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్ దగ్గర మార్కులు కొట్టేసింది ఈ మెగా ఫామిలీ హీరోయిన్ నిహారిక కొణిదెల. ట్రెండ్ ని కమేండ్ చేస్తున్న ఇంటర్నెట్ ని బాగా యూస్ చేసుకుంది నిహారిక. ఫస్ట్ తన స్టెప్ షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ మీద పెట్టి తనకంటూ ఒక గ్రూప్ అఫ్ ఆడియన్స్ ని క్రేయేట్ చేసుకుంది.

ఒక్క సినిమాతోనే..
మెగా ఫ్యామిలీ నుండి వచ్చినా ఎక్కడ ఫామిలీ సపోర్ట్ తీసుకోకుండా మనసుకి నచ్చిన సినిమాతో ఎంట్రీ ఇచ్చింది నిహారిక. డైరెక్టర్ రామరాజు సెకండ్ మూవీ 'ఒక మనసు సినిమా'తో 'నాగశౌర్య' పక్కన నటించిన నిహారిక ఈ సినిమా తో యాక్టింగ్ లో మెచ్యూరిటీ లెవెల్స్ ని చూపించింది. నాలుగు పాటలు, ఆరు సీన్లలో మాత్రమే హీరోయిన్ ని చూపించే సినిమాలు వరదలా వస్తున్న టైం లో 'ఒక మనసు లాంటి' హీరోయిన్ ఇంపార్టెంట్ ఉన్న సినిమా చెయ్యడం నిహారిక ఫిలిం సెలక్షన్ ఏ రేంజ్ లో ఉందొ చెప్తుంది .


విజయ్ సేతుపతి..
ప్రస్తుతం తమిళ పరిశ్రమలో మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు విజయ్ సేతుపతి చేస్తున్న కొత్త చిత్రంలో నిహారిక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు అరుముగ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే చిత్ర షూటింగ్ మొదలైందని, నిహారిక కూడా షూట్లో పాల్గొంటోందని వినికిడి. అలాగే ఈ చిత్రంలో మరో యంగ్ హీరో మణిరత్నం ‘కడలి’ ఫేమ్ గౌతమ్ కార్తిక్ కూడా నటిస్తున్నాడు. ఇకపోతే నిహారిక ప్రస్తుతం తెలుగులో ‘నాన్న కూచి’ అనే వెబ్ సిరీస్ కూడా చేస్తోంది.

21:29 - December 10, 2016

'జానకిరాముడు' సినిమా టీంతో టెన్ టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్రం డైరెక్టర్ టీ.సతీష్ బాబు, హీరోయిన్ మౌర్య పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. తమ అనుభవాలను వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:51 - November 25, 2016

టాలీవుడ్ యంగ్ హీరోల్లో 'నిఖిల్' ఒకరు. వైవిధ్యమైన చిత్రాలు ఎంచుకుంటూ ముందుకెళుతున్నాడు. ఈయన నటించిన పలు చిత్రాలు విజయవంతమయ్యాయి కూడా. తాజాగా 'ఎక్కడకు పోతావే చిన్నవాడా' అనే చిత్రంలో నటించాడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ ను తెచ్చుకుంది. ఈ సందర్భంగా 'నిఖిల్'..చిత్ర యూనిట్ తో టెన్ టివి ముచ్చటించింది. ఈ సందర్భంగా 'నిఖిల్' మాట్లాడుతూ..ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా విడుదల చేయడం పట్ల పలువురు తిట్టారని పేర్కొన్నారు. ఎందుకంటే నోట్ల రద్దు వల్ల జనాల దగ్గర డబ్బుల్లేవు అని తెలిపారు. కానీ సినిమాలో కంటెంట్ ఉంటే సక్సెస్ అవుతుందని అనుకున్నామని అందుకే సినిమాను విడుదల చేయడం జరిగిందన్నారు. చిత్రం పది కోట్ల కలెక్షన్ చేయబోతోందని, యూఎస్ లో కూడా కలెక్షన్స్ బాగా ఉన్నాయన్నారు. రెండో వారం అయినా విజయవంతంగా నడుస్తోందని, కథ మంచిగా ఉంటే ఆదరిస్తారని ఈ సినిమా రుజువు చేస్తోందన్నారు. ప్రతిది రివ్యూ బాగా ఇచ్చారని, ప్రధానంగా టెన్ టివి రివ్యూస్ చూసి ప్రేక్షకులు కదులుతుంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియాకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు 'నిఖిల్' పేర్కొన్నారు. 

15:55 - November 10, 2016

రాంచరణ్ తేజ తాజా చిత్రం 'ధృవ' ఆడియో పాటలు మార్కెట్ లో విడుదలయ్యాయి. అట్టహాసంగా ఆడియో కార్యక్రమం జరుగుతుందని ఆశించిన మెగా అభిమానులు తీవ్ర నిరాశకు గురయినట్లు తెలుస్తోంది. తమిళంలో ఘనవిజయం సాధించిన 'తని ఒరువన్‌' చిత్రాన్ని తెలుగులోకి 'ధృవ' పేరుతో 'రామ్‌చరణ్‌' హీరోగా రీమేక్‌ చేస్తున్నారు. మెగా నిర్మాత అల్లు అరవింద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. 'రాంచరణ్‌' ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి ఈ సినిమా చేస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం 'చెర్రీ' తన బాడీ ఫిట్‌నెస్‌ దగ్గర్నుంచీ, ఆహారపు అలవాట్ల వరకూ ఎన్నో మార్పులు చేసుకున్నాడని టాక్. అయితే ఈ చిత్రం ఆడియో కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇతర మెగా హీరోలు హాజరవుతారనే ప్రచారం జరిగింది. కానీ 'ధృవ' ఆడియోను బుధవారం అర్ధరాత్రి డైరెక్ట్ గా మార్కెట్ లోకి విడుదల చేశారు. డిసెంబర్ 2న 'ధృవ' చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర టీం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

09:16 - November 5, 2016

కొరిమో గ్రాఫర్ కమ్ హీరో కమ్ డైరెక్టర్ లారెన్స్ చిరంజీవి మూవీపై కన్నేశాడు. మల్టీటాలెంటెడ్ పర్సన్ మెగాస్టార్ మూవీని రిమేక్ చేయబోతున్నాడట. ఇంతకీ లారెన్స్ రిమేక్ చేస్తున్న చిరంజీవి మూవీ ఏంటో మీరు ఓ లుక్కెయండి.
'గంగ'తో భారీ హిట్టు 
స్టార్ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న లారెన్స్ హీరోగా డైరెక్టర్ గా కూడా సత్తా చూపిస్తున్నాడు. ముని సీరిస్ లైన కంచన, గంగ సినిమాలతో ఈ లారెన్స్ ఇటు నటుడిగా, డైరెక్టర్ తన టాలెంట్ చూపించాడు. గంగ సినిమాతో భారీ హిట్టు కొట్టిన మల్టీటాలెంటెడ్ ఇప్పుడు చిరంజీవి మూవీనే రిమేక్ చేయబోతుండడం విశేషంగా మారింది.
ముగ్గురు మొనగాళ్లు..
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ మూవీస్ లో ముగ్గురు మొనగాళ్లు ఒకటి. చిరు త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయమే సాధించింది. ఇందులోని మూడు క్యారెక్టర్లలో చిరు చూపించిన వైవిధ్యం.. ఆయన నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా మెగా అభిమానుల్ని ఉర్రూతలూగించింది. ఈ సినిమాను ఇప్పుడు లారెన్స్ రీమేక్ చేయబోతున్నాడట. 
మూడు రకాల పాత్రల్లో లారెన్స్
ముగ్గరు మొనగాళ్లు సినిమా నిజానికి రజనీకాంత్ హీరోగా చేసిన మూండ్రు ముగమ్ కి రిమేక్ గా తెరకెక్కింది. ఇప్పుడు ఇదే చిత్రం రిమేక్ లో లారెన్స్ సైతం మూడు క్యారెక్టర్స్ లో తన మల్టీటాలెంట్ ని మరోసారి చూపించాలని ఆశపడుతున్నాడట. ఈ చిత్రానికి నిర్మాత కూడా లారెన్సేనట. అయితే దర్శకత్వ బాధ్యతలు మాత్రం వేరే దర్శకుడికి అప్పగిస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాని ఇప్పటి జనరేషన్ కి తగ్గట్లగా డీల్ చేసే దర్శకుడి కోసం లారెన్స్ సర్చ్ చేస్తున్నాడట. గంగలో రెండు రకాల పాత్రలతో అదరగొట్టిన లారెన్స్ ఈ ముగ్గరు మొనగాళ్లు రిమేక్ లో మూడు రకాల పాత్రలతో అదుర్స్ అనిపిస్తాడేమో చూడాలి.

 

09:10 - November 5, 2016

సింగం 3గా రాబోతున్న సూర్య కొత్త చిత్రం స్టార్ట్ చేశాడు. చిన్న సినిమాతో పెద్ద హిట్టు కొట్టిన డైరెక్టర్ తో ఈ వర్సటైల్ స్టార్ న్యూ మూవీ అనౌన్స్ చేశాడు. సూర్య చేస్తున్న కొత్త మూవీ విశేషాలేంటో చూద్దాం...
24 సినిమాతో సూర్య సక్సెస్ 
ఆఫ్టర్ లాంగ్ టైం 24 సినిమా సూర్య సక్సెస్ చూశాడు. ఈ చిత్రం తమిళంలో కంటే తెలుగులోనే భారీ కలెక్షన్లను రాబట్టింది. 24విజయంతో రిలాక్స్ గా ఉన్న సూర్య సింగం 3తో బాక్సఫీసు వద్ద గర్జించడానికి సిద్ధంగా ఉన్నాడు. షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఈ మూవీ డిసెంబర్ 16న రిలీజ్ కానుంది. అయితే ఇప్పుడు సూర్య న్యూ మూవీ స్టార్ట్ చేశాడు.
సూర్య కొత్త మూవీ  
తానా సెరిందా కూట్టం అనే టైటిల్ తో సూర్య కొత్త మూవీ చేస్తున్నాడు. నాన్ రౌడీతో పెద్ద హిట్టు కొట్టిన విఘ్నేష్ శివన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను తెలుగులో నేను రౌడీగా డబ్ చేసిన సంగతి తెలిసిందే. నాన్ రౌడీ మూవీ టేకింగ్ ఫిదా అయిన సూర్య ఈ దర్శకుడితో పని చేయాలని కోరికతో ఛాన్స్ ఇచ్చినట్లు వినిపిస్తుంది.    
హీరోయిన్ గా కీర్తి సురేష్  
ఈ కొత్త సినిమాలో సూర్య పక్కన కీర్తి సురేష్ ని హీరోయిన్  ఎంపిక చేశారు. ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుందట. ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ ఈ నెల రెండో వారంలో స్టార్ట్ కానునట్లు తెలుస్తుంది. జెస్ట్ త్రీ మంథ్స్ లో షూటింగ్ కంప్లీట్ చేసి సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేయాలని యూనిట్ భావిస్తుందట. 

 

08:43 - November 5, 2016

దీపికపడుకొనే పద్మావతిగా మారుతుంది. పీకూగా వావ్ అనిపించిన ఈ లాంగ్ లెగ్స్ బ్యూటీ పద్మావతిగా మెస్మరైజ్ చేయడానికి రెడీ అయింది. త్రీబుల్ ఎక్స్ కోసం బాలీవుడ్ కి గ్యాప్ ఇచ్చిన దీపిక లేటేస్ట్ గా బీటౌన్ లో మరో బిగ్ ఛాన్స్ పట్టేసింది. దీపికపడుకొనే చేయనున్న పద్మావతి మూవీ సంగతులేంటో చూద్దాం... 
మళ్లీ బీటౌన్ లో 
బాజీరావు మస్తానీ, పీకూ సినిమాలతో దీపికపడుకొనే బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్స్ అందుకుంది. అయితే హాలీవుడ్ మూవీ త్రీబుల్ ఎక్స్ లో ఛాన్స్ రావడంతో ఈ బ్యూటీ బాలీవుడ్ సినిమాలకు నో చెప్పింది. ఇప్పుడు త్రీబుల్ ఎక్స్ మూవీ కంప్లీట్ కావడంతో మళ్లీ బీటౌన్ లో తన జోరు చూపించడానికి రెడీ అవుతుంది.  
మరో వైవిధ్యభరితమైన చిత్రం
రామ్ లీల, పికూ, బాజీరావ్ మస్తానీ చిత్రాల్లో దీపికపడుకొనే డిఫరెంట్ రోల్స్ ప్లే చేసింది. ఈ మూవీస్ సక్సెస్ కావడంతో పాటు ఈ బ్యూటీకి నటిగా మంచి పేరు తెచ్చాయి. దీంతో తాజాగా ఈ భామ మరో వైవిధ్యభరితమైన చిత్రాన్ని అంగీకరించింది. పద్మావతి టైటిల్ తో తెరకెక్కనున్న ఈ మూవీకి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్నాడు.
అందుకే అంగీకరించా..
రామ్ లీలా, బాజీరావు మస్తానీ తరువాత పద్మావతి కోసం సంజయ్ లీలా భన్సాలీతో సార్ తో వర్క్ చేయడం హ్యపీగా ఉందని చెప్పుతుంది. ఈ పాత్ర తనకి ఎంతో కొత్తగా అనిపించిందనీ, అందుకే అంగీకరించానని దీపికా సంతోష పడుతుంది. పద్మావతి సినిమాకి అదృష్టంగా భావిస్తుందట. ఈ సినిమాలోని పద్మావతి పాత్ర కోసం సంజయ్ లీలా భన్సాలీ ఊహించిన పాత్రకు 100పర్సెంట్ ట్రై చేస్తానని దీపిక చెప్పుతుంది.ఈ మూవీ ఏ నేఫథ్యంలో తెరకెక్కుతుందనే విషయంలో యూనిట్ క్లారిటి ఇవ్వలేదు.

 

13:36 - November 4, 2016

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' 'కాటమరాయుడు' షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. 'సర్ధార్ గబ్బర్ సింగ్' డిజాస్టర్ తరువాత నటిస్తున్న చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. శరత్ మరార్ నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రానికి 'కాటమరాయుడు' అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. 'పవన్' సరసన మరోసారి 'శృతి హాసన్' నటిస్తోంది. ఫ్యాక్షనిస్టు ప్రేమకథతో తెరకెక్కించనున్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఆకుల శివ ఈ చిత్రానికి కథను అందించారు. ఇదిలా ఉంటే ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి మెగాస్టార్ 'చిరంజీవి' వెళ్లినట్లు సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. 'ఖైదీ నంబర్ 150' సినిమాలోని కొన్ని సీన్స్ ను 'కాటమరాయుడు' సెట్ లో షూట్ చేస్తుండడంతో 'చిరు' 'పవన్'ని కలిసినట్లు తెలుస్తోంది. ఒకే సెట్ లో కలుసుకున్న 'చిరు', 'పవన్' లు చాలాసేపు విడిగా మాట్లాడుకునట్లు టాక్. మాట్లాడుకున్నారు. మరి ఈ విషయం నిజమా ? కాదా ? అనేది ఫొటోలు బయటపడితే తెలుస్తుంది. 

13:25 - November 4, 2016

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ మళ్లీ పుల్ బిజీ అయింది. తెలుగు తమిళంలో కలిపి ఈ బ్యూటీ ఏకంగా ఆరు సినిమాలు చేస్తుంది. అవకాశాలు లేక ఐటం బ్యూటీగా టర్న్ తీసుకుందానుకున్న కాజల్ బడా సినిమాలను లైన్ లో పెట్టి తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పకనే చెప్పుతుంది. ఇంతకీ కాజల్ చేస్తున్న ఆ కొత్త సినిమాలేంటో వాచ్ దీస్ స్టోరీ.
కాజల్ గత ఎడాది ఒకే ఒక్క సినిమా 
కాజల్ గత ఎడాది ఒకే ఒక్క సినిమా టెంపర్ చేసింది. ఇక ఈ ఎడాది ఈ బ్యూటీ నటించిన బ్రహ్మోత్సవం, సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. దీంతో తెలుగులో కాజల్ పని అయిపోయినట్లే అనుకున్నారంతా. దీనికి తోడు ఈ బ్యూటీ జనతా గ్యారేజ్ లో ఐటం సాంగ్ లో ఆడిపాడటంతో ఇక కాజల్ కెరీర్ కోలాప్స్ అంటూ కామెంట్స్ వినిపించాయి. కానీ కాజల్ ఒకేసారి ఆరు సినిమాల్లో నటిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.
ఖైదీ నెంబర్ 150లో హీరోయిన్ గా కాజల్  
ప్రస్తుతం కాజల్ మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే తేజ దర్శకత్వంలో రానా హీరోగా నటిస్తున్న మూవీలో కూడా కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ జరుపుకుంటుంది. వీటితో పాటు ఈ బ్యూటీ తమిళంలో నాలుగు బడా సినిమాలు చేస్తుంది.
ధనుష్ తో మరోసారి నటించేందుకు సైన్ 
తమిళంలో జీవా సరసన నటించిన కవాలై వేండెం సినిమా తెలుగులో ఎంత వరకు ఈ ప్రేమ టైటిల్ తో రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అదే విధంగా తలా 57మూవీలో అజిత్ కి జోడిగా నటిస్తుంది. ఇక లేటేస్ట్ గా ధనుష్ తో మరోసారి నటించేందుకు సైన్ చేసింది. ధనుష్ భార్య సౌందర్య దర్శకత్వం వహించనున్న కొత్త మూవీలో కాజల్ నే హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఫేడవుట్ అయినట్లే అనుకున్న ఈ బ్యూటీ ఇలా వరుసగా బడా సినిమాలలో పుల్ స్వీంగ్ లో ఉంది.

 

Pages

Don't Miss

Subscribe to RSS - 10Max