10tv

11:22 - February 16, 2018
11:25 - February 14, 2018

విజయవాడ : గత కొన్ని రోజులుగా ఏపీలో విభజన హామీల అమలు..ప్రత్యేక హోదా అమలు చేయాలంటూ కేంద్రంపై అధికార..విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిదే. దీనిపై ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రధానంగా ప్రతిపక్షమైన వైసీపీ ఒక్కసారిగా వ్యూహం మార్చేసింది. తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారన్న జగన్ ప్రకటనతో రాజకీయ వేడి మరింత రగులుకుంది. దీనితో టిడిపి అప్రమత్తమైంది. టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం అందుబాటులో ఉన్న కీలక నేతలు, ఎంపీలు, మంత్రులతో సమావేశమయ్యారు. జగన్ వ్యాఖ్యలతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. విభజన హామీలు..భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఏప్రిల్ 5వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగనున్న సంగతి తెలిసిందే. కానీ ఏప్రిల్ 6వ తేదీన ఎంపీలు రాజీనామా చేస్తారని జగన్ ప్రకటించడంలో ఆంతర్యం ఏమి ఉంటుందనే దానిపై చర్చించనున్నారు. 

12:37 - December 27, 2017
07:58 - September 7, 2017

హైదరాబాద్ : 10 టీవీ ఎస్టేట్‌ మేనేజర్‌ మధుసూదన్‌ రెడ్డి సంతాపసభ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. నియోకర్సర్‌ ఆధ్వర్యంలో మధుసూదన్‌ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మధుసూదన్‌ రెడ్డి మృతి ప్రజానాట్యమండలి, 10టీవీకి తీరని లోటు అని ప్రముఖ గాయకుడు జయరాజ్‌ అన్నారు. ప్రజా సమస్యలపై ఆయన ఎప్పుడూ స్పందించే వారని.. కళలను ప్రోత్సహించేవారని సినీనటుడు మాదాల రవి తెలిపారు.  

07:31 - August 4, 2017

ప్రభుత్వానికి ఇది కొత్త కాదని వచ్చిన కొత్తలో టీవీ9, ఎబీఎన్ ఆంధ్రజ్యోతిని నిషేధించారని, మీడియా అనేది ప్రజాస్వామ్యనికి నాలుగో స్థంభంలాంటిదని, పోలీసులు తమ విచక్షణ కోల్పోయి చివరికి మహిళలపై కూడా దాడి చేస్తున్నారని, పోలీసు వ్యవస్థ చట్టన్ని అధికమిస్తోందని, మల్లన్న సాగర్ వద్ద సంవత్సరం పాటు 144సెక్షన్ ఉంద నిజం కాద అని సీపీఎం నేత నంద్యాల నర్సింహ రెడ్డి అన్నారు. శాంతిభద్రతలు చేయిదటిపోయినప్పుడు మాత్రమే ఇలాంటి చర్యలు తీసుకుంటారని, పోలీసులను ఉసుగోల్పే ప్రయత్నం చేయదని టీఆర్ఎస్ నేత సమ్మరావు అన్నారు. నేరెళ్ల ఏ శాంతభద్రతలకు భంగం కల్గిందని వారిపై థర్డ్ డిగ్రీ ఉపయోగించారు. ఖమ్మంలో రైతులకు బేడిలు ఎందుకు వేశారు, మహిళ జర్నలిస్టుపై ఏ విధంగా దాడి చస్తారు అని కాంగ్రెస్ నేత బెల్లం నాయక్ అన్నారు.

 

13:10 - July 18, 2017

ఢిల్లీ : ఉపరాష్ట్రపతి పదవికి విపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ నామినేషన్ వేశారు. ఈ కార్యాక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరైయ్యారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

21:41 - July 8, 2017

పాట్నా : అక్రమ ఆస్తులకు సంబంధించి లాలూ కుటుంబంపై సిబిఐ, ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. నిన్న లాలు కుటుంబసభ్యుల ఇళ్లపై సిబిఐ దాడులు జరిపి 24 గంటలు గడవక ముందే.. తాజాగా లాలు కుమార్తె ఎంపి మీసా భారతి ఫామ్‌హౌస్‌, ఇళ్లపై ఈడీ దాడులు చేసింది. మనీ లాండరింగ్‌ కేసులో ఈడీ సోదాలు నిర్వహించింది. సుమారు 3 ఎకరాల్లో ఉన్న సైనిక్‌ ఫామ్‌ హౌస్‌ విలువ 50 కోట్లుగా ఉంది. అక్రమ ఆస్తుల కేసులో మీసా, ఆమె భర్త శైలేష్‌ గతనెల ఐటి అధికారుల ముందు హాజరైన విషయం తెలిసిందే. అతి తక్కువ ధరలకే భూములు కొనుగోలు చేసి పెద్ద మొత్తంలో ఆస్తులు కూడ బెట్టారని వీరిపై ఆరోపణలున్నాయి. మనీ లాండరింగ్‌ కేసులో మీసా భర్త శైలైష్‌ను ఈడీ ప్రశ్నించింది.

21:03 - June 29, 2017

పశ్చిమ గోదావరి : జిల్లా గరగపర్రులో.. ఎట్టకేలకు అన్యాయానికి చెరపడింది. రెండున్నర నెలలుగా దళితులకు సామూహిక బహిష్కారం విధించి.. వారికి తిండి, ఉపాధి.. ఆఖరికి వైద్యం కూడా అందకుండా వేధించిన అగ్రకుల దురహంకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మొత్తం వ్యవహారానికీ ఇందుకూరు బలరామకృష్ణంరాజు, ముదునూరు రామరాజు, కొప్పుల శ్రీనివాస్‌లే బాధ్యులుగా గుర్తించిన పోలీసులు.. ఈ ముగ్గురినీ గురువారం ఉదయం అరెస్టు చేశారు. గరగపర్రు దళితులు, రెండున్నర నెలలుగా అనుభవిస్తున్న వేదనను తీర్చేందుకూ అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. దళిత కుటుంబాలకు అవసరమైన ఉపాధి, వసతుల కల్పనకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ దిశగా చర్యలు ప్రారంభిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతోపాటే, గ్రామంలో, దళితుల బహిష్కారం అనంతరం తలెత్తిన శాంతిభద్రతల సమస్యను పరష్కరించేందుకు.. ప్రత్యేకంగా శాంతి కమిటీలను నియమించాలనీ పోలీసు శాఖ నిర్ణయించింది.

మాజీ ఎంపీ హర్షకుమార్‌ ఆమరణ నిరాహార దీక్ష
గరగపర్రులో దళితులకు సామూహిక బహిష్కారం విధించిన అగ్రకుల పెద్దలను అరెస్టు చేయడంతో.. మాజీ ఎంపీ హర్షకుమార్‌ ఆమరణ నిరాహార దీక్షను విరమించారు. దళిత సంఘాల నేతలు నిమ్మరసం ఇచ్చి ఆయనతో దీక్షను విరమింపజేశారు. భవిష్యత్తులో ఐక్య ఉద్యమాలతో అగ్రకుల దురహంకారాన్ని ఎదుర్కొంటామని హర్షకుమార్‌ స్పష్టం చేశారు. గరగపర్రు దళితులకు దన్నుగా వివిధ పక్షాల నేతలు గురువారం కూడా ఆ గ్రామంలో పర్యటించారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు, దళిత శోషణ్‌ ముక్తి మంచ్‌ జాతీయ కన్వీనర్‌ వి.శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం.. గరగపర్రును సందర్శించింది. సామూహిక బహిష్కారం వల్ల స్థానికులు ఎదుర్కొన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. దళితుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దుర్నీతిని, నిరంకుశ వైఖరిని సీపీఎం నాయకులు ఈ సందర్భంగా తప్పుబట్టారు.

రేపు జగన్ పర్యటన
అటు కాపు నేత ముద్రగడ పద్మనాభం కూడా గురువారం గరగపర్రులో పర్యటించారు. గ్రామంలోని దళితుల జీవన స్థితిగతులను తెలుసుకున్నారు. మరోవైపు, వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి కూడా శుక్రవారం గరగపర్రులో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు గ్రామంలో భత్రను మరింత కట్టుదిట్టం చేశారు. గరగపర్రు పరిసర గ్రామాల్లో కూడా పోలీసు భద్రతను పెంచారు. గరగపర్రు ఘటనను వెలుగులోకి తెచ్చి, దళితులకు న్యాయం జరిగేలా సామాజిక బాధ్యతతను సమర్థండగా నిర్వర్తించిన 10టీవీకి సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 

07:33 - June 25, 2017

రంగారెడ్డి : చిన్నారి మీనా మృతి చెందడం బాధాకరమని మంత్రి మహేందర్ రెడ్డి వెల్లడించారు. చేవెళ్ల మండలం చన్ వెళ్లి గ్రామంలో బోరు బావిలో మీనా పడిపోయిన సంగతి తెలిసిందే. ఆమె చనిపోయిందని మంత్రి ప్రకటించారు. దీనితో ఆ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..కుళ్లిపోయిన స్థితిలో చిన్నారి శరీర భాగాలు బయటకొచ్చాయని, చిన్నారి రక్షించేందుకు అన్ని విధాల ప్రయత్నించినట్లు తెలిపారు. సంఘటన జరిగిన అనంతరం తాను, ఎంపీ, కలెక్టర్, ఉన్నతాధికారులు ఇక్కడకు చేరుకోవడం జరిగిందన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు సహాయక చర్యలు కొనసాగాయన్నారు. 40-50 ఫీట్ల మధ్య మోటార్ తీయాలని అనుకోవడం జరిగిందని, మోటార్ తో పాటు పాప వస్తుందని అనుకున్నట్లు కానీ అలా జరగలేదన్నారు. 180 ఫీట్ల వరకు కెమెరాలను పంపించినట్లు, కానీ ఆ ఫలితం నెరవేరలేదన్నారు. 420 ఫీట్ల వరకు చిన్నారి వెళ్లినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఫ్లషింగ్ సహాయంతో తీయాలని ప్రయత్నించగా మీనా డ్రస్..శరీర భాగాలు బయటకు రావడం జరిగిందన్నారు. ఇలా జరగడం బాధాకరమని, చిన్నారి కుటుంబాన్ని తప్పకుండా ఆదుకుంటామన్నారు.

07:16 - June 25, 2017

క్షణక్షణం ఉత్కంఠ..చిన్నారి మీనా క్షేమంగా బయటకు రావాలి..అంటూ ప్రతొక్కరిలో ఆశ...మీనా..నేను అమ్మను..నేను వస్తున్నా..అంటూ ఆ తల్లి ఆవేదనతో చెబుతున్న మాటలు..బోరు బావి చుట్టూ తవ్వకాలు..ఆత్యాధునిక కెమెరాలతో పరిశీలన..కానీ ఇవన్నీ ఏవీ నెరవేరలేదు..ఆ చిన్నారి మీనా అనంతలోకాలకు వెళ్లిపోయింది..60గంటలుగా కొనసాగిన రెస్క్యూ చివరికి విషాదంతో ముగిసింది.
 

60గంటలు..
రంగారెడ్డి : చేవెళ్ల మండలం చన్ వెళ్లి గ్రామంలో గురువారం సాయంత్రం చిన్నారి మీనా బోరు బావిలో పడిపోయిన సంగతి తెలిసిందే. ఆ చిన్నారి మృతి చెందిందని మంత్రి మహేందర్ రెడ్డి ఆదివారం ఉదయం ప్రకటించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యాయరు. 60గంటలుగా కొనసాగిన రెస్క్యూ విఫలైమంది. దీనితో ఆ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఫ్లష్ ఔట్ పద్ధతితో చిన్నారి శరీర భాగాలు బయటకొచ్చాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం వారి స్వగ్రామానికి తరలిస్తామని అధికారులు వెల్లడించారు.

ఆదుకుంటాం - మహేందర్ రెడ్డి..
చిన్నారి మీనా మృతి చెందడం బాధాకరమని మంత్రి మహేందర్ రెడ్డి వెల్లడించారు. మీనా కుటుంబాన్ని ఆదుకుంటామని, 420 ఫీట్ల వరకు చిన్నారి వెళ్లినట్లు గుర్తించినట్లు తెలిపారు. కుళ్లిపోయిన స్థితిలో చిన్నారి శరీర భాగాలు బయటకొచ్చాయని, చిన్నారి రక్షించేందుకు అన్ని విధాల ప్రయత్నించినట్లు తెలిపారు. 40-50 ఫీట్ల మధ్య మోటార్ తీసినప్పుడు మోటార్ తో పాటు పాప వస్తుందని అనుకున్నట్లు కానీ అలా జరగలేదన్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - 10tv