10tv live
హైదరాబాద్ : సికింద్రాబాద్ కార్ఖానాలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. స్థానికంగా ఉన్న వారు భయబ్రాంతులకు గురయ్యారు. ఓ ఆయిల్ కంపెనీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కార్ఖానాలో ఆయిల్ గోదాంలో బుధవారం మధ్యాహ్నం మంటలు అంటుకున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో నుండి మంటలు పైకి ఎగబాకాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు శ్రమించారు. ఈ ఘటనతో స్థానికులు, ఇతరులు భయబ్రాంతులకు గురయ్యారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.
చిత్తూరు : జిల్లాలో తలలేని బాలిక మృతదేహం కలకలం రేపింది. పెనుమూరులో కలవగుంట జలాశయంలో తలలేని బాలిక మృతదేహం లభ్యం అయింది. క్షుద్రపూజలు చేసి బాలికను బలిచ్చారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాలికకు 12 నుంచి 14 సం.రాలు ఉంటాయని అంటున్నారు. తల లేకపోవడంతో బాలిక వివరాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేశారు. తల కోసం చుట్టుప్రక్కల గాలిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..
కామారెడ్డి : కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ 61వ జన్మదినోత్సవాన్ని కామారెడ్డిలో ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. అనంతరం కాంగ్రెస్ కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ చౌరాస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. బతుకమ్మకుంట కాలనీలో పేదలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య పరీక్షలు చేయించుకున్నవారికి మందులు, కళ్లద్దాలు పంపిణీ చేశారు.
హైదరాబాద్ : విభజన సమయంలో ఎలాంటి హామీలిచ్చారు..ఏపీ రాష్ట్రానికి కేంద్రం ఏమి ఇచ్చింది ? ప్రభుత్వం ఏమి ఖర్చు చేసింది..నిజ నిజాలు తెలుసుకొనేందుకు జనసేన అధినేత 'పవన్' స్పీడు పెంచారు. ఇప్పటికే ఉండవల్లి...జయ ప్రకాష్ నారాయణ్ తో జేఎఫ్ సీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఇతర మేధావులు..కీలక నేతలు ఉంటారని పవన్ పేర్కొన్నారు. అందులో భాగంగా పలువురు నేతలు..మేధావులతో పవన్ మాట్లాడారు.
గురువారం ఉదయం ఏపీ సీపీఎం, ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శులతో పవన్ మాట్లాడారు. శుక్రవారం నిర్వహించే సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అదే విధంగా ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి కూడా పవన్ ఫోన్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్ హాజరవుతారని రఘవీరా తెలిపారు. ఈ సమావేశం అనంతరం పవన్ ఎలాంటి నిర్ణయాన్ని వెలువరిస్తారో వేచి చూడాలి.

తూర్పుగోదావరి : రాజమండ్రి రావులపాళెంలో హర్షవర్దన్ లిటిల్‌ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు వెయ్యి అడుగుల జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. అండర్ 19 ప్రపంచ కప్ టోర్నమెంట్లో నాలుగోసారి వరల్డ్ కప్ సాధించి రికార్డ్ సృష్టించిన భారత జట్టు విజేతలకు సంఘీభావంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ర్యాలీని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు.

న్యూజిలాండ్ : అండర్ 19 వరల్డ్ కప్ లో భారత్ ఫైనల్ కు చేరింది. సెమీస్ లో పాక్ పై 203 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫైనల్లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.
హైదరాబాద్ : వినాయక చవితి పండగ సందర్భంగా.. తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు తరలివచ్చి.. గణనాథుడిని దర్శించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాణిపాకం, అయినవిల్లి, విశాఖలోని సంపత్ వినాయక ఆలయం సహా.. ప్రముఖ ఆలయాలన్నీ పండగా వాతావరణంతో కళకళలాడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనూ వినాయక ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వాడవాడలా వెలసిన గణేషులతో సందడి నెలకొంది.
హైదరాబాద్ : నగరంలో వానలు దంచికొడుతున్నాయి. తెల్లవారుజామునుంచి ఎడతెరిపి లేకుండా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్ పరిసర ప్రాంతాల్లో విద్యార్థాలు స్కూళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. రహదారులు చెరువులను తలపించడంతో.. రోడ్డు దాటేందుకు భయాందోళన చెందారు. మరోవైపు కార్యాలయాలకు వెళ్లేందుకు వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు.
లోతట్టు ప్రాంతాలు జలమయం
రహదారులు చెరువులను తలపిస్తుండగా.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలావరకు రోడ్లు దెబ్బతిన్నాయి. పంజాగుట్టలో రోడ్లను కమిషనర్ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. ఉదయం నుంచే సహాయక పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరించాలని ఇంజనీరింగ్ అధికారులు, డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....
ఢిల్లీ : ఉపరాష్ట్రపతి పదవికి విపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ నామినేషన్ వేశారు. ఈ కార్యాక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరైయ్యారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.
మేడ్చల్ : డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.. మేడ్చల్ జాతీయ రహదారిపై ధర్నా చేపట్టాయి.. వివిధ కాలేజీలనుంచి తరలివచ్చిన విద్యార్థులు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. గతంలో మేడ్చల్‌కు మంజూరైన కళాశాలను సుధీర్ రెడ్డి ఘట్కేసర్ మండలానికి మారుస్తున్నారని ఆరోపించారు.. రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు.. పోలీసుల తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. రెండువర్గాల మధ్య తోపులాటతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థుల ధర్నాకు కాంగ్రెస్, బీజేపీ నేతలు మద్దతు ప్రకటించాయి.
Pages
Don't Miss
