10tv live news update

15:32 - April 24, 2017

భూపాలపల్లి : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గోవిందరావుపేట మండలం దేవునిగుట్టలో గిరిజనులపై పోలీసులు, అటవీశాఖ అధికారులు చేసిన దాడిని సీపీఎం ఖండించింది. పదిహేడేళ్లుగా అడవిలో ఉంటూ, భూములను సాగుచేసుకుంటున్న గిరిజనులను తరిమికొట్టడాన్ని తప్పుపట్టింది. 2006 అటవీ చట్టం ప్రకారం అటవీ భూములు సాగుచేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాల్సింది పోయి, భూముల నుంచి తరిమికొడుతారా ? అని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇళ్లను తగులబెట్టి, పసు సంపదను పోలీసులు, అటవీశాఖ అధికారులు తీసుకెళ్లారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

11:32 - April 22, 2017

టాలీవుడ్ లో త్వరలో ఒక్కటయ్యే ఓ యువజంటపై రకరకాల కథనాలు వస్తున్నాయి. వీరికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ మన్మథుడు 'అక్కినేని నాగార్జున' తనయుడు 'నాగ చైతన్య', నటి 'సమంత'లు త్వరలో ఒక్కటి కాబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఇటీవలే ఎంగేజ్ మెంట్ కూడా జరిగిపోయింది. నిశ్చితార్థం జరగకముందే వీరిద్దరూ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు హల్ చల్ చేశాయి. తాజాగా నిశ్చితార్థం అనంతరం చైతూ..సమంతలు ప్రేమ జీవితంలోని మధురానుభూతుల్ని ఆస్వాదిస్తున్నారు. ఇదివరకు పలు సందర్భాల్లో కూడా 'చైతూ' గరిటె తిప్పుతున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. తాజాగా 'సమంత' ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. 'నాగచైతన్య' వంట చేస్తుండగా 'సమంత' రుచి చేస్తున్నట్లుగా ఆ ఫొటోలో కనబడుతున్నారు. తాను వంటకి సాయం చేస్తుండగా..నాగ చైతన్య గరిటె తప్పుతున్న ఈ ఫొటోలు సందడి చేస్తున్నాయి.

09:48 - April 21, 2017

ముంబై : అవినీతి భరతం పట్టాలంటే పెద్ద నోట్లు (రూ. 500, రూ. 1000) నోట్లు రద్దు ఒక్కటే మార్గమని భావించిన కేంద్రం ఆ విధంగా నిర్ణయం తీసుకుంది. అనంతరం ప్రజలకు తీవ్ర కష్టాలు ఎదురయ్యాయి. అనంతరం రూ. 2000 వేలు, రూ. 500 నోట్లను ముద్రించి చలామణిలోకి తీసుకొచ్చారు. దీనివల్ల కూడా సామాన్యుడు ఇప్పటికీ సమస్యలను ఎదుర్కొంటున్నాడు. తాజాగా అంధులు కూడా పలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. స్పర్శతో వాటి విలువను గుర్తించలేకపోతున్నారు. కొత్త నోట్లను ప్రింట్‌ చేసేటప్పుడు విలువను సూచించే అంకెలను కాస్త ఉబ్బెత్తుగా (ఎంబోసింగ్‌) ప్రింట్‌ చెయడం లేదు. దీంతో వాళ్లు రూ. 500, రూ. 2000 నోటు మధ్య తేడాను గుర్తించలేకపోతున్నట్టు జాతీయ అంధుల సమాఖ్య(ఎన్‌ఏబీ) గురువారం వెల్లడించింది. పాత నోట్లు రద్దు చేసినప్పుడే ఈ సమస్యను ఆర్‌బీఐ దృష్టికి తీసుకెళ్లామని, అయినప్పటికీ ఇంతవరకూ ఎలాంటి మార్పులను కొత్త నోట్లలో గమనించలేదని ఎన్‌ఏబీ కార్యదర్శి జొవాకిమ్‌ రాపోజ్‌ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 80 లక్షల మంది అంధులు పలు విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కొత్త పద్ధతుల్లో కొత్త నోట్లను గుర్తించే విధానాన్ని నేర్పుతున్నట్లు ముంబైలోని ఓ అంధుల పాఠశాల ఉపాధ్యాయురాలు పేర్కొన్నారు.

09:41 - April 21, 2017

ఢిల్లీ : దేశ రాజధానిలో ప్రఖ్యాత ఐదు నక్షత్రాల హోటల్ లో అది ఒకటి. ఆ హోటల్ ను ఇప్పుడు వేలం వేయబోతున్నారు. అదే..’తాజ్ హోటల్'....వేలం వేసేందుకు న్యూఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌(ఎన్‌డీఎంసీ)కి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. వేలం ఎందుకు నిర్వాహించాల్సి వస్తుందో కారణాలు విశ్లేషిస్తే..ఈ హోటల్ ను ప్రభుత్వ స్థలంలో నిర్మించారు. 33 ఏండ్ల లీజు ఒప్పందంతో ఈ హోటల్ ను టాటా గ్రూప్ నిర్వహించింది. ఈ ఒప్పందం 2011లో ముగిసిపోయింది. కానీ అప్పటి నుండి 9సార్లు లీజు గడువును టాటా గ్రూప్ కు ఎన్ డీఎంసీ పొడిగిస్తూ వచ్చింది. అద్దె విషయంలో గిట్టుబాటు కావడం లేదంటూ ఎన్ డీఎంసీ భవనాన్ని వేలం వేసేందుకు నిర్ణయించింది. వేలాన్ని టాటా గ్రూప్‌ వ్యతిరేకించడంతో ఎన్‌డీఎంసీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దాంతో వేలానికి అనుమతిచ్చిన సుప్రీంకోర్టు..వేలంలో టాటా గ్రూప్‌ దాన్ని దక్కించుకోకపోతే ఖాళీ చేసేందుకు ఆరు నెలల గడువు ఇవ్వాలని ఎన్‌డీఎంసీకి సూచించింది.

21:06 - April 13, 2017

అంబేద్కర్ పేరుతోటి చంద్రుల ఆటలు... జగ్గంపూడికాడ శిలాఫలకానికి బీటలు, అట్టడబ్బాలుమోస్తున్న జగదీశ్వర్ రెడ్డి...గంట పనికి మూడు లక్ష రూపాయల కూలీ... భవానీ ద్వీపానికి ఆంధ్రా సర్కార్ తద్దినం.. ప్రైవేట్ పరం చేసే ఆలోచన్ల నారావారు, యాదాద్రి జిల్లాల దూపకుచస్తున్న జనం... అయినా ఇసొంటివి ఎన్నిజూడలేమనం, కనిగిరి మోర్లదేలిన చంద్రన్నకానుకలు..దళారుల పాలైతున్న ప్రభుత్వ పథకాలు, మిర్యాలగూడ చెరువును మింగేస్తున్నరు...ఆకరిసూపుకోసం జనం ఎగవడ్తున్నరు... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

20:50 - April 13, 2017

జైపూర్ : రాజస్థాన్‌లో ఐటి అధికారులు చాయ్‌వాలా ఇంటి తలుపు తట్టారు. కోట్‌పుత్లీకి చెందిన లీలారామ్‌ గుజ్జర్‌ కోటి రూపాయలను పబ్లిగా బహిర్గతం చేసిన వీడియో వైరల్‌ కావడమే ఇందుకు కారణం. టీ బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్న లీలారామ్‌ ఏప్రిల్‌4న ఆరుగురు కుమార్తెలకు పెళ్లిళ్లు చేశాడు. వారికి కట్నంగా కోటి 51 లక్షల నగదును బయటకు తీసి గ్రామస్తుల ముందు గట్టిగా అరుస్తూ వాటిని లెక్క పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో కాస్తా వైరల్‌ కావడంతో డబ్బు వివరాలు లెక్క చెప్పాల్సిందిగా గుజ్జర్‌కు ఐటి శాఖ సమన్లు జారీ చేసింది. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో దానికి సంబంధించిన ఆధారాలు చూపాలని చాయ్‌వాలాను ఆదేశించారు. మరోవైపు వరకట్నం ఇవ్వడం నేరం కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. లీలారామ్‌ ఆరుగురు కూతుళ్లలో ఇద్దరు మాత్రమే మేజర్‌ అని తెలుస్తోంది. 

 

20:42 - April 13, 2017

హైదరాబాద్ : తెలంగాణ జైళ్ల శాఖను ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని జైళ్లశాఖ డీజీ వీకే సింగ్‌ తెలిపారు. గ్రాండ్‌ విజన్‌ 2025 కార్యక్రమంతో తెలంగాణాలోని ప్రతి పల్లెలో జైళ్ల ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఈ మేరకు స్థానికులకు భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు చెప్పారు.   

 

14:31 - April 13, 2017

వరంగల్ : జిల్లాలోని ఎనుమాముల మిర్చి మార్కెట్ యార్డును సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సందర్శించారు. మిర్చి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మిర్చి రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. పక్క రాష్ట్రాల్లో క్వింటాల్‌ మిర్చి రూ. 12 వేల నుంచి రూ. 14 వేలు పలుకుతుంటుంటే తెలంగాణలో ఎందుకు తక్కువగా ఉందన్నారు. మార్కెట్ లో ఆన్ లైన్ లో కొనుగోలు చేస్తునట్టు చెబుతున్నారని, మిర్చి ఇంతకంటే ఎక్కువ ఉత్పత్తి అయిన రోజులున్నాయని, అప్పుడు లేని ఇబ్బంది ఎందుకు ఏర్పడుతుందని సూటిగా ప్రశ్నించారు. అంతర్జాతీయ మార్కెట్ పడిపోయిందని చెబుతున్నారని ఇది అబద్ధమని తెలిపారు. దేశీయ మార్కెట్ లో తెలంగాణ మార్కెట్ కంటే ఎక్కువ ధరలున్నాయన్నారు. ఒక రాష్ట్రంలో రూ. 10-14 వేల రేట్లు నడుస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో రూ. 2 - రూ.5వేలు ఎందుకుందని ప్రశ్నించారు. రెండు..మూడు రోజుల్లో మిర్చి రైతులకు న్యాయం చేయకపోతే రైతులతో కలిసి మార్కెట్‌ను దిగ్బంధిస్తామని హెచ్చరించారు.

 

19:42 - April 12, 2017

అనంతపురం : నిరుపేద రోగుల డిమాండ్‌కు తగినట్లుగా 'అన్న సంజీవని మెడికల్‌ షాపుల్ని' ఏర్పాటు చేస్తామని ఏపీ మంత్రి పరిటాల సునీత తెలిపారు. అనంతపురంలో 'అన్న సంజీవిని మెడికల్‌ షాపు'ను ఆమె సందర్శించారు. ప్రభుత్వం తక్కువ ధరకు నాణ్యమైన మందుల్ని అందిస్తోందని... ప్రజలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అనంతరం అనంతపురం ప్రభుత్వ వైద్యశాలకు సునీతా వెళ్లారు. పీజీ సీట్లు మంజూరు చేయాలంటూ సమ్మె చేస్తున్న డాక్టర్లను కలిశారు. వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. 

 

16:57 - April 12, 2017

ఢిల్లీ : ఈవీఎంల ట్యాపరింగ్ అంశంపై ప్రతిపక్షాలు పోరును మరింత ఉధృతం చేశాయి. ఈ మేరకు 13 ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి భవన్ కు వెళ్లాయి. అక్కడ ప్రణబ్ ముఖర్జీతో సమావేశమై ట్యాపరింగ్ అంశంపై ఫిర్యాదు చేశాయి. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌ నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. ఇటీవల 5 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌ అంశం పెనుదుమారం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈవీఎంలతో పాటు వివిధ అంశాలపై విపక్షాలు రాష్ట్రపతికి మెమోరాండం సమర్పించాయి. దేశంలో అభద్రతాభావం నెలకొందని ఇటీవల దాద్రీ, ఉనా, అల్వార్‌, జార్ఖండ్‌, ఉధంపూర్‌లో జరిగిన హింసాత్మక ఘటనలపై పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. గోవా, మణిపూర్‌లలో రాజ్యాంగ విరుద్ధంగా బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులపై సిబిఐ, ఈడీలతో దాడులు చేయించడం ద్వారా కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌ విమర్శించారు.

Pages

Don't Miss

Subscribe to RSS - 10tv live news update