2018 ఎన్నికలు

15:30 - November 19, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల తంతులో ఒక ఘట్టం పూర్తయ్యింది. నామినేషన్ దాఖలు నవంబర్ 19వ తేదీ సోమవారం సాయంత్రం మూడు గంటలకు ముగిసింది. చివరి రోజు..కార్తీక మాసం రెండో సోమవారం..అదే రోజున ఏకాదశి కావడంతో చాలా మంది నామినేషన్ దాఖలుకు మంచి ముహూర్తంగా నిర్ణయించారు. ఆయా ఎన్నికల కార్యాలయాల వద్ద సందడి నెలకొలంది. భారీగా కార్యకర్తలు..అనుచరులు..అభిమానుల మధ్య నేతలు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలులో అధికార, ప్రతిపక్షాలకు చెందిన ప్రముఖులున్నారు. 
ఈ నెల 20న నామినేసన్ల పరిశీలన.
22 వరకు నామినేషన్ పరిశీలన ఉపసంహరణ గడువు.
డిసెంబర్ 7న తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్.
డిసెంబర్ 11న ఫలితాలు.

తెలంగాణ రాష్ట్రంలో నామినేషన్ ఆఖరి గడవు..చివరి వరకు ఉత్కంఠ. ఆయా పార్టీలు వ్యూహాలు రచిస్తూ చివరి రోజు వరకు పార్టీలు జాబితాలు ప్రకటించాయి. ప్రధానంగా మహాకూటమిలోనున్న పార్టీలు కేటాయించిన దానికన్నా అధిక సంఖ్యలో పోటీ పడుతున్నాయి. 94 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఏకంగా 100 స్థానాల్లో అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా టీజేఎస్ 14 స్థానాల్లో, టీడీపీ 13 స్థానాలకు వారి వారి పార్టీ అభ్యర్థులు నామినేషన్ ప్రమాణ పత్రాలు దాఖలు చేశారు. సీపీఐ మాత్రం 3 స్థానాలతో సరిపెట్టుకుని అభ్యర్థులతో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అయితే కొన్ని స్థానాల్లో ఫ్రెండ్లీ పోటీ ఉంటుందని ఆయా పార్టీలు ప్రకటించాయి. ఈ నెల 20వ తేదీన నామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు. నామినేషన్ ఉపసంహరణ ఈ నెల 22లోపు చేసుకోవచ్చు.

13:09 - November 15, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన గులాబీ బాస్ ముందే అభ్యర్థులను ప్రకటించేసి ప్రతిపక్షాలను అయోమయంలో పడేశారు. అంతేకాదు..ప్రచారంలో కూడా గులాబీ అభ్యర్థులు దూసుకెళుతున్నారు. మొత్తం 119 నియోజకవర్గాలున్న తెలంగాణలో 117 స్థానాలకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. మరో రెండు స్థానాలకు తొందరలోనే ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. ప్రకటించిన 117 సీట్లలో ఏ వర్గానికి ఎన్ని సీట్లు కేటాయించారనేది చూద్దాం...
ఓసీలు - 58  ఎస్సీ - 19 ఎస్టీ 12 సిక్కు - 1 బీసీ - 24 ముస్లిం - 3.
సామాజిక వర్గాల వారీగా
మాల - 7 నేతకాని - 1 యాదవ - 5 ముదిరాజ్‌ - 1 పద్మశాలి - 1 వెలమ - 12 రెడ్డి - 37 ఠాకూర్‌ - 1 కమ్మ– 6, బ్రాహ్మణ– 1, విశ్వబ్రాహ్మణ - 1 లంబాడ - 7 కోయ - 4 గోండు - 1 ముస్లిం -3 సిక్కు- 1 వైశ్య– 1  మున్నూరు కాపు - 8 గౌడ - 6 పెరిక - 1 వంజర - 1 మాదిగ - 11 

10:03 - November 15, 2018
సొంత కారు లేదు
ఆస్తుల విలువ రరూ. 22.60 కోట్లు
బంగారం..భూములు పెరిగాయి. 
కొడుకు..కోడలకు అప్పులు చెల్లించాలి.
గతంతో పోలిస్తే కేసీఆర్ అప్పులు పెరిగాయి.
అప్పులు రూ. 8.88 కోట్లు...
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సొంతకారు లేదంట. అంతేగాకుండా..కొడుకు..కోడలకు అప్పులు చెల్లించాల్సి ఉందంట. అవునండి..ఇవన్నీ కేసీఆర్ దాఖలు చేసిన ప్రమాణపత్రంలో వెల్లడించారు. గజ్వేల్ నియోజకవర్గం నుండి బరిలో ఉంటున్న కేసీఆర్ నవంబర్ 14వ తేదీ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆస్తులు..అప్పులు..కేసులు..ఇతర వివరాలతో ప్రమాణపత్రం సమర్పించారు. 
సొంతకారు లేదని, కొడుకు కేటీఆర్ కు రూ. 82 లక్షలు, కోడలు శైలిమకు రూ. 24.65 లక్షలు అప్పు కింద చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. మొత్తం ఆస్తుల విలువ రూ. 94.59 లక్షలుగా ఉందని, అప్పులు రూ. 8.88 కోట్లున్నాయని తెలిపారు. 
2018లో... 2014లో...

వ్యవసాయ భూమి 54.21 ఎకరాలు.
భూమి విలువ రూ. 6.50 కోట్లు.

వ్యవసాయ భూమి 37.70 ఎకరాలు
భూమి విలువ రూ. 4.50 కోట్లు
కేసీఆర్ పేరిట భూమి  37.70 ఎకరాలు కేసీఆర్ పేరిట భూమి  48 ఎకరాలు
వ్యవసాయేతర భూమి 2.04 ఎకరాలు వ్యవసాయేతర భూమి 2.04 ఎకరాలు
అప్పులు రూ. 8,88,47,570  రూ. 7,87,53,620
నగదు రూ. 9.90 లక్షలు  రూ. 2.40 లక్షలు
బ్యాంకు డిపాజిట్లు రూ. 4,25,61,452 రూ. 44,66,327
బంగారం 7.5 తులాలు  6 తులాలు
తెలంగాణ పబ్లికేషన్స్ లో పెట్టుబడి రూ. 4,16,25,000 రూ. 4,16,25,000 తెలంగాణ పబ్లికేషన్స్ లో పెట్టుబడి రూ. 4,16,25,000
తెలంగాణ బ్రాడ్ కాస్టింగ్ లో పెట్టుబడి రూ. 55 లక్షలు రూ. 55 లక్షలు తెలంగాణ బ్రాడ్ కాస్టింగ్ లో పెట్టుబడి రూ. 55 లక్షలు రూ. 55 లక్షలు

నివాస భవనాలు
బంజారాహిల్స్ నందినగర్ (584 చ.అ)
కరీంనగర్ తీగలగుట్టపల్లి (1,449 చ. అ) 
భవనాల విలువ : రూ. 5.10 కోట్లు

నివాస భవనాలు
బంజారాహిల్స్ నందినగర్ (584 చ.అ)
కరీంనగర్ తీగలగుట్టపల్లి (1,449 చ. అ) 
భవనాల విలువ : రూ. 5.10 కోట్లు
 
15:44 - November 14, 2018

హైదరాబాద్ : జనగామ సీటుపై తేలుస్తారా ? లేదా ? నవంబర్ 14 (బుధవారం) సాయంత్రం నాటికి తేల్చాలంటూ టీజేఎస్...కాంగ్రెస్‌కు అల్టిమేటం జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ లో ఎన్నికలు..నామినేషన్ దాఖలు కూడా ప్రారంభమైనా మహాకూటమి సీట్ల విషయంలో సర్దుబాటు కావడం లేదు. కాంగ్రెస్ 75 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. కూటమి పొత్తులో భాగంగా టీజేఎస్, టీటీడీపీ, సీపీఐ అడుగుతున్న సీట్ల విషయంలో సందిగ్ధత నెలకొంది. కాంగ్రెస్ వైఖరిపై ప్రధానంగా టీజేఎస్ గుర్రుగా ఉంటోంది. జనగామ సీటుపై కాంగ్రెస్ ఎటూ తేల్చడం లేదు. ఇక్కడి నుండి బరిలో నిలవలాలని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల యోచిస్తుండగా ఈ సీటును తమకే కేటాయించాలని టీజేఎస్ పట్టుబడుతోంది. ఏమి చేయాలో తెలియక కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. 
దీనిపై టీజేఎస్ తాజాగా అల్టిమేటం జారీ చేసింది. మూడు స్థానాల విషయంలో తొందరగా నిర్ణయం తీసుకోవాలని టీజేఎస్ సూచించింది. వరంగల్ తూర్పు విషయంలో ఎలాంటి మార్పు ఉండవద్దని కాంగ్రెస్‌ని కోరింది. టీజేఎస్ ఇచ్చిన అల్టిమేటంపై కాంగ్రెస్ స్పందిస్తుందా ? తలగ్గొతుందా ? లేదా ? అనేది చూడాలి. 

13:09 - November 4, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7వ తేదీన జరిగే ఎన్నికల్లో డబ్బు..మద్యం ప్రభావం భారీగా ఉంటుందా ? ఓటర్లను మభ్య పెట్టేందుకు అభ్యర్థులు సరంజామాను సిద్ధం చేసేస్తున్నారా ? ఈసారి జరిగే ఎన్నికల్లో భారీగా మద్యం..డబ్బు పంపిణీ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. దీనితో ఎన్నికల అధికారులు అప్రమత్తమయ్యారు. పలు చర్యలు తీసుకొనడానికి ఎన్నికల అధికారులు సిద్ధమౌతున్నారు. 
2014 ఎన్నికల్లో రూ. 76 కోట్లు ? 2018లో ?...
ఇప్పటికే పట్టుబడింది రూ. 55 కోట్లు...
కీలక నియోజకవర్గాలపై ఈసీ నిఘా ?
అన్ని మార్గాల దగ్గర చెక్ పోస్టులు
సంచార బృందాల నియామకం..నిత్యం తనిఖీలు...

Image result for Telangana Election 2018 cash and liquorడిసెంబర్ 7న జరిగే ఎన్నికల పోలింగ్ కు అధికారులు సర్వం సిద్ధం చేసేస్తున్నారు. మరోవైపు గెలుపొందేందుకు ఆయా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. మహా కూటమి పేరిట కలుస్తున్న కాంగ్రెస్, జనసమితి, టీడీపీ, సీపీఐ పార్టీలు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. ముందే అభ్యర్థులను ప్రకటించేసిన గులాబీ దళం ప్రచారం ముందంజంలో ఉంది. కానీ కొన్ని కీలక నియోజకవర్గాల్లో అధికంగా డబ్బు..మద్యం పంపిణీ చేసే అవకాశం ఉందని ఈసీ గుర్తించింది. దీనితో ఓటర్లను మభ్య పెట్టకుండా ఉండేందుకు అనుసరించాల్సిన ప్రణాళికలు రచిస్తోంది. ఓటర్లను తిప్పుకోవడానికి అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపుతారని గుర్తించింది. 2014 ఎన్నికల్లో రూ. 76 కోట్ల నగదు పట్టుబడగా, ఈ ఎన్నికల్లో ఇప్పటికే రూ. 55 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ధన ప్రవాహం అధికంగా ఉండే నియోజకవర్గాలపై క్షేత్రస్థాయి అధికారుల నుండి ఎన్నికల సంఘం నివేదిక కోరింది. 
Image result for Telangana Election 2018 cash and liquorప్రధానంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, టీపీసీసీ చీఫ్, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిలు బరిలోకి దిగే నియోజకవర్గాల్లో ఖర్చు భారీగా ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని అభ్యర్థులు సిద్ధం కావడం...డబ్బు..మద్యం ప్రభావం ఎక్కువగా ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. 
ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో డబ్బు భారీగా పట్టబడుతోంది. మద్యం, చీరలతో పాటు వివిధ రకాల వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దీనిని అరికట్టేందుకు కీలక నియోజకవర్గాలపై ప్రత్యేక నిఘా పెట్టడం జరిగిందని, ఆయా నియోజకవర్గాలకు వచ్చే అన్ని మార్గాల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వెల్లడించారు. 

15:16 - November 3, 2018

నల్గొండ : తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని తహతహలాడుతున్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుండే సమస్యలు వస్తున్నాయి. అంతర్గత విబేధాలు...పార్టీ నేతల మధ్య విబేధాలు పొడచూపుతున్నాయి. దీనితో పార్టీ పరువు కాస్తా బజారున పడుతోంది. తాజాగా మిర్యాలగూడలో కాంగ్రెస్ నిర్వహించిన సమావేశం రచ్చ రచ్చ అయ్యింది. టికెట్ తమకంటే తమకే కేటాయించాలంటూ ఆశావాహులు ఆందోళన చేశారు. స్వయంగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఎదుటే ఈ రచ్చ జరగడం విశేషం. 
సమావేశానికి సీనియర్ నేత జానారెడ్డి హాజరయ్యారు. సమావేశంలో జానారెడ్డి ఎదుటే అమరేందర్ రెడ్డి, శంకర్ నాయక్ వర్గాలు ఆందోళన చేపట్టాయి. ఇటీవలే టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం తీసుకున్న అమరేందర్ రెడ్డికి టికెట్ కేటాయిస్తారంటూ ప్రచారం జరిగింది. దీనితో మొదటి నుండి పార్టీ కోసం పనిచేస్తున్న వారు ఆందోళన చేపట్టారు. పార్టీ మారిన వారికి కాకుండా పార్టీ కోసం పనిచేస్తున్న స్థానికులకే టికెట్ ఇవ్వాలని నిరసన వ్యక్తం చేశారు. టికెట్ కోసం స్కైలాబ్ నాయక్, శంకర్ నాయక్, అమరేందర్ రెడ్డిలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

12:54 - October 27, 2018

హైదరాబాద్: మాజీ కాంగ్రెస్ నేత, టీఆర్ఎస్‌కు ఇటీవలే గుడ్ బై చెప్పిన ధర్మపురి శ్రీనివాస్ సొంత గూటికి (కాంగ్రెస్) చేరారా ? లేదా ? అనే తెగ చర్చ జరుగుతోంది. రెండు నెలలుగా కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారానికి ఇంకా ఫుల్‌స్టాప్ పడలేదా ? అంటే అవునని అనిపిస్తోంది. శనివారం డి.శ్రీనివాస్‌తో పాటు ఇతరులు హస్తినకు చేరుకున్నారు. ఇతరులు మాత్రం కాంగ్రెస్‌లో చేరారు కానీ డి.ఎస్. మాత్రం చేరలేదని టాక్ వినిపిస్తోంది. 
Image result for D Srinivas and kcrతెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావడంతో పలువురు టికెట్లు ఆశించి భంగపడి ఇతర పార్టీలోకి చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి గులాబీ తీర్థం పుచ్చుకున్న డి.శ్రీనివాస్ మాత్రం అలకబూనారు. ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పించడం లేదంటూ వార్తలు వెలువడ్డాయి. దీనితో ఆయన పార్టీ మారుతారని అప్పట్లో ప్రచారం జరిగింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఏకంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు స్వయంగా గులాబీ బాస్‌కి ఫిర్యాదు చేశారు. కేసీఆర్‌తో భేటీ అయ్యేందుకు డి.శ్రీనివాస్ ప్రయత్నించినా అవి సఫలం కాలేదు. చివరకు పార్టీ మారాలని డి.శ్రీనివాస్ నిర్ణయం తీసుకున్నారు. 
Image result for rahul gandhi and d.srinivasడీఎస్ తన రాజకీయ భవిష్యత్‌పై వేగం పెంచారు. తన అనుచరుడు ఎమ్మెల్సీ భూపతిరెడ్డిని కాంగ్రెస్ గూటికి పంపిన డీఎస్ శనివారం రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారని ప్రచారం జరిగింది. కానీ రాహుల్‌తో కొన్ని విషయాలు మాట్లాడడం జరిగిందని డిఎస్ విలేకరులకు తెలిపారు. కానీ ఏ విషయాలు మాట్లాడారో చెప్పలేదు. పార్టీలో చేరారా ? అనే ప్రశ్నకు మాత్రం మౌనమే సమాధానమిచ్చారు. మరి ఆయన కాంగ్రెస్‌‌లో చేరారా ? చేరుతారా ? అనేది రానున్న రోజుల్లో తెలియనుంది. 

14:46 - October 26, 2018

హైదరాబాద్ : ఎన్నికల ప్రచారంలో దూసుకపోతున్న గులాబీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నేత పార్టీ మారనున్నారు. పార్టీ మారనున్నారనే సమాచారంతో ఆ నేతపై వేటు వేసింది. గజ్వేల్ మాజీ శాసనసభ్యుడు, రాష్ట్ర రహదారి అభివృద్ది సంస్థ ఛైర్మన్ తూంకుంట నర్సారెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు ఆయన్ని సస్పెండ్ చేస్తున్నట్లు టీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించింది. 
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వారు టికెట్లను ఆశించారు. కానీ వారికి టికెట్లు దక్కకపోవడంతో తీవ్ర నిరుత్సహాంలో మునిగిపోయారు. తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ గత కొన్ని రోజులుగా నర్సారెడ్డి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారాలని నిర్ణయం తీసుకోవడం..కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలను ఆయన సంప్రదించినట్లు తెలు్స్తోంది. ఇటీవలే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ను కలిసినట్లు...గురువారం రాత్రి కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతితో నర్సారెడ్డి భేటీ అయినట్లు సమాచారం. శుక్రవారం పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో భేటీ అయినట్లు టాక్. అనంతరం నర్సారెడ్డి ఢిల్లీకి పయనమయ్యారు. దీనితో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. మెదక్ శాసనసభ సీటు ఇస్తామని కాంగ్రెస్ హామీనిచ్చినట్లు సమాచారం. 

12:03 - October 17, 2018

హైదరాబాద్ : ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అన్ని పక్షాలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. అవకాశం ఉన్న అన్ని వ్యవస్థలను ఉపయోగించుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు.. తెలంగాణలో రాజకీయ పరిణామాలు, పరిస్థితులు తెలుసుకునేందుకు ఏపీ ఇంటెలిజెన్స్‌ వర్గాలు రంగంలోకి దింపారు. ఈ విషయం బయటపడడంతో తెలంగాణ ఇంటెలిజెన్స్‌ కూడా అప్రమత్తమైంది. 
తెలంగాణ ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్‌ పెద్దలు దృష్టి సారించారు. ఇక్కడి పరిస్థితులు, పరిణామాలపై ఎప్పటికప్పుడు ఏపీ ఇంటెలిజెన్స్‌ అధికారులు అక్కడి ఉన్నతాధికారులకు చేరవేస్తున్నట్లు తెలంగాణ పోలీసులు గుర్తించారు. నగరంలోని పలు హోటళ్లలో మకాం వేసి ఈ తతంగాన్ని కొనసాగిస్తున్నట్లు భావిస్తున్నారు. దీంతో ఏపీ అధికారుల కదిలికలపై తెలంగాణ ఇంటెలిజెన్స్‌ వర్గాలు నిఘా పెట్టారు. 
అయితే.. ఏపీ నిఘా వర్గాలు నెల క్రితమే తెలంగాణలో దిగినట్లు సమాచారం ఉంది. తెలంగాణ జిల్లాల్లోని రాజకీయ పరిస్థితి ఏంటి ? టీడీపీ ఉనికి చాటుకోవడానికి ఇంకా అవకాశం ఉన్న ప్రాంతాలేంటి ? మహాకూటమిలో టీడీపీ చేరితే ఎన్ని సీట్లు కోరవచ్చు ? అనే అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు తన ఇంటెలిజెన్స్‌ అధికారులతో ఆరా తీసినట్లు బయటకు పొక్కడంతో పెద్ద దుమారం చెలరేగింది. ఇక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో ఈ కార్యక్రమం మరింత ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. అధికారులు మరో అడుగు ముందుకేసి ప్రముఖ హోటళ్లలో బస చేస్తూ.. తెలంగాణ పోలీసు అధికారులపైనే రెక్కీ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఇంటిలిజెన్స్‌ వర్గాలు గుర్తించినట్లు సమాచారం. 
సాధారణంగా ఎన్నికల సమయంలో ఇంటెలిజెన్స్‌ అధికారులు సమాచార గోప్యత, పని వెసులుబాటు కోసం ప్రైవేట్‌ చోట నుంచి పని చేసేందుకు తమ పరిధిలోని హోటళ్లను ఎంచుకుంటారు. అయితే ఏపీ ఇంటెలిజెన్స్‌ అధికారులు తెలంగాణలో అనధికారికంగా దిగడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ అధికారులు వ్యూహాత్మకంగానే కొన్ని హోటళ్లను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే.. రాజకీయ అంశాలపై ఆరా తీసే అధికారం ఏపీ ఇంటెలిజెన్స్‌ అధికారులకు ఉండదని.. న్యాయవాదులంటున్నారు. మొత్తానికి దాదాపు 60 మంది నిఘా అధికారులను హైదరాబాద్‌కు పంపించినట్లు సమాచారం. అలాగే వందమంది ఏపీ ఇంటెలిజెన్స్‌ అధికారులు ఖమ్మం, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌లో ఆంధ్రావాళ్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలతో పాటు... నిజామాబాద్‌, మెదక్‌, వరంగల్‌ జిల్లాల్లో మోహరించినట్లు తెలుస్తోంది. టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయనే సమాచారాన్ని సేకరిస్తున్నట్లు సమాచారం. ఏదిఏమైనా ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ఇంటెలిజెన్స్‌ అధికారులు బిజీబిజీగా ఉన్నారు. ఎప్పటికప్పుడు ఎవరికి దొరికిన సమాచారం వారు చేరవేస్తున్నారు. 
 

11:36 - September 14, 2018

హైదరాబాద్ : కాషాయం దళం ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనుంది. పార్టీ జాతీయ  అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ రాష్ట్రంపై ప్రధానంగా దృష్టి పెట్టారు. పక్కా ప్రణాళిక, వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలో అమిత్ షా అడుగు పెట్టనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న అనంతరం బషీర్ బాగ్ లోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కీలక నేతలతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో ఎలా ప్రచారం నిర్వహించాలి ? తదితర వివరాలను ఆయన నేతలకు దిశా..నిర్దేశం చేయనున్నారు. 

మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వ పథకాలను...రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని షా నిర్దశం చేయనున్నారు. ఈ ఎన్నికల్లో ఒంటిరిగా పోటీ చేయాలని బీజేపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల్లో ఉన్న నేతలను ఆకర్షించడం...బీజేపీపై అభిమానం ఉన్న వారిని పార్టీలోకి చేరిపించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసే వారిపై పార్టీ అధిష్టానం నిర్వహించినట్లు, వారికి టికెట్ కేటాయించనున్నటు్ల సమాచారం. మరి షా పర్యటన తెలంగాణలో బీజేపీ నేతలకు బూస్ట్ ఇస్తుందా లేదా ? అనేది చూడాలి. 

Don't Miss

Subscribe to RSS - 2018 ఎన్నికలు