2019

10:59 - April 23, 2018

ఢిల్లీ : 2019లో ఎన్నికలు...ఇప్పటి నుండే పలు రాజకీయ పార్టీలు వ్యూహాల్లో నిమిగ్నమై పోయాయి. ప్రజలను ఆకర్షించేందుకు హామీలు గుప్పిస్తున్నారు. అందులో భాగంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ఇప్పటి నుండే వ్యూహాలు రచిస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రాజ్యాంగ పరిరక్షణ పేరిట దేశ వ్యాప్తంగా కార్యక్రమం చేపడుతోంది. సోమవారం తాల్కటోరా స్టేడియ నుండి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు, వివిధ రాష్ట్రాల కార్యకర్తలు పాల్గొననున్నారు. 
దళితులు, అణగారిన వర్గాలపై దాడులు జరుగుతుండడంపై కాంగ్రెస్ ఈ కార్యక్రమం చేపట్టింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానాలను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా ఎంచుకుంది. దేశంలోని 17 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీలను తమవైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్ యత్నిస్తోంది. 

19:45 - January 25, 2018
06:36 - November 8, 2017

హైదరాబాద్ : 2019లో అధికామే లక్ష్యంగా పని చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్‌... వివిధ రకాల వృత్తి నిపుణులను పార్టీలో చేర్చుకుంటోంది. ప్రొఫెషనల్స్‌కు స్థానం కల్పించడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్‌ నాయకులు భావిస్తున్నారు. వృత్తి నిపుణులను పార్టీలో చేర్చుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ అనుసరిస్తున్న వ్యూహంపై 10 టీవీ ప్రత్యేక కథనం.. 2019 అసెంబ్లీ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్‌ దృష్టి పెట్టింది. పార్టీని ప్రజలకు మరింత చేరువచేసే లక్ష్యంలో భాగంగా వృత్తి నిపుణులకు వల వేస్తోంది. వివిధ రంగాలకు చెందిన ప్రొఫెషనల్స్‌ను పార్టీలో చేర్చుకుంటోంది.

ఆలిండియా ప్రొఫెషనల్‌ కాంగ్రెస్‌ వింగ్‌కు ఎంపీ శశిథరూర్‌ చైర్మన్‌గా ఉన్నారు. పీసీసీల్లో కూడా ప్రొఫెషనల్‌ కాంగ్రెస్‌ విభాగాలను ఏర్పాటు చేస్తున్నారు. టీపీసీసీ ప్రొఫెషనల్‌ విభాగం చైర్మన్‌గా దాసోజు శ్రవణ్‌.. బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఐటీ, బ్యాంకింగ్‌ రంగ నిపుణులు, వ్యాపారులను పార్టీలో చేర్చుకుంటున్నారు. వీరితో రోజువారీ సమావేశాలు నిర్వహిస్తూ... పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలను వివరిస్తున్నారు. పాలకపక్షాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసే విధంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రొఫెషనల్‌ కాంగ్రెస్‌ సౌత్‌ ఇండియా కోఆర్డినేటర్‌గా ఎమ్మెల్యే గీతారెడ్డి వ్యవహరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వృత్తి నిపుణులను పార్టీలోకి ఆహ్వానించే బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం జంట నగరాల్లో రెండు కమిటీలు పని చేస్తున్నాయి. దశలవారీగా తెలంగాణ మొత్తం విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.  

12:16 - October 12, 2017

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వరాలు ఎందుకు ప్రకటించేస్తున్నారు. మూడేండ్ల అనంతరం ఇప్పుడే ఎందుకు వరుసగా సంక్షేమ పథకాల అమలు చేస్తున్నారు ? రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదంగా ఉన్న భూములను ఎందుకు రెగ్యులరైజ్ చేస్తున్నారు ? మధ్యతరగతి ప్రజల కోసం కొత్త పథకం తెస్తున్నారా ? కొత్త కొత్త పథకాలు..వరాలు దేని కోసం? అనే చర్చ జరుగుతోంది.      బాబు ప్రస్తుతం దూకుడు పెంచేశారు..వరుసగా పథకాలు..సంక్షేమ పథకాలు ప్రకటించేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో భాగంగా బాబు ఇప్పటి నుండే వ్యూహాలు రచిస్తున్నారని పొలిటికల్ అనలిస్టుల టాక్. 2018-2019 లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధమేనని బాబు ఇదివరకే ప్రకటించేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఇటీలవలే నంద్యా..కాకినాడలో జరిగిన ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించడంతో బాబు మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. మరోసారి మెజార్టీ సాధించాలని బాబు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచే విధంగా ఇప్పటి నుండే ప్రయత్నాలు చేయాలని కింది కార్యకర్తలకు దిశా..నిర్దేశం చేస్తున్నారు. అందులో భాగంగా పార్టీ నేతలు..కార్యకర్తలతో అప్పుడప్పుడు భేటీ అవుతూ పలు సూచనలు..సలహాలు అందచేస్తున్నారు. ప్రభుత్వం అందచేస్తున్న సంక్షేమ పథకాలు..ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బాబు పేర్కొంటున్నారు. ఇంటింటికి టిడిపి పేరిట ఓ కార్యక్రమాన్ని రూపొందించి ప్రజల మధ్యలోకి వెళుతున్నారు.

అన్ని శాఖలపై రివ్యూ నిర్వహించిన బాబు ప్రస్తుతం..పోలవరం..అమరావతిపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ఎలాగైనా 2019 ఎన్నికల్లో వీటిని పూర్తి చేయాలని..రాష్ట్రంలోని 28 ప్రాజెక్టులను ఓ కొలిక్కి తీసుకరావాలని బాబు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పెన్షన్లు..ఇంటి నిర్మాణాలు..చంద్రన్న పెళ్లికానుక..ఎన్టీఆర్ సృజల స్రవంతి..తదితర పథకాలను ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవలే నూతన గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. చంద్రన్న బీమా కింద ప్రమాదవశాత్తు కింద ఎవరైనా మరణిస్తే రూ. 5లక్షలు ఇచ్చే వారు. ఇప్పుడు సహజ మరణానికి రూ. 2లక్షలు అందిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే ప్రత్యర్థి అయిన వైసీపీని కూడా టార్గెట్ చేశారు. ఆ పార్టీలో ఉన్న కొంతమందిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. బలహీనపరిచేలా ప్లాన్స్ రూపొందిస్తున్నట్లు, రాయలసీమలో పార్టీ బలహీనంగా ఉందనే కారణంతో రెడ్డీ సామాజిక వర్గానికి చెందిన కీలకనేతలను పార్టీలో చేర్చుకొనేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.

కానీ ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలపై బాబు దృష్టి సారించడం లేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని రైతులు..ఇతరులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో బాబు ఇచ్చిన హామీలు ఏమాత్రం అమలు చేయలేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు. కేవలం ఎన్నికల కోసమే బాబు పలు స్కీంలు ప్రవేశ పెడుతున్నారని ఆరోపణలున్నాయి. మరి బాబు చేస్తున్న ప్లాన్స్ వర్కవుట్ అవుతాయా ? లేదా ? అనేది చూడాలి. 

07:51 - September 20, 2017

వచ్చే ఎన్నికల్లో తమదే విజయమని సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దీనిపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒక్క విజయాన్ని అడ్డు పెట్టుకుని ఎలా బేరీజు వేస్తారని వైసీపీ ప్రశ్నిస్తోంది. మరో వైపు కృష్ణా అక్రమ నిర్మాణాలపై హైకోర్టు 8 మంది అధికారులతో పాటు 49 మంది అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఇందులో ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న అతిథి గృహ యజమానికి కూడా నోటీసులు వెళ్లాయి. వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. నదీ పరివాహక ప్రాంతాలను పూర్తిగా ఆక్రమించేస్తున్నారని వైసీపీ పేర్కొంటోంది. దీనిపై టెన్ టివి చర్చా కార్యక్రమంలో పద్మజారెడ్డి (వైసీపీ), చందు సాంబశివరావు (టిడిపి), ఆళ్ల రామకృష్ణారెడ్డి (వైసీపీ) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

21:48 - August 9, 2017

హైదరాబాద్ : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సచివాలయంలో మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అనేక అంశాలతో పాటు.. తన వ్యక్తిగత అంశాలను మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు. నేరెళ్ల ఘటన దురదృష్టకరమన్నారు కేటీఆర్‌. బాధితులను చూస్తుంటే... పోలీసుల అత్యుత్సాహం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. బాధితులను రిమాండ్‌కు తరలించే వరకు తనకు ఈ విషయం తెలియదని... వాహనాలను దగ్ధం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందన్నారు. ప్రజలను కొట్టించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని... డీఐజీ నివేదిక రాగానే పోలీసులపై చర్యలు ఉంటాయన్నారు. ఇసుక మాఫియాను అరికట్టిన ఘనత తమ ప్రభుత్వానిదేనని... ఆదాయం పెరగడమే ఇందుకు నిదర్శనమన్నారు కేటీఆర్‌. హిమాన్స్‌ మోటార్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని... ఏడేళ్ల క్రితమే కార్యకలాపాలు నిలిపివేశామన్నారు. ఈ విషయంలో తనపై విమర్శలు చేయడం బాధాకరమన్నారు.

కోర్టుకు వెళ్లేందుకైనా సిద్దం
ఇక 2019 ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌దే అధికారమని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో... ఐదు సీట్లను గెలవలేదని కేటీఆర్‌ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ఎయిమ్స్‌, ఐఐఎం, ఐఐటీఆర్‌, హైకోర్టు, బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ సహా దేనికీ కేంద్రం సహకరించడం లేదన్నారు. ఇలా అయితే రాష్ట్రంలో బీజేపీ ఎలా బలపడుతుందన్నారు. ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టులపై జీఎస్టీ 5 శాతానికి తగ్గించాల్సిందేననన్నారు కేటీఆర్‌. చేనేత, గ్రానైట్‌పైనా కూడా జీఎస్టీ తగ్గించాలన్నారు. ఇప్పటివరకు జీఎస్టీపై ఏ రాష్ట్రం కోర్టుకు వెళ్లలేదని... కేంద్రం ఈ అంశాలను పరిశీలించకపోతే కోర్టుకు వెళ్లేందుకైనా సిద్దమన్నారు కేటీఆర్‌. ఇక ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌పై స్పందించిన కేటీఆర్‌... రాజధానిలో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క అందరూ తమకు రాజకీయ శత్రువులేనని స్పష్టం చేశారు.

హరీష్ రావుతో విభేదాలులేవు
ఇక హరీష్‌రావుతో విభేదాలున్నాయంటూ వస్తున్న వార్తలపై కేటీఆర్‌ స్పందించారు. తనకు, హరీష్‌రావుకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని... అన్ని విషయాల్లోనూ తమకు క్లారిటీ ఉందన్నారు. 2029లో కూడా కేసీఆరే సీఎంగా ఉండాలని కోరుకుంటునన్నారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం సిరిసిల్ల నుంచే పోటీ చేస్తానని కేటీఆర్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ నగర వాసులు ఎన్నో రోజుల నుంచి కలలు కంటున్న మెట్రో మొదటి దశను ఈ ఏడాదే ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్లు కేటీఆర్‌ తెలిపారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా మెట్రోరైలు ప్రారంభిస్తామన్నారు.

07:59 - July 17, 2017

గుంటూరు : ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయింది. మరో రెండేళ్లలో ఎన్నికలు ఉన్నాయి. అమరావతిలో సచివాలయం నిర్మించినా, పార్టీల కోసం ప్రత్యేక భవనం లేదు. దీంతో పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలతో భేటీలు నిర్వహించాలంటూ ఏదో ఒక ఫంక్షన్‌ హాల్లో ఏర్పాటు చేయాల్సి వస్తోంది. ఇకపై ఇలాంటి ఇబ్బందులు తొలగనున్నాయి. టీడీపీ ముఖ్యనేతలు చంద్రబాబును కలవాల్సి వస్తే అమరావతిలోని సచివాలయానికి వెళ్లాల్సి వస్తోంది. గుంటూరులో ఉన్న టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో సరైన వసతులు లేవు. పైగా ఇది అమరావతికి 35 కి.మీ. దూరంలో ఉంది. గుంటూరు టీడీపీ ఆఫీసులు పార్టీ కార్యక్రమాలను అనువుగా లేకపోవడంతో ఇప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రత్యేక షెల్టర్...
టీడీపీ కార్యాలయం కోసం గుంటూరు జిల్లా మంగళగిరిలో స్థలం కేటాయించారు. కొత్త ఆఫీసు ఇప్పట్లో సిద్ధమయ్యే అవకాశాలు లేవు. దీంతో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద భారీ షెడ్‌ నిర్మిస్తున్నారు. చంద్రబాబు సందర్శకులను కలుసుకోవడంతోపాటు టీడీపీ సమావేశాలకు వినియోగించుకునేందుకు వీలుగా దీనిని సిద్ధం చేస్తున్నారు. వీలైంత త్వరగా దీనిని పూర్తి చేయాలని తెలుదేశం అధినాయకత్వం నిర్ణయించింది. చంద్రబాబు సచివాలయం నుంచి రాగానే పార్టీ నేతలతో సమావేశమయ్యేందుకు వీలుగా తీర్చిదిద్దుతున్నారు. ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌రావుకు షెడ్‌ నిర్మాణ బాధ్యతలను అప్పగించారు.

త్వరలో వైసీపీ కూడా 
మరో వైపు ప్రతిపక్ష వైసీపీ కూడా త్వరలో అమరావతి నుంచి కార్యక్రమాలు ప్రారంభించబోతోంది. పార్టీ అధినేత జగన్‌ అమరావతి నుంచి రాజకీయ వ్యూహ రచన చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లోని లోటస్‌ పాండు నుంచి అమరావతికి మకాం మార్చేందుకు తాడేపల్లిలో నివాసాన్ని సిద్ధం చేస్తున్నారు. విజయవాడలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకోబోతోంది. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్న టీడీపీ, వైసీపీ అమరావతి కేంద్రంగా రాజకీయాలను వేడెక్కించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. 

13:55 - July 12, 2017

తూర్పు గోదావరి : ఈ జిల్లా ఏపీలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలున్న జిల్లా. ఇక్కడ పాగా వేస్తేనే సీఎం కుర్చీకి చేరువ‌కాగ‌లుగుతార‌న్నది రాజకీయవర్గాల నిశ్చితాభిప్రాయం. ఇది గత ఎన్నికల్లో కూడా నిరూపితం అయింది. జిల్లాలోని మొత్తం 19స్థానాల్లో టీడీపీ, 13, బీజేపీ 1 స్థానంలో విజయం సాధించగా.. వైసీపీకి 5 స్థానాలు మాత్రమే దక్కాయి. వారిలో కూడా ఇద్దరు టీడీపీ కండువా కప్పుకున్నారు. 2014 ఎన్నికల అనంతరం ఓటమిపాలయిన ప‌లువురు నేత‌లు పార్టీకి దూర‌మ‌య్యారు. రాజ‌మండ్రి సిటీ నుంచి పోటీ చేసిన బొమ్మన రాజ్ కుమార్, మండ‌పేట నుంచి బ‌రిలో దిగిన గిరిజాల వెంక‌ట‌స్వామి నాయుడు పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఇటు జిల్లా నుంచి గెలిచిన ఐదుగురిలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వ‌రుపుల సుబ్బారావు సైకిల్‌పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో జిల్లావైసీపీలో స్తబ్దత నెలకొంది. రాజ‌మండ్రి రూర‌ల్ నుంచి పోటీ చేసిన ఆకుల వీర్రాజు , ముమ్మిడివ‌రం నుంచి పోటీ చేసి ప‌రాజ‌యం పాల‌యిన గుత్తులసాయి లాంటి నేతలు ప్రస్తుతం అంతక్రియాశీల‌కంగా క‌నిపించ‌డం లేదు.

పూర్తిస్థాయిలో మార్పులు
తూర్పుగోదావరిజిల్లా పార్టీలో నెలకొన్న సైలెన్స్‌ బ్రేక్‌ చేయడానికి వైసీపీ నాయకత్వం పూర్తిస్థాయిలో మార్పులు చేర్పులు చేపట్టింది. ఆయా నియోజకవర్గాల ఇంచార్జ్‌లను మార్చేసి కొత్తవారికి చాన్స్‌ ఇస్తోంది. కాకినాడ రూరల్‌లో చెల్లుబోయిన వేణుస్థానంలో కన్నబాబుకి బాధ్యతలు అప్పగించారు. కాకినాడ సిటీ బాధ్యతలను ముత్తాశశిధర్‌కు ఇవ్వగా.. రాజమండ్రి సిటీ ఇంచార్జ్‌గా రౌతు సూర్యప్రకాశ్‌రావు, రాజమండ్రి రూరల్లో కందుల దుర్గేశ్‌ బాధ్యలు చేపట్టారు. వీరితోపాటు ఇటీవలే వైసీపీ గూటికి చేరిన పర్వత ప్రసాద్‌ను ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంచార్జ్‌గా నియమించారు. అటు ముమ్మిడివరం, మండపేటల్లో కూడా కొత్తవారినే ఇంచార్జ్‌లుగా నియమించారు. ఇలా జిల్లాల్లో సగానికి పైగా నియోజకవర్గాల్లో కొత్తవారే పార్టీఇంచార్జ్‌లుగా పగ్గాలు చేపట్టారు. ఇక పిఠాపురం, పెద్దాపురం, రామచంద్రాపురం, పి.గన్నవరం లాంటి చోట్ల కూడా నయా లీడర్లకే అవకాశం కల్పించే చాన్స్‌ కనిపిస్తోంది. దీంతో రాబోయే 2019 ఎన్నికల్లో తూర్పుగోదావరి నుంచి మూడొంతులకు పైగా కొత్త నేతలకే అసెంబ్లీ టెక్కెట్లు లభిస్తాయని వైసీపీలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి.గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న వైసీపీ .. రాబోయే ఎన్నికలకు పక్కాప్లాన్‌తో వెళ్లాలని భావిస్తోంది. దీనికోసం పార్టీలో యువనేతలతోపాటు అనుభజ్ఞులకు పెద్దపీటవేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీలో కొత్తరక్తం ఎక్కిస్తున్న వైసీపీ అధినాయకత్వం రాబోయే ఎన్నికల్లో ఏమేరకు సక్సెస్‌ అవుతుందో వేచి చూడాలి. 

13:49 - May 27, 2017
06:38 - May 24, 2017

హైదరాబాద్: దక్షిణాదిన పార్టీ బలోపేతంపై దృష్టిసారించామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. 2019 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాలో రెండోరోజూ పర్యటించిన అమిత్‌షా.. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే మోదీ లక్ష్యమని చెప్పారు.

నల్లగొండ జిల్లాలో రెండోరోజూ...

నల్లగొండ జిల్లాలో రెండోరోజూ... బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పర్యటన బిజీబిజీగా సాగింది. నల్లగొండ, కనగల్‌ మండలాల్లోని వెలుగుపల్లి, చిన్నమాదారం, పెద్దదేవులపల్లిలో ఆయన పర్యటించారు. వెలుగుపల్లిలో దీన్‌దయాల్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడి దళితవాడకు దీన్‌ దయాళ్‌ బస్తీగా నామకరణం చేశారు. అక్కడి నుంచి చిన్నమాదారం వెళ్లిన అమిత్‌షా....గ్రామస్థులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.

చిన్నమాదారంలో వివేకానందుడి విగ్రహాన్ని ఆవిష్కరణ....

అనంతరం అమిత్‌షా, చిన్నమాదారంలో వివేకానందుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలుసుకున్నారు. తర్వాత, పెద్దదేవులపల్లిలో జరిగిన సభలో మాట్లాడిన అమిత్‌షా ... తెలంగాణలో బూత్‌స్థాయి నుంచి బీజేపీ బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. దక్షిణ భారతదేశంలో కచ్చితంగా బీజేపీ పాగా వేస్తుందన్నారు. అది తెలంగాణ నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో అధికారం బీజేపీదేనని ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో పొత్తులపైనా

తెలుగు రాష్ట్రాల్లో పొత్తులపైనా అమిత్‌షా మాట్లాడారు. ఏపీలో టీడీపీతో పొత్తు కొనసాగుతుందని చెప్పారు. అయితే తెలంగాణలో మాత్రం టీడీపీతో పొత్తుపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం అంతవరకే చెప్పదల్చుకున్నానంటూ సమాధానాన్ని దాటవేశారు. తెలంగాణలో బీజేపీని బలమైన రాజకీయశక్తిగా తయారు చేస్తున్నామన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని

తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని అమిత్‌షా చెప్పారు. 60ఏళ్లలో ఇంతకుముందెన్నడూ లేనివిధంగా ఎక్కువ నిధులు ఇచ్చామన్నారు. వేర్వేరు పథకాల కోసం తెలంగాణకు దాదాపు లక్ష కోట్ల నిధులు ఇచ్చామన్నారు. తెలంగాణకు ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలను ఇచ్చామని చెప్పారు.

Pages

Don't Miss

Subscribe to RSS - 2019