aamir khan

17:41 - November 8, 2018

అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ ప్రధాన పాత్రల్లో నటించగా, ధూమ్ 3 ఫేమ్, విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో, యశ్ రాజ్ ఫిలింస్ నిర్మించిన చిత్రం, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్.
భారీ అంచనాల మధ్య, హిందీతో పాటు, తెలుగులోనూ ఈరోజు రిలీజైన థగ్స్ ఆఫ్ హిందూస్థాన్  సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ : 


దాదాపు రెండు దశాబ్దాల క్రితం వ్యాపారం నిమిత్తం ఇండియాకు వచ్చిన బ్రిటీష్ వాళ్ళు, ఇక్కడి సంస్థానాలనీ, రాజ్యాలనీ తమ ఇష్టారాజ్యంగా ఆక్రమించుకుంటుంటారు.
ఆ నేపథ్యంలో, రోనక్‌పూర్ అనబడే స్వతంత్ర్య రాజ్యంపై కన్నేసిన బ్రిటీష్ పాలకుడు జాన్ క్లైవ్, రోనక్‌పూర్ రాజుని, అతని కొడుకుని అంతమొందించి, రాజ్యాన్ని చేజిక్కించుకుంటాడు. అప్పుడు యువరాణి జఫీరా, రాజ్య సంరక్షకుడు ఖుదా బక్ష్ సాయంతో రాజ్యం నుండి తప్పించుకుంటుంది. మరోపక్క థగ్స్‌గా పిలవబడే ఒక ముఠా, దారి దోపిడీలతో బ్రిటీష్ వారిపై విరుచుకు పడుతుంటుంది. తన అవసరాల కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తూ, తన తెలివితో ఎంతటివారినైనా బురిడీ కొట్టించే ఫిరంగి మల్లయ్యను, థగ్స్  నాయకుడైన ఖుదా బక్ష్‌ను పట్టుకోవడానికి నియమిస్తాడు జాన్ క్లైవ్. మరి ఫిరంగి మల్లయ్య, ఖుదా బక్ష్‌ని బ్రిటీష్ వారికి అప్పజెప్పాడా, లేదా అనేదే ఈ థగ్స్ కథ.

నటీనటులు & సాంకేతిక నిపుణులు : 


అమితాబ్ చేసిన యాక్షన్ సన్నివేశాలను చాలా వరకూ డూప్ సాయంతో లాగించేసారు. నటన పరంగా ఓకే అనిపిస్తారు. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ నవ్వించే ప్రయత్నం చేసాడు కానీ, తెలుగులో ఆయనకి వాయిస్ సూట్ కాలేదు. తెరపై అమీర్‌ని చూస్తున్నంత సేపు..  పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్‌లో జాక్ స్పారో పాత్రే గుర్తొస్తుంది. కత్రినా సురైయ్యాగా తన డ్యాన్స్‌తో ఆకట్టుకుంటుంది. ఫాతిమా సనా షేక్ పాత్ర అలరిస్తుంది.
అజయ్ - అతుల్ కంపోజ్ చేసిన పాటలు తెలుగులో పెద్దగా ఆకట్టుకోవు కానీ, జాన్ స్టివార్ట్ బ్యాగ్రౌండా స్కోర్ సినిమాకి ప్లస్ అయింది.  మనుష్ నందన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్ట్ వర్క్ కూడా బాగుంది.
మేడిపండు చూడ మేలిమై ఉండు, పొట్టవిప్పి చూడ పురుగులుండు అనే సామెత ఈ సినిమాకి చక్కగా సూటవుతుంది. 1839లో వచ్చిన కన్‌ఫెషన్స్ ఆఫ్ ది థగ్ నవల ఆధారంగా, రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో, ప్రతిష్టాత్మక యశ్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తుంది, పైగా, అమితాబ్, అమీర్ కాంబో  అనగానే ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ ఆ అంచనాలకు ఆమడ దూరంలో నిలిచిపోయింది. దర్శకుడు సెట్స్ మీదా, కాస్ట్యూమ్స్ మీదా, యాక్షన్ ఘట్టాల పైనా పెట్టిన శ్రద్థ, కొంచెమైనా స్ర్కీన్‌ప్లే పై కూడా పెట్టుంటే థగ్స్ ఇంకోలా ఉండేది. 


థగ్స్.. పైన పటారం, లోన లొటారం. 

తారాగణం :  అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్

        కెమెరా    :            మనుష్ నందన్ 

       సంగీతం   :         అజయ్ - అతుల్ 

నేపథ్య సంగీతం  :         జాన్ స్టివార్ట్ 

         నిర్మాత   :         ఆదిత్య చోప్రా

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం :     విజయ్ కృష్ణ ఆచార్య

రేటింగ్  : 2/5

 

 

మూవీ రివ్యూ - 5 స్టార్ రేటింగ్‌ విధానం...
3.5 స్టార్ - ఉత్తమ చిత్రం
3 స్టార్స్  - చాలా బావుంది! తప్పక చూడాల్సిన సినిమా
2.75 స్టార్స్  - ఉన్నంతలో బావుంది
2.5 స్టార్స్ - సినిమా చూడొచ్చు 
2.25 స్టార్స్ - ఇంకొంచెం శ్రద్ధపెట్టాల్సి ఉంది 
2 స్టార్స్ - చాలా మెరుగుపర్చుకోవాలి

 

 

11:18 - January 5, 2018

అమీర్ ఖాన్ నటించిన బాలీవుడ్ మూవీ దంగల్ చైనాలో రికార్డు సృష్టంచింది. చైనీస్ ఐఎండీబీలో దంగల్ చిత్రంలో మొదటి స్థానంలో నిలిచింది. ఐఎండీబీ నిర్వహించిన వెబ్ సైట్ సర్వేలో దంగల్ మూవీకే ఎక్కువ మంది మద్దతు తెలిపారు. దంగల్ దేశీయంగా కూడా రికార్డు స్థాయిలో వసూల్ చేసింది. లేడీ బాక్సర్ కథ అంశంగా చిత్ర తెరకెక్కింది. దంగల్ ప్రపంచ వ్యాప్తంగా 2000వేల కోట్లను వసూల్ చేసింది. 

14:29 - September 19, 2017

బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ గా పేరొందిన నటుడు 'అమీర్ ఖాన్' వైవిధ్య పాత్రలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. అంతేగాకుండా ఆయా పాత్రలకు జీవం పోసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఆయన ఏ సినిమా చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది. ఇటీవలే వచ్చిన సినిమాలే అందుకు నిదర్శనం. తాజాగా 'సీక్రెట్‌ ఆఫ్‌ సక్సెస్‌', 'థగ్స్ ఆఫ్‌ హిందుస్థాన్‌' సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిల్లో 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' చిత్రానికి సంబంధించిన ఓ లుక్ బయటకు వచ్చింది.

ఈ లుక్ చూసిన వారందరూ అసలు అమీర్ ఖాన్ యేనా అంటూ ఆశ్చర్యపోయారు. చింపిరి జుట్టు... చినిగిపోయిన బట్టలు... మాసిపోయిన శరీరంతో కనిపించాడు. ఈ సినిమా చిత్రీకరణ శనివారం ముంబయిలోని ఓ స్టూడియోలో ప్రారంభమైంది. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. యస్‌రాజ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌ కూడా నటిస్తున్నట్లు టాక్. అమీర్ ఖాన్ గెటపే ఇలా ఉంటే బిగ్ బి గెటప్ ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది. కత్రినా కైఫ్‌, 'దంగల్‌' ఫేమ్‌ ఫాతిమ సన్‌ షైక్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 

16:00 - August 23, 2017

ప్ర‌ముఖ అమెరికన్ బిజినెస్ మ్యాగ‌జైన్ ఫోర్బ్స్ ప్ర‌తి ఏడాది అత్య‌ధిక పారితోషికం అందుకున్న న‌టుల జాబితాను విడుద‌ల చేస్తుంది. ఈ ఏడాది కూడా టాప్ 10 జాబితాను విడుద‌ల చేసింది. బాలీవుడ్ హీరోలు షారుక్‌ ఖాన్‌- 38 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.243 కోట్లు), సల్మాన్‌ ఖాన్‌- 37 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.237 కోట్లు), అక్షయ్‌కుమార్‌- 35.5 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.227 కోట్లు) లు 8,9, 10 స్థానాల‌లో చోటు దక్కించుకున్నారు. 68 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.435కోట్లు)తో మార్క్‌ వాల్‌బర్గ్ టాప్ పొజీష‌న్ లో ఉండ‌గా,దంగ‌ల్ చిత్రంతో దాదాపు 2000 కోట్ల వ‌సూళ్ళు రాబ‌ట్టిన అమీర్ ఖాన్ ఇందులో లేక‌పోవ‌డం గ‌మ‌న‌ర్హం. 2016 జూన్ 1 నుండి సేక‌రించిన నివేదిక ప్ర‌కారం ఫోర్బ్స్ ఈ జాబితాని విడుద‌ల చేసిన‌ట్టు తెలుస్తుంది.

డ్వెయిన్‌ జాన్సన్‌- 65 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.416 కోట్లు), విన్‌ డీజిల్‌- 54.5 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.349 కోట్లు), ఆడమ్‌ శాండ్లర్‌- 50.5 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.323 కోట్లు) , జాకీ చాన్‌- 49 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.314 కోట్లు), జూ.రాబర్ట్‌ డౌనీ- 48 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.307 కోట్లు), టామ్‌ క్రూజ్‌- 43 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.275 కోట్లు) లు 2,3,4,5,6,7 స్థానాల‌లో ఉన్నారు.

10:25 - June 30, 2017

ఆస్కార్ అవార్డు..అత్యంత ప్రతిష్టాత్మకంగా అవార్డును భావిస్తుంటారు. తమకు ఎప్పటికైనా ఈ అవార్డు వస్తుందని..రావాలని నటీనటులు అనుకుంటుంటారు. అందులో భాగంగా ఆయా చిత్రాల్లో ఒదిగిపోయి నటిస్తుంటారు. ఈ పురస్కారానికి అందుకోవడానికి ప్రపంచదేశాలు పోటీ పడుతుంటాయి. కానీ ఎంపిక మాట తరువాత..నామినేట్ కావడమే అసలు విషయం. నామినేటెడ్ కావడానికి తీవ్రమైన పోటీ ఉంటుంది. కమిటీ సభ్యులు ఆయా సినిమాలను చూసి పరిశీలించి..ఎంపిక చేస్తుంటారు. గత ఏడాది ఆస్కార్‌ పురస్కారాల ఎంపికకు 683 మందితో ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. ఈసారి ఈ సంఖ్యను పెంచారు. ప్యానెల్ లో బాలీవుడ్ స్టార్స్ కు చోటు దక్కింది. బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌, సల్మాన్‌ ఖాన్‌, ఇర్ఫాన్‌ ఖాన్‌, ఐశ్వర్య రాయ్, అమీర్‌ ఖాన్‌, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే ఉన్నారు. వీరిని ఆస్కార్‌ ప్యానెల్‌గా ఎంపిక చేసినట్టు ఆహ్వానాలు అందాయి. అత్యధికంగా 774 మందితో ఈ ప్యానల్‌ ఉండబోతుంది.

09:24 - June 28, 2017

బాలీవుడ్ మిస్టర్ ఫర్ పెక్ట్ 'అమీర్ ఖాన్' సాహసాలు చేయడంలో ముందుంటాడు. ఆయన నటించే పాత్ర కోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తాడని ఆయన చిత్రాలు చూస్తే తెలిసిపోతుంది. తాజాగా మరొక సాహసం చేశాడు. ఆయన ఫొటో చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. ‘అమీర్' ఇటీవలే నటించిన 'దంగల్' సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకుంది. ఈ సినిమాలోని పాత్రల కోసం సిక్స్ ప్యాక్ తో దర్శనమిచ్చాడు..మరో పాత్ర కోసం ఏకంగా బరువు పెరిగిన సంగతి తెలిసిందే. ఇలా చేయడం ఆరోగ్యానికి హానికరమని వైద్యులు చెప్పినా 'అమీర్' వినకుండా సాహసం చేసి భళీరా అనిపించాడు. తాజాగా ఆయన 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ లు కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని పాత్ర కోసం ఆయన ఏకంగా ముక్కు..చెవులు కుట్టించేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. చెవులు కుట్టించుకోవడంతో 'అమీర్' నొప్పి భరించలేకపోయాడని టాక్. మరి ఆయన పాత్ర ఎలా ఉండనుందో సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాలి.

11:38 - May 6, 2017

ఇండియా బాక్సాసును షేక్ చేసిన అమీర్ ఖాన్ సినిమా 'దంగల్' చైనాలతో సైతం డుమ్ము రేపుతోంది. చైనాలో శనివారం విడుదలైన 'దంగల్' తొలిరోజే రూ. 15కోట్లు వసూలు చేసింది. అమీర్ ఖాన్ కు చైనాలో మంచి మార్కెట్ ఉంది. అమీర్ నటించిన 'పీకే' సినిమా చైనాలో 100 కోట్ల రూపాయలను వసూలు చేసిన విషయం తెలిసిందే. ‘3 ఇడియట్స్ సినిమా చైనీస్ లోకి డబ్ చేసి, విడుదల చేసినప్పటి నుంచి చైనా సినీ అభిమానులు ఖాన్ కు దగ్గరయ్యారు. అయితే చైనా కూడా అక్కడా ప్రదర్శించే భారతీయ సినిమాల సంఖ్యను రెండు నుంచి నాలుగు పెంచింది.

10:21 - April 18, 2017

బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ 'అమీర్ ఖాన్' చైనాకు చేరుకున్నారు. వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ తనకు తానే సాటి అని నిరూపించుకున్న నటుల్లో 'అమీర్' ఒకరు. ప్రయోగాత్మకమైన చిత్రాల్లో నటిస్తూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఇటీవలే ఆయన నటించిన 'దంగల్' సినిమా విజయదుందుభి మ్రోగించింది. ఆయన నటనకు ప్రశంసలు కూడా లభించాయి. ఈ చిత్రాన్ని 'చైనా'లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడానికి 'అమీర్' చైనాకు వెళ్లారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. చైనాలో అమీర్ కు ఉన్న పాపులార్టీ ఏంటో ఈ ఫొటోలను బట్టి చూస్తే తెలుస్తుంది. అక్కడ యువత అమీర్ తో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. పుష్పగుచ్చాలిచ్చి ఆనందం వ్యక్తం చేశారు. చైనా ప్రజలను కలవడం చాలా ఆనందంగా ఉందని, చైనీయులకు నా పనితనం నచ్చడం చాలా సంతోషంగా ఉందని అమీర్ పేర్కొన్నారు. ఈ మధ్య 'ధూమ్ 3, ‘పీకే' చిత్రాలు చైనాలో బాగా ఆడాయని తెలిపారు.

10:06 - April 8, 2017

పాకిస్తాన్ లో తన సినిమా విడుదల చేయవద్దని ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ వెల్లడించారు. ఆయన నటించిన 'దంగల్' చిత్రం ఏ మేర విజయం సాధించిన సంగతి తెలిసిందే. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం భారీగా కలెక్షన్లు సైతం రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైనా పాక్ లో మాత్రం విడుదల కాలేదు. 2016 జమ్మూ కాశ్మీర్ లోని ఉరి దాడుల అనంతరం పాక్ లో భారత సినిమాలను ప్రదర్శించడం లేదనే సంగతి తెలిసిందే. అనంతరం గొడవలు సద్దుమణిగిన అనంతరం సినిమాలప నిషేధాన్ని పాక్ ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో 'దంగల్' సినిమాను పాక్ లో విడుదల చేయాలని పాక్ లో ఉన్న లోకల్ డిస్ట్రిబ్యూటర్లు కోరారు. దీనికి 'అమీర్' ఒప్పుకున్నారు. కానీ 'దంగల్' సినిమాలోని ఓ సన్నివేశంలో భారత జాతీయ జెండా...జాతీయగీతం ఉండడంతో ఈ సన్నివేశాలని తొలగించాలని పాక్ సెన్సార్ బోర్డు ఆదేశించడం పట్ల 'అమీర్' తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్రీడకు సంబంధించిన అంశమని..భారత్..పాక్ కు ఎలాంటి సంబంధం లేదని..అలాంటప్పుడు జాతీయ గీతం సన్నివేశాలను తొలగించాల్సినవసరం ఏంటీ ? అని అమీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి పాక్ లో సినిమాను విడుదల చేయడానికి అమీర్..చిత్ర యూనిట్ ఒప్పుకోలేదని తెలుస్తోంది.

15:41 - March 15, 2017

అమీర్ ఖాన్..బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ గా పేరొందారు. వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ అలరిస్తున్న ఈ హీరో ఇటీవలే బర్త్ డే జరుపుకున్నారు. 52వ పుట్టిన రోజును మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ముంబైలో తన నివాసంలో కేక్ కట్ చేసిన అనంతరం మీడియాతో సరదాగా మాట్లాడారు. సోమవారం రాత్రి 12గంటలకే నిద్రపోవడం జరిగిందని, ఆ సమయంలో ఎన్నో ఫోన్స్ కాల్స్, సందేశాలు వచ్చాయన్నారు. కానీ ఒక్కరు కూడా తనకు పుట్టిన రోజు బహుమతులివ్వలేదని..కనీసం మీరైనా ఇస్తారని ఆశిస్తున్నట్లు మీడియానుద్దేవించి సరదాగా వ్యాఖ్యానించారు. ఇంట్లో ఏర్పాటు చేసిన గెట్ టు గెదర్ పార్టీకి రావాలని రెండు రోజుల క్రితమే 'షారూఖ్ ఖాన్'ని ఫోన్ లో ఆహ్వానించినట్లు, తమ మధ్య వృత్తిపరమైన విషయాలను చర్చించుకోవడం జరగదన్నారు. గతేడాది 'దంగల్‌' సినిమాతో కలెక్షన్ల రికార్డులు సృష్టించిన ఈ మిస్టర్ ఫర్ ఫెక్ట్ ప్రస్తుతం 'సీక్రెట్‌ సూపర్‌స్టార్‌', 'థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌' చిత్రాల్లో నటిస్తున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - aamir khan