adilabad

09:16 - August 18, 2018

ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పంట పొలాలు నీట మునిగిపోయాయి. దీనితో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 1.23 లక్షల ఎకరాల్లో రూ. 32 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా. పత్తి, సోయా కంది, జొన్న పంటలు నీట మునిగాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు..ఎగువున కురుస్తున్న వర్షాలతో వాగులు..వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పెన్ గంగా ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా వంతెనపై పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. 17 ముంపు మండలాలకు అధికారులను కలెక్టర్ నియమించారు. ఆదిలాబాద్, వరద ముంపు గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించారు. 

10:21 - August 16, 2018
14:19 - August 10, 2018

ఆదిలాబాద్ : జిల్లాలో 'రిమ్స్' ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడ ఎన్నో లోటుపాట్లు ఉన్నాయనే విమర్శలున్నాయి. కీలకమైన వైద్య శాలకు భారతీయ వైద్య మండలి షాక్ ఇచ్చింది. గుర్తింపు కొనసాగించడానికి నిరాకరిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. 22 అంశాల్లో లోపాలను ఎత్తి చూపింది. రెగ్యులర్ డీన్ లేరని..డీన్ ఉన్నా..ఆయన సరిగ్గా రాలేరని...ఉన్న ఫ్యాకల్టీ 35 శాతమేనని...దీనితో లోపాలతో గుర్తింపు కొనసాగించలేమని స్పష్టం చేసింది.

ఎంసీఐ గుర్తింపు కొనసాగించడానికి నిరాకరించడం విద్యార్ధులను కలవరపడుతున్నట్లు సమాచారం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రిమ్స్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని కోరుతున్నారు. 

15:27 - July 26, 2018

ఆదిలాబాద్ : ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఆ నియోజకవర్గ ప్రజలు తమదైన శైలీలో తీర్పునిస్తారు. గోడదూకే నేతల కంటే పార్టీలను నమ్ముకున్న అభ్యర్థులనే అక్కడి ప్రజలు అసెంబ్లీకి పంపుతారు. అయితే ఆ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. టీడీపీ ప్రభావం తగ్గటంతో టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌లు ఎన్నికల పోరుకు సిద్ధమవుతున్నాయి. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏమిటి? అక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏమిటి? వాచ్ దిస్‌ స్టోరీ.

చెన్నూరుపై ఆధిపత్యం కోసం టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ పోటాపోటీ
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చెన్నూరు నియోజకవర్గానికి ఓ ప్రత్యేక ఉంది. ఏ నేతలైతే పార్టీని నమ్ముకుని ఉంటారో వారిని అక్కడి ప్రజలు అసెంబ్లీకి పంపుతారు. ఒకప్పుడు టీడీపీ, కాంగ్రెస్‌లకు కంచుకోటగా ఉన్న చెన్నూరు నియోజకవర్గంలో ఇప్పడు టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌లు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ చెన్నూరు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రస్తుతం అధికార పార్టీ ఆధీనంలో ఉన్న ఈ నియోజవర్గంలో కాంగ్రెస్‌ తన జెండా ఎగరవేయాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. అందుకనుగుణంగా ఎన్నికల వాతావరణాన్ని సృష్టించారు నేతలు. అధికార పార్టీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుపై ఆరోపణలకు దిగుతూ రాజకీయాల్లో హిట్‌ పెంచుతున్నారు మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత బోడ జనార్దన్‌. తనకు ఒక్క అవకాశం ఇవ్వడంటూ నియోజకవర్గ ఓటర్లు కోరుతున్నారు.

చెన్నూరు అభివృద్ధిలో విఫలమైనట్లు ఆరోపణ ఎదుర్కొంటున్న ఓదెలు
మరోవైపు తెలంగాణ సెంట్‌మెంట్‌ నియోజకవర్గ రాజకీయాలను మార్చటంతో టీఆర్‌ఎస్‌ నేత నల్లాల ఓదెలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్నికల సందర్భంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో దౌడ్‌పెట్టిస్తానన్న ఎమ్మెల్యే అందులో విఫలమయ్యినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే వినోద్‌. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన వినోద్‌ ఇప్పడు టీఆర్‌ఎస్‌ తరుపున పోటీ చేసారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక ఓదెలుకు టికెట్‌ ఇస్తే వినోద్‌, వినద్‌కు టికెట్‌ ఇస్తే ఓదెలు అధిష్టానంపై తిరగబడే అవకాశం లేకపోలేదు. టీఆర్‌ఎస్‌ టికెట్ల పంచాయితీ కాంగ్రెస్‌కు కలిసొచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే చెన్నూరు ప్రజలు ఇటు టీఆర్‌ఎస్‌ను అభ్యర్థిని ఎన్నుకుంటారా లేక అటు కాంగ్రెస్‌ అభ్యర్థిని ఎన్నుకుంటార అనే వేచిచూడాల్సి ఉంది. 

13:26 - June 18, 2018

ఆదిలాబాద్‌ : జిల్లా కంకూరులో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో వివాదాస్పద భూముల్లో అటవీ అధికారులు మొక్కలు నాటిస్తుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో భారీగా పోలీసు బలగాలను మోహరించి మొక్కలు నాటిస్తున్నారు. తమ భూములు అటవీ అధికారులు కబ్జా చేస్తున్నారని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి నిరసన తెలిపారు. మిగులు భూముల జోలికి అధికారులు రాకూడదని 2008లో కాంకూరు గ్రామసభలో తీర్మానం చేశారు. కాని గ్రామసభ నిర్ణయాలను పట్టించుకోని అటవీశాఖ అధికారులు వివాదస్పద భూముల్లో మొక్కలు నాటిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

08:30 - June 13, 2018

నిర్మల్ : ఆ నియోజకవర్గంలో దళిత, బహుజన, మైనారిటీ ఓటర్లే అధికం. కానీ పాలకులందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. దీంతో తమ సమస్యలు పరిష్కారం కావటం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు తప్ప మరెప్పుడు ఆ నాయకులు గ్రామాల్లో పర్యటించిన దాఖలాలు లేవని ప్రజలు వాపోతున్నారు. అగ్రకులాలు ఆధిపత్యం చెలాయిస్తున్న ముథోల్‌ నియోజకవర్గంపై 10టీవీ స్పెషల్‌ స్టోరీ.
ముథోల్‌ నియోజకవర్గంలో దళిత, బహుజన, మైనరిటీ ప్రజలే అధికం
నిర్మల్‌ జిల్లా ముథోల్‌ నియోజకవర్గంలో దళిత, బహుజన, మైనరిటీ ప్రజలే అధికంగా ఉన్నారు. కానీ ఇక్కడ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అగ్రకులాలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. దీంతో దళిత, బహుజన, మైనారిటీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ సమస్యలు పరిష్కారం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వచ్చే సాధారణ ఎన్నికల్లో బహుజనులకు అధికారాన్ని కట్టబెట్టాలనే యోచనలో నియోజకవర్గ  ప్రజలు ఉన్నారు. 
ముథోల్‌.. 117 గ్రామాలు, 49 తాండాలు 
ముథోల్‌ నియోజకవర్గంలో ముథోల్‌తో పాటు కుంటాల, కుబీర్, లోకేశ్వరం, తానూర్, భైంసా మండలాలున్నాయి. ఈ మండలాల్లో 117 గ్రామాలు, 49 తాండాలు ఉన్నాయి. గత ఎన్నికల ప్రకారం మొత్తం 2,06,230 మంది ఓటర్లు ఉన్నారు. వీరీలో ఎస్సీ ఓటర్లు 20 శాతం, ఎస్టీ ఓట్లరు 9 శాతం, బీసీలు 31 శాతం, మైనారిటీలు  14 శాతం ఉండగా..  ఇతర ఓటర్లు 24 శాతం ఉన్నారు. 
రెడ్డి, రావు సామాజికవర్గం ఆధిపత్యం 
ఎక్కువ శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారీటీలు ఉన్నా ముథోల్‌ నియోజకవర్గంలో రెడ్డి, రావు సామాజిక వర్గాలు మాత్రమే పాలన సాగిస్తున్నాయి. 1957 ఎన్నికల్లో గోపిడి గంగిరెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. 1962లో కాంగ్రెస్‌ తరుపున పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 1967లో గడ్డన్నరెడ్డి ముథోల్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన వరుసగా 1972, 1978,1983 ఎన్నికల్లో గెలిచారు. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో గడ్డన్నపై టీడీపీ అభ్యర్థి హన్మంత్‌రెడ్డి విజయం సాధించారు. తిరిగి 1989 ఎన్నికల్లో గడ్డన్న తన పదవిని చేజిక్కించుకున్నారు. 1994 ఎన్నికల్లో గడ్డన్న మరోసారి ఓటమిపాలయ్యారు. టీడీపీ అభ్యర్థి నారాయణరావు పటేల్‌ ఆయనపై విజయం సాధించారు. మళ్లీ 1999లో గడ్డన్న గెలవగా.. 2004 ఎన్నికల్లో నారాయణరావు పటేల్‌ని ప్రజలు గెలిపించారు. 2009 సాధారణ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేణుగోపాలచారి అనూహ్య విజయం సాధించారు. ఇక 2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి విఠల్‌రెడ్డి బీజేపీ అభ్యర్థి రమాదేవీపై 14,837 ఓట్లతో విజయం సాధించారు. 
బహుజనులకు టిక్కెట్లు కేటాయిస్తారా ? 
ఇప్పటి వరకు ఏ పార్టీ చూసినా రెడ్డి, రావు సామాజిక వర్గానికి తప్ప ఇతర సామాజిక వర్గానికి టికెట్‌ ఇచ్చిన దాఖలు లేవు. దీంతో తమ సమస్యలు పరిష్కారం అవ్వటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళిత, బహుజనుల కేంద్రం అయినప్పటికీ....  రెడ్డి, రావు సామాజిక వర్గాలకు చెందినవారు ఎమ్మెల్యేలుగా ఉండటంతో అభివృద్ధిలో ముథోల్‌ నియోజకవర్గం వెనుకపడిపోతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో జరుగుతున్న రైతు ఆత్మహత్యల్లో ముథోల్‌ నియోజకవర్గం ముందు వరుసలో ఉంది. గోదావరి నది పక్కనే ప్రవహిస్తున్నా... వ్యవసాయానికి చుక్కనీరు అందటం లేదని రైతులు వాపోతున్నారు. ఉపాధి కరువై దుబాయ్‌, ముంబై లాంటి ప్రాంతాలకు వలస వెళ్లేవాళ్లే ఎక్కువగా ఉన్నారని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే.. వచ్చే ఎన్నికల్లో బహుజనులనే ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంటామని నియోజకవర్గ ప్రజలు తేల్చి చెబుతున్నారు. ఇన్నాళ్లు అగ్రకులాలకు టికెట్లు ఇచ్చి గెలిపించుకున్న పార్టీలు ఈ సారి కూడా ఆ సామాజిక వర్గాలకే టికెట్‌ ఇస్తాయో... ప్రజలు కోరుతున్నట్టు బహుజనులకు టిక్కెట్లు కేటాయిస్తాయో వేచి చూడాలి.

19:39 - June 12, 2018

ఆదిలాబాద్ : ఇప్పటివరకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, కబ్జాదారులు మాత్రమే భూములను ఆక్రమించుకోవడం చూశాం. కాని ఓ పేదోడి స్థలాన్ని రెవెన్యూ, పోలీసు అధికారులు కలిసి కబ్జా చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోనే ఈ ఘటన జరగడం విస్మయం కలిగిస్తోంది. బాధితుడికే భూమి చెందాలన్న కోర్టు ఉత్తర్వులను సైతం లెక్కచేయకుండా దర్జాగా భూమిని కబ్జా చేసేశారు. దీంతో న్యాయం చేయాలంటూ బాధితుడు కోరుతున్నాడు. దళితుడి భూమి కబ్జా విషయంపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను చూడండి..

18:48 - June 11, 2018

అదిలాబాద్‌ : జిల్లాలోని పలు ప్రాంతాలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. సుశ్మీర్‌ గ్రామం వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో చుట్టుపక్కల ఆరు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మావల, గుడిహత్నూర్‌, తలమడుగు, తాంసి మండలాల్లో ఈదురు గాలులతో కూడిన ఈ భారీ వర్షం కురిసింది. జిల్లాలోని పలు కేంద్రలో రోడ్లు జలమాయం అవగా..... ఈదులు గాలులకు పూరి గుడిసెల పైకప్పులు ఎగిరిపోయ్యాయి. మరి కొన్ని చోట్ల గోడలు నేలకూలయి.

19:52 - June 7, 2018

ఆసిఫాబాద్‌ : ఎజెన్సీ ప్రాంతాల్లో పీసా చట్టాన్ని అనుసరిస్తూ... తమ గ్రామాల్లో స్వయం పాలన సాగిస్తున్నామంటున్నారు ఆదివాసులు.  జూన్‌ 2నుంచి ఆదివాసులు లంబాడ తెగకు చెందిన ఉద్యోగులను ఏజెన్సీ గ్రామల్లో అనుమతించడంలేదు. స్వయం పాలన ప్రకటించి, లంబాడాలను అడ్డుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించామని ఆదివాసులంటున్నారు. ఊరి చివరిలో మావనాటే మావరాజ్‌, 'మావేనాటే.. మావే సర్కార్‌' అనే బోర్డులను పెట్టారని డిమాండ్‌ చేస్తున్నారు. ఆదివాసుల ఆందోళనపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

15:33 - June 6, 2018

ఆదిలాబాద్ : స్కూల్ బస్సుల ఫిట్ నెస్ పై గట్టి నిఘా ఏర్పాటు చేశారు. స్కూల్ బస్సుల ఫిట్ నెస్ పై రవాణ శాఖాధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. డ్రైవర్లతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ శ్యామ్ నాయక్ టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Pages

Don't Miss

Subscribe to RSS - adilabad