aiadmk

14:05 - May 29, 2018
19:22 - April 2, 2018

ఢిల్లీ : అవిశ్వాసం చర్చకు రాకుండా బీజేపీ- కాంగ్రెస్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్ చేసుకున్నాయని ఏఐడీఎంకే ఎంపీ తంబిదొరై ఆరోపించారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌.. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ కావేరీ జలాలపై చర్చ జరగకుండా ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం కర్ణాటకలో ఎన్నికలున్నాయి కాబట్టే అవిశ్వాసం చర్చకు రావద్దని కాంగ్రెస్‌ బీజేపీ భావిస్తున్నాయన్నారు. కావేరీ బోర్డు ఏర్పాటు పై కేంద్రం ప్రకటన చేసే వరకు తమ ఆంగదోళన కొనసాగిస్తామని తంబిదొరై స్పష్టం చేశారు. 

18:37 - March 22, 2018

ఢిల్లీ : కావేరీ నదీ యాజమాన్య నీటి పంపకంపై స్పష్టత వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని ఏఐఏడీఎంకే ఎంపీ తంబి దురై అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ ఆందోళన పార్లమెంట్‌లో కొనసాగిస్తామని తంబిదురై టెన్ టివితో తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

19:46 - January 27, 2018

చెన్నై : తమిళనాడులో ద్రవిడ పార్టీ నేతలు... జీయర్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. హిందూ దేవుళ్లపై డిఎంకె ఎంపి కనిమొళి చేసిన వ్యాఖ్యలను జీయర్లు తీవ్రంగా ఖండించారు. హిందూ మతం, సాంప్రదాయాలపై దాడులు జరుగుతుంటే మౌనం వహించకుండా ఎదురుదాడికి దిగాలని శ్రీవిల్లీపుత్తూరిలోని ఆండాల్‌ సన్నిధికి చెందిన ఓ జీయర్‌ స్వామి పిలుపునిచ్చారు. దీనిపై కనిమొళి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జీయర్లంటే తమకు గౌరవం ఉండేదని...సమాజానికి మంచి సందేశం ఇవ్వాల్సిన వాళ్లే ఇపుడు రాళ్లు, కత్తులు పట్టుకుని హింసకు దిగుతామని హెచ్చరించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. 

19:44 - January 27, 2018

చెన్నై : తమిళనాడులో ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. డిఎంకెతో పాటు వామపక్షాలు, తమిళ సంఘాలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి. పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని విపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. సామాన్యులకు భారంగా మారిన బస్సు చార్జీలను వెంటనే తగ్గించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. డిఎంకె వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్టాలిన్, సిపిఎం కార్యదర్శి రామకృష్ణ, సిపిఐ కార్యదర్శి ముత్తరన్, ఎండిఎంకె వైగో, విసీకే నేత తిరుమావళవన్, కాంగ్రెస్‌ నేత తిరునావుక్కరసు నేతృత్వంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

19:42 - January 27, 2018

చెన్నై : తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ స్థానికతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి రానివ్వమంటూ దర్శకుడు, తమిళన్‌ పార్టీ నేత సీమన్ హెచ్చరిస్తున్నారు. రజనీకాంత్‌కు నిజంగా దమ్ముంటే కర్ణాటకకు వెళ్లి తాను తమిళుడినని ప్రకటించాలని సవాల్‌ విసిరారు. 44 ఏళ్లపాటు తమిళనాడులో ఉన్నంత మాత్రాన రజనీ తమిళుడు కాదని సీమన్‌ స్పష్టం చేశారు. సినిమాల్లో డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చిన వ్యక్తి ఇపుడు రాజకీయాలంటూ ప్రజలను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

20:16 - December 25, 2017

చెన్నై : ఆర్కేనగర్‌ ఉప ఎన్నిక ఓటమి నేపథ్యంలో అన్నాడీఎంకే పార్టీ సమీక్షా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంతో పాటు పలువురు సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఓటమిపై చర్చించారు. అసమ్మతి నేతలు పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం వల్లే ఘోర పరాజయం చెందినట్లు పార్టీ పేర్కొంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఆరుగురు నేతలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. ఎమ్మెల్యే వెట్రివేల్, తంగ తమిళ్ సెల్వన్, రంగస్వామి, ముత్తయ్య, కలైరాజన్, షోలింగూర్, పార్థిబన్‌లను పార్టీ నుంచి తొలగించారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థి టీటీవీ దినకరన్ గెలుపొందిన విషయం తెలిసిందే. ఆయనకు క్రమంగా మద్దతు పెరుగుతుండడంతో ప్రభుత్వం నిఘా పెంచింది.

22:01 - December 19, 2017

తమిళనాడు : చెన్నైలోని ఆర్కే నగర్‌ అసెంబ్లీ స్థానానికి ఈనెల 21న జరుగనున్న ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్‌కు ఉప ఎన్నిక జరుగుతోంది. అధికార అన్నా డీఎంకే, ప్రతిపక్ష డీఎంకే సహా అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను నిలబెట్టాయి. 17 నెలల అన్నా డీఎంకే పాలనకు ఈ ఎన్నిక ప్రోగ్రెస్‌ రిపోర్టుగా భావిస్తున్నారు. జయలలిత మరణం తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. 
 

11:34 - November 24, 2017

చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నికకు ఈసీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. డిసెంబర్ 21న ఎన్నికలు..డిసెంబర్ 24న ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు. జయలలిత మరణంతో ఆర్కే నగర్ అసెంబ్లీ సీటు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. డబ్బు పంపిణీ, నిబంధనల ఉల్లంఘనతో గతంలో వాయిదా పడింది. తాజాగ మరోసారి షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది.

జయలలిత మరణం అనంతరం రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. పన్నీర్ సెల్వం తన మద్దతు దారులతో బయటకు వెళ్లిపోవడంతో అన్నాడీఎంకే రెండుగా చీలిపోయింది. అనంతరం నాటకీయ పరిణామాల మధ్య శశికళ జైలుకు వెళ్లింది. అనంతరం పన్నీర్..పళనీ వర్గాలు ఒక్కటయ్యాయి. పార్టీ గుర్తు కోసం ఇరువర్గాలు పోటీ పడ్డాయి. చివరకు గురువారం పన్నీర్..పళనీ వర్గాలకు రెండాకుల గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. 

16:04 - November 7, 2017

తమిళనాడు : తాను రాజకీయాల్లోకి వచ్చేశానని...కొన్ని పనులు మాత్రం పెండింగ్‌లో ఉన్నాయన్నారు ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌. తాను కూడా హిందువే అని, హిందువుల సెంటిమెంట్‌ను గాయపరిచే ఉద్దేశం తనకు లేదని కమల్‌ స్పష్టంచేశారు. తాను అతివాదం  పదాన్నే వాడానని, ఉగ్రవాదం అని వాడలేదని వివరణ ఇచ్చారు.  హింస ఏ రూపంలో ఉన్నా తాను సహించబోనని కమల్‌ తేల్చి చెప్పారు. కమల్‌ తన పుట్టినరోజు సందర్భంగా 'మయ్యం విజిల్‌' యాప్‌ను ప్రారంభించారు.  ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఈ యాప్‌ను ప్రారంభించనట్లు కమల్‌ చెప్పారు. ఎక్కడ ఏ తప్పు జరిగినా ఈ యాప్ ద్వారా తన అభిమానులు దానిని వెలుగులోకి తీసుకురావాలని, న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. పార్టీ నిర్మాణం, కార్యకలాపాల కోసం అభిమానుల నుంచే విరాళాలు సేకరిస్తానని, ఆ వివరాలన్నీ ఈ యాప్‌లో ఉంటాయని ఈ సందర్భంగా కమల్ ప్రకటించారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - aiadmk