aircraft

16:20 - December 6, 2018

ముంబై  (మహారాష్ట్ర) : శ్రీమంతుల ఇంట్లో పెళ్లి అంటే అంతా హడావిడే. ఎక్కడ చూసినా రిచ్ లుక్సే. ఏది చేసినా ఘనంగా వుండాలి. అందరూ గొప్పగా చెప్పుకోవాలి. ఇటువంటి వివాహాలు ఎక్కడా జరగలేదబ్బా అనుకునేంత గొప్పగా..రిచ్ గా వుండాలి. దాని కోసం ఫుడ్, కాస్ట్యూమ్స్, ఎకామిడేషన్,  నుండి అన్ని అరేంజ్ మెంట్స్ అన్నీ అంటే అన్నీ ఘనంగా వుండాలి.అటువంటిది అంబానీవారింటో పెళ్లి అంటే మాటలా? ఎంతటి రిచ్ గా వుంటుందో ఊహించటానికి కూడా సాధ్యంకానంత రిచ్ గా వుండబోతోంది అంబానీగారి గారాల పట్టి ఇషా అంబాని వివాహం. 
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా వివాహం డిసెంబర్ 12న జరగనుంది. ముంబైలోని ‘ఆంటిల్లా’లో వీరి పెళ్లిని అంగరవైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు భారీ నుండి అతి భారీగా జరుగుతున్నాయి. అంబానీల ఇంట పెళ్లంటే.. ఎంత గ్రాండ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లికి ముందే కుటుంబ సభ్యులు, సన్నిహితులకు అంబానీ, పిరమాళ్ కుటుంబాలు ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ నిర్వహిస్తున్నాయి. ఈ వేడుకలకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదిక కానుంది. ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసం అతిథులను తీసుకెళ్లడానికి అంబానీ ఫ్యామిలీ 30 నుంచి 50 చార్టర్డ్ ఎయిర్ క్రాఫ్ట్‌లను ఉపయోగించనున్నట్టు సమాచారం. సాధారణ రోజుల్లో మహారాణా ప్రతాప్ విమానాశ్రయంలో రోజుకు 19 విమానాలు మాత్రమే రాకపోకలు సాగిస్తాయి. ఎన్నికల ఎఫెక్ట్, అంబానీ కూతురి ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కారణంగా ఆ విమానాశ్రయానికి రద్దీ భారీగా పెరగనుంది. ఉదయ్‌పూర్‌లో భారీ సంఖ్యలో ఫైవ్ స్టార్ హోటళ్లను కూడా అంబానీ కుటుంబం బుక్ చేసిసేసారు. ఇషా పెళ్లి వేడుకలను సెలబ్రిటీ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ తన కెమెరాలో బంధించనున్నారు. ప్రియాంక-నిక్, అనుష్క-విరాట్‌ల పెళ్లికి కూడా ఆయనే ఫొటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఉదయ్‌పూర్‌లో ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ తర్వాత ముంబైలో నాలుగు రోజులపాటు అంబానీ కూతురి పెళ్లి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. గతంలో కర్ణాటక మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్థన్ రెడ్డి కుమార్తె వివాహం పెద్ద నోట్ల రద్దు సమయంలో జరిగినా ఎంత ఘనంగా చేశాడో తెలిసిన విషయమే. 

 

16:30 - October 30, 2018

అమెరికా : డొనాల్డ్  ట్రంప్. ఈ పేరే సంచలనం. తన నిర్ణయాలను నిర్మొహమాటంతో ఎన్నికల ఎజెండాలోపెట్టి విజయం సాధించిన ట్రంప్ కామెడీలు కూడా చేస్తుంటారు. తన వింత చర్యలతోను, చేష్టలతో నవ్వులు పూయించే ట్రంప్ మరోసారి నవ్వులు పూయించారు. గతంలో ఓసారి బాత్రూమ్ లో వాడే పేపర్ తో విమానం ఎక్కిన విషయం తెలిసిందే. దీంతో  నెటిజన్లతో  వింత వింత కామెంట్స్ చేశారు. ఈసారి మరోసారి ట్రంప్ నెటిజన్లకు చిక్కారు.

Image result for trump umbrellaచిన్న చిన్న కారణాలతో నెటిజన్లకు టార్గెట్ గా మారే ఆయన, ఇల్లినాయిస్‌లో జరుగుతున్న ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో బయలుదేరగా, వర్షం కురుస్తుండటంతో గొడుగు పట్టుకుని విమానం మెట్లు ఎక్కిన వేళ ఈ ఘటన జరిగింది. విమానం లోపలికి వెళ్లే వేళ, గొడుగును మూసేందుకు సాధ్యం కాకపోవడంతో, ద్వారం వద్దే దాన్ని పడేసిన ట్రంప్ లోపలికి వెళ్లిపోయారు. ఆపై గాలికి ఆ గొడుగు అటూ ఇటూ తిరుగుతూ, విమాన ద్వారం వద్దే ఇరుక్కుపోయింది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుండగా, సరదా సరదా కామెంట్లు వస్తున్నాయి. "ట్రంప్‌ కు గొడుగును ఎలా మూసివేయాలో కూడా తెలీదు" అని ఒకరు, "చేతిలో ఉన్న గొడుగునే మూయలేదంటే బాత్ రూమ్‌ కు వెళితే ఫ్లష్‌ కూడా చేయరేమో" అని ఇంకొకరు, "ట్రంప్‌ తెల్లగా ఉంటారు. గొడుగు నల్లగా ఉంది కాబట్టే, ఆయన అందుకే పట్టించుకోకుండా వదిలేసుంటారు" అని ఇంకొకరు  కామెంట్లు చేశారు. గతంలోనూ ట్రంప్ కు సంబంధించిన ఇటువంటి వీడియోలు వైరల్ అయ్యాయి. మరి ట్రంప్ మరోసారి నవ్వులు పూయించటంలో సక్సెస్ అయినట్లే కదా!..

 

 

 
 
12:30 - October 30, 2018

ఢిల్లీ : దూర తీరాలలో గగన విహారంలో ఉద్యోగం చేసే కొడుకు పండగకు వస్తాడనుకుని వేయి కళ్లతో ఎదురు చూసే తల్లికి కడుపుశోకం మిగిల్చి వెళ్లిపోయాడు. ప్రతీ సంవత్సరం అందరూ కలిసి దీపావళి పండుగను వేడుగగా చేసుకుని మురిసిపోయే ఆ కుటుంబంలో శాశ్వతంగా చీకటిని మిగిల్చి వెళ్లిపోయాడు. ఆనవాయితీయికి చరమగీతం పాడి ఆ ఇంట విషాద గీతం వినిపించేలా చేసి వెళ్లిపోయిన కుమారుడ్ని తలచుకుని ఆ తల్లి హృదయం పుట్టెడు శోకంతో అంగలార్చుకుపోతోంది. నవంబర్ 7వ తేదీన వచ్చే దీపావళి పండుగకు వస్తాడని గంపెడంత ఆశతో కుమారుడు  భవ్వే సునేజా కోసం సంగీతా సునేజా ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురు చూస్తున్న వేళ ఆ ఇంట్లో పిడుగులాంటి వార్త వినిపించింది. అంతే కుటుంబం అంతా కుదేలైపోయింది. కలా? నిజమా? అనే మీమాంసలో పడిన ఆ కుటుంబానికి కల కాదు నిజమే అనే చేదు వార్త నమ్మటానికి ఎంతో సమయం పట్టలేదు. 

Image result for pilot SUNEJA BHAVE FAMILYభవ్యే సునేజా తో కలిసి ఆ ఇంట ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ. కానీ.... ఓ పిడుగులాంటి వార్త ఆ కుటుంబం ఆశలను ఆనందాలను చిదిమేసింది. ఇక ఎప్పటికీ భవ్యే రారని... ఆయన ఇక లేరని తెలిసి అంతా శోక సంద్రంలో ముగినిపోయారు. 31 ఏళ్ల అతి చిన్నవయసులోనే ఇండోనేషియాలో సముద్రంలో కూలిపోయిన విమానం పైలట్‌ భవ్వే సునేజా. ఈ ప్రమాద వార్తను టీవీల్లో చూసిన ఆయన కుటుంబ సభ్యులు నమ్మలేకపోయారు. కన్నీరుమున్నీరైన ఆయన తల్లి సంగీతా సునేజాను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు.  

Image result for pilot SUNEJA BHAVE FAMILY2009లో ఆయనకు పైలట్‌ లైసెన్సు వచ్చిన భవ్వే మయూర్‌ విహార్‌లోని పబ్లిక్‌ స్కూల్‌లో భవ్యే చదువుకున్నారు. తండ్రి గుల్షన్‌ సుఖేజా చార్టెర్డ్‌ అకౌంటెంట్‌ గా పనిచేసే తండ్రి, తల్లి సంగీతా సునేజా ఎయిర్‌ ఇండియాలో పనిచేసేవారు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో మేనేజర్‌గా పనిచేసిన గరిమా సేథీతో 2016లో భవ్యేకు  వివాహమైంది. 2011లో లయన్‌ ఎయిర్‌లో చేరిన భవ్వేకు పైలట్‌గా 6,000 ఫ్లైట్‌ అవర్స్‌ అనుభవం ఉన్న ఈ భారతీయుడు అనుభవం తన ప్రాణమేకాదు..తనతో పాటు ఎంతోమందిని జలసమాధి చేయటం విచారించదగిన విషయం. కళ్లల్లో దీపాల ఒత్తులు వేసుకుని ఆశగా ఎదురు చూస్తున్న జీవన సహచరి జీవితాంతం ఎదురు చూసినా రాని భాగస్వామి కోసం గుండెలవిసేలా రోదిస్తుంటే ఓదార్చేందుకు ఎవ్వరి తరం కావటంలేదు. 

 
21:50 - September 4, 2018

అమెరికా : చేపల్ని పెంపకంపై ఇప్పుడు కోట్లాది రూపాయలు టర్నోవర్ అవుతున్నాయి. చేపల్ని ఎక్కువగా తినమని వైద్యులు కూడా చెబుతుంటారు. ఒకప్పుడు కాలువల్లోను, నదుల్లోను, సముద్రాల్లోను పెరిగిన చేపల్నే తినేవారు. కానీ గత కొంతకాలంగా చేపల చెరువుల్లో ఒక వ్యాపారంగా మారిపోయాయి. ఇక అసలు విషయానికి వస్తే చేపల్ని ఒకచోటి నుండి మరొక చోటికి తరలించేందుకు సాధారణంగా రోడ్డు మార్గాలను..లేదా నీటి మార్గాల ద్వారా కానీ విమానం ద్వారా చేపల్ని ఒకచోటి నుండి మరొకచోటికి తరలించటం కూడా జరుగుతోంది. వాటికి తీసుకెళ్లి అతి ఎతైన ప్రదేశం నుండి ఆ చేపల్ని గాల్లోంచి కొండ ప్రాంతాలలో వుండే చెరువుల్లోకి జారవిడుస్తున్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే..అంత ఎత్తునుండి జారవిడిచినా మీనాలు చక్కగా చెరువుల్లోకి క్షేమంగా చేరిపోతున్నాయి.

అమెరికాలోని యుటా రాష్ట్రంలో అక్కడి వైల్డ్‌లైఫ్ రీసోర్సెస్ ఈ పని చేస్తున్నది. కొండ ప్రాంతాల్లోని చెరువుల్లో చేపల పెంపకానికి ఈ పద్ధతి ఈజీగా ఉండటంతో అక్కడి అధికారులు కొన్నాళ్లుగా ఇదే ఫాలో అవుతున్నారు. విమానం కింది భాగంలో ఉన్న భారీ రంధ్రం నుంచి వేలాది చేపలను కింద ఉన్న చెరువులోకి జార విడుస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది. గతంలో పాల క్యాన్లలో చేపలను వేసి, వాటిని గుర్రాలపై పైకి తరలించి చెరువుల్లో వేసేవారు. కానీ దానికి సమయం ఎక్కువ, సుదీర్ఘ ప్రక్రియ కావడంతో విమానంతో చేపల్ని తరలించటం సునాయాసంగా మారిపోవటం..పైగా తక్కువ సమయంలోనే పని పూర్తి కావటంతో దీన్నే కొనసాగిస్తున్నామని సదరు విమాన చేపల తరలింపుదారులు తెలిపారు. కాగా ఇవన్నీ చిన్నచిన్న చేప పిల్లలు కావడంతో అంత ఎత్తు నుంచి కింద పడినా వాటిలో 95 శాతం వరకు బతికే ఉంటున్నాయంటున్నారు సదరు నిర్వాహకులు.

17:14 - July 23, 2018

న్యూఢిల్లీ : ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జీ కుంతియం వెల్లడించారు. తెలంగాణలో పార్టీ బలోపేతం ఆయన దృష్టిసారించారు. అందులో భాగంగా ఢిల్లీలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ తో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్ కార్యదర్శులు బోసరాజు, సలీం, శ్రీనివాస్ లు కూడా పాల్గొన్నారు. ఒక్కో కార్యదర్శికి ఐదారు పార్లమెంట్ నియోజకవర్గాలు కేటాయించినట్లు, సీఎం కేసీఆర్ చెబుతున్నదానికంటే బలంగా ఉన్నామని తెలిపారు. 

14:05 - July 23, 2018

ఢిల్లీ : రాఫెల్ యుద్ధ విమానాలను ఏ ధరకు కొనుగోలు చేశారో చెప్పాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. యుద్ధ విమానాల కొనుగోలు ధర ఇవ్వడంలో కేంద్రం ఎందుకు తాత్సారం చేస్తుందని ప్రశ్నించారు. 2014ఎన్నికల్లో కేసీఆర్ ఆకర్షణీయమైన మాటలతో, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ఆలస్యంగా విడుదల చేయడంతో టీఆర్ఎస్ గెలిచిందని..కాంగ్రెస్ ఓడిపోయిందని తెలిపారు. అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వడం, ఎంపికలో ఆలస్యం అవుతుందన్నారు. మూడు నెలల ముందే మేనిపెస్టో విడుదల చేయాలని, అభ్యర్థులకు టిక్కెట్లు డిస్ట్రిబ్యూషన్ చేయాలని ఏఐసీపీ సమావేశంలో చెప్పినట్లు తెలిపారు. సంస్థాగతంగా బలపడేందుకు నిరంతరాయంగా కృషి చేస్తున్నామని చెప్పారు.

 

12:08 - December 1, 2017

ఢిల్లీ : ప్రొఫెషనల్‌  వింగ్‌ సూట్‌ డైవర్లు విన్స్‌ రెఫెట్‌,ఫ్రెడ్‌ ఫ్యుగన్‌ బేస్‌ జంపింగ్‌లో మరో వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించారు. వ్యక్తిగత వింగ్‌సూట్‌ విభాగాల్లో 4 సార్లు వరల్డ్‌ చాంపియన్స్‌గా నిలిచిన విన్స్‌ రెఫెట్‌,ఫ్రెడ్‌ ఫ్యుగన్‌ ఇప్పటివరకూ మరే ఇతర వింగ్‌సూట్‌ డైవర్లు చేయని సాహసమే చేశారు. స్పెయిన్‌లోని ఎంపురియాబ్రావా పర్వతాలపై నికి యూరప్‌లోనే అత్యంత ఎత్తైన పర్వతంగా పేరుంది. ఈ పర్వతంపై నుంచి వింగ్‌సూట్‌ డైవింగ్‌ చేసిన ఈ ఇద్దరూ....3వేల మీటర్ల ఎత్తులో ఎగురుతోన్న ఎయిర్‌క్రాఫ్ట్‌లోకి విజయవంతంగా డైవ్‌ చేసి ఔరా అనిపించారు. ఎడ్వంచరస్‌ స్పోర్ట్స్‌ వరల్డ్‌లో ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌.

 

21:44 - September 28, 2017
20:42 - September 28, 2017

హైదరాబాద్‌ : నగర శివారు ప్రాంతంలోని కీసర మండలం అంకిరెడ్డి పల్లి క్రషర్‌ పరిశ్రమ వద్ద ట్రైనింగ్‌ విమానం కుప్పకూలింది. ఒక్కసారిగా విమానం కూలడంతో పెద్దగా మంటలు వ్యాపించాయి. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బంది వివరాలు సేకరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం వీడియోలో చూద్దాం...

 

19:59 - July 6, 2017

రాజస్థాన్ : భార‌త వైమానిక ద‌ళానికి చెందిన మిగ్‌-23 శిక్షణ విమానం రాజ‌స్థాన్‌లో కుప్పకూలింది. జోద్‌పూర్‌లోని బాలేస‌ర్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే శిధిలాల నుంచి భారీగా మంట‌లు వ్యాపించాయి. నేల‌కూలిన‌ మిగ్-23 విమానం పూర్తిగా ధ్వంస‌మైంది. ఈ ప్రమాదం నుంచి  పైల‌ట్లు ఇద్దరూ సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు.  సాంకేతిక లోపం త‌లెత్తడం వ‌ల్ల మిగ్‌-23 ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. మంగళవారంనాడు ఎయిర్‌ ఫోర్స్‌ ఛాపర్ అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌లో కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే.
  

Pages

Don't Miss

Subscribe to RSS - aircraft