Ajith

14:11 - November 8, 2018

తమిళ స్టార్ హీరో, తల అజిత్, దర్శకుడు శివల కాంబినేషన్‌లో, వీరం, వేదాళం, వివేకం తర్వాత, విశ్వాసం అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా సెట్‌లో, ఒక డ్యాన్సర్ మరణించిన ఘటన గురించి తెలిసి కోలీవుడ్ ఉలిక్కి పడింది.
ప్రస్తుతం, విశ్వాసం సినిమాలోని ఒక పాట చిత్రీకరణ పూణెలో జరుగుతుంది. రిహార్సల్స్ చేస్తున్న టైమ్‌లో, శరవణన్ అనే డ్యాన్సర్, గుండెపోటు రావడంతో సెట్‌లోనే కుప్పకూలిపోయాడు. యూనిట్ సభ్యులు వెంటనే అతణ్ణి హాస్పిటల్‌కి తీసుకెళ్ళగా, అప్పటికే శరవణన్ మృతిచెందినట్టు డాక్టర్స్ చెప్పడంతో, యూనిట్ సభ్యులు షాక్ అయ్యారు. ఈ విషయం తెలిసి, అజిత్ చాలా బాధపడ్డాడట. తనే దగ్గరుండి పోస్ట్‌మార్టం పనులవీ చూసుకున్నాడని మూవీ యూనిట్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇక, శరవణన్ గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడనీ, కానీ, ఆసంగతి యూనిట్ వారికి చెప్పలేదని తోటి డ్యాన్సర్స్ అంటున్నారు. శరవణన్ మృతదేహాన్ని చెన్నైలోని అతని కుటుంబ సభ్యులకు అప్పచెప్పడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చెయ్యడంతో పాటుగా, మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల ఆర్థిక సాయం అందచేసింది విశ్వాసం టీమ్.  

17:15 - September 1, 2018

ఒక హిట్ కొట్టగానే విర్రవీగే తెలుగు కుర్ర హీరోలకు తెలుగు క్యారెక్టర్ నటి మీనా ఓ ఝలక్ ిఇచ్చింది. నేను చాలా మంది హీరోలను చూశాను. ఒక్క హిట్ కొట్టగానే విర్రవీగిపోతుంటారు. వారిలో కుక్క బుద్ధిలాంటి ఈగో తారాస్థాయికి చేరుకుంటుంది. ఇటువంటి నటులందరు తమిళ హీరో అజిత్ కాళ్లు కడిగి నెత్తిమీద నీళ్ళు  జల్లుకోవాలి అంటూ  వదిన, అక్క క్యారెక్టర్లలో కనిపించే మీనా తన సోషల్ మీడియా ఖాతాలో వ్యాఖ్యానం పోస్ట్ చేసింది. అంతేకాదు..ఆయన పాదపూజ చేసుకుంటే కనీసం 10 శాతం మంచితనమైన పెరుగుతుందని తన పోస్ట్ లో పేర్కొంది. 

ఈ వ్యాఖ్య  ఎవరిగురించో కొంత అర్ధం అయినా.. కుర్రహీరోలందరూ ఈ నటిపై గుర్రుగా ఉన్నారు. ఈ నటి అజిత్ సినిమాలో ఓ పాత్ర పోషించింది ఇటీవల. అదీ అసలు విషయం. 

 

08:50 - April 19, 2018

చెన్నై : తమిళ సినీ పరిశ్రమ సమ్మెకు తెరపడింది.. గత 48 రోజులుగా కొనసాగుతున్న బంద్‌కు ముగింపు పలుకుతున్నట్లు నిర్మాతల మండలి అద్యక్షుడు విశాల్ ప్రకటించారు. ఇండస్ర్టీలోని  ఇబ్బందులకు న్యాయం జరిగేలా సమ్మె సాగిందన్నారు. శుక్రవారం నుంచి సినిమా థియేటర్లతోపాటు, షూటింగులు మళ్ళీ ప్రారంభం కానున్నాయి. చిత్రసీమ పూర్వ వైభవం సంతరించుకునే దిశగా సమ్మె విరమణకు సహకరించిన సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తీ, తదితర నటులు, చిత్రనిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ యాజమాన్యాలతోపాటు సినీపరిశ్రమలోని 24 క్రాఫ్ట్ లకు విశాల్ ధన్యవాదాలు తెలిపారు. 

 

13:27 - November 22, 2017

1980 నటులు అందరు ఒకే చోట ఉంటే వారి చూడడానికి రెండు కళ్లు సరిపోవేమో కానీ చూడక తప్పదు. 80ల నాటి సౌత్ ఇండియా స్టార్స్ అంత ఒకేచోటికి చేరారు. ఆ నాటి హీరోయిన్లు అందరు ప్రతి ఏడాది గెట్ టూ గెదర్ ఏర్పాటు చేసుకుంటారు. ఈ సరి జరిగిన గెట్ టూ గెదర్ లో మెగా స్టార్ చిరంజీవి, వెంకటేష్, నరేష్ తో పాటు తమిళ నటుడు శరత్ కుమార్, సురేష్, బాగ్యరాజు పాల్గొన్నారు. హీరోయిన్లు రమ్యకృష్ణ, సుమలత, రాధిక, రేవతి, నదియా, సుహాసిని, జయసుధ, ఖుష్బూ, తదితరులు పాల్గొన్నారు. ఈ గెట్ టూ గెదర్ లో తెలుగు, తమిళం, మలయాళ, కన్నట చెందిన 28 మంది నటులు పాల్గొన్నారు. ఈ ప్రొగ్రామ్ ఈనెల 17న చెన్నైలోని మహాబలిపురం ఉన్న ఓ రిసార్ట్ లో జరిగింది. దీన్ని సుహాసిని మణిరత్నం, లిస్సీ లక్ష్మీ ఆర్గనైజ్ చేశారు.

12:50 - June 1, 2017

కోలీవుడ్ స్టార్ హీరో 'అజిత్' సినిమా కోసం ఆయన అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తుంటారు. ఆయన స్టైల్..ఆకట్టుకొనే వస్త్ర ధారణ..ఫైట్లతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న 'వివేగం' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన టీజర్ రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. కానీ ఆయన షూటింగ్ పాల్గొంటుండగా గాయపడినట్లు వార్తలు వెలువడుతున్నాయి. యూరప్ లో జరుగుతున్న షూటింగ్ లో ‘అజిత్’ పాల్గొన్నట్లు..డూప్ లేకుండానే పలు సన్నివేశాల్లో ఆయన పాల్గొంటున్నారని తెలుస్తోంది. కొంత ఎత్తు నుంచి 'అజిత్' కింద పడడంతో భుజానికి గాయాలైనట్లు సమాచారం. 'అజిత్‌'కు వెంటనే ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారని తెలుస్తోంది. గాయాల తీవ్రతపై స్పష్టమైన సమాచారం లేదు. 'అజిత్' ఇంటర్ పోల్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో 'వివేక్ ఒబెరాయ్' విలన్ గా నటిస్తున్నాడు.

14:48 - May 11, 2017

కోలీవుడ్ లో స్టార్ హీరోల్లో ఒకరైన 'అజిత్' తాజా చిత్రం 'వివేగం'పై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఇటీవలే విడుదలైన టీజర్ అంచనాలు మించి వ్యూస్ వస్తున్నాయి. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 'అజిత్' సరసన 'కాజల్' నటిస్తోంది. భారీ యాక్షన్ సీన్స్ తో రూపొందిన టీజర్ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది. 'అజిత్' ఇంటర్ పోల్ అధికారిగా నటిస్తుండగా బాలీవుడ్ హీరో 'వివేక్ ఒబెరాయ్' విలన్ గా నటిస్తున్నారు. రిలీజ్ అయిన 12 గంటల్లో ఈ చిత్ర టీజర్ కి 5 మిలియన్ల పైనే వ్యూస్ లభించాయి. ఇప్పటి వరకు 'కబాలి' చిత్రంపైనే ఈ రికార్డు ఉంది. తాజాగా 'వివేగం' టీజర్ దీనిని బ్రేక్ చేసి సౌత్ ఇండియన్ మూవీకి ఓ బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. మరి చిత్ర విడుదలయైన తరువాత ఎలాంటి రికార్డ్స్ సృష్టిస్తుందో వేచి చూడాలి.

12:30 - February 2, 2017

తమిళ హీరో 'అజిత్' పై టాలీవుడ్ బాహుబలి 'రానా' ప్రశంసల వర్షం కురిపించాడు. కండలు తిరిగి ఉన్న 'అజిత్' లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకొంటోంది. వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న 'అజిత్'..'వివేగం' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను చిత్ర యూనిట్ బుధవారం రాత్రి విడుదల చేసింది. ఈ పోస్టర్ పై 'రానా' స్పందించాడు. 'వావ్..వావ్..వావ్..ఔట్ స్టాడింగ్..అందరికీ మీరు స్పూర్తి..వృత్తి పట్ల ఈ పోస్టర్ అంకిత భావాన్ని తెలియచేస్తోంది' అంటూ 'రానా' ట్వీట్ చేశారు. 'అజిత్' కు ఇది 57వ సినిమా. సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్ ఒకేసారి విడుదల చేశారు. 'బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్' అనేది ట్యాగ్‌లైన్ తగిలించారు. దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. శివ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో 'కాజల్', 'అక్షర హాసన్' హీరోయిన్లుగా నటిస్తున్నారు. వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. 

09:45 - May 31, 2016

'వీరం', 'వేదాలం' వంటి బ్యాక్‌ టు బ్యాక్‌ బ్లాక్‌బస్టర్లు ఇచ్చిన దర్శకుడు శివతో కలిసి అజిత్‌ మరో చిత్రం చేస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రంలో అజిత్‌ సరసన ఇద్దరు కథానాయికలు ఆడిపాడనున్నారు. అందులో ఒకరిగా అనుష్కను ఇప్పటికే ఎంపిక చేసుకోగా, మరో కథానాయికగా కాజల్‌ని సెలెక్ట్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం హిందీలో 'దో లఫ్జోంకి కహానీ' చిత్రంలో కాజల్‌ నటిస్తోంది. ఈ చిత్రం త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్‌లో పాల్గొన్న కాజల్‌, తన తదుపరి చిత్రం అజిత్‌తో ఉంటుందని వెల్లడించింది. 'ప్రస్తుతం విక్రమ్‌తో 'గరుడ' చిత్రంలో నటిస్తున్నాను. త్వరలోనే అజిత్‌ సరసన నటించేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చాను. ఇది మరో రెండు నెలల్లో ప్రారంభం కానుంది' అని తెలిపింది. దీంతోపాటు కాజల్‌ ప్రస్తుతం తమిళంలో జీవా నటిస్తున్న 'కావలై వేండమ్‌', తెలుగులో తేజ దర్శకత్వంలో రూపొందుతున్న మరో చిత్రంలోనూ నటిస్తోంది.

 

07:22 - April 11, 2016

మహేష్‌కి జోడీగా నటించిన 'ఒన్‌.. నేనొక్కడినే' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన కృతి సనన్‌ ఆ తర్వాత నాగచైతన్య సరసన 'దోచెయ్' చిత్రంలోనూ నటించింది. వీటితోపాటు బాలీవుడ్‌లో నటించిన 'దిల్‌వాలే', 'హీరోపంటి' చిత్రాలు కృతికి మంచి పేరే తీసుకొచ్చాయి. తాజాగా తమిళంలో అజిత్‌ సరసన నటించే లక్కీ ఛాన్స్‌ను అందిపుచ్చుకుందని సమాచారం. అజిత్‌, శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'తలా 57' చిత్రంలో కృతిసనన్‌ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక హీరోయిన్‌గా తమన్నాని సెలెక్ట్‌ చేసిన విషయం విదితమే. ఈ చిత్రంతో కృతి కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. మొత్తమ్మీద అజిత్‌ సరసన నటించే ఇద్దరు కథానాయికల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యిందని చిత్ర యూనిట్‌ తెలియజేసింది.

08:45 - March 21, 2016

తమిళ అగ్ర హీరో అజిత్‌ 57వ చిత్రంలో నటించేందుకు అనుష్క గ్రీన్‌సిగల్‌ ఇచ్చిందని సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందిన 'ఎన్నై అరిందాల్‌' చిత్రం తమిళనాట మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ జోడీ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. 'వీరమ్‌', 'వేదాలమ్‌' చిత్రాలకు దర్శకత్వం వహించిన శివ దర్శకత్వంలో అజిత్‌ 57వ చిత్రం కూడా తెరకెక్కనుంది. అనిరుథ్‌ సంగీతం అందిస్తున్న ఈచిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు జూన్‌లో ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. ఈ చిత్రంతోపాటు అనుష్క 'బాహుబలి2' చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.

 

Pages

Don't Miss

Subscribe to RSS - Ajith