aksharm

13:42 - July 9, 2017

ప్రముఖ నవలారచయిత ప్రభాకర్ జైని రాసిన సినీవాలీ నవల ఆవిష్కరణ సభ ఇటీవల రవీంద్రభారతిలో జరిగింది. తెలంగాణా ప్రభుత్వ సలహాదారులు కె.వి.రమణాచారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో  ఆధ్యాత్మిక గురువు శ్రీరాంసార్ సినీ వాలీ నవలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, నవ్యవీక్లీ ఎడిటర్ జగన్నాథశర్మ, ఎ.పి.బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టు అసోషియేషన్  అధ్యక్షులు టి.రాజేందర్, బిక్కి కృష్ణ, అసుర, కత్తిమహేశ్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పలువురిని ఘనంగా సత్కరించారు. ఇటీవల మహబూబాబాద్ లో కవయిత్రి కీర్తనారెడ్డి రాసిన జీవనవీణ కవితా సంపుటిని ప్రముఖ కవి, ప్రజాగాయుడు గోరటి వెంకన్న ఆవిష్కరించారు. బిక్కి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రభ ఎడిటర్ వై.ఎస్.ఆర్ శర్మ, జాయింట్ కలెక్టర్  దామోదర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ ఉమా మురళీనాయక్, ఆకెళ్లరాఘవేంద్ర తదితరులుపాల్గొన్నారు. 

13:41 - July 9, 2017

తెలంగాణాలో ఎందరో గేయరచయితలున్నారు. అద్భుతమైన పాటలు రాస్తున్నారు. ప్రజలను తమ పాటలతో ఉత్తేజపరుస్తున్నారు. ఉద్యమాల బాట పట్టిస్తున్నారు. అలాంటి వారిలో కరీంనగర్ కు చెందిన కన్నం లక్ష్మీనారాయణ ఒకరు. ఆయన ఓ పక్క సింగరేణి బొగ్గుగనిలో కార్మికునిగా పనిచేస్తూ మరో పక్క గేయరచయితగా పాటలు రాస్తూ వచ్చారు. ప్రముఖ గేయరచయిత కన్నం లక్ష్మినారాయణ జనం పాట మీ కోసం..పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

 

13:35 - February 14, 2016

అరుణ్ సాగర్.. ఈ పేరుకో వైబ్రేషన్.. ఎలక్ట్రానిక్ మీడియాలో అతనో  సెన్సేషన్. కవిత్వాభిమానులకు ఇష్టమైన అబ్సెషన్. ఒక్కమాటలో చెప్పాలంటే అరుణ్ సాగర్ అంటే కొత్తదనం, సూటిదనం, ఓ విస్ఫోటనం, ప్రవహించే ఎర్రదనం. తెలుగు కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించిన కవి ఆయన. స్వర్ణ భస్మమురా మన కవిత, అలజడి చెందిన అక్షర సమూహమన్న  నిత్య నవయవ్వన కవి. సీలేరు ఒడ్డున విరుగుతున్న విల్లు ఫెటఫేటేల్ ధ్వానాల్ విను.. వినరా రామా అంటూ నిర్వాసితుల గోడును పలవరించి మరణ వాంగ్మూలాన్ని వినిపించిన అరుణ్ సాగర్ ఇకలేడని, కనిపించడని అంటే నమ్మలేని విషాదం.
సరికొత్త కవిత్వానికి అరుణ్ బాటలు
ప్రపంచం నడుస్తున్న దారిలోంచి కొంచెం పక్కకు జరిగి పరికించే శక్తి కొందరికే ఉంటుంది. అతడు 24గంటల ఎలక్ట్రానిక్ మీడియా ప్రవాహంలో పరిగెత్తుతూనే సమాజాన్ని నిశితంగా పరికించాడు. అత్యాధునిక భావజాలంతో తనదైన ఆలోచనా ధోరణితో, మానవ విలువలతో పలవరించాడు. తడి నిండిన అక్షరాలలో మెట్రోసెక్సువల్ మేల్ వాదనను, నిర్వాసితుల గోడును వినిపించాడు. జీవితం మాగ్జిమమ్ రిస్క్ లో ఉన్నా.. చిరునవ్వు చెదరకుండా సరికొత్త కవిత్వానికి బాటలు వేశాడు. 
ఎంతటి మేధావో..అంతటి నిగర్వి 
ఎంతటి మేధావో..అంతటి నిగర్వి. ఎంతటి సాహసికుడో అంతటి సామాన్యుడు. కవిత్వంలో మాత్రమే  మాటల పొదుపరి...స్నేహంలో కాదు. చెలిమి కోసం ప్రాణాలిచ్చే సావాసగాడు. 
వామపక్ష నేపథ్యాన్ని వీడలేదు..
కానీ, ఏ క్షణంలోనూ తాను నడిచొచ్చిన దారిని మరువలేదు. తాను ఎదిగొచ్చిన వామపక్ష నేపథ్యాన్ని వీడలేదు. తాను పనిచేస్తున్న సంస్థ మార్కెట్  పోటీలో నిలదొక్కుకునేలా తన వంతు కర్తవ్యాన్ని నెరవేరుస్తూనే వీలు దొరికినప్పుడూ..అవసరం ఏర్పడినప్పుడూ తన భావజాలాన్ని ప్రదర్శించడంలో వెనకాడలేదు జంకలేదు. దటీజ్ అరుణ్ సాగర్. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

Don't Miss

Subscribe to RSS - aksharm