amazon

12:35 - November 28, 2018

బెంగళూరు: ఆన్‌లైన్ అమ్మకాల్లో  ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ అమేజాన్ దూసుకుపోతోంది. మార్చి, 2018తో ముగిసిన ఏడాది జరిగిన అమ్మకాల్లో రికార్డు స్థాయిలో అమ్మకాలు చేసి  తన సమీప ప్రత్యర్థి ఫ్లిప్‌కార్ట్‌ను దాటివేసింది. 
బార్కలేస్ అందించిన నివేదిక ప్రకారం అమేజాన్ 7.5 బిలియన్ అమెరికన్ డాలర్ల (రూ 750 కోట్లు) అమ్మకాలు చేయగా.. ఫ్లిప్‌కార్ట్ 6.2 బిలియన్ డాలర్ల (రూ 620 కోట్ల) అమ్మకాలు మాత్రమే చేయగలిగింది. ఫ్లిప్‌కార్ట్ తన ఫ్యాషన్‌రంగ సంస్థలైన మైంత్రా, జబాంగ్‌ను తమ గ్రూపులో కలుపుకున్న తర్వాత, అమేజాన్‌తో పోటాపోటీగా అమ్మకాలు జరిపింది. గతేడాది గ్రాస్ మర్కెంటైల్ విలువ (జీఎమ్వీ)లో  జబాంగ్, మైంత్రా కంపెనీలు కలవకముందే ఫ్లిప్‌కార్ట్.. అమేజాన్‌కు భారీ పోటీని ఇవ్వగలిగింది. 
అమేజాన్ 7.5 బిలియన్ అమెరికన్ డాలర్ల (రూ 750 కోట్లు) అమ్మకాలు చేయగా.. ఫ్లిప్ కార్ట్ 6.2 బిలియన్ డాలర్ల (రూ 620 కోట్ల) అమ్మకాలు మాత్రమే చేయకలిగింది. అయితే.. ఆదాయం విషయానికి వస్తే ఫ్లిప్‌కార్ట్ అమేజాన్ కంటే ఎక్కువ స్థాయిలోనే ఉందని నివేదిక వెల్లడించింది. 
అమేజాన్ అమెరికన్ ప్రత్యర్థి అయిన వాల్‌మార్ట్ ఈ ఏడాది ప్రారంభంలో ఫ్లిప్‌కార్ట్ లో 77 శాతం  వాటాను సొంతం చేసుకున్న సంగతి తెలింసిందే. 
 

 

12:20 - October 18, 2018

ఢిల్లీ : ప్రతీ సంవత్సరం దసరా వచ్చిందంటే చాలు ఆన్ లైన్ దిగ్గజం అమెజాన్ సేల్స్ సంచలనం సృష్టిస్తునే వుంది. సేల్స్ ఐటెమ్స్ పెట్టిన నిమిషాలలోనే భారీగా సేల్స్ తో అమెజాన్ అదరగొడుతోంది. ఈ నేపథ్యంలో ఈ దసరా   సందర్భంగా అక్టోబర్‌ రెండో వారంలో గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌ పేరుతో దుమ్మురేపిన ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ రెండో విడత మెగా ఆఫర్‌ను ప్రకటించింది. 

Related imageఈనెల 24వ తేదీ అర్ధరాత్రి నుంచి 28వ తేదీ అర్ధరాత్రి వరకు మరోసారి వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌ ఇస్తున్నట్లు ప్రకటించింది. దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకుని రెండో విడత అమ్మకాలకు అమెజాన్‌ ముందుకు వస్తోందని భావిస్తున్నారు. కొనుగోలు సమయంలో అమెజాన్‌ పే యూజర్లకు రూ.250 క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 

Image result for amazon led tvఐదు రోజుల పాటు జరగనున్నరెండో రౌండ్‌ సేల్‌లో ఎక్స్‌క్లూజివ్‌ లాంచ్‌లు, ఆఫర్లు ఉంటాయని భావిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్లు, ఎల్‌ఈడీ టీవీలు, హోమ్‌ అప్లియెన్సెస్‌, కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్ పై పలు డీల్స్‌ను ప్రకటించింది. ఈ సారి గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌లో ప్రతి రోజూ రెడ్‌మి 6ఏ ఫ్లాష్‌ సేల్‌ నిర్వహించనుంది. 

Image result for amazon selling booksఅమెజాన్‌ ఫైర్‌ టీవీ స్టిక్‌, మూడో జనరేషన్‌ ఎకో స్మార్ట్‌ స్పీకర్స్‌ ఆకర్షణీయమైన డిస్కౌంట్‌లో అందించనుంది. అలెక్స్‌ ఆధారిత డివైజ్‌లకు 70 శాతం వరకు డిస్కౌంట్‌ లభించనుంది. బెస్ట్‌ సెల్లింగ్‌ బుక్స్‌ను కేవలం రూ.19కే అమ్మాలని  అమెజాన్ నిర్ణయించింది. 
 

 
15:59 - October 16, 2018

ఢిల్లీ : స్మార్ట్ ఇప్పుడు అందరి చేతుల్లోను ఇదే. స్మార్ట్ ఫోన్స్ ఏ కంపెనీ విడుదల చేసినా..అది క్షణాల్లో స్మార్ట్ అభిమానుల చేతుల్లో హొయలు పోతుంది. ప్రపంచం అంతా స్మార్ట్ గా మారిపోతున్న క్రమంలో అన్ని మొబైల్ కంపెనీలు పోటీలు పడి మరీ స్మార్ట్ ఫోన్స్ ని మరింత స్మార్ట్ గా ఎలా తయారు చేయాలో అనే పనిలో స్మార్ట్ గా ఆలోచిస్తున్నారు. దీంతో ప్రపంచం మరింత స్మార్ట్ ను సంతరించుకుంటోంది. ఈ నేపథ్యంలో హువావే సబ్ బ్రాండ్ సంస్థ అయిన ఆనర్ నుండి నూతన స్మార్ట్ ఫోన్ కొద్దిసేపటి క్రితం భారత మార్కెట్లో విడుదల అయింది. ఆనర్ 8ఎక్స్‌ పేరిట విడుదలైన ఈ ఫోన్లో భారీ డిస్‌ప్లే, డ్యుయల్ కెమెరాలు లాంటి పలు ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. ఈ నెల 24 నుండి అమెజాన్ సైట్‌ లో ప్రత్యేకంగా విక్రయించనున్న ఈ ఫోన్ 4 జీబీ / 6 జీబీ వేరియంట్ లలో లభించనుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల ఫోన్ ధర రూ.14,999 ఉండగా, 6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధర రూ.16,999గా ఉంది. అలాగే 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధర రూ.18999గా ఉంది.
 

 

11:09 - October 16, 2018

ఢిల్లీ :  ఏమీ కావాలన్నా ఆన్‌లైన్.. ఒక ఫోన్ ను చేతిలో పట్టుకుని నచ్చిన వాటిని క్లిక్ చేయడం..వాటి ధరను ఆన్‌లైన్‌లోనే చెల్లించడం..గడప దాటకుండానే ఆ వస్తువు ఇంటికి చేరుతున్నాయి. తినే తిండి నుండి మొదలుకుని కట్టుకొనే బట్ట..వాడే వస్తువులు కూడా అంతా ఆన్ లైన్ లోనే లభిస్తున్నాయి. అంతేగాకుండా ఫలానా ఐటమ్ కొంటే మరొక ఐటమ్ ఉచితం అని ఆఫర్్స..డిస్కౌంట్లు ఆయా సంస్థలు ప్రకటిస్తుండడంతో వినియోగదారులు కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. పండుగ సీజన్ లైతే సరేసరి...ప్రధానంగా దసరా..దీపావళి..పండుగ సీజన్ లో ఆన్ లైన్ కళకళాడుతోంది...
దసరా..దీపావళి పండుగ సీజన్ ను ఇ కామర్స్ సంస్థలు మంచిగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నాయి. ఆయా కంపెనీలు భావిస్తున్నట్లుగానే ఆన్ లైన్ మార్కెట్ కళకళలాడుతోంది. అమ్మకాలు దుమ్మురేపుతున్నాయి. పండుగ సీజన్ కావడంతో ఈ-కామర్స్ సంస్థలకు కాసుల వర్షం కురుస్తోంది. దిగ్గజ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కేవలం ఐదు రోజుల్లోనే రూ. 15,000 కోట్ల మేర అమక్మాలు జరిపినట్లు అంచనా వేస్తున్నారు. 
ఆన్ లైన్ లో వివిధ వస్తువులకు డిస్కౌంట్లు ప్రకటిస్తుండడంతో నెటిజన్లు కొనుగోలుకు ఎగబడుతున్నారు. స్మార్్ట ఫోన్లు, గృహోపకరణాలుకు ఎక్కువగా డిమాండ్ ఉంది. అంతేగాకుండా పండుగ సీజన్ కావడంతో దుస్తులకు కూడా మంచి గిరాకీ ఉన్నట్లు ఆయా సంస్థలు వెల్లడిస్తున్నాయి. గతేడాది ఇదే వ్యవధిలో రూ.10,325 కోట్లుగానే ఉన్నాయని చెప్పింది. అంటే ఈసారి ఏకంగా 64 శాతం వృద్ధి చెందడం పట్ల ఆయా కంపెనీలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. 
ధరలు తగ్గించడం, ఆఫర్లు ప్రకటించడంతో ఆన్ లైన్ లో కొనుగోలుకు ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేగాకుండా వాడిన వస్తువులకు సంబంధించిన వాటికి కూడా గిరాకీ బాగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. కొన్ని పథకాల వల్ల కొత్త వినియోగదారులు కూడా లభించారని ఆయా సంస్థలు పేర్కొంటున్నాయి. ఆన్ లైన్ అమ్మకాలు ఈసారి దాదాపు రూ.22 వేల కోట్లను తాకవచ్చని పేర్కొన్నది. 

10:07 - October 15, 2018

హైదరాబాద్ : దసరా..దీపావళి..పండుగలను క్యాష్ చేసుకోవాలని...వివిధ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఆన్ లైన్ లో వివిధ డిస్కౌంట్లు..ఆఫర్లు ప్రకటిస్తూ వినియోగదారులను ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆన్ లైన్ లో కొద్ది రోజుల్లోనే 40 లక్షలకు పైగా సెల్ ఫోన్ లు విక్రయాలు జరిగాయని సమాచారం. అమెజాన్..ప్లిఫ్ కార్టు..ఇతర సంస్థలు ఆన్ లైన్ లలో హావా కొనసాగిస్తున్నాయి. తాజాగా ఎస్‌బీఐ భారీ ఆఫర్లతో ముందుకొచ్చింది. యోనో యాప్ ను ముందుకు తీసుకొచ్చింది. ఈ పండుగ సీజన్ లో కొనుగొళ్లు జరిపే వారికి భారీ రాయితీలు..క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈనెల 16 నుండి 21 మధ్య యోనో ద్వారా జరిపే కొనుగోళ్లపై పది శాతం రాయితీ..క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్, నగలు, ఫ్యాషన్, గిఫ్ట్, ట్రావెల్, హాస్పిటాలిటీ రంగంలో పలు ఆఫర్లు ఉన్నట్టు ఎస్‌బీఐ పేర్కొంది. ఇప్పటికే ఈ కామర్్స సంస్థలు యోనోతో 85 శాతం మేర ఒప్పందాలు కుదుర్చుకున్నాయని తెలిపింది. మరి ఈ పండుగ సీజన్ లో ఎస్‌బీఐ ఎలాంటి ఫలితాలు కనబరుస్తుందో చూడాలి. 

14:14 - October 11, 2018

ఢిల్లీ : ఇప్పుడు ప్రపంచం అంతా స్మార్ట్ అయిపోయింది. అందరి చేతుల్లోను స్మార్ట్ ఫోన్సే. ఇంటిలోను స్మార్ట్ ఐటెమ్సే. స్మార్ట్ అభిమానులకోసం మైక్రోమ్యాక్స్ సంస్థ నూతన ఆండ్రాయిడ్ స్మార్ట్‌టీవీలను తాజాగా విడుదల చేసింది. చూపరులను కట్టిపడే స్మార్ట్ టీవీని విడుదల చేసింది. మైక్రోమ్యాక్స్ అనుబంధ యూ టెలీ వెంచర్స్, 'యూఫోరియా' పేరిట భారత మార్కెట్లో 40 అంగుళాల స్మార్ట్ టీవీని ఆకర్షణీయ ధరలో విడుదల చేసింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ద్వారా ప్రత్యేకంగా విక్రయించబడే ఈ టీవీ ధర రూ. 18,999 కాగా, పాత టీవీని ఎక్స్ఛేంజ్ ఆఫర్ లో భాగంగా మార్చుకుంటే రూ. 7,200 వరకూ డిస్కౌంట్ కూడా లభిస్తుందని సంస్థ తెలిపింది. 

Image result for amazon
ఇక ఈ స్మార్ట్ టీవీలో మీడియా ఫైల్స్ ను డైరెక్టుగా ప్లే చేసుకోవచ్చు. తమకు నచ్చిన యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉంది. ఇంకా ఈ టీవీలో 40 అంగుళాల ఫుల్‌ హెచ్‌ డీ డిస్‌ ప్లే, 5000:1 కాంట్రాస్ట్‌ రేషియో, డ్యూయల్ కోర్ గ్రాఫిక్స్ కో ప్రోసెసర్‌ కూడిన క్వాడ్-కోర్ ప్రాసెసర్, మూడు హెచ్‌డీఎం పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు, ఒక వీజీఏ పోర్ట్, 24 వాట్స్‌ ఆడియో అవుట్‌ పుట్‌ సదుపాయాలుంటాయి. మరి ఇంకేంటి మీ పాత టీవీని ఇచ్చేయండి. కొత్త ఫుల్ హెచ్చ డీ స్మార్ట్ టీవీని ఇంటికి పట్టుకెళ్ళండి.

13:23 - December 1, 2015

హైదరాబాద్ : ఆన్‌లైన్‌ షాపింగ్‌ దిగ్గజం అమెజాన్‌ సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. హోమ్‌ డెలివరీకి ఆ సంస్థ డ్రోన్లను ఉపయోగించుకునే పనిలో పడింది. దీనిపై ఇప్పటికే ప్రయోగాలు మొదలు పెట్టింది. అమెజాన్‌ రిలీజ్‌ చేసిన లేటెస్ట్‌ వీడియో..ఫ్యూచర్‌ డోర్‌ డెలివరీ సిస్టమ్‌ను స్ర్కీన్‌ మీద చూపించింది.
డ్రోన్లతో వస్తువుల డెలవరీ
ఆన్‌లైన్‌ షాపింగ్‌ దిగ్గజమైన అమెజాన్‌ కస్టమర్లకు మరింత దగ్గర కావడానికి ప్రయత్నాలు చేస్తోంది. అతి తక్కువ సమయంలో వస్తువులను డెలివరీ చేయడానికి దగ్గర దారులు వెదుకుతోంది. దీని కోసం ఏకంగా డ్రోన్లనే ఉపయోగించేందుకు సిద్ధమవుతోంది. డ్రోన్లతో డెలివరీ చేసే విధానంపై ఇప్పటికే పలు మార్లు ప్రయోగాలు నిర్వహించింది. ఈ ప్రయోగాలకు సంబంధించి ఓ వీడియోను ఆ సంస్థ విడుదల చేసింది.
ప్రోటోటైప్‌ టెక్నాలజీతో ప్రయోగం
డ్రోన్‌ డెలివరీ కోసం ప్రోటోటైప్ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు అమెజాన్‌ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన వీడియోలో సాకర్ షూలను 30 నిమిషాల్లో వినియోగదారుడికి డ్రోన్ డోర్ డెలివరీ చేసింది.
వచ్చే ఏడాది జూన్‌లో కార్యాచరణ
డ్రోన్‌ డెలివరీని ఎప్పటి నుంచి అందుబాటులోకి తీసుకొస్తామనే విషయాన్ని మాత్రం అమెజాన్ వెల్లడించలేదు. వచ్చే ఏడాది జూన్‌లో ఇందుకు సంబంధించిన కార్యాచరణను పూర్తి చేసి.. వచ్చే 12 నెలల్లో డ్రోన్‌ల ద్వారా వస్తువులను సరఫరా చేసే అవకాశం ఉందని సంస్థ అధికారులు చెబుతున్నారు. మరోపక్క గూగుల్, వాల్‌మార్ట్ సహా పలు ప్రముఖ కంపెనీలు తమ వస్తువులను డ్రోన్‌ల ద్వారా వినియోగదారులకు చేరవేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

 

09:30 - October 12, 2015

హైదరాబాద్ : ఢిల్లీలో నిర్వహిస్తున్న అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ అట్టహాసంగా జరుగుతోంది. డిజైనర్లు తమ టాలెంట్ ప్రదర్శించుకోవడానికి.. ప్రపంచానికి చాటడానికి సరైన స్టేజ్ గా భావిస్తున్నారు. తమలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి ట్రెండీగా డ్రెస్సులు డిజైన్ చేసి ప్రదర్శిస్తున్నారు. ప్రముఖ డిజైనర్‌ సంచితా అజంపూర్ డిజైన్ చేసిన దుస్తుల్లో మోడల్స్ ర్యాంప్ వాక్ చేస్తుంటే... ర్యాంప్ కి కొత్త కళ వచ్చింది. అమెజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ లో సంచితా డిజైన్ చేసిన హ్యాట్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. 

Don't Miss

Subscribe to RSS - amazon