america tour

10:27 - March 1, 2018

హైదరాబాద్ : పార్టీ జెండా..ఏజెండా ఖరారు కాక ముందే.. వెన్నుద‌న్నుగా నిలిచే వారి కోసం టి.జె.ఏ.సి ప్రయ‌త్నాలు ముమ్మరం చేసింది. తెలంగాణ ఉద్యమానికి స‌హ‌క‌రించిన ఎన్ ఆర్.ఐల‌ను మ‌రొసారి త‌న‌వైపుకు తిప్పుకునేందుకు జాక్ చైర్మన్ అడుగులు వేస్తున్నారు.ఆయ‌న ఏర్పాటు చేయ‌బోయే పార్టీకి ఇంటా బ‌య‌ట మ‌ద్దతు కూడ‌గ‌ట్టెప్రయ‌త్నం చేస్తున్నారు. కోదండ‌రామ్ అమెరికా ప‌ర్యట‌న హ‌ట్ టాపిక్ గా మారింది.

వారం రోజుల క్రితం స‌తీమ‌ణితో క‌లిసి కొదండ‌రామ్ అమెరికా పర్యటనకు వెళ్లారు. అయితే ఇది కేవలం కోదండరామ్‌ వ్యక్తిగత పర్యటన మాత్రమేనని టీజేఏసీ వర్గీయులు చెబుతున్నా... రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించడం, మార్చి రెండో వారంలో పార్టీని ప్రారంభించబోతున్న క్రమంలో.. కోదండరాం అమెరికాకు వెళ్లడం రాష్ట్రంలో రాజకీయాన్ని వేడెక్కించింది. పార్టీని ప్రారంభించబోతున్న రోజే పార్టీ పేరును, గుర్తును, విధివిధానాలను కోదండరామ్ ప్రకటించబోతున్నారు.ఓ వైపు తెలంగాణ ఉద్యమ సమయంలో చురుకైన పాత్ర పొషించి ..తెలంగాణ వచ్చిన తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేతలను అందరిని మరోసారి తెరపైకి తెచ్చే ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరో వైపు ప్రపంచ నలుదిక్కుల్లో ఉన్న తెలంగాణ వాదులను సైతం ఏకతాటి పైకి తెచ్చే ప్రయత్నం ప్రోపెసర్ కొదండరామ్ చేపట్టారు.

తెలంగాణ ఉద్యమ స‌మ‌యంలో అన్ని రాజ‌కీయ పార్టీల‌ను ఏక తాటిపైకి తెవ‌డంలో కొదండ‌రామ్ ప్రముఖ పాత్ర పొషించారు. స‌క‌ల జ‌నుల స‌మ్మె స‌మ‌యంలో అమెరికా..ఇత‌ర దేశాల్లో ఉండే ఎన్ .ఆర్ .ఏలు స్వయంగా మ‌ద్దతు ప‌లికారు.టిజాక్ కు తెర వెనుక,ముందు అన్ని విధానాలు స‌హ‌కరాలు అందించారు.తెలంగాణ రాష్ట్రం సిద్దించినా ఇంకా తెలంగాణ యువ‌త ఆంకాక్షలు కా నేర‌వేర‌క పొవ‌డం వంటి అంశాల‌ను ప‌లుమార్లు ఎన్.ఆర్.ఐలు కొదండ‌రామ్ దృష్టికి తీసుకోచ్చారు.అధికార టి.ఆర్.య‌స్ పార్టీని ఎదుర్కోవలంటే.ఒక్క కొదండ‌రామ్ సార్ వ‌ల్లే అవుతుంద‌ని ఎన్‌ఆర్‌ఐలు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. ఇపుడు టీజాక్‌ పార్టీ ఏర్పాటు వెనుక వారి సహకారం చాలా ఉందనే ప్రచారం జరుగుతోంది.

మరోవైపు కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన నేతలు, అధికారపార్టీలోని కొంతమంది అసంతృప్త నేతలు కోదండరామ్‌కు టచ్‌లో ఉన్నట్టు తెలిస్తోంది. కోదండరామ్‌ అమెరికాకు వెళ్లడానికి ముందు పార్టీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 200 మందితో ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేశారు.వంద మంది టీజేఏసీకి చెందిన వారు కాగా, మరో వందమంది బయటవారిని తీసుకుంటున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత కోదండరామ్‌ వారందరితో సన్నాహాక మీటింగ్‌ను ఏర్పాటు చేయ‌బోతున్నాట్లు తెల‌స్తోంది. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో గులాబీపార్టీకి ఎర్త్‌పెట్టేందుకు కోదండరాం సారు.. అన్ని ఏర్పాట్లు చేస్తున్నారనే ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. 

12:42 - June 27, 2017

అమెరికా : ఉగ్రవాదంపై  పోరు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, భారత ప్రధాని మోదీ సంయుక్తంగా ప్రకటించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్య ఉగ్రవాదమని... దానిపనై ఉమ్మడిగా  పోరాడి అణచివేస్తామని హెచ్చరించారు. భారత్‌, అమెరికా మధ్య ఆర్ధికమైత్రి కొనసాగుతుందని స్పస్టం చేశారు. శ్వేతసౌధంలో ట్రంప్‌తో భేటీ అయిన మోదీ.... వాణిజ్యం, రక్షణరంగం, ఉగ్రవాదంపై చర్చించారు.
శ్వేతసౌధంలో మోదీకి ఘన స్వాగతం 
అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఘన స్వాగతం లభించింది. భాతర కాలమానం ప్రకారం సరిగ్గా మంగళవారం రాత్రి ఒంటిగంట 10 నిమిషాలకు వైట్‌హౌస్‌కు  మోదీ కారులో వచ్చారు.  మోదీ వాహనం దిగగానే ట్రంప్‌ దంపతులు ఆయనతో కరచాలనం చేసి ఆత్మీయ స్వాగతం పలికారు. సుమారు రెండు నిమిషాలపాటు ప్రధాన ద్వారం దగ్గరే క్షేమసమాచారాలను ఒకరినొకరు విచారించుకున్నారు.  ఈ సందర్భంగా మోదీ ఏం చెప్పారో తెలియదుకానీ... అమెరికా అధినేత ట్రంప్‌, మెలనియా దంపతులు హాయిగా గుండెనిండా నవ్వుకున్నారు. ఆ తర్వాత  ట్రంప్‌ దంపతులు, మోదీ ముగ్గురూ కలిసి వైట్‌హౌస్‌లోకి వెళ్లారు.
ట్రంప్‌ - మోదీ మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు 
శ్వేతసౌధంలోని కేబినెట్‌ రూమ్‌లో ట్రంప్‌ - మోదీ మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి.  వాణిజ్యం, రక్షణరంగంతోపాటు ఉగ్రవాదంపైనా ఇరు దేశాల అధినేతలు చర్చించారు. ఈ చర్చలు ముగియగానే రోజ్‌ గార్డెన్‌లో ట్రంప్‌, మోదీ సంయుక్త ప్రకటన చేశారు. ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన  టెర్రరిజాన్ని నామరూపాల్లేకుండా చేస్తామని ట్రంప్‌ ప్రకటించారు. ఉగ్రవాదులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.  అంతర్జాతీయ ఉగ్రవాదంపై అమెరికా, భారత్‌ ఉమ్మడిగా పోరాడుతాయన్నారు. ఉమ్మడిగా పోరాడి ఉగ్రవాదాన్ని అణచివేస్తామని హెచ్చరించారు.  భారత్‌ ఆర్ధికపరంగా అభివృద్ధి చెందుతోన్న దేశమని...ఆ దేశంతో ఆర్థికమైత్రి కొనసాగుతుందని స్పష్టం చేశారు.  ఎన్‌ఎస్‌జీలో భారత సభ్యత్వానికి   మద్దతిస్తామని చెప్పారు.
మేము అభివృద్ధి యంత్రాలం... 
అమెరికా అధ్యక్షుడి ఆదరణను ఎప్పటికీ మర్చిపోలేనని మోదీ అన్నారు. శ్వేతసౌధంలో తనకు లభించిన ఆతిథ్యం భారతీయులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానన్నారు.  తామిద్దరం అభివృద్ధి యంత్రాలమని.... ప్రజాస్వామ్య విలువలకు  ఇరుదేశాలు కట్టుబడి ఉండాలన్నారు.  ఉగ్రవాదం ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న సమస్యని... ఉమ్మడిగా టెర్రరిజంపై పోరాడుతామని మోదీ హెచ్చరించారు.  అమెరికాతో భారత్‌ స్నేహబంధం మరింత బలపడుతుందని భావిస్తున్నానన్నారు. ఇరు దేశాధినేతల మధ్య సమావేశం ముగిసిన తర్వాత మోదీకి ట్రంప్‌ ప్రత్యేక విందు ఇచ్చారు.

20:38 - June 25, 2017

అమెరికా : ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటన ప్రారంభమైంది. రెండ్రోజుల పాటు జరిగే ఈ పర్యటన కోసం.. మోదీ ఉదయం వాషింగ్టన్ చేరుకున్నారు. ఇవాళ అమెరికా కంపెనీల సీఈవోలు, వర్జీనియాలో ప్రవాస భారతీయ సంఘాలతోనూ మోదీ వేర్వేరుగా భేటీ కానున్నారు. రేపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో సమావేశం కానున్నారు. మోదీ రాకను ఆహ్వానిస్తూ ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. నిజమైన మిత్రుడితో ముఖ్యమైన వ్యూహాత్మక విషయాలపై చర్చిస్తామని ట్రంప్‌ వెల్లడించారు. ట్రంప్‌ అధ్యక్షుడయ్యాక అమెరికాలో మోదీ పర్యటించడం ఇదే తొలిసారి.

06:53 - May 14, 2017

అమరావతి: తన అమెరికా పర్యటన చాలా తృప్తినిచ్చిందన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం అనేక కంపెనీల సీఈవోలను కలిశామని.. అమెరికాలో స్థిరపడ్డ తెలుగువాళ్లు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరామన్నారు. భవిష్యత్‌లో సోలార్‌ విద్యుత్‌ను అభివృద్ధి చేస్తే విద్యుత్‌ ధరలు భారీగా తగ్గుతాయన్నారు చంద్రబాబు.

అనేక మంది కంపెనీల సీఈవోలతో భేటీ...

ఆంధ్రప్రదేశ్‌లో సంపద సృష్టి కోసమే అమెరికాలో పర్యటించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో అమెరికా పర్యటన వివరాలను వెల్లడించారు. అమెరికాలో తాను అనేక మంది కంపెనీల సీఈవోలతో భేటీ అయ్యాయని వారిని ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరానన్నారు చంద్రబాబు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకున్నామన్నామన్నారు. గతంలో వారసత్వంగా వచ్చిన ఆస్తులే సంపదగా ఉండేవని.. ప్రస్తుతం తెలివితేటలు ఉన్నవారే ఎంతైనా సంపాదించగలుగుతున్నారన్నారు. ప్రపంచంలోనే తెలుగువాళ్లు అత్యున్నత స్థాయిలో ఉండాలన్నారు చంద్రబాబు.

ఏపీని నాలెడ్జ్ హబ్ గా తయారు చేయడమే లక్ష్యం...

ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్‌ హబ్‌గా తయారు చేయడమే లక్ష్యమన్నారు చంద్రబాబు. ఐటీ రంగంలో ప్రపంచంలో ఉన్న ప్రతి నలుగురిలో ఒక భారతీయుడు ఉన్నారన్నారు. ప్రతి నలుగురు భారతీయుల్లో ఒక తెలుగువాడున్నారు.. తెలుగు రాష్ట్రాల నుంచి ఇంజీనీర్లు, వైద్యులు అమెరికా వెళ్లారన్నారు.

సోలార్‌, పవన విద్యుత్‌పై దృష్టి ...

అమెరికా పర్యటనలో సోలార్‌, పవన విద్యుత్‌పై దృష్టి పెట్టామన్నారు చంద్రబాబు. సోలార్‌లో నూతన ప్రయోగానికి శ్రీకారం చుట్టిన టెస్లాను సంప్రదించామన్నారు. టెస్లాలో భాగంగా ఇళ్లపై సోలార్‌ పవర్‌ ప్యానళ్ల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేయొచ్చు. ఇంటిపైన సోలార్‌ ప్యానెల్‌ పెట్టుకుంటే గృహావసరాలు, కార్లకు వాడుకోవచ్చన్నారు. భారత్‌లో విద్యుత్‌ రంగాన్ని మార్చబోతున్నామన్నారు.

ఎక్కువ సమయాన్ని వ్యవసాయ రంగానికి కేటాయించినట్లు...

ఇక పర్యటనలో ఎక్కువ సమయాన్ని వ్యవసాయ రంగానికి కేటాయించినట్లు చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో 28 శాతం వర్షాభావం ఉన్నా.. 14 శాతం వృద్ధి రేటు సాధించామన్నారు. ఇక తాను ఎన్నో పర్యటనలకు వెళ్లినప్పటికీ ఈ పర్యటన ఎంతో తృప్తినిచ్చిందని చంద్రబాబు తెలిపారు.

15:47 - May 13, 2017

ఖమ్మం : ఈ అమ్మాయి పేరు సుమలత. పుట్టింది పేద కుటుంబంలోనైనా.. పేదరికం తన చదువుకు అడ్డం కాదని నిరూపించింది. డబ్బు, హోదా, అవకాశాలు అన్నీ ఉండీ చదవలేని వారికి ఈ చదువుల తల్లి రోల్‌మోడల్‌గా నిలుస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన మణి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఉంటోంది. కూలీ పనులు చేస్తూ ఇద్దరు కూతుళ్లను చదివించింది. పెద్ద కూతురు సుమలత చదువులో ఎంతో రాణిస్తోంది. సుమలత 8 వ తరగతి వరకూ.. టేకుల పల్లిలోని సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదువుకుంది. 9, 10 వ తరగతులు అల్గనూరు సాంఘిక సంక్షేమ పాఠశాలలో పేద, దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల విద్యార్థినీ విద్యార్థులు.. అమెరికాలో చదివే అవకాశం కల్పించాలని గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్ ప్రభుత్వానికి విన్నవించారు. దీనికి సాంఘిక సంక్షేమ శాఖ అంగీకరించి ఉపకార వేతనం ఇచ్చేందుకు ఒప్పుకుంది.

తెలంగాణ నుంచి ఆరుగురు విద్యార్థులు
పాఠశాలలో 5 రకాల పరీక్షలు నిర్వహించి.. విద్యార్థుల్లో ఉత్తమ ప్రతిభని కనబర్చిన వారిని ఎంపిక చేశారు. మన దేశం నుంచి మొత్తం 40 మంది విద్యార్థులు వెళ్తుండగా.. మన తెలంగాణ నుంచి ఆరుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. అందులో ఇద్దరు అల్గనూరు సాంఘిక సంక్షేమ పాఠశాల విద్యార్థులే కావడంతో సుమలత చాలా సంతోషంగా ఉంది. రెక్కాడితే గానీ డొక్కనిండని పరిస్థితి వీరిది. అమ్మ, అమ్మమ్మలు కూలీ పని చేస్తూ.. ఇంటిని లాక్కొస్తున్నారు. తమ కూతురు.. అమెరికా పర్యటనకు ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె తల్లి చెబుతోంది. కానీ ఖర్చులకు చేతిలో ఒక్క రూపాయి లేకపోవడం చాలా బాధగా ఉందని చెబుతోంది. ఎవరైనా దాతలు వచ్చి.. సహాయం చేయాలని కోరుతోంది. తమ కూతురు ముందు ముందు ఎన్నో విజయాలు సాధిస్తుందని మణి చెబుతోంది. కుటుంబ పోషణే భారంగా ఉన్న ఈ తరుణంలో పిల్లల ఉన్నత చదువులు.. వారి ఖర్చు తన వల్ల కాదని సుమలత అమ్మమ్మ చెబుతోంది. ప్రభుత్వం తమకు సహాయం చేయాలని వీళ్లంతా కోరుతున్నారు. చదువుకు పేదరిక అడ్డు కాదు. కాస్త చేయూత ఉంటే చాలు అని సుమలత నిరూపించింది. చిన్న వయస్సులోనే.. పేదరికంతో నరకం అనుభవిస్తున్నా సరే! వాటన్నింటినీ సుమలత అధిగమించింది. పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని.. ఈ చదువుల బంగారు తల్లిని చూస్తే తెలిసిపోతుంది. అయితే సుమలత ఉన్నతికి ధాతలు ఎవరైనా సహాయం చేస్తే.. అమెరికా పర్యటనకు వెళ్లడానికి అడ్డంకులు తొలగిపోయినట్టే.

07:08 - May 10, 2017

 అమరావతి: అమెరికాలో చంద్రబాబు ఐదోరోజూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఏపీకీ పెట్టుబడులే లక్ష్యంగా పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. మొదట అప్లయిడ్‌ మెటీరియల్స్‌ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీతో అప్లయిడ్‌ మెటీరియల్స్‌ కంపెనీని భాగస్వామిగా చేసేందుకు రోడ్‌మ్యాప్‌ రూపొందించాలన్నారు. ఇందుకోసం అప్లయిడ్‌ మెటీరియల్స్‌ సంస్థ నుంచి ముగ్గురు, ఏపీ ప్రభుత్వం నుంచి ముగ్గురు బృందంగా ఏర్పడి సమన్వయం చేసుకోవాలని నిర్ణయించారు. మరోవైపు ఏపీని క్లౌడ్‌హబ్‌గా రూపొందించడంలో ప్రభుత్వానికి సహకారం అందించేందుకు నుటనిక్స్‌ సంస్ధ ముందుకొచ్చింది. మరో రెండు నెలల్లో దీనిపై స్పష్టమైన రోడ్‌మ్యాప్‌, ప్రాజెక్ట్‌ రిపోర్టుతో వస్తామని నుటనిక్స్‌ ప్రతినిధి ధీరజ్‌పాండే తెలిపారు.

యూఎస్‌ఐబీసీ సదస్సుల్లో పాల్గొన్న చంద్రబాబు....

యునైటెడ్‌ స్టేట్స్ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ రెండవ వార్షిక పశ్చిమ తీర సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. పట్రాకార్ప్‌ సీఈవో జాన్‌ ఎస్‌ సింప్సన్‌తో బాబు భేటీ అయ్యారు. విశాఖలో ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఈ అమెరికన్‌ బీపీవో సంస్థ విస్తరణపట్ల ఆసక్తి కనబరుస్తోంది. విశాఖలో ఇప్పటికే 1500 ఉద్యోగాలు కల్పించిన బీపీవో సంస్థ.. స్థలం కొరత కారణంగా నయా రాయ్‌పూర్‌కు 500 ఉద్యోగాలు తరలిపోయాయని ప్రస్తావించింది. విశాఖలో తగిన స్థలం ఉంటే మరో 500 ఉద్యోగాలు కల్పించేవాళ్లమని స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన చంద్రబాబు వెంటనే ఈ సంస్థకు టెక్‌ మహీంద్రా బిల్డింగ్‌ కేటాయించాలని ఏపీఐఐసీని ఆదేశించారు. ఆ తర్వాత వీసాకార్డ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అంబాసిడర్‌ డెమెట్రియస్‌ మరంటీస్‌, బెల్‌ కర్వ్‌ల్యాబ్స్‌, మొబిలిటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ గ్రూప్‌ ప్రతినిధులతోనూ చంద్రబాబు భేటీ అయ్యారు.

చంద్రబాబుకు ట్రాన్స్‌ఫర్మేటివ్‌ చీఫ్‌ మినిస్టర్‌ అవార్డు....

చంద్రబాబుకు ట్రాన్స్‌ఫార్మేటివ్‌ చీఫ్‌ మినిస్టర్‌ అవార్డు దక్కింది. యుఎస్‌ఐబీసీ తరపున జాన్‌ చాంబర్స్‌ ఈ అవార్డును చంద్రబాబుకు అందజేశారు. ఈ అవార్డు తనకు కాదని, తన రాష్ట్రానికి దక్కిన గౌరవంగా చంద్రబాబు తెలిపారు. ఈ పురస్కారాన్ని అమెరికన్‌ ఇన్వెస్టర్ల నుంచి ఏపీకి ఇస్తున్న మద్దతుగా భావిస్తున్నానని అన్నారు. ప్రతి యూఎస్‌ పారిశ్రామికవేత్త ఏపీకి వచ్చి ఒక పరిశ్రమను స్థాపించాలని ఈ సందర్భంగా కోరారు. అనంతరం సన్‌రైజ్‌ ఏపీ ట్రాన్స్‌ఫర్మషనల్‌ జర్నీ టూ వర్డ్స్‌ ఏ హ్యాపీ స్టేట్‌ అనే అంశంపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

సిస్కో కంపెనీ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం

అంతకు ముందు సిస్కో ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో చిన్న తరహా వ్యాపారాలు మరింత సులభతరం చేసుకోవడంలో, విజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడాన్ని సరళతరం చేయడంలో సహకారం అందిస్తామని సిస్కో ప్రకటించింది. ఏపీలో సాంకేతికత అనుసంధానించే ప్రక్రియ వేగంగా జరుగుతోందని, అందుకు తగిన వాతావరణాన్ని మెరుగుపర్చాలని భావిస్తున్నట్టు చంద్రబాబు స్పష్టం చేశారు.

08:30 - October 16, 2016

అమెరికా : హైదరాబాద్ లో స్టార్టప్ లను ప్రపంచ దేశాలకు అనుసంధానం చేసే టి.బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ సిలికాన్ వ్యాలీలో ప్రారంభించారు. ఉబెర్, టై సిలికాన్ వ్యాలతో కలిసి టి.బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని పది స్టార్టప్ నగరాల్లో హైదరాబాద్ ను ఒకటిగా నిలపాలన్నదే తమ లక్ష్యమని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. భారత్ లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం తెలంగాణ అని ఉబెర్ సంస్థ సీనియర్ ఉపాధ్యక్షుడు అభివర్ణించారు. స్టార్టప్ లకు హైదరాబాద్ అత్యంత అనుకూలంగా ఉందన్నారు. 

15:39 - September 22, 2015

అమెరికా : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ..ఎక్కువగా విదేశాల్లో పర్యటించడానికి ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఆయా దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు, ఇతరులతో ఆయన సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఏ దేశంలో వెళ్లినా మోడీకి బ్రహ్మరథం పడుతున్నారని, ప్రపంచంలోనే నెంబర్ గా దేశం ముందుకు వెళుతోందని మోడీ భజన రాయుళ్లు పేర్కొంటుంటారు. కానీ పరిస్థితి ఒక్కసారిగా తిరగబడింది. అమెరికాలో కొందరు ఎన్నారైలు 'మోడీ ఫెయిల్ డాట్ కాం' పేరిట కొత్త వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఈనెల 26వ తేదీ నుండి 'మోడీ' లో అమెరికాలో పర్యటించనున్న సందర్భంలో ఈ వెబ్ సైట్ ప్రారంభం కావడం గమనార్హం. దీనికి ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాలు కూడా తోడు కావడంతో వెబ్ సైట్ వీక్షకుల సంఖ్య విపరీతంగా అధికమౌతోంది. మోడీ అధికారంలోకి వచ్చాక మైనార్టీలు..దళితులు..మహిళలు..పై దాడులు పెరిగిపోయాని వారు ఆరోపణలు గుప్పిస్తున్నారు. పౌర హక్కులను మోడీ కాలరాస్తున్నారని, సాంస్కృతిక సంస్థల్లో మత ఛాందస రాజకీయాలు చొచ్చుకుపోతున్నాయని వారు పేర్కొంటున్నారు. దీనిపై బీజేపీ నేతలు ఏమంటారో ? 
watch the website : http://modifail.com/

Don't Miss

Subscribe to RSS - america tour