amit shah

ఉత్తర్ ప్రదేశ్ : రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థి ఓటమిపై బిఎస్పీ అధినేత్రి మాయావతి బిజెపిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎస్పీ-బీఎస్పీలు పరస్పర అవగాహనతో ఓటింగ్‌లో పాల్గొంటే.. సీటు కోల్పోతామన్న భయంతోనే బీజేపీ మా ఎమ్మెల్యేలను భయభ్రాంతులకు, ప్రలోభాలకు గురిచేసిందని మాయావతి ఆరోపించారు. ఎస్పీ-బిఎస్పీల మధ్య చిచ్చు పెట్టేందుకు బిజెపి ప్రయత్నిస్తోందన్నారు. రాజ్యసభ ఎన్నికల ఫలితాలు ఎస్పీ-బీఎస్పీ మధ్య సంబంధాలపై ప్రభావం చూపించే ప్రసక్తే లేదన్నారు. 2019 ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి బిజెపికి తగిన గుణపాఠం చెబుతాయని మాయావతి స్పష్టం చేశారు. యోగి ప్రభుత్వం తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బిజెపికి ఓటేసిన అనిల్‌కుమార్ సింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు మాయావతి వెల్లడించారు.
ఆహ్మదాబాద్ : గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం మరోసారి కొలువుతీరింది. ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ప్రమాణ స్వీకారం చేశారు. గాంధీనగర్‌లోని సచివాలయం మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో గుజరాత్ గవర్నర్ ఓపీ కోహ్లీ... విజయ్ రూపానీతో ప్రామాణం చేయించారు. ఉపముఖ్యమంత్రిగా నితిన్ పటేల్ ప్రమాణం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ అగ్రనేత అద్వానీ, మాజీ ముఖ్యమంత్రులు ఆనందీబెన్ పటేల్, కేశూభాయ్ పటేల్, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రూపానీ, నితిన్ పటేల్‌తోపాటు మరో 18 మంది మంత్రులు ప్రమాణం చేశారు. ఈ నెలలో రెండు విడదలుగా జరిగిన ఎన్నికల్లో 98 సీట్లతో బీజేపీ విజయం సాధించింది. గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం కొలువుతీరడం వరుసగా ఇది ఆరోసారి. విజయ్ రూపానీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది రెండోసారి.
ఢిల్లీ : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 93వ జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మోది స్వయంగా వాజ్‌పేయి ఇంటికి వెళ్లి ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విజయ్ గోయెల్ తదితర నేతలు వాజ్‌పేయి ఇంటికి వెళ్లి వాజ్‌పేయికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్ ద్వారా వాజ్‌పేయికి శుభాకాంక్షలు తెలిపారు. వాజ్‌పేయి డిసెంబర్ 25, 1924లో గ్వాలియర్‌లో జన్మించారు.

ఆహ్మాదబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. అధికారమే లక్ష్యంగా బిజెపి, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా స్వరాష్ట్రంలో జరుగుతున్న ఈ ఎన్నికలు ప్రధాని మోదికి ప్రతిష్టాత్మకంగా మారాయి. గుజరాత్‌కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నరేంద్రమోది ప్రధాని కేంద్రానికి వెళ్లిపోవడంతో రాష్ట్రంలో బిజెపి పరిస్థితి నానాటికి దిగజారుతూ వచ్చింది. అవినీతి ఆరోపణలు... అస్తవ్యస్త పాలన... పాటీదార్, ఓబిసి, దళిత ఉద్యమాలు ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కరి చేశాయి. దీంతో గతంలో ఎప్పుడూ లేనివిధంగా బిజెపికి ఎదురుగాలి వీస్తోంది. వీటికి తోడు మోది ప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు, జిఎస్టి నిర్ణయాలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వీటికి తోడు బిజెపి చీఫ్ అమిత్‌షా, మాజీ సిఎం ఆనందీబెన్ పటేల్ మధ్య విభేదాలు... సిఎం బాధ్యతలు చేపట్టిన విజయ్ రూపానీ బలమైన నేత కాకపోవడం... కాంగ్రెస్‌కు అనుకూలంగా మారినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా మోది చరిష్మా తమను అధికారంలోకి తెస్తుందని బిజెపి పార్టీవర్గాలు విశ్వసిస్తున్నాయి.
1990 నుంచి అధికారానికి దూరమైన కాంగ్రెస్
మరోవైపు 1990 నుంచి అధికారానికి దూరమైన కాంగ్రెస్ తిరిగి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. నోట్లరద్దు, జిఎస్టిల నిర్ణయాలతో దేశ ఆర్థికవృద్ధి మందగించిందని బిజెపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన సామాజిక ఉద్యమాలను కాంగ్రెస్ పార్టీ తనకు అనూకూలంగా మార్చుకుంది. పాటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్, దళిత యువనేత జిగ్నేష్, ఓబిసి నేత అల్పేష్ ఠాకూర్ల మద్దతుతో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎన్నికల్లో ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్తున్నారు. ఈ సామాజిక సమీకరణాలు కాంగ్రెస్‌కు ఎంతవరకు లాభం చేకూరుస్తాయన్నది వేచి చూడాలి.
అహ్మదాబాద్ : తన కుమారుడు జయ్ షా కంపెనీపై వస్తున్న అవినీతి ఆరోపణలపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మౌనం వీడారు. జయ్ షా కంపెనీ ప్రభుత్వంతో ఎలాంటి లావాదేవీలు జరపలేదని అహ్మదాబాద్‌లో ఓ టీవీ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో అమిత్ షా చెప్పారు. ప్రభుత్వం నుంచి సెంటు భూమి కూడా తీసుకోలేదని...జయ్ షా వ్యాపార లావాదేవీల్లో అవినీతి ప్రసక్తే లేదన్నారు. టర్నోవర్‌కు లాభాలకు తేడా ఉంటుందని తెలిపారు. తన కుమారుడు స్వయంగా విచారణకు ముందుకు వచ్చారని, 100 కోట్ల పరువు నష్టం దావా వేశారని అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ వద్ద ఏవైనా ఆధారాలుంటే కోర్టుకు సమర్పించవచ్చని ఆయన సూచించారు. కాంగ్రెస్‌లోనే అవినీతి నేతలున్నారని వారిపై విచారణ జరపకుండా బిజెపిపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని ధ్వజమెత్తారు. జయ్ షా కంపెనీ టర్నోవర్ 50 వేల నుంచి 80 కోట్లకు చేరుకుందని 'ది వైర్' వెబ్సైట్ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే.
అవినీతి రహిత పాలన అంటారు.. విపక్షాలను ఇరుకున పెట్టడానికి అన్ని అధికారాలను ఉపయోగిస్తారు. కానీ, కమల దళం చేస్తున్న ఘనకార్యాలను మాత్రం పట్టించుకోరు. దేనిపైనా సరైన దర్యాప్తు జరగదు. ఓ పక్క బీజెపీ పాలిత రాష్ట్రాల్లో అనేక అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు సాక్షాత్తూ పార్టీ అధ్యక్షుడి పుత్ర రత్నంపైనే అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై విచారణ సంగతేమో కానీ, రివర్స్ కేసులు మాత్రం పెడుతున్నారు. కమలం దళం అవినీతి బురదలో కూరుకుపోతోందా? మోడీ పాలనలో ఏం జరుగుతోంది? ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ..
16వేల రెట్లు పెరిగిన ఆ కంపెనీ ఆస్తులు
ఏడాదిలోనే 16వేల రెట్లు ఆ కంపెనీ ఆస్తులు పెరిగాయి. ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టాక.. పెరిగిన అమిత్ షా కొడుకు సంపద అడ్డూ అదుపు లేకుండా పెరిగింది. చెప్పేదొకటి..చేసేదొకటిగా సర్కారు తీరు మారింది. ఓవరాల్ గా పారదర్శకతలేని వ్యాపార లావాదేవీలు కనిపిస్తున్నాయి. అసలు స్థిరాస్తులేమీ లేని కంపెనీలకు కోట్లల్లో రుణాలెలా వచ్చాయి.. ఏం జరుగుతోంది?..పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

కేరళలో రాగులుతున్న అందరు ఖండిస్తున్నామని, అక్కడ బీజేపీ హత్య రాజకీయాలు ప్రొత్సహిస్తోందని, గవర్నర్ ద్వారా విచారణ చేయించాలి తప్ప ఇలా గొడవ దిగడం సమాంజసం కాదని, పార్టీ కార్యాలయాల ముందు వెళ్లడం మంచి పద్దతి కాదని కాంగ్రెస్ నేత రామచంద్ర రెడ్డి అన్నారు. బీజేపీ జనరక్షక్ యాత్ర బీజేపీ కార్యకర్తల కోసం చేస్తోందని, బీజేపీ ఎప్పుడు శాంతియుతంగా యాత్ర చేస్తోందని, రక్తపాతం ప్రజాస్వామ్యాంలో పనిరాదని, చాలా స్పష్టంగా నిరసన తెలియజేసే హక్కు ఉందని బీజేపీ నేత నరేష్ అన్నారు. వారి ఉద్దేశం శాంతయుతమైతే పినరమ్ గెలిచిన విజయోత్సవ ర్యాలీ పై ఎందుకు దాడి చేశారని, ఈ రోజు 120 రేపు 200 కావచ్చు ఇవన్నీ బుటకపు మాటలని, మధ్యప్రదేశ్ పర్యటనకు పినరయ్ విజయన్ వెళ్తామంటే ఆ రాష్ట్ర సీఎం అడ్డుకున్నారు. హత్య రాజకీయాలు ఆర్ఎస్ఎస్ అలవాటని ఐద్వా నాయకురాలు రమాదేవి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.
హైదరాబాద్ : బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాడులను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీలు చేపట్టారు. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకత పెరగడం వల్లే ఇలాంటి దాడులకు పాల్పడుతుందని సీపీఎం నేతలు అన్నారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న బీజేపీ వైఖరిని ఎండగడుతున్నందుకే... సీపీఎం కార్యాలయాలపై దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో తెలంగాణ సీపీఎం కార్యాలయానికి ర్యాలీగా బీజేపీ నేతలను ఇందిరాపార్క్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న సీపీఎం కార్యకర్తలు కూడా ప్రతిఘటన ర్యాలీ చేసేందుకు యత్నించారు. దీంతో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో పోలీసులు భారీగా మోహరించి... పలువురు సీపీఎం నేతలను అరెస్ట్ చేశారు.
ఢిల్లీ : తమ కార్యకర్తలపై బీజేపీ చేస్తున్న దాడులను నిరసిస్తూ సిపిఎం దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో సీపీఎం ప్రజా ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్పై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి నిప్పులు చెరిగారు. కేరళలో బీజేపీ, ఆర్ఎస్ఎస్లే హింసను రగిలిస్తూ.. తిరిగి వామపక్ష ప్రభుత్వంపై నిందలు మోపుతున్నాయని...'ఉల్టా చోర్ కొత్వాల్‌కో డాంటే' అన్నట్టుగా బీజీపీ నేతల తీరు ఉందన్నారు ఏచూరి మండిపడ్డారు. వాస్తవానికి ఆర్ఎస్ఎస్, బీజేపీ దాడులతోనే వందల సంఖ్యలో కామ్రేడ్లు ప్రాణాలు కోల్పోతున్నారని ఏచూరి అన్నారు. ఆర్ఎస్ఎస్ 191 మంది సిపిఎం కార్యకర్తలను హత్య చేసిందని ఆరోపించారు. 2016-2017లో కేంద్ర హోంశాఖ నివేదిక ప్రకారం సిపిఎం కార్యకర్తలు 85 మంది హత్యకు గురైతే... ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు 65 మంది హత్యకు గురయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. వామపక్ష ప్రభుత్వాన్ని అస్థిర పరచాలన్న కుట్రతోనే బీజేపీ దుష్ప్రచారాన్ని చేస్తోందని దాన్ని దీటుగా ఎదుర్కొంటామని సీతారాం ఏచూరి తేల్చి చెప్పారు.
మతతత్వ రాజకీయాలను రెచ్చగెడుతూ
ఆర్ఎస్ఎస్ గత 50 ఏళ్లుగా కేరళలో మతతత్వ రాజకీయాలను రెచ్చగెడుతూ వస్తోందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాష్‌కరత్ అన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో హిందుత్వ వాదాన్ని బలవంతంగా రుద్దుతూ రైతులు, కార్మికులు, మైనారిటీలకు వ్యతిరేకంగా అక్కడి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని తెలిపారు. కేరళలో బలమైన వామపక్ష ప్రభుత్వం ఉన్నందున వారి పప్పులు ఉడకడం లేదని కరత్ అన్నారు. బిజెపి యాత్రకు కేరళ ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదని, బిజెపి వామపక్షాలపై చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని ప్రజాక్షేత్రం లోనే తేల్చుకుంటామన్నారు.
నరేంద్రమోది, బిజెపి చీఫ్ అమిత్‌షాలు ఎన్కౌంటర్ స్పెషలిస్టులు
ప్రధానమంత్రి నరేంద్రమోది, బిజెపి చీఫ్ అమిత్‌షాలు ఎన్కౌంటర్ స్పెషలిస్టులని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్ తీవ్రంగా మండిపడ్డారు. గుజరాత్లో నిర్దోషులను పొట్టనబెట్టుకున్నారని...గోరక్ష, లవ్ జిహాద్ల పేరిట దాడులు చేస్తూ హత్యలకు పాల్పడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా దళితులు, కమ్యూనిస్ట్‌లపై దాడులకు పాల్పడుతున్న బీజేపీ కుయుక్తులను తిప్పికొడతామన్నారు. బిజెపి వ్యతిరేక ర్యాలీలో CPM జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో పాటు పొలిట్ బ్యూరో సభ్యులు బృందా కరత్, ప్రకాశ్ కరత్, బీవీ రాఘవులు తదితరులు పాల్గొన్నారు.
Pages
Don't Miss
