andhra police

17:11 - May 22, 2018

నెల్లూరు : భార్య, భర్తలు దొంగతనం చేసి సీసీ కెమెరాకు చిక్కారు. ఈ నెల 16న నగరంలోని వీబీఎస్‌ కళ్యాణమండపం ఎదురుగా ఉన్న మహబూబ్‌ బాషా అనే కాంట్రాక్టర్‌ ఇంట్లో 3 లక్షల నగదు ఆభరణాలు చోరికి గురయ్యాయి. మహబూబ్‌ బాషా ఇంటి ఎదురుగా వున్న ఓ షాపు ముందు సీసీ కెమెరా వుడటంతో పోలీసులు దాన్ని పరిశీలించారు. దీంట్లో నింధితురాలు హరిక ఎవ్వరు లేని సమయంలో వెళ్లినట్లు కనిపించటంతో పోలీసులు ఆమెను విచారించగా భర్త శ్రీహరితో కలిసి చోరికి పాల్పడినట్టు అంగీకరించింది. పోలీసులు వీరిని అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి 3 లక్షల విలువ చేసే నగదు, 1.5 లక్షలు విలువ చేసే నగలను స్వాధీనం చేసుకున్నారు.

16:35 - May 3, 2018

అనంతపురం : జిల్లాలోని ధర్మవరంలో పోకిరికి దేహశుద్ధి చేశారు. బ్యాంకు లోన్ మంజూరు చేయాలని...పెళ్లి చేసుకుంటానని ఓ బ్యాంకు ఉద్యోగినిని ఆకతాయి వేధించాడు. ఈ ఘటన అనంత జిల్లాలోని ధర్మవరంలో చోటు చేసుకుంది. ఆంధ్రా ప్రగతి బ్యాంకులో ఓ మహిళ పనిచేస్తోంది. ఈమెను లక్ష్మీనారాయణ అనే యువకుడు పెళ్లి చేసుకుంటానని వేధింపులకు గురి చేశాడు. ఈ విషయాన్ని కుటుంసభ్యులకు మహిళ తెలిపింది. ఇదే క్రమంలో మహిళ ఇంటికి వచ్చిన యువకుడిని పట్టుకుని విద్యుత్ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పచెప్పారు.

 

 

22:08 - March 26, 2018
15:39 - March 26, 2018

విజయనగరం : అమాయక గిరిజనుడిపై ఎస్సై తన ప్రతాపాన్ని కనబరిచాడు. గిరిజనుడైన పశువుల కాపరిని చితకబాదిన ఘటన వెలుగులోకి వచ్చింది. సోర్రి అప్పలస్వామి అనే గిరిజనుడు పశువులు కాపరిపై ప్రభుత్వం భూములను అక్రమించుకున్నాడనే ఆరోపణతో ఎస్సై సన్యాసినాయుడు అప్పలస్వామిని దారుణంగా చితకబాదాడు. ఈ ఘటన పాచిపెంట మండలం కొండతాడూరులో చోటుచేసుకుంది. ఎస్సై చేసిన దాడిలో అప్పలస్వామి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ క్రమంలో సీపీఎం అప్పలస్వామికి అండగా నిలబడింది. ఎస్సై పై చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది. 

13:12 - February 14, 2018

పశ్చిమగోదావరి : శివరాత్రి సందర్భంగా ఆచంటలో ఉన్న శివాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. పండుగ సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమాలకు భక్తులు భారీగా హాజరయ్యారు. ఆధ్యాత్మిక వేడుకలకు హాజరైన మహిళల పట్ల కొంతమంది ఆకతాయి విద్యార్థులు అసభ్యకరంగా ప్రవర్తించడం..కామెంట్స్ చేశారని కొంతమంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్టేషన్ కు తీసుకొచ్చి విద్యార్థులను విచారించారు. ఒక్కసారిగా రెచ్చిపోయిన ఓ పోలీసు విద్యార్థులను చితకబాదాడు. అక్కడకు చేరుకున్న మీడియా చితక్కొడుతున్న దృశ్యాలను చిత్రీకరించారు. దీనిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఉత్సవాల్లో తమ ఎదుటే అసభ్యకరంగా ప్రవర్తించారని...విద్యార్థులు పొంతనలేని సమాధానం చెబుతున్నారని పోలీసులు పేర్కొంటున్నట్లు సమాచారం. 

13:42 - February 11, 2018

గుంటూరు : ఆయేషామీరా హత్య కేసుపై సిట్‌ అధికారులు పునర్విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా ఇవాళ సిట్‌ అధికారులు గుంటూరు జిల్లాలోని తెనాలికి చేరుకున్నారు. ఆయేషామీరా తల్లిదండ్రులను కలిశారు. ఆయేషా హత్యపై వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

 

16:15 - January 12, 2018
13:19 - January 10, 2018
13:14 - January 10, 2018

విశాఖ : పెందుర్తిలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. పెందుర్తి పోలీస్టేషన్‌ ఎదురుగా మహాలక్ష్మీనాయుడు అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పుపెట్టుకున్నాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు, పోలీసులు మంటలు ఆర్పారు. తీవ్రగాయాలతో ఉన్న మహాలక్ష్మినాయుడును విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అయితే గతంలో భార్యతను క్రికెట్‌బ్యాట్‌తో హతమార్చిన కేసులో మహాలక్ష్మినాయుడు నిందితుడిగా ఉన్నాడు. కేసు దర్యాప్తు సాగుతుండగానే మహాలక్ష్మినాయుడు ఆత్మహత్యయత్నించాడు.  

 

13:43 - December 5, 2017

కృష్ణా : రాష్ట్ర పోలీస్‌ శాఖలో పలు విభాగాలకు అధికారుల కొరత ఏర్పడింది. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల బదిలీల్లో జరుగుతున్న జాప్యం కారణంగా ఈ శాఖలో కీలక విభాగాలు దిక్కులు చూస్తున్నాయి. విజిలెన్స్‌ అండ్ ఎన్ ఫోర్స్‌మెంట్, పీఅండ్ఎల్, తూనికలు-కొలతలు ఇలా కీలకమైన శాఖలను పట్టించుకునే నాథుడే లేరు. ఐజీ స్థాయి అధికారులు ఈ విభాగాల్లో కీలకపాత్ర పోషించాలి. కానీ ఇన్‌చార్జ్‌లతోనే నెట్టుకొస్తున్నారు. కీలకమైన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి హోంశాఖ కార్యదర్శి అనురాధను ఇన్‌చార్జ్‌గా నియమించిన ప్రభుత్వం ఏడాదిన్నరకు పైగా అక్కడ ఐజీ పోస్టు భర్తీ చేయలేదు. అలాగే పీఅండ్ఎల్ విభాగం ఐజీ మధుసూదనరెడ్డి కేంద్ర సర్వీసులకు వెళ్లడంతో ఇన్‌చార్జ్ ఆర్గనైజేషన్స్ ఐజీ కుమార విశ్వజీత్‌కు అప్పగించారు.

సీపీ గౌతమ్ సవాంగ్‌ కు పదోన్నతి
అలాగే విజయవాడ కమిషనరేట్‌కు అడిషనల్‌ సీపీ పోస్టు ఏడాదిన్నరకు పైగా ఖాళీగా ఉంది. అడిషనల్‌ డీజీ ర్యాంక్‌ అధికారిని కమిషనర్‌గా నియమించింది. ఏడీజీగా ఉన్న సీపీ గౌతమ్ సవాంగ్‌ పదోన్నతి పొంది డీజీ ర్యాంక్ అధికారి అయినా ఆయనే విధుల్లో కొనసాగుతున్నారు. అటు అమరావతి కమిషనరేట్ ఏర్పాటుకు మాత్రం అడుగులు ముందుకు పడలేదు. దీంతో డీఐజీ స్థాయి అధికారి రమణ కుమార్‌ను విజయవాడ అదనపు జాయింట్ సీపీగా నియమించారు. అలాగే నాలుగు జిల్లాల గుంటూరు రేంజ్‌లో ఉన్న ఐజీ సంజయ్‌ని పోలీస్‌ ట్రైనింగ్‌కి బదిలీ చేసి అక్కడ డీఐజీ స్థాయి అధికారి వీవీ గోపాల్‌రావును ప్రభుత్వం నియమించింది. కోస్తా ఐజీ కుమార విశ్వజీత్‌ను ఆర్గనైజేషన్స్‌కు బదిలీ చేసినా ఆ స్థానంలో ఎవరినీ నియమించలేదు. అలాగే ఏలూరు రేంజ్‌కు డీఐజీ లేరు. మెరైన్ పోలీస్ విభాగానికి ఐజీ పోస్టు కూడా అదే విధంగా అధికారుల బదిలీల విషయంలో కూడా ప్రభుత్వం నాన్చుడి ధోరణిని అవలంబిస్తోంది. జూన్ చివరివారంలో ఎస్పీల బదిలీ ప్రక్రియ చేపట్టారు. అయితే ఆ కసరత్తు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అలాగే చాలా విభాగాలకు స్టాఫ్ ఆఫీసర్స్ కొరత నెలకొంది. ఫోరెన్సిక్‌కు డైరెక్టర్ లేకపోవడంతో ప్రభుత్వ సలహాదారు గాంధీ ఆ విభాగాన్ని చూసుకుంటున్నారు. లీగల్ విభాగం ఐజీ దామోదర్‌కు అదనంగా హైవే సేఫ్టీ బాధ్యతలు అప్పగించారు. రవాణా శాఖకు కమిషనర్‌గా ఐజీ బాలసుబ్రహ్మణ్యంను నియమించారు.

ఐపీఎస్‌ల అధికారుల బదిలీలు రెండేళ్లకోసారి
సాధారణంగా సీనియర్‌ ఐపీఎస్‌ల అధికారుల బదిలీలు రెండేళ్లకోసారి లేదంటే పనితీరును బట్టి జరుగుతూ ఉంటాయి. కానీ బదిలీల ప్రక్రియలో స్తబ్దత నెలకొనడంతో.. ఏపీలోని చాలా ప్రాంతాల్లో కొందరు పోలీస్‌ అధికారులు.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో చాలా కేసులు పేరుకుపోతున్నాయి. కొందరు ఎస్‌ఐలు, సీఐలు ఠాణాల్లో సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ నాయకుల అండదండలతో విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలుకూడా ఉన్నాయి.ఏదిఏమైనా ప్రభుత్వం వెంటనే ఐపీఎస్‌ల బదిలీలతో పాటు ఎస్‌ఐ, సీఐ స్థాయి అధికారులను బదిలీల జాబితాలో చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Pages

Don't Miss

Subscribe to RSS - andhra police